ప్ర . "రేపో రేట్ " (Repo Rate) అనగా నేమి ?
జ. ప్రజలు , వ్యాపారస్తులు వారి వారి అవసరాలకనుగుణంగా బ్యాంకుల వద్ద అప్పులు తీసుకుంటాయి . అలానే బ్యాంకులు వాటి అవసరాల కొరకు , అనగా తిరిగి అప్పులు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు (RBI)వద్ద అప్పులు తీసుకుంటాయి . అప్పులు ఇచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంకు వడ్డీ (Interest) వసూలు చేస్తాయి . ఆ విధంగా వసూలు చేసే వడ్డీ రేటునే "రేపో రేట్ " (Repo Rate) అని అంటారు . అలానే బ్యాంకుల వద్ద మిగులు ఉన్నట్లయితే , వాటిని రిజర్వ్ బ్యాంకు వద్ద పొదుపు చేస్తాయి . అలా పొదుపు చేయడం వలన రిజర్వ్ బ్యాంకు వడ్డీ చెల్లిస్తుంది . అలా చెల్లించే వడ్డీని " రివర్స్ రేపో రేట్ " (Reverse Repo Rate ) అంటారు . అయితే ఈ వడ్డీ రిజర్వ్ బ్యాంకు వసూలు చేసే వడ్డీ కంటే 0.50% నుండి 1% వరకు తక్కువగా ఉంటుంది . ది . 16.04.2016 నుండి "రేపో రేట్ " (Repo Rate) 6. 50 % మరియు " రివర్స్ రేపో రేట్ " (Reverse Repo Rate ) 6% గా అర్ . బి. ఐ . నిర్ణయించడం జరిగింది . అలానే నగదు రిజర్వ్ రేషియో ( C.R.R ) 4%. యదా విదిగా ఉంచారు . ( బ్యాంకులు తమ వద్ద తప్ప కుండా ఉంచుకోవల్సిన్ నగదు నిష్పత్తి ని నగదు రిజర్వ్ రేషియో ( C.R.R ) అంటారు ) .
No comments:
Post a Comment