ప్ర : నేడు బ్యాంకుల పని తీరు (EXPERIANCE OF BANKS) వాస్తవంగా ఎలా ఉంది ? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి ?
జ : నేడు బ్యాంకుల పని తీరు చాలా దారుణంగా ఉంది . ఆ కారణంగానే బ్యాంకులలో రోజు రోజుకు మొండి బకాయిలు పెరిగి పోతున్నాయి . రాని బాకీలుబుపెరిగి పోతున్నాయి . లాభాలు తగ్గుతున్నాయి .

సామాన్య , మధ్యతరగతి వారికి లక్ష రూపాయల అప్పు ఇవ్వాలంటే , బ్యాంకులకు రెండు , మూడు సంవత్స రాల అధిక ఆదాయం గల ' ఐ.టి ' రిటర్నులు ఇవ్వాలి , పాన్ కార్డు ఇవ్వాలి , ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు ఇవ్వాలి , 'సిబిల్' చెక్ చేయించు కోవాలి , ఒక సంవత్సరం బాంక్ ట్రాన్జాక్షన్స్ ఇవ్వాలి , 10 రెట్లు సెక్యూరిటీ ఇవ్వాలి . బ్యాంకులు సూచించిన చార్టర్ ఇంజినీరుతో ఆ సెక్యూరిటీకి వాల్యుయేషన్ చేయించి ఇవ్వాలి , బ్యాంకులు సూచించిన లాయర్ తో లీగల్ ఒపినీయన్ చేయించి ఇవ్వాలి , ఈ సి , ఇవ్వాలి , రెండు ఫోటోలు ఇవ్వాలి . అయినా నెలా , రెండు నెలలు కాళ్ళు అరిగేలా తిరిగినా , ఏదో ఒక లోపం చూపించి రిజెక్ట్ చేసిన లోను అప్లికేషన్స్ కోకొల్లలు .
అదే పలుకు బడి వారికి , పెద్దలకు ఏ సెక్యురిటీ లేకుండానే , ఏ 'సిబిల్' రిపోర్ట్ చూడ కుండానే వేల కోట్ల అప్పులు ఇస్తాయి . ఒక వేల నిజంగా సేక్యూరిటే ఉంటే , అన్ని వేల కోట్ల అప్పులు ఎందుకు రాని బాకీలుగా మారుతాయి . లా ఆండ్ ఆర్డర్ కు ఎందుకు సమస్యలు వస్తాయి . కోర్టులలో కేసులు ఎందుకు పేరుకు పోతాయి .
పెద్దల అప్పులు వసూలు చేయడానికి , వారి ఆఫీసుల ముందర ప్లే కార్డులు పట్టుకుని కూర్చోవడం , సామాన్యులకైతే నోటీసులిచ్చి ఆస్తులను వేలం వేయడం ఎంత విడ్డూరం . ఒక ఆటవిక విధానంగా మారి పోతుంది . నేడు మీడియా , ఇంటర్నెట్ పుణ్యమా అని , క్షణాలలో వార్తలు ప్రపంచమంతా ప్రాకి పోతుంది .
బ్యాంకులు నడిచేది ముఖ్యంగా ప్రజల డిపాజిట్ల తోనే అనేది మరియు ప్రజలు అప్పులపై చెల్లించే వడ్డీలు , చార్జీల తోనే బ్యాంకులు ఆదాయాన్ని పొందుతున్నాయనే విషయాన్ని మరిచి పోకూడదు . ఒక సారి ప్రజలకు బ్యాంకులపై నమ్మకం సన్నగిల్లినా , బ్యాంకులు వివక్ష చూపినా , బ్యాంకులు పంపించే సందేశాన్ని ప్రజలు పూర్తిగా అర్ధం చేసుకున్నా , ఇక బ్యాంకులు మన గలగడం కష్ఠ తరం కాగలదు .
ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి ?
సమస్యకు కారణమైన కారకాలను అధిగమిస్తే లేదా తొలగిస్తే సమస్యనుండి బయట పడ వచ్చు.
అవి ,
01. రాజకీయ జోక్యం తగ్గించాలి .
02. బ్యాంకు అధికారులు బ్రోకర్లను , పైరవీ కారులను ధరి చేయ నీయ రాదు . వారి ద్వారా వచ్చిన అప్లికేషన్లను పరిగణలోకి తీసుకొనరాదు .
03. 'సిబిల్ ' నే పూర్తిగా ఆధారం చేసుకోరాదు .
04. అధికారులే కంపెనీలను గాని , వ్యక్తులను గాని విసిట్ చేయాలి . పరిశీలించాలి .
05. లోన్ స్లాబ్లను బట్టి , లోన్ శాంక్షన్ అధికారాలను వికేంద్రీక రించాలి .
06. లోన్ ఇవ్వాళా వద్దా అనే అధికారం , బ్యాంక్ అధికారులకే ఉండాలి గాని మరొకరికి ఉండకూడదు . అంతే కాదు ఆబ్లిగేషన్స్ , రెకమండేషన్స్ , బెదిరింపులు ఉండ కూడదు .
07. ఒక వేల ప్రభుత్వ నిబంధనల ప్రకారం సబ్సిడీలు ఇవ్వాల్సి వస్తే లేదా ప్రభుత్వ ఆబ్లిగేషన్స్ ఉంటే ఆ సబ్సిడీ మొత్తాన్ని లేదా ఆ రాణి బాకీలను ఆ ప్రభుత్వాలే ఫిల్ చేయాలి .
08. ఈ రోజుల్లో ప్రతి డాక్యుమెంటును ఉదా : ఓటర్ కార్డు , ఆధార్ కార్డు , గ్యాస్ బిల్ , ఐ . టి . రిటర్న్ , బ్యాంక్ స్టేట్ మెంట్ , పాన్ కార్డు , ఈ సీ రికార్డ్ మొదలైనవి , అవి వర్జినలా లేక డూప్లికేటా , వెరిఫై చేసుకునే అవకాశాలున్నాయి . అందుకని బ్యాంకు అధికారులే వాటిని వెరిఫై చేసుకుని లోన్ శాంక్షన్ చేయాలి .
09. అన్నీ సక్రమంగా ఉన్న వారికీ , రోజులకొద్దీ , నెలకొద్దీ చెప్పులరిగేలా త్రిప్పకుండా , రెండు మూడు రోజులలోనే లోన్ శాంక్షన్ చేయాలి .
10. లోన్ శాంక్షన్ చేసిన తరువాత ప్రతినెలా , వారి సంస్థల తీరును లేదా వ్యక్తుల ఉపయోగాన్ని పరిశీలిస్తూ ఉండాలి . వారి చెల్లింపుల విధానాన్ని పరిశీలిస్తూ ఉండాలి .
11. అవసరమైతే వారికి సలహాలు , సూచనలు చేస్తూ ఉండాలి .
12. ఎప్పటి కప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ ఉండాలి .
13. ఆదరా బాదరా కాకుండా , డాక్యుమెంటేషన్ , స్యురిటీలు , ఆధారాలు సరీగ ఉండేట్లు చూసుకోవాలి . బ్రోకర్లు , మధ్య వర్తులు ఉన్నపుడు వీటిని నమ్మకంతో పట్టించు కోరు , ఆడిట్ జరుగుతున్నపుడు తప్పా .
అందుకని పై సూచనలను పాఠించినట్లవుతే రాని బాకీలను , మొండి బకాయిలను తగ్గించు కోవచ్చు .

No comments:
Post a Comment