Saturday, August 23, 2025

హృదయాలను విశాలం చేసుకుంటేP

*నేటి అంశం: సామాజికం*

శీర్షిక: *హృదయాలను విశాలం చేసుకుంటే*

పెళ్ళంటే నూరేళ్ళ పంట
అదే నిజం కావాలి ఇంటింటా
కానీ దురదృష్టవశాత్తు
మనుసులు భావాలు కలియక
అవుతున్నాయి జీవితాలు పెంట పెంట!

వివాహం చేసుకునే ముందే
అర్ధం చేసుకోవాలి ఒకరినొకరు
మోహాన్ని ప్రేమని భ్రమ పడక
అందం ఆహార్యం అద్భుతమనుకోక
భాష సంస్కృతి సాంప్రదాయాలు
సమ్మతమైతేనే నిర్ణయం తీసుకో!

మనస్థత్వాలు భావాలు ఆలోచనలు
కలిసాకనే పెళ్లి వేడుకలు జరుపుకో
ఇక ఆ తరువాత కష్టమో నష్టమో
కలిసి నూరేళ్ళు అన్యోన్యంగా జీవించు!

చేతికున్న ఐదు వ్రేళ్ళే
సమానంగా ఉండవనేది నగ్నసత్యం
ఒకే కడుపులోజన్మించిన ముగ్గురుపిల్లలు
అందాలకు ఆలోచనలకు పోలికెక్కడ?!

అలాంటిది కొత్త వ్యక్తులు తక్షణమే
కలిసిపోతారనుకోవడం అత్యాశే
పెళ్ళిబంధమన్నాక సమస్యలు సహజం!

హృదయాలను విశాలం చేసుకుంటే
ఎలాంటి సమస్యలైనా చిన్నవగును
ఒకరినొకరు అర్ధం చేసుకొని
సంయమనం పాటిస్తూ
సర్దుబాటు చేసుకోగలిగితే
ఆ జీవితం స్వర్గధామం!

లేదంటే పెళ్ళైన ఆరు నెలలకే
విలువైన జీవితం కాలం ధనం వృధానే
పరువు ప్రతిష్టలు గంగలో కలియు
ఇరుకుటుంబాలు నడిసంద్రంలో ఈదుతూ
విడాకుల కొరకు కోర్టుల చుట్టూ తిరుగేరు!

పంతాలుపట్టింపులతో విడాకులు వచ్చినా
ఆ తరువాత ఇరువురూ
మరల పెటాకులైన వారితోనే వివాహాలు
లేదా ఒంటరిజీవితాలేనన్న పచ్చి నిజాన్ని మరువరాదు!

No comments: