ప్ర : 'ఫేస్ బుక్ ' ( Facebook) లో డుప్లికేట్ అకౌంట్లు (Fake Accounts) లేకుండా చేయాలంటే ఏమి చేయాలి ?
" ప్రతి ఫేస్ బుక్ " అకౌంట్ కు " ఆధార్ నెంబర్ " తప్పని సరి, అనే నిభందనను పెట్టాలి" .
("Aadhar Number " should be made as mandatory to open a Account in the 'Face book ' to control fake Accounts).
సామాజిక మీడియాలో 'పేస్ బుక్' కు ఉన్నంత క్రేజ్ మరి దేనికి లేదు . సామాజిక మీడియా ఒక అద్భుతమైన ప్రజా వేదిక . లక్షాలాది ఆలోచనలకు ప్రతి బింభం . కోట్లాది సమస్యల పరిష్కారానికి ఆధారం. ఇంతటి గొప్పసామాజిక మీడియా అయిన 'పేస్ బుక్' లో ఈ మధ్య అనేక మైన ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నట్లు మరియు దాని వలన అనేక మైన సమస్యలు ఎదురవుతున్నట్లు మనం పత్రికల ద్వారా , టి వి, రేడియోల తెలుసుకుంటున్నాం . ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో పునరావృత్తం కాకుండా ఉండా లంటే మరియు 'పేస్ బుక్' లో ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేయకుండా కట్టడి చేయాలంటే చక్కటి మార్గం ఒకటి ఉంది . దీని వలన ఎవ్వరు కూడా ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేయలేరు . ఎవ్వరూ ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు ఓపెన్ చేయలేరు .
దానికి ఒక చక్కటి మార్గం ఏమంటే భారత దేశంలో "ప్రతి ఫేస్ బుక్ " అకౌంట్ కు " ఆధార్ నెంబర్ " తప్పని సరి, అనే నిభందనను పెట్టాలి . అలానే ఇతర దేశాలలో వారి పరిమనెంటు గుర్తింపు కార్డు నెంబరు తప్పని సరి అనే నిభందనను పెట్టాలి . అంతే . 'ఫేస్ బుక్ లో అక్కౌంట్ ' అనేది రాజ్యాంగ హక్కు కాదు , ప్రాధమిక హక్కు అంత కంటే కాదు . మన దేశ రక్షణ మనకు ముఖ్యం . మన దేశ సమస్యలు మనకు నష్టం .
No comments:
Post a Comment