ప్ర . అఫిడవిట్స్ ( AFFIDAVITS) ఎంత వరకు ఉపయోగ పడుతున్నాయి ?
జ . సామాన్య పౌర సేవలకు , అనగా ఇన్కం సర్టిఫికెట్స్ కు, బర్త్ సర్టిఫికెట్స్ కు , డెత్ సర్టిఫికెట్స్ కు, పెన్సన్ సర్టిఫికెట్స్ కు , అనేకరకాల అనుమతులకు , లైసెన్సులకు , అధికారులు అఫిడవిట్లను ప్రజల నుండి కోరు తుంటారు. దానికి తోడూ నోటరీ చేయించ మంటారు . ఇవి ఎంత వరకు ఉపయోగ పడుతున్నాయో అధికారులు , ప్రభుత్వాలు ఆలోచించాలి. వీటి వలన ప్రజలకు సమయం వృధా అవుతుంది . రవాణా ఖర్చులు వృధా అవుతున్నాయి . డబ్బు వృధా అవుతుంది . బాండు పేపర్లు దొరుకక నకిలీవి తయారవు తున్నవి , మరి కొందరు అక్కడ తెచ్చాము , ఇక్కడ తెచ్చామని ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు . ఒక నిర్ణీత ధర అంటూ లేదు . మరియు అవసరానికి అందు బాటులో ఉండవు . ఈ మధ్యనే పోస్టాఫీసులలో అమ్ముతున్నారు . కాని ప్రజలందరికి పూర్తి అవగాహన లేదు . బాండు పేపర్ల కొరకు చెట్లను నరుకుతున్నారు . అఫిడవిట్లను కాపాడ డానికి , సిబ్బందికి ఇబ్భందిగా మారింది . వీటి వలన కేవలం దళారులు , బ్రోకర్లు లబ్ధి పొందు తున్నారు . ప్రజలకు కష్టాలు , నష్టాలు మిగులుతున్నాయి.
అందుకని , అఫిడవిట్ల రద్దు గురించి అధికారులు ఆలోచించాలి. ప్రజలకు విముక్తి కలిగించాలి. అతి పెద్ద ప్రజా స్వామ్య భారత దేశంలో , దేశాన్ని పరి పాలించే , లక్షల కోట్ల రూపాయలతో వ్యవహారాల నడిపించే , అతి ముఖ్యమైన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా , పోటీలో నిలిచిన అభ్యర్ధులు సబ్మిట్ చేసిన అఫిడవిట్లకు ఎన్నికల కమీషన్ , విలువను పెంచాలి. 'మమ' అనిపిస్తే ప్రజలకు యములై కూర్చుంటారు . ఇంకను ముఖ్యమైన వాటికి సంభందించి సబ్మిట్ చేసే అఫిడవిట్లకు విలువను పెంచాలి . ఉపయోగం లేని చోట రద్దు చేసే విధంగా ఆలోచించాలి .
No comments:
Post a Comment