ప్ర . "జాతస్య మరణం DEATH) ధృవం "అంటే ఏమిటి ?
డబ్బు సంపాదించడంలో ఒక్కొక్కరిది ఒక్కో పంధా . ఒకరు తనకు తన కుటుంభ సభ్యుల జీవనం కొరకు కష్టపడి డబ్బు సంపాదిస్తే , అదే అవసరానికి మరికొందరు దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకుంటారు . ఒకరు భవిష్యత్ అవసరాల కొరకు నిజాయితీగా సంపాదిస్తే , మరొకరు తరతరాల వారసుల అవసరాలకొరకు మోసాలు చేసి , కుంభ కోణాలు చేసి , డబ్బు సంపాదించి నల్ల ధనంగా స్విస్ బ్యాంకులలో దాచి పెడుతుంటారు . విదేశాలలో దాక్కుంటారు . కష్ట పడండి . నిజాయితీగా సంపాదించండి . ప్లాన్డ్ గా మదుపు చేయండి . అనుకోకుండా వచ్చే ఖర్చులకు , ఆరోగ్య ఖర్చులకు , వృద్ధా ప్య జీవనం గడవడానికి పొదుపు చేయండి . కాని మోసాలు చేసి నల్ల ధనం కూడ పెట్టకండి . ఏమి సంపాదించినా , ఎంత కూడా బెట్టినా పోయే టప్పుడు ఏమి వెంట తీసుక పోము అని గుర్తుంచుకోవడం వలన ఎక్కడా మోసాలు జరుగవు . ఎక్కడా అవినీతి జరుగదు . ఎక్కడా కొట్టుకోవడం , తిట్టుకోవడం జరుగదు . ఎక్కడా కుంభ కోణాలు జరుగవు . ఎక్కడా యుద్దాలు జరుగవు . అలానే మనిషికి త్రుప్తి సుఖం , ఆనందం దక్కు తుంది . సర్వే నిజాయితీ జన : సుఖినో భవంతు .
జ . "జాతస్య మరణం ధృవం" అనగా "పుట్టిన ప్రతి జీవి చావక మానదు" అని దీని అర్ధం . " పుట్టిన ప్రతి ఒక్కరు చావక మానరు " అని దీని అర్ధం . ఇది సత్యం . మనిషి పుట్టే టపుడు నూలు పోగు లేకుండా , తల్లి పేగును కోసుకుని ఏడ్చు కుంటూనే భూమి మీదికి వస్తాడు లేదా వస్తుంది . కాని మరే ఇతర ఆస్తులను , సంపదను వెంట తీసుకుని రారు . అలానే మనిషి చని పోయే టప్పుడు కూడా కనీసం పార్ధీవ శరీరం పై ఉన్న తెల్లటి బట్టను కూడా తీసుకుని పోకుండా , ఆత్మీయుల భందాన్ని తెంపుకుని ఏదో ఒక రోజు మల్లీ ఏడ్చుకుంటూనో లేదా ఏదో రకమైన భాధతోనో మరని స్తాడు లేదా మరనిస్తుంది . కాలి బూడిదై పోతాడు లేదా పోతుంది . కాని తమ వెంట యే భూములను , యే డబ్బులను , యే ఆస్తులను , యే నల్లదనాన్ని తీసుకుని పోరు . అంటే కష్ట పడో , మోసాలు చేసో సంపాదించిన వన్నీ, ఇక్కడే , అంటే భూమి మీదనే వదిలి పెట్టి పోతారు . ఇంతటి నగ్న సత్యం తెలిసి కూడా మనుష్యులు దేనికోసమో ఆరాట పడుతుంటారు . దేని కోసమో ఇతరులను నిందిస్తుంటారు , దేని కోసమో ఇతరులను కించ పరుస్తుంటారు .దేని కోసమో చిన్న చూపు చూస్తుంటారు . దేని కోసమో కొట్లాటలు పెట్టు కుంటారు . దేని కోసమో పోట్లాడు తుంటారు . దేని కోసమో పోరాడుతుంటారు . దేని కోసమో హైరానా పడుతుంటారు . ఎందు కోసమో మోసాలు చేస్తుంటారు . మరి దేనికోసమో స్విస్ బ్యాంకులలో లేదా ఇతర బ్యాంకులలో లేదా బినామి పేర్లతో నల్ల ధనంగా దాచి పెడుతుంటారు. హత్యలు చేస్తారు . ఆత్మ హత్యలు చేసు కుంటారు .
అలానే , ప్రతి జీవికి జీవిత కాలంలో 4 దశలు ఉంటాయని మనకు తెలుసు . అవి , బాల్యం , కౌమార్యం , యవ్వనం మరియు వృద్ధాప్యం . మనిషికి బాల్యంలో ఉన్నపుడు ఏమి తెలియదనే చెప్పాలి . కౌమార్యం లో విద్యా , ఆటలు పాటల తోనే కాలం గడిచి పోతుంది . ఇక మిగిలింది యవ్వనం , వ్రుదాప్యం . యవ్వనం లోనే మనిషికి అహం అధికంగా ఉంటుంది . నాకే ఇన్ని ఆస్తులున్నాయనో , నేనే అధికంగా చదివాననో , నేనే పెద్ద హోదాలో ఉన్నాననో , నేనే అధికారంలో ఉన్నాననో గర్వం , పొగరు ఉంటుంది . నా అంతటి వారే లేరని విర్ర వీగు తుంటారు . కసురుకుంటారు . గొడవ పెట్టుకుంటారు . ఎదుటి వారిని హీనంగా చూస్తారు . ఎదుటి వారిని లెక్క చేయరు . అయితే ఎలా సంపద వారికి వచ్చింది , ఎలా మోసం చేస్తే వచ్చింది . యే ప్రభుత్వ దయా దాక్షన్యాల వలన వచ్చింది . యే రిజర్వేషన్ల అవకాశాల ద్వారా వచ్చింది గుర్తు చేసుకోరు . అంతే కాకుండా , వారే ఏదో ఒక రోజు వృద్ధాప్య దశకు వస్తామన్న విషయం మరిచి పోతారు . లేదా వారే ఏదో ఒక రోజు అనారోగ్యం పాలు కావచ్చని గాని , ప్రమాదాలకు గురి కావచ్చని గాని గుర్తుకు రాదు . ఒక్కో సారి యే అస్స్తులున్నా , ఎంత డబ్బు ఉన్నా పనికి రాదనీ గ్రహించరు . మనిషి కి కావాల్సింది తోటి వారి ప్రేమ , ఆప్యాయత , కరుణ అని గుర్తించరు .
డబ్బు సంపాదించడంలో ఒక్కొక్కరిది ఒక్కో పంధా . ఒకరు తనకు తన కుటుంభ సభ్యుల జీవనం కొరకు కష్టపడి డబ్బు సంపాదిస్తే , అదే అవసరానికి మరికొందరు దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకుంటారు . ఒకరు భవిష్యత్ అవసరాల కొరకు నిజాయితీగా సంపాదిస్తే , మరొకరు తరతరాల వారసుల అవసరాలకొరకు మోసాలు చేసి , కుంభ కోణాలు చేసి , డబ్బు సంపాదించి నల్ల ధనంగా స్విస్ బ్యాంకులలో దాచి పెడుతుంటారు . విదేశాలలో దాక్కుంటారు . కష్ట పడండి . నిజాయితీగా సంపాదించండి . ప్లాన్డ్ గా మదుపు చేయండి . అనుకోకుండా వచ్చే ఖర్చులకు , ఆరోగ్య ఖర్చులకు , వృద్ధా ప్య జీవనం గడవడానికి పొదుపు చేయండి . కాని మోసాలు చేసి నల్ల ధనం కూడ పెట్టకండి . ఏమి సంపాదించినా , ఎంత కూడా బెట్టినా పోయే టప్పుడు ఏమి వెంట తీసుక పోము అని గుర్తుంచుకోవడం వలన ఎక్కడా మోసాలు జరుగవు . ఎక్కడా అవినీతి జరుగదు . ఎక్కడా కొట్టుకోవడం , తిట్టుకోవడం జరుగదు . ఎక్కడా కుంభ కోణాలు జరుగవు . ఎక్కడా యుద్దాలు జరుగవు . అలానే మనిషికి త్రుప్తి సుఖం , ఆనందం దక్కు తుంది . సర్వే నిజాయితీ జన : సుఖినో భవంతు .
No comments:
Post a Comment