ప్ర : " జన్ ధన్ యోజన " పథకం సంపూర్ణంగా విజయ వంతం కావాలంటే ఏమి చేయాలి?
జ : "జన్ ధన్ యోజన " పథకం సంపూర్ణంగా విజయ వంతం కావాలంటే , ఈ క్రింది వాటిని  తప్పనిసరీగా పరిగణ లోకి తీసుకోవాలి .  అవి , 
01. రాజ్యాంగ పరమైన " విద్యా హక్కును " , సంపూర్ణంగా , మనః స్పూర్తిగా అమలు చేయాలి .
02. బ్యాంకు వ్యవహారాలపై , ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి .
03. కొన్ని బ్యాంకులను కలిపేయాలి . మరియు బ్యాంకుల బ్రాంచులను ప్రతి గ్రామం లో ఉండేటట్లు చోరువ తీసుకోవాలి .
04. బ్యాంకు ఆఫీసర్లు , సిబ్బంది ' కస్టమర్ ఫ్రెండ్లీ " గా వ్యవహ రించాలి .
05. ప్రజలకనుగునంగా , బ్యాంకుల సమయాలను మార్చాలి .
06. ఆటోమాటిక్ గా  డెబిట్ చేయడానికి , 30 రోజుల ముందుగా  ఎస్ ఎం ఎస్  ద్వారా తెలియ పరుచాలి . ఒక వేల ఆరోజుకు బ్యాలన్స్ లేక పోతే , ఆ తరువాతి కాలంలో ఎప్పుడైనా  రుసుములతో  డెబిట్ చేసి  పాలసీని  లైవ్ లో ఉంచాలి .  సామాన్య జనానికి  ఇవేమీ  తెలియవు .  పాలసీ లైవ్ లోనే ఉండను కుంటారు .  సాధారణంగా మనుష్యులకు  అశ్రద్ధ ఎక్కువ . మతి మెరుపు ఎక్కువ. వీటిని ఇన్స్యూరెన్స్ కంపెనీలు  అడ్వాంటేజ్ గా తీసుకోరాదు .  
07. ప్రతి అకౌంట్ కు , నామినీని మ్యాన్డేటరీ చేయాలి . వారి పూర్తి అడ్రస్ లు , సెల్ నెంబర్లు రిజిస్టర్ చేయాలి . అనుకోని సంఘటనలు జరిగి నప్పుడు , ఎలాంటి కొర్రీలు లేకుండా , అకౌంట్ లోని బ్యాలన్స్ అమౌంట్ , నామినీకి  చెల్లించే ఏర్పాటు చేయాలి . ఏదైనా  అనుకోని  సంఘటన ( ఆక్సిడెంట్ , మరణం ) జరిగినప్పుడు , నామినీ అడ్రస్ సరీగా లేదని , బ్యాంకు అకౌంట్ నెంబర్ సరీగా లేదని , మాకు సరియయిన సమయంలో  తెలియ పరచలేదని   జిమ్మిక్కులు చేయరాదు . కోర్టుల చుట్టూ  త్రిప్పు రాదు .  ఎందరికో  ఇండ్లు  లేవు . అందుకని  అడ్రస్ లు  మరీనా  అకౌంట్ నెంబర్ మారదు .  సగం డబ్బులు మేసే మధ్యవర్తులను , బ్రోకర్లను  నిషేధించాలి . 
08. ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాలి .
09. సర్వీస్ చార్జీలను తగ్గించాలి . సర్వీస్ పన్నును పూర్తి గా ఎత్తి వేయాలి .
10. క్లైముల గురించి ప్రజలలో అవగాహన కల్పించాలి .
11. క్లైముల విషయంలో పారదర్శకత ఉండాలి, సత్వరం జరగాలి .
www.sollutions2all.blogspot.com
No comments:
Post a Comment