Tuesday, August 26, 2025

భూ కైలాస్ దేవాలయం

అంశం: మై సెల్ఫీ


శీర్షిక: *భూ కైలాస్ దేవాలయం*

అదిగదిగో భూ కైలాస్ దేవాలయం
తాండూరు పట్టణం నడిబొడ్డున వెలసిన
అవనిలో అద్భుత కట్టడం సుందర జల మార్గం
అది ఉంటుంది రెండు వందల మీటర్లు
అందులో గలగలా పారు స్వచ్ఛమైన నీరు

చల్ల చల్లని నీటిలో మెల్లమెల్లగా అడుగులెస్తుంటే
ఏదో తీయని ఆనందం మదిలో మెదులు
ఇక భక్తుల నోటిని ఆపడం ఎవరి తరం 
"ఓం నమః శివాయ" నినాదాలతో 
మారుమ్రోగు భూకైలాస జలమార్గం!

వెళ్ళడానికి రావడానికి ఒకే మార్గం
పొడుగూనా మధ్యలో బిగించిరి స్టీల్ పైపులు
ఒకరికొకరు తగలరు ఎవరి దారి వారిదేనోయ్
జల మార్గాంతం వరకూ జ్యోతిర్లింగాలే!

నీటి లోతు ఉండు మోకాళ్ళ నుండి గొంతు వరకు
ఎవరి భక్తి వారిదే కొడుతారు కొబ్బరి కాయలు
ఆనందంతో కేరింతలు కొడుతుంటారు పిల్లలు
మునుగుతుంటారు తేలుతుంటారు పెద్దలు!

అది ఒక భూతల స్వర్గం 
చివరలో ఉంటుంది శివుని ఆలయం
శివుని సేవించు కొని పుచ్చుకుందురు తీర్ధం
తిరిగి రావచ్చు జల మార్గం
అక్కడి నుండే బయటకు వెళ్ళడం సులభం!

ఎత్తెన తరువులు ఆహ్లాదకర ప్రకృతి 
చుట్టూరా అందమైన మనోహర శివపార్వతుల
సప్త ఋషుల త్రిమూర్తుల గణపతి విగ్రహాలు
ఎన్నో మరెన్నో అనుభవిస్తే గానీ తనివి తీరదు
అన్నీ వసతులతో ఉచిత భోజనమూ!

No comments: