ప్ర . లక్షలాది , కోట్లాది రూపాయలతో నిర్మించిన అక్రమ  కట్టడాలను , నివాస గృహాలను , పదుల అంతస్తుల  భ0వనాలను కూల్చడం  న్యాయమా  ( DISMANTLING   OF NATIONAL ASSET IS JUSTIFIED) ?
జ . లక్షలాది , కోట్లాది రూపాయలతో నిర్మించిన కట్టడాలను , నివాస గృహాలను , పదుల అంతస్తుల  భవనాలను కూల్చడం  న్యాయం  కాదు . అవి అక్రమ  కట్టడాలైనా , సక్రమ  కట్టడాలైనా  అవి మన దేశ సంపద . సంపదను నాశనం చేసుకుంటే , మనదేశం  బికారి అవుతుంది . ఇతర దేశాల ముందు తల వంచాల్సి వస్తుంది . అభి వృద్ధి చెందిన దేశంగా  ఎప్పటికీ కాదు . 
యికపోతే,  లక్షలాది , కోట్లాది రూపాయలతో నిర్మించిన కట్టడాలు  , నివాస గృహాలు  , పదుల అంతస్తుల  భవనాలు  ప్రకృతి  సృష్టించినవి  కావు . వీటిని  మానవులు  లక్షలాది , కోట్లాది రూపాయల ఖర్చుతో  , ఎన్నో వ్యయప్రయాసలతో  , ఎన్నో  సంవత్సరాలు  , నిద్ర ఆహారాలు మాని  నిర్మించినవి . మేదావి ఇంజేనీర్ల , ఆర్కి టెక్టుల తెలివి తేటలకు  ప్రతీకలు  .  వీటిని  ప్రకృతి నాశనం చేస్తుంది కాని  ఇలాంటి కట్టడాలును , నివాస గృహాలను   , పదుల అంతస్తుల  భవనాలను ప్రకృతి  సృష్టించదు . నిర్మించదు .  
అయితే , ఈ నిర్మాణాల  వెనుక  అవినీతి (అవినీతి  పరులు ) ఉండవచ్చు . మోసం (మోస కారులు ) ఉండవచ్చు . అధికార దుర్వినియోగం (అధికార దుర్వినియోగ  పరులు ) ఉండవచ్చు. ఈ  నిర్మాణాలు అక్రమమే కావచ్చు . అన్యాయమే  కావచ్చు .  కాని ఇక్కడ తప్పు  కట్టడాలది కాదు  , నివాస గృహాలది కాదు  , పదుల అంతస్తుల  భవనాలది కాదు .  
ఆ  తప్పు  మనసున్న , ప్రాణమున్న  స్వ్వార్ధ పరులది . అవినీతి పరులది . అవినీతి కి తోడ్పడిన లేదా  అవకాశాలు కల్పించే చట్టాలది కావచ్చు . ఓటు బ్యాంకు కోసం  నడిపే రాజకీయాలది కావచ్చు . అందరికీ సమానమైన  న్యాయం కల్పించని  న్యాయ వ్యవస్థది   కావచ్చు . వేలాది కోట్ల బ్యాంకుల అప్పులు  ఎగ్గొట్టే  వారికి  జై కొట్టే  సమాజానిది కావచ్చు .  కాని  ప్రాణం లేని  కట్టడాలది కాదు . నివాస భవనాలది కాదు.   పదుల  అంతస్తుల భవనాలది  కాదు .  అవసరమైతే , దానికి సంభందించిన  మనుష్యులను శిక్షించాలి గాని  ప్రాణం లేని  దేశ  సంపదను కాదు . 
ఒక చెట్టుకు చెదలు పడుతే , ఆ చెదలకు మందులు వేసి నివారిస్తాం గాని , చెట్టును నరికి వేయం కదా .
బిడ్డకు జబ్బు చేస్తే , తల్లి దండ్రులు వైద్యుడి దగ్గరకు తీసుకు వెళ్లి మందులు ఇప్పిస్తారు గాని , బిడ్డను చంపుకోరు కదా .
పంటకు తెగులు పడుతే , మందులు పిచికారి కొడుతారు గాని , పంటను నాశనం చేసుకోరు కదా.
విద్యార్ధి తప్పు చేస్తే , గురువు తల్లి దండ్రులను పిలిపించి కొన్సిల్లింగ్ చేస్తాడే గాని , మంచి మాటలు చెబుతాడే గాని , విద్యార్ధిని చంపడు కదా .
ఏదేని అక్రమ సంబందం తో ఒక శిశువు జన్మిస్తే , అలాంటి వారిని రక్షిస్తారే గాని శిక్షించరు కదా . అంతే కాదు , వారికి హక్కులు కల్పిస్తారు . ఆ అక్రమ సంభందం ఏర్పరుచుకున్న వారికి శిక్షలు వేస్తారు .
అందుకని అత్యవసర పరిస్థితులలో తప్పా , లక్షలాది కోట్ల ప్రజల డబ్బుతో , ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి , ఎన్నో ఏండ్లు కష్టపడి ఇంజినీర్లు , కూలీలు నిర్మించిన కట్టడాలను , నివాస భవనాలను , పదుల అంతస్తుల భవనాలను కూల్చడం న్యాయం కాదు. ధర్మం కాదు. అవసరమైతే , న్యాయంగా చెందాల్సిన వారికి కెటాయించడం చేయాలి . లేదా మరో విధంగా వాటిని సద్వినియోగం చేయాలి . ఒక వేల కూల్చు కుంటూ పోతే, ఎన్ని యేండ్ల నాటి కైనా 'భారత దేశం' అభివృద్ధికి నోచుకోని దేశం గా పిలువబడుతుంది గాని , అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించ బడదు .
No comments:
Post a Comment