ప్ర; కొడుకులు బిడ్డలు (PARENTS THOSE WHO DO NOT HAVE SONS AND DAUGHTERS) లేని తల్లి దండ్రులు , కొడుకులు బిడ్డలు, మనుమలు, మనుమరాండ్లు ఉండి కూడా ప్రేమలకు, ఆప్యాయతలకు , ఆధరణకు నోచుకోని తల్లి దండ్రులు , వృద్ధాప్య దశను గుర్తుకు తెచ్చుకొని దిగులు పడాల్సిందేనా?
జ : "మాతృ దేవో భవ"
"పితృ దేవో భవ "
"ఆచార్య దేవో భవ " అన్నారు పెద్దలు .
కొడుకులు బిడ్డలు (PARENTS THOSE WHO DO NOT HAVE SONS AND DAUGHTERS) లేని తల్లి దండ్రులు , కొడుకులు బిడ్డలు, మనుమలు, మనుమరాండ్లు ఉండి కూడా ప్రేమలకు, ఆప్యాయతలకు , ఆధరణకు నోచుకోని తల్లి దండ్రులు , వృద్ధాప్య దశను గుర్తుకు తెచ్చుకొని ఎంత మాత్రం దిగులు పడ నవసరం లేదు . చింతించ నవసరం లేదు . బాధ పడనవసరం లేదు . కొడుకులు బిడ్డలు లేని వారు , కొడుకులు బిడ్డలు, మనుమలు, మనుమరాండ్లు ఉండి కూడా ప్రేమలకు, ఆప్యాయతలకు , ఆధరణకు , నోచుకోని తల్లి దండ్రులు , వృద్ధాప్య దశను గుర్తుకు తెచ్చుకొని ఎంత మాత్రం దిగులు పడ నవసరం లేదు . దానికో చక్కని ఉపాయం / పరిష్కారం ఉంది .
పూర్వ కాలంలో దేశంలో జనాభా తక్కువగా ఉండేది . ఉన్న జనాభాలో అన్నీ పెద్ద కుటుంభాలు , ఉమ్మడి కుటుంభాలే ఉండేవి . అప్పుడు సంతానానికి పరిమితి అంటూ ఉండేది కాదు . ఏ కుటుంభంలో చూసినా 5 నుండి 15 వరకు ఉండే వారు . ఆ కాలంలో పెద్దగా హాస్పిటల్స్ లేక పోయినా సంతాన శక్తి అలా ఉండేది . ఇక ఏ సమస్య వచ్చినా ఆ ఇంటి పెద్దే పరిష్కరించే వా డు . ఏ ఖర్చు వచ్చినా ఆ పెద్దే చోసుకునే వాడు . ఆ పెద్ద మనిషి మాటే వేదం . ఏ ఫంక్షన్ జరిగినా , ఒక్కరు కూడా మిస్ అయ్యే వారు కాదు . సంపాదించే వారు అనేకం . ఖర్చు పెట్టేది మాత్రం ఒక్కరి ద్వారానే జరిగేది . చిన్నా పెద్దా ఎవ్వరికీ ఏ చిన్న బాధ లేకుండా కడుపులో పెట్టుకుని చూసుకునే వారు . ఇక వారి మధ్య ప్రేమలు , ఆప్యాయతలు , అనురాగాలు , సంస్కృతి , సాంప్రదాయాలు వెల్లి విరిసేవి. అందరూ కడుపు నిండా బుజిస్తూ , ఆటా పాటలతో సంతోషంగా , ఆనందంగా కాలం గడిపే వారు .
కానీ రానూ రానూ కాలం మారి పోయింది . జనాభా అడ్డు అదుపూ లేకుండా పెరిగి పోయింది . అవసరాలు పెరిగి పోయాయి . విద్యా వంతులు పెరిగి పోతున్నారు . సైన్స్ & టెక్నాలజీ పెరిగి పోయింది . స్వార్ధం పెరిగి పోయింది . మనుష్యులకు ఇగో పెరిగి పోయింది . ఒంటరిగా జీవించాలనే ఆలోచన పెరిగి పోయింది . ఉపాధి అవకాశాలు పెరిగి పోయాయి . సంపాదన పెరిగి పోయింది . దేశ విదేశాలకెళ్లి సంపాదించే , జీవించే అవకాశాలు మెరుగయ్యాయి . స్వతహాగా కూడా బెట్టుకోవాలి , ఇతరులకంటే ఉన్నతంగా ఎదుగాలి , పిల్లలని అధికంగా చదివించాలి , విలాస వంతంగా జీవించాలి , ఒంటరిగా స్వేచ్ఛగా జీవించాలనే భావన పెరిగి పోయింది . అదే విధంగా సమస్యలూ కూడా పెరిగాయి . పెద్దల యెడ భాద్యత తగ్గి పోసాగింది. ముసలి వారంటే భారంగా ఫీలవ్వ సాగారు . ఆ కారణంగా ఉమ్మడి కుటుంభాలు , పెద్ద కుటుంభాలు కనుమరుగయి , చిన్న కుటుంభాలు సంతరించుకున్నాయి . అలానే ఒకరిద్దరికే సంతానాన్ని పరిమితం చేసుకుంటున్నారు . అయినను నేడు కనీసం 40 కోట్ల జనాభా పేద తనంలోనే జీవిస్తున్నారనేది కఠోర సత్యం .
ఇంత వరకూ బాగానే ఉందను కున్నా , ఇప్పుడు మరో సమస్య సమాజానికి పెను ముప్పుగా తయారు కాబోతుంది . ఏ కుటుంభం లో చూసినా , అది చాప క్రింద నీరులా తయా రవుతుంది . " కర్ణుడి చావుకు శతకోటి కారణాలు అన్నట్లు " దీనికి కారణాలు అనేకం . గ్లోబలైజేషన్ కావచ్చు , పాశ్చాత్త్యా పోకడలు కావచ్చు , మరింత సైన్స్ & టెక్నాలిజీ పెరుగడం కావచ్చు , స్వార్ధం పెరుగడం కావచ్చు , మనుష్యులలో ఇగో పెరుగడం కావచ్చు . అనారోగ్యాలు కారణం కావచ్చు , సామాజిక మీడియాలు కావచ్చు , టీవీ లు కావచ్చు , ఇంటర్ నెట్ కావచ్చు , అధికంగా విద్యావంతులు కావడం కావచ్చు , ఇతరులు అక్రమంగా , మోస పూరితంగా , అధికంగా సంపాదించి , విచ్చలవిడిగా ఖర్చు చేయడం కావచ్చు , దేశ విదేశాలలో విహరించడం కావచ్చు , వారిని ప్రభుత్వాలు పెద్దగా పట్టించు కోక పోవడం కావచ్చు , స్వతహాగా డబ్బు సంపాదించే శక్తి కావచ్చు , నాలుగు డబ్బులు చేతిలో కనబడటం కావచ్చు , ఒకరిని చూసి మరొకరు అనుకరించడం కావచ్చు , పాలకులు కొడుకుల కోడండ్ల , బిడ్డలా అల్లుండ్ల భాద్యతలను పెంచే చర్యలు తీసుకోక పోవడం కావచ్చు , ప్రీ పేయిడ్ ' అనాధ ఆశ్రమాల ' వ్యాపార మాయ కావచ్చు , స్వేచ్ఛగా , ఎవరి ఆజమాయిషీ లేకుండా జీవించాలనే కోరికలు కావచ్చు , ప్రేమగా ఉంటే పెద్దల భాద్యతలను తీసుకోవాల్సి వస్తుందని కావచ్చు , లేదా తల్లి దండ్రులలో విభేదాలు కావచ్చు , వారిలో ఒకరి జీన్స్ కావచ్చు , లేదా తల్లి దండ్రుల పెంపకం లో లోపం కావచ్చు , గ్రహ బలాలు కావచ్చు , మరింకేదేమైనా కావచ్చు . తరాలు మారు తున్నపుడు , కాలాలు మారు తున్నపుడు ఇది కూడా కొంత వరకు సహజమే . ఇది పారు తున్న సెల యేరు లాంటిది . భూకంపం లాంటిది . పెను తుఫాన్ లాంటిది . అగ్ని గుండం లాంటిది . దీనిని ఎవ్వరూ ఆపలేరు . నేటి మెజారిటీ యువతీ యువకుల మాటలు , పద్ధతులు , విధానాలు , తల్లి దండ్రుల యెడ భావన చూస్తుంటే అలానే అని పిస్తుంది .
ఈ కారణంగా ఆ చిన్న కుటుంబాలు కూడా పోయి , కేవలం భార్యా భర్తల వరకే పరిమితం కావాలని కోరుకుంటున్నారు . సంస్కృతికి , సాంప్రదాయాలకు పూజ్యం పెడుతున్నారు . నవ మాసాలు మోసి, కనీ పెంచి పెద్ద చేసి , విద్యా బుద్దులు చెప్పించి , కాళ్లరిగేలా తిరిగి , లక్షలు ఖర్చు పెట్టి , మంచి అల్లుండ్లను కోడండ్లను తెచ్చి వివాహాలు జరిపిస్తే , తల్లి దండ్రులన్నా , అత్తా మామలన్నా అసహించుకుంటున్నారు . రెక్కలు వచ్చిన పక్షుల్లా ఎగిరి పోతున్నారు . వారి మూలాలను మరిచి పోతున్నారు . ప్రతి చిన్న చిన్న విషయాలకు తప్పులు తీయడం , చిన్న బుచ్చుకోవడం , ఆవేశాలకు లోనుకావడం , తల్లి దండ్రులకు , అత్తా మామలకు దూరంగా జీవించాలనుకోవడం మొదలైనవి నేడు సర్వ సాధారణం అయి పోయినవి . వీటిని వారు గొప్పగా చెప్పుకుని సంతోషిస్తున్నారు . ఏమైనా అంటే కాలం మారింది , కాలానికి అనుగుణంగా మారాలి . పెద్దలు పాత చింత కాయ పచ్చడి లాంటి వారు అని ఉచిత సలహాలు ఇస్తున్నారు .
ఈ విధంగా అసహ్యించుకుని తల్లి దండ్రులను, కొడుకులు బిడ్డలు దూరం పెట్టినా , పట్టించుకోక పోయినా , ఘర్షణ పడినా , చీదరించుకున్నా , పెద్దగా బాధ పడనవసరం లేదు . వృద్ధాప్య దశ గురించి ఎంత మాత్రం చింతించ నవసరమూ లేదు . దీనికో చక్కని ఉపాయం ఉంది . చక్కటి పరిష్కార మార్గముంది . "మనసుంటే మార్గముంటుంది" అన్నట్లు , సమస్య వచ్చినప్పుడు అవసాన దశలో , వృద్దాప్య దశలో , చేత కాని దశలో బాధపడటం కంటే , ఆ సమయంలో పరిష్కారానికి ఆలోచించడం కంటే , ముందు నుండే , ఓ పది విత్తనాలను నాటడానికి ఆసక్తి చూపాలి . అంటే ఓ పది మందిని , మీ స్వభావానికి సరిపోయేటువంటి వారిని, మీరంటే అభి మానం , గౌరం ఉన్నటు వంటి వారిని , నిజాయితీ గల , నమ్మకమైన , అనుకూలమైన పేద మధ్య తరగతి పిల్లలను చేర దీయడం ప్రారంభించాలి . వారికి మీరు వయస్సులో ఉన్నపుడు , చేతనయినపుడు , వారికి మీ చేతనైన సేవను సహాయ సహకారాలు , ప్రేమతో నిజాయితీతో అందించాలి . ఇది మీకు చేతనైన పనే . దేశంలో 70 % పేద మధ్య తరగతి ప్రజలే ఉన్నారు . అన్ని రకాల సహాయ సహకారాలు అందుకోడానికి కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు . మీ స్వభవానికి సరి పడే వారు వేలల్లో ఎదిరి చూస్తున్నారు . అంతా మీ ప్రేమ , నిజాయితీ లపైననే ఆధార పది ఉంటుంది . ఆ పది మందిలో మీ మనుమలు మనుమరాండ్లు ఉండ వచ్చు , పని మనుషులు ఉండవచ్చు , ఇతరులు ఉండ వచ్చు . అది మీ ఇష్టం . ఇక వారికి ప్రేమను అందించాలి . వారి చిన్న చిన్న అవసరాలకు చేయూత నివ్వాలి . డబ్బు పెట్టడమే కాక పోవచ్చు . మాట సహాయం కావచ్చు . సలహా చెప్పడం కావచ్చు . ఆపదలో ఉన్నపుడు ఆదు కోవడం కావచ్చు . చిన్న చిన్న కానుకలు ఇవ్వడం కావచ్చు . ఈ ప్రక్రియ నిరంతరం , కన్న బిడ్డలను చూసుకున్నట్లుగానే ఉండాలి . జీవన శైలిలో ఇదొక భాగంగా మారాలి . ఆ విధంగా చేయడం వలన , మీ సహాయం పొందిన బయటి వ్యక్తులకు , మీపై తప్పకుండా , గౌరవం , ప్రేమా, దయ , కరుణ , ఆప్యాయత , అభిమానం ఉంటుంది . మిమ్మల్ని ఖచ్చితంగా చేర దీస్తారు . అక్కున చేర్చు కుంటారు . మీ దగ్గర కొద్దో గొప్పో డబ్బు ఉంటుంది . ఎందుకంటే ముందు నుండే మీరు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి . దానిని రోజు వారి ఖర్చులకు ఉపయోగించు కోవచ్చు . అప్పుడు వారికి పెద్దగా ఆర్ధిక భారం పడదు .
మనం రోజూ పత్రికలలో , టీవీలలో చూస్తుంటాం . కొడుకులూ కోడండ్లు సరీగా చూడక పోవడం వలన ఉరిపెట్టుకున్నారని , ఆత్నహాత్యలు చేసుకున్నారని , తిరుపతి వెంకన్నకు ఆస్తులన్నీ వ్రాసిచ్చారనీ , కోట్లాది ఆస్తులుండి అనాధలయ్యారని , అడక్కు తింటున్నారని , దిక్కులేని చావు చచ్చారనీ వింటూ ఉంటాం . చూస్తూ ఉంటాం . ముందుగానే ఈ సోషల్ సర్వీస్ నిజాయితీగా , మనస్పూర్తిగా ప్రారంభిస్తే , పాజిటివ్ ధోరణితో నడుచుకుంటే నిండా నూరేళ్లు ఏ ఇబ్బందీ లేకుండా , ఎవ్వరితో చీవాట్లు పడకుండా , హాయిగా జీవించ వచ్చు . ఇక , ఆ పది విత్తనాలలో ఒకటి రెండూ గాలికి కొట్టుకు పోయినా , ఒకటి రెండింటిని పిట్టలు తిన్నా , ఒకటి రెండూ పుచ్ఛి పోయినా , చివరికి రెండు మూడయినా మిగులుతాయి . "కొడుకులు కోడండ్లు ,బిడ్డలు అల్లుండ్లు మిమ్ముల దూరం చేసిన రోజు , చీదరించుకున్న రోజు , అసహించుకున్న రోజు , బాధ పెట్టిన రోజు , మరింత వారికి దగ్గరై , మీ దగ్గర ఉన్న కొద్దీ పాటి నగదును , నగలను , ఆస్తులను , లేదా పెద్ద మొత్తం ఆస్తులను , మిమ్ములను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఆ మిగిలిన వారందరికీ లేదా మీకు నచ్చిన ఒకరిద్దరికీ విడతల వారీగా వీ లు నామా రాసేసి లేదా రిజిస్టర్ చేయిస్తే , వృధ్యాప్య దశలో హాయిగా జీవించ వచ్చు" .తల్లి దండ్రులు స్వతహగ సంపాదించిన ఆస్తులు , వారి కొడుకులు బిడ్డలకు నైతిక హక్కే కానీ , చట్టబద్దమైన హక్కు అని ఎక్కడా లేదు . ఇది కేవలం తరాలుగా వస్తున్న ఆనవాయితీ మాత్రమే . బాధ్యతలు నెరవేరుస్తే , నైతిక హక్కుగా తల్లి దండ్రుల ఆస్తులను పొందవచ్చు . దీనికి గ్రామస్తులే పూనుకోవాలి. సమాజమే పూనుకోవాలి . ఒక మంచి ప్రయోజనం కొరకు చట్టాలు సహకరించాలి .
దీనికి , వృద్ధులకు కావాల్సింది ఒకటే . మనో ధైర్యం . సాహసం . పట్టుదల , పిల్లలు ఎంచుకున్న దారినే నడువగలిగే మొండితనం అలవర్చుకోవడం . ఎంత మాత్రం ఫీలవ్వక పోవడం అనేవి ముఖ్యం . మొదట ప్రారంభించిన వారికి కొంత ఇబ్బంది , మానసిక ఆంధోలన ఉండవచ్చు . కానీ రాను రాను అందరూ అదే బాటలో నడిస్తే , ఏ బాధ అనిపించదు . చట్టాలను కూడా వీటికి అనుగుణంగా మార్చాలి . నైతిక బాధ్యత వహించి , కొడుకులు బిడ్డలు కూడా స్వచ్చందంగా , తల్లి దండ్రులు సంపాదించుకున్న ఆస్తులను వదులు కోవాలి . లేదా వారిని ఎదో విధంగా , వారికి కష్టం బాధ కలుగ కుండా పోషించే బాధ్యతను తీసు కోవాలి .
అయితే దేశంలో కొడుకులు కోడండ్లు , బిడ్డలు అల్లుండ్లు మంచి వారు అసలే లేరు అని అనడం లేదు . తల్లి దండ్రులను మంచిగా పోషించే వారు ఉన్నారు , ప్రేమలను , ఆప్యాయతలను పంచే వారు ఉన్నారు . " ఒకే వరలో రెండు కత్తులు ఇమడవు " అన్నట్లు , ఒకే కుటుంభం లో ఆధి పత్య పోరుగల అత్తా కోడండ్లు , 'ఒక తరం 'వయస్సు తేడా గల అత్తా కోడండ్లు , విద్య , సంపాదనలో తేడా గల అత్తా కోడండ్లు , పాత సాంప్రదాయాలు గల అత్తలు , పాశ్చాత్త్యా పోకడలు గల కోడండ్లతో నివసించ లేరు , " స్త్రీ కి , స్త్రీయే శత్రువు " అనే నానుడి ఏనాడో పుట్టింది . ఎవరికో ఒకరికి లేదా ఇద్దరికీ సర్దుబాటు గుణం ఉంటే తప్పా . " రౌతు గుర్రాన్ని కొలను వరకు తీసుకుని రాగలడే గాని, నీటిని త్రాగించలేడు " అన్నట్లు , కొడుకుల పరిస్థితి అలానే ఉంది . బిడ్డల పరిస్థితి కూడా అలానే ఉంది . చాదస్తపు తల్లి దండ్రులు , అత్తా మామలు , 70, 80 యేండ్లు వచ్చినా మా మాటే అందరూ వినాలనే వారు , మేము చెప్పినట్లుగానే నడుచుకోవాలి అనే వారు లేక పోలేదు. చాదస్తం తోటి గిల్లి పంచాయితీలు పెట్టుకునే తల్లి దండ్రులు లేక పోలేదు . ఈ కారణంగానే ప్రతి కుటుంభంలో అనేక సమస్యలు ఉంటున్నాయి . ఇక ముందూ ఉంటాయి కూడా .
అయితే , మీరు ఇక్కడ ఒక సమస్యను లేవదీయ వచ్చు . డబ్బు , ఆస్తులున్న వారు సరే . మరి డబ్బు , ఆస్తులు లేని వృద్ధుల పరిస్థితి ఏమిటి ?
'ఎంత చెట్టుకి అంతే గాలి' అన్నట్లు , వారికి తగ్గట్టే సేవలు లభించ వచ్చు . అంత కంటే ఎక్కువగా , పెద్దగా వారు ఊహించరు , ఆశించరు కూడా . నిజానికి ఏ తల్లి తండ్రి పేదలు కారు. ఆర్ధికంగా పేదలు కావచ్చు . కానీ పిల్లలకు ప్రేమను పంచడంలో , పిల్లలను పోషించడంలో పేదలు కారు . ధన వంతులైన , పేదలైనా , తల తాకట్టు పెట్టి అయినా , కడుపులో బిడ్డ పడిన కాన్నుండి , బిడ్డ భూమి మీద పడిన కాన్నుండి , రోగాలు వచ్చిన రొప్పులూ వచ్చినా , గాయాలైనా కంటికి రెప్పలా చూసుకుంటారు . తాము పెద్దగా చదువక పోయినా , తమ బిడ్డలు పెద్ద పెద్ద చదువులు చదివి , గొప్ప వారు కావాలని , మంచి పేరు తేవాలని , రిక్షా త్రొక్కయినా , అప్పులు తెచ్చి అయినా , నానా తంటాలు పడి అయినా , ఉన్నత విద్యలు కాన్వెంట్ స్కూళ్లలో , ప్రయివేట్ స్కూళ్లలో చదివించి , మంచి మంచి ఉద్యోగాలు లేదా వ్యాపారాలు వచ్చేటట్లు చేసి , పెళ్ళిండ్లు , పేరంటాలు , పురుడ్లు చేస్తే , తల్లి దండ్రులు పేద వారు ఎలా అవుతారు? పిల్లలను ప్రయోజకులను చేసే క్రమం లో ఆస్తులను పోగొట్టుకుని , అప్పుల పాలయితే వారు పేదలు ఎలా అవుతారు? ఒక వేల వారు నిజంగానే వారు పేద వారు అయితే , పిల్లలు కూడా పేద తనంగానే జీవిస్తే , తల్లి దండ్రులు కూడా అంతే స్థాయి పోషణను కోరుకుంటారు . అంతే స్థాయి ప్రేమలను , ఆప్యాయతలను ఆశిస్తారు . అంతే కానీ ఏ సి లు , 5 స్టార్ రెస్టారెంట్లు , మినరల్ వాటర్ , బంగళాలు , విల్లాలు అడిగరు . మానవత్వమున్న కొడుకులు బిడ్డలు ఇలాంటి లెక్కలు ఎవ్వరూ వేయరు . ఇలాంటి పేదల కోసమే ప్రభుత్వాలు , నెలకు 1,000/- రు . లు . పెన్షన్ ఇస్తుంది . తెల్ల రేషన్ కార్డు ఇస్తుంది . మందులు ఇస్తుంది . వీటినే ఇతరులకు ఇవ్వాలి . సచ్ఛంద సంస్థలు , ధాతలు , మా న వత్వం గల వారు , ప్రభు త్వాలు , ఇలాంటి పేదలకు , ధన వంతులైన వారు , అనాధ తల్లి దండ్రులకు చోటు కల్పించాలి , ఆర్ధిక సహాయం చేయాలి.
ఏది ఏమైనప్పటికి , ఏ కొడుకైనా బిడ్డయినా కొన్ని జీవిత నగ్న సత్యాలను మరువరాదు . అవి ఏమంటే ,
01. " ఏ కొడుకైనా , బిడ్డయినా కూడా , రేపు వారి కొడుకూ బిడ్డలకు తల్లి దండ్రులవుతామనే విషయం మరువరాదు . "
02." ఏ కొడుకైనా , బిడ్డయినా వారు కూడా , రేపు వారి అల్లుడూ కోడలుకు అత్తా మామ లవుతారనే విషయం మరువరాదు ".
03." ఏ కొడుకైనా , బిడ్డయినా వారు కూడా , రేపు వారూ వృద్ధాప్య దశను తప్పించుకోలేరనే విషయం మరువరాదు ".
04." ఏ కొడుకైనా , బిడ్డయినా నేడు వారి కొడుకూ , బిడ్డలను ఎలా పెంచు తున్నారో , తమను కూడా అలానే పెంచి ఉంటారనే విషయం మరువరాదు ".
05." ఏ కొడుకైనా , బిడ్డయినా వారికి కూడా , రేపు రోగాలు రొప్పులేస్తున్నాయని , ఆర్ధిక ఇబ్బందులు, కష్ట సుఖాలు , లాభ నష్టాలు ఉంటాయన్న విషయం మరువరాదు "..
06. " జాతస్య మరణం ధృవం " . అనగా పుట్టిన వారు గిట్టక తప్పదు అనే విషయం ఎవ్వరూ మరువరాదు" .
07. " ప్రతి మనిషి సమాజంలో ఒక భాగమే నన్న విషయం ఎవ్వరూ మరువరాదు ".
08. " ఏ మనిషి అయినా వారి వారి దశల నుండి , గ్రహాల నుండి , ప్రారబ్ధ ఖర్మల నుండి తప్పించు కోలేరు అనే విషయం మరువరాదు ".
09. " తల్లి దండుల ఆస్తులపై , కొడుకులకు బిడ్డలకు , నైతిక హక్కే గాని , చట్టబద్దమైన హక్కు లేదన్న విషయం మరువరాదు ".
శతాబ్దాలు గడిచినా , 16 శతాబ్దం నాటి మన జనకవి ,' వేమన ' వ్రాసిన అనేక మైన పద్యాలలో ఒకటి ఇప్పటి అందరి నోటిలో నానుతూనే ఉంది , నానుతూనే ఉంటుంది . అది ఏమంటే ,
" తల్లి దండ్రుల యెడ దయ లేని పుత్రుండు , పుట్ట నేమి వాడు గిట్టనేమి ,
పుట్ట లోన చెదలు పుట్టదా గిట్టదా , విశ్వదాభి రామ వినుర వేమా "
మరో విషయం , "కొడుకులు కోడండ్లు ,బిడ్డలు అల్లుండ్లు మిమ్ముల దూరం చేసిన రోజు , చీదరించుకున్న రోజు , అసహించుకున్న రోజు , బాధ పెట్టిన రోజు , మీరు స్వయంగా ఎంచు కున్న వారికి , నమ్ముకున్న వారికీ మరింత వారికి దగ్గరై , మీ దగ్గర ఉన్న కొద్దీ పాటి నగదును , నగలను , ఆస్తులను , లేదా పెద్ద మొత్తం ఆస్తులను , మిమ్ములను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఆ మిగిలిన వారందరికీ లేదా మీకు నచ్చిన ఒకరిద్దరికీ విడతల వారీగా వీ లు నామా రాసేసి లేదా రిజిస్టర్ చేయిస్తే , వృధ్యాప్య దశలో హాయిగా , ప్రశాంతంగా , మనఃశాంతితో జీవించ వచ్చు". అంతే కాదు , దీని వలన అనేక లాభాలు కూడా ఉన్నాయి . అవి ,
01. పేద పిల్లలకు కొంత ఆదరణ , ఆర్ధిక సహాయం అందుతుంది . వారు విద్య వంతు లవుతారు. ఉపాధిని పొందుతారు . తమ కాళ్ళ మీద , తాము జీవించ గలుగుతారు .
02. ప్రభుత్వాలకు కొంత భారం తగ్గుతుంది .
03. సంపద వికేంద్రీకరణ జరుగుతుంది . ఆర్ధిక అసమానతలు తొలిగి పోతాయి .
04. వృద్ధాప్య దశలో తల్లి దండ్రులకు ఎలాంటి దిగులు , బాధ కష్టం ఉండదు .
05. సమాజం దృష్టి కూడా పిల్లలపై పడుతుంది కాబట్టి , వారిలో కూడా కొంత మార్పు రావచ్చు . ఆస్తుల కొరకైనా లేదా ప్రేమ తోటైనా , లేదా జ్ఞ్యానోదయం కలిగయినా తల్లి దండ్రులను , ఎదో విధంగా చూసుకోడానికి , ఆదు కోడానికి ముందుకు రావచ్చు .
06. అనేకమైన ఇతర కారణాల వలన అనగా అత్తా కోడలుకు పడక పోవడం కావచ్చు , కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం కావచ్చు , మరే ఇతర కారణాలు కావచ్చు . అలాంటప్పుడు కొడుకులు , తల్లి దండ్రులను దూరంగా ఉంచయినా ఆర్ధిక భారాన్ని భరిస్తూ , ప్రేమలను , ఆప్యాయతలను పంచినా చాలు . అందులో తప్పేమి లేదు . కోడళ్లతో , తిట్లు , కొట్లు , చంపబడటాలు పడే బదులు , పరిస్థితులను బట్టి వారిని దూరంగా ఉంచి పోషించడం నేరం కాదు . వృద్ధాశ్రమం లలో లేదా వారి వారి గృహాలలో ఉంచడంలో తప్పు లేదు . తల్లీ దండ్రుల మీద ప్రేమ ఉందా లేదా అనేదే ముఖ్యం . కొడుకులకు ఇలాంటి ఆలోచనలైనా రావచ్చు . ఏ కొందరికి వచ్చినా నా జీవితం ధన్యమే .
07. కొందరు తల్లి దండ్రుల మనస్థత్వాలు కూడా కొడుకులకు, లేదా కోడన్లకు కు లేదా బిడ్డలకు లేదా అల్లుండ్లకు నచ్చక పోవచ్చు , గిట్టక పోవచ్చు . అలాంటి వారికి ఇలాంటి పిల్లల మనస్థత్వాలు నచ్చ వచ్చు . ఆ కారణంగా కూడా వీరికి వృద్ధాప్య దశలో ఎలాంటి దిగులు ఉండదు .
08. ఒక్క కుటుంభంతో మొదలైన ఈ విధానం , దేశమంతా విస్తరిస్తే , సంపద విస్తరించి ,ఆర్ధిక అసమానతలు తగ్గి పోయి , పేద కుటుంబాలు కనుమరుగయి పోతాయి . దేశం ఆర్ధికాభి వృద్ధి చెందుతుంది.
09. వృద్ధులకు జీవించాలనే ఆశ పెరుగుతుంది . జీవించ గలమనే ధైర్యం పెరుగు తుంది . బలవంతపు చావులు / ఆత్మ హత్యలు తగ్గి పోతాయి .
10. వృధ్యాప్య దశలో హాయిగా , ప్రశాంతంగా , మనఃశాంతితో జీవించ వచ్చు".
ఈ ఆర్టికల్ ను నేటి వృద్ధులు చదువలేక పోవచ్చు . వారికి ఇప్పటికీ ఇప్పుడే నిర్ణయాలు తీసుకోగల శక్తి , ధైర్యం లేక పోవచ్చు . కానీ నేటి యువతీ యువకులకు తల్లి దండ్రులు తప్పకుండా ఉండి ఉంటారు . వారిలో మార్పు వస్తే చాలు . మరో విషయం , నేటి యువతీ యువకులే , రేపు తల్లి దండ్రులుగా మారుతారు . అప్పుడైనా వారు ఈ నిర్ణయాలు తీసుకోడానికి అవకాశం ఉంటుంది . అయితే వీరు ఇప్పటి నుండే కొంత డబ్బు పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది . అలానే ఇతర పిల్ల యెడ ప్రేమ , దయ , కరుణ , ఆప్యాయత , సహనం పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది . అంతే కాకుండా ఎక్కడైనా , ఒంటరిగానైనా సంతోషంగా జీవిస్తాం అనే విధంగా మనో ధైర్యాన్ని పెంచు కోవాలి .
ఇది ఎదో ఒక రోజు తప్పకుండా మొదలవుతుంది . ముసలి వారంటే చీదరించుకునే
, ఏ విధమైన సహకారం , ప్రేమలు అందించని కొడుకులు బిడ్డలకు , కోడండ్లకు అల్లుండ్లకు జ్ఞ్యానోదయం కలుగుతుంది .
" సర్వే జన : సుఖినో భవంతు "