ప్ర . కోర్టులలో కొండల్లా, గుట్టల్లా కేసులు ( Increase of cases in courts) పెరిగి పోవడానికి గల కారణాలు ఏమిటి?
జ . కోర్టులలో కొండల్లా , గుట్టల్లా కేసులు పెరిగి పోవడానికి గల ముఖ్య కారణాలు " ప్రజలకు అధి కారులకు న్యాయ అవగాహనా లోపం + చట్టాలలో లొసుగులు , మినహాయింపుల పాపం + అవినీతి శాపం " మొదలయిన వాటిని ముందుగా చెప్పు కోవాలి . ప్రజలకు అధి కారులకు న్యాయ అవగాహన ఎలా ఉండాలి అంటే ' చిన్న పిల్లలకు వ్యాక్జిన్ వేయించు కోవాలని ప్రజలకు , వేయాలని అధికారులకు ఎలా గుర్తుంటుందో అలా 'చట్టాల గురించి , న్యాయం గురించి అవగాహన కల్పించాలి . ఏది మంచి ఏది చెడు , ఏది ధర్మం , ఏది అధర్మం అనేది ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలి . దీనికి న్యాయ వాదులు , న్యాయ మూర్తులు , విశ్రాంత న్యాయ వాదులు , విశ్రాంత న్యాయ మూర్తులు తరుచుగా గ్రామ గ్రామాన సభలు నిర్వహించాలి . దీనికి ప్రభుత్వం నిధులు కేటాయించాలి . ఆ విధంగా ప్రజలలో న్యాయ అవగాహనను , నై తికతను పెంపొందించాలి . ప్రతి ఒక్కరినీ అక్షరాస్యుల్ని చేయాలి . ప్రతి ఒక్కరిని ఒక న్యాయ సైనికుడిలా తయారు చేయాలి . చట్టం ముందు అందరూ సమానులే అనే భావనను ప్రజలలో కల్గించాలి . స్వాతంత్ర్యం వచ్చిన 68 సంవత్సరాలు దాటినా ఇంకనూ నిరక్ష రాస్యులున్నారంటే , ఇంకనూ అత్యంత పేద వారు , బిక్ష గాండ్లు ఉన్నారంటే దానికి కారణం , చట్టాలు రాజకీయ నాయకులకు , బడా మోస గాండ్లకు , వర్తింప చేయడం , ఓటు బ్యాంకు కోసం కొంత మందికి జీవిత పర్యంతం రిజర్వేషన్లు కల్పించడమే . పేద వారు , మధ్య తరగతి వారు , నిజాయితీ పరులు , రైతులు అప్పులు తీసుకోవాలంటే , సవా లక్ష ప్రశ్నలు ఎదురౌతాయి . అప్పులు చెల్లించక పోతే నానా హైరానా చేస్తారు. ఆత్మ హత్యలకు గురి చేస్తారు . ఆదే వైట్ కాలర్ మోసగాండ్లకు , కమీషన్లకు కక్కుర్తి పడో . ఆబ్లిగేషన్స్ వలననో , బ్యాంకర్లు వేల కోట్ల అప్పులు ఇచ్చి , వారి ఇంటి ముందు ' ప్లే కార్డ్స్ ను ' పట్టుకుని నిలబడుతారు . మరి కొంత మంది అప్పుల ఎగవేత దారులు విదేశాలకు పోవ డానికి రాచ బాటను ఏర్పాటు చేస్తారు . పలుకుబడి గల ధనవంతుడికి న్యాయం దక్కుతుండే , పేద వాడికి దక్క కుండా పోతుండే . ధన వంతుడికి బెయిలు దొరుకుతుండే , పేద వాడికి దొరకడం లేదాయే . బెయిల్ దొరక ఆత్మ హత్యలు చేసుకుంటున్న ఉదంతాలను చూస్తున్నాం . రూ.లు. 25/- చీపురు కట్ట కోసం తీసుకున్న లంచం కేసు తేల డానికి 40 సంవత్సరాలు పట్టిన ఉదంతాలు పేపర్లలో చూస్తున్నాం . కేసులు అధికంగా వాయిదాలు పడటం , ఒక కేసు తీర్పు రావడానికి ఒక్కో సారి దశాబ్దాలు దాటడం . సుదీర్ఘ కాలం కొన సాగడం వలన సాక్షులు అందు బాటులో లేక పోవడమో , చని పోవడమో . తారు మారు చేయడమో జరుగు చున్నది. తీర్పులు సాక్షులపైననే ఆధార పడటం మొదలయిన వన్నింటిని చట్టాలలో లొసుగులుగా చెప్ప వచ్చు . అధికారులలో అవినీతి ఆలోచనను రానివ్వకూడదు . వీటిని అధిగ మించుతే కోర్టులలో కేసులు తగ్గు మొఖం పడుతాయి . " పుండు ఒక కాడ ఉంటే మందు ఒక కాడ పెట్టిన చందం " లా నడుచు కుంటే ఉపయోగం ఉండక పోవచ్చు .
No comments:
Post a Comment