Wednesday, April 27, 2016

మ్యూచ్యువల్ ఫండ్స్ ( MUTUAL FUNDS) అనగా నేమి ?


ప్ర .  మ్యూచ్యువల్ ఫండ్స్ ( MUTUAL FUNDS)  అనగా నేమి ?
                                 
జ . చిన్న వయస్సులోనే , సంపాదించే సమయం లోనే , క్రమ బద్దంగా పొదుపు చేసు కుంటూ పోతే , ఆ డబ్బే మరల మనకు డబ్బును సంపాదించి పెడుతుంది (Money creates money from break even point).
డబ్బులు పొదుపుతో పాటు , వృద్ధి చేసుకోడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వీటిలో రిస్కు తో కూడినవి , రిస్క్ లేనివి అని రెండు రకాలుగా చెప్పు కోవచ్చు . మరల వీటిలోనే పన్ను భారం గలవి (డె ట్ ఫండ్స్ ) , పన్నుల భారం లేనివి (టాక్స్  సేవింగ్  ఈక్విటీ ఫండ్స్ )  అని కూడా చెప్పు కోవచ్చు .

1. రిస్కుతో కూడు కున్న పెట్టుబడులంటే, ఆదాయం ఎక్కువగా ఉండి, రిస్కు ఎక్కువ గా ఉంటుంది . కాని పెట్టిన పెట్టుబడులకు భద్రత తక్కువగా ఉంటుంది .

ఉదా : బయట వ్యక్తులకు అధిక వడ్డీలకు ఆశ పడి అప్పులు ఇవ్వడం , ప్రైవేటు
చీటీలు వేయడం , అవగాహన లేకుండా శేర్లల్లో పెట్టుబడులు పెట్టడం , అనుభవం లేకుండా , యిష్టత , స్పష్టత లేని వ్యాపారాలు చేయడం మొదలైనవి.

2. రిస్కు తక్కువగా ఉండే పెట్టుబడులంటే , ఆదాయం తక్కువగా ఉండి, రిస్కు కూడా తక్కువగా నే ఉంటుంది. అంటే భద్రత ఎక్కువ గా ఉంటుంది .

ఉదా : పోస్టాఫీస్ లలో , బ్యాంకులలో - సేవింగ్ (4%) , ఫిక్సుడు డిపాజిట్స్ (7%-9%), రికరింగ్(8%) డిపాజిట్లల్లో , ఎన్ .ఎస్ .సి (8%) లలో పొదుపు చేయడం. ప్రభుత్వ పధకాలలో(6%) , డిబెంచర్స్ (10%) , డెట్ ఫండ్స్, మ్యూచ్యువల్ ఫండ్స్ లలో ( దీర్ఘ కాలంలో 12% నుండి 15%) పొదుపు చేయడం మొదలైనవి .

మ్యూచ్యువల్ ఫండ్స్ (  MUTUAL FUNDS):



కేంద్ర అనుమతి , ఆర్ బి ఐ , సెబీ ఆమోదం పొందిన కంపనీలు , ప్రజలనుండి చిన్న చిన్న మొత్తాలు , ఇతర కంపనీలనుండి పెద్ద పెద్ద మొత్తాలను సేకరించి , అవి తిరిగి రాబడి ఎక్కువగా ఉండే షేర్లల్లో , రిస్కు తక్కువ గా ఉండే ప్రభుత్వ పధకాలలో మరియు కొంత క్యాష్ రూపకం లో ఉంచుకొని కాల్ మనీ వ్యాపారం ద్వారా డబ్బును వృద్ధి చేస్తారు . అలా వృద్ధి చేసిన డబ్బునే , వారి ఖర్చులు , జీతాలు , కమీసన్లు మినహా యించి , మిగిలిన డబ్బును యూనిట్ హోల్డర్లకు పంచుతారు . అంటే యూనిట్ విలవ పెంచు తారు . దీనినే ఎన్ ఎ వి (N.A.V) అంటారు . 

ప్రజల దగ్గర సేకరించిన డబ్బుకు , ప్రారంభం లోనైతే ఒక యూనిట్ 10 రూ ల . చొప్పున కేటాయిస్తారు . ఆ తరువాత ఎన్. ఎ. వి (N.A.V) ఆధారంగా కేటాయిస్తారు . ఇలా కేటాయించిన వాటినే మ్యూచ్యువల్ ఫండ్స్ (  MUTUAL FUNDS UNITS) యూనిట్స్ అనీ , ఇలా నడిపే కంపనీలను మ్యూచ్యువల్ ఫండ్స్ (MUTUAL FUNDS) కంపనీస్ అని అంటారు . 

కొత్తగా  షేర్ మార్కెట్ లోకి వచ్చే మదుపరులు ,  మ్యూచ్యువల్ ఫండ్స్ (MUTUAL FUNDS) లలో పెట్టుబడులు పెట్టడమే  మంచిది . ఎందుకంటే  పెట్టిన పెట్టుబడికి  రిస్క్ తక్కువగా ఉంటుంది . ఫండ్ మేనేజర్ల తెలివితేటలతో, అందుబాటులోని సాంకేతిక నైపుణ్యాలతో , త్వర త్వరగా నిర్ణయాలు తీసుకునే శక్తి , చేతిలో పెద్ద మొత్తంలో డబ్బు  అందుబాటులో ఉండటం మూలంగా ,  దీర్ఘ కాలిక పెట్టుబడిలో  మాడు పరులు 12 నుంచి  16% వరకు లాభాలు రావచ్చు . మదుపరులకు రోజు వారీ టెన్షన్  అవసరం ఉండదు . రాజకీయాల మార్పులకు , ప్రకృతి వైపరీత్యాలకు భీతిల్లాల్సిన  అవసరం  పెద్దగా ఉండదు . అయితే పెట్టుబడులు పెట్టే  స్కీముల గురించి అనుభవజ్ఞ్యుల , ఫైనాన్స్ అడ్వైజర్ల సలహాలను తీసుకోవాలి .కనీసం  ప్రతి 3 నెలల కొక సారి  పెట్టుబడులను సమీక్షించు కోవాలి . 

అదే  కొత్తగా వచ్చే మదుపరులు, యే మాత్రం అనుభవం లేకుండా , కేవలం డబ్బు సంపాదించాలన్న ఆశతో   షేర్  మార్కెట్ లో  పెట్టుబడులు పెట్టినా , రోజు వారీ  ఆన్ లైన్ లావా దేవీలు జరిపినా , చేతులు కాలడం ఖాయం . 

ఉదా . కు  కొన్ని  మ్యూచ్యువల్ ఫండ్స్ (MUTUAL FUNDS) :. Reliance Mutual Fund, Birla Mutual Fund, SBI mutual fund, Sundaram Mutual Fund, TATA Mutal Fund, ICICI , Frankilin, HDFC Mutual funds etc.,

ప్ర . ఆన్లైన్ లో  పెట్టుబడులు పెట్టేటప్పుడు ' డైరెక్ట్ ' (DIRECT) ఆప్స్ న్  ను ఎంచుకోవచ్చా ?

జ . ఆన్లైన్ లో  పెట్టుబడులు పెట్టేటప్పుడు ' డైరెక్ట్ ' (DIRECT) ఆప్స్ న్  ను ఎంచుకోవచ్చు . డైరెక్టుగా  కొన వచ్చు . అమ్మ వచ్చు . స్విచ్ చేసుకోవచ్చు . సిప్ చేసుకోవచ్చు . పెట్టుబడులు పెట్టడం , లాభాలు  లేదా నష్టాలు  పొందడం మన ఇష్టం . మన డబ్బు మన ఇష్టం . ఎక్కడ నిర్బంధం ఉండదు .  డైరెక్టుగా  కొనేటప్పుడు  0.5% - 1%  కమీషన్స్  బ్రోకర్లకు చెల్లించాల్సిన అవసరం ఉండదు  . ' రెగ్యులర్ ' (REGULAR) ను సెలెక్ట్ చేస్తే , బ్రోకర్ల ద్వారా  కొనుగోలు చేస్తే  0.5% - 1% , వీరికి  కమీషన్  మ్యూచ్యువల్  ఫండ్  సంస్థ  చెల్లిస్తుంది . ( వీరిలో అనేక మైన లెవల్స్  బ్రోకర్లు ఉంటారు ). 'సెబీ ' (SEBI) గుర్తించ బడిన  బ్రోకర్  సంస్థల ద్వారా  కొనడం వలన  అనేక మైన ప్రయోజనాలు ఉంటాయి .  డైరెక్టుగా  కొనేటప్పుడు   సెకండరీలో ( అంటే పబ్లిక్ ఇష్యూ అయిపోయిన తరువాత ) ,   ఎన్. ఏ . వి . కూడా , 'రెగ్యులర్' కంటే అధికంగానే ఉంటుంది . అలానే అమ్మే టప్పుడు కూడా ఎన్. ఏ .వి . అధికంగా ఉంటుంది  డైరెక్టుగా కొనేటప్పుడు మన సొంత నిర్ణయాలతోటే  పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది . లాభాలు రావచ్చు , నష్టాలు రావచ్చు .  ఉదా : DSPBR TECHNOLOGIES FUND  కొన్నట్లయితే  ఈ రోజున  12.78% నష్టం వచ్చేది . అలానే  TATA DIGITAL INDIA FUND  కొన్నట్లయితే  ఈ రోజున  9.72% నష్టం వచ్చేది . అలానే  SBI PHARMA FUND కొన్నట్లయితే  ఈ రోజున  9.27 % నష్టం వచ్చేది . అలా  అనేక మైన  '' మ్యూచువల్  ఫండ్స్  '' స్కీమ్స్  నష్టాల లో  కూడా నడుస్తున్నాయి . 




No comments: