ప్ర : పోస్టాఫీసులో "సుకన్య సమృద్ధి అకౌంట్" ( SUKANYA SAMIDDHI ACCOUNT IN POST OFFICE ) ఓపెన్ చేయడం వలన ప్రయోజనం ఏమిటి ? దాని మీద ఎంత వడ్డీ వస్తుంది ? ఎవరు అర్హులు ? ఎంత కాలం కంటిన్యూ చేయాలి ?
జ : పోస్టాఫీసులో "సుకన్య సమృద్ధి అకౌంట్" ( SUKANYA SAMIDDHI ACCOUNT IN POST OFFICE ) ఓపెన్ చేయడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి . ప్రస్తుతం దీనిలో అత్యధిక వడ్డీ రేటు లభిస్తున్నది . వడ్డీ ప్రతి సంవత్సరం కాంపౌండ్ వడ్డీ ప్రకారం లెక్క గడుతారు . సులువుగా దగ్గరలోని ఏదేని పోస్టాఫీసులలో అకౌంట్ ఓపెన్ చేయ వచ్చు . పూర్తి ప్రభుత్వ సెక్యురిటీ ఉంటుంది . మినిమం రూ . లు .1000/- లతో అకౌంట్ ఓపెన్ చేయ వచ్చు . ఆ తరువాత నెలలో , లేదా సంవత్సరం లో ఎంతైనా కట్ట వచ్చు . ఎన్ని సార్లైనా కట్టు కోవచ్చు . కానీ సంవత్సరంలో రూ . లు . 1,50,000/- మించ కూడదు . ఆడ పిల్లలకు ఆర్ధిక భద్రత కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం .
"సుకన్య సమృద్ధి అకౌంట్" ( SUKANYA SAMIDDHI ACCOUNT ) లో ఎంత వడ్డీ వస్తుంది ?
అన్ని స్కీ మ్ ల కంటే అధికంగా 8.6% వడ్డీ లభిస్తుంది (సాలుకు ) .
"సుకన్య సమృద్ధి అకౌంట్" ( SUKANYA SAMIDDHI ACCOUNT ) ఓపెన్ చేయడానికి ఎవరు అర్హులు ?
పది సంవత్సరాల లోపు వున్న ఆడ పిల్లలు మాత్రమే అర్హులు . ఒక సంవత్సరం గ్రేస్ పిరియడ్ ఉంటుంది . ఒక పాప కు ఒక అకౌంట్ మాత్రమే . ఇద్దరు అడ పాపలు ఉంటే మ్యాక్సిమం రెండు అకౌంట్లు మాత్రమే అనుమతిస్తారు .
"సుకన్య సమృద్ధి అకౌంట్" ( SUKANYA SAMIDDHI ACCOUNT ) ఎంత కాలం కంటిన్యూ చేయాలి ?
పాపలకు 21 సంవత్సరాలు వచ్చే వరకు కంటిన్యూ చేయాలి . ఆ తరు వాత మన ఇష్టం .
"సుకన్య సమృద్ధి అకౌంట్" ( SUKANYA SAMIDDHI ACCOUNT ) ఎవరు ఓపెన్ చేయ వచ్చు ?
తల్లి దండ్రులు , అమ్మమ్మ , నానమ్మ , తాతయ్యలు గార్డియన్ గా ఓపెన్ చేయ వచ్చు .
"సుకన్య సమృద్ధి అకౌంట్" ( SUKANYA SAMIDDHI ACCOUNT ) లో మధ్యలో ఏమైనా డబ్బు తీసు కోవచ్చా ?
అలాంటి అవకాశం లేదు . కానీ పాపలకు 18 యేండ్లు దాటిన తరువాత విద్య కోసమని , అప్పటి వరకు కట్టిన మొత్తంలో 50% వరకు తీసుకోవచ్చు .
"సుకన్య సమృద్ధి అకౌంట్" ( SUKANYA SAMIDDHI ACCOUNT ) లో డబ్బులు సర్దు బాటు కాక , లేదా మరిచి పోయి ఏదైనా సంవత్సరంలో కనీసం 1000/- రూ .లు . అయినా కట్ట క పోతే ఏమౌతుంది ?
అకౌంట్ డిస్కంటీన్యూ అవుతుంది . అయితే తరువాత దానిని , సంవత్సరానికి 50 రూ . లు పెనాలిటీ కట్టి రెన్యూ చేసు కోవచ్చు .
"సుకన్య సమృద్ధి అకౌంట్" ( SUKANYA SAMIDDHI ACCOUNT ) ను 21 యేండ్ల కంటే ముందుగా క్లోజ్ చేయడానికి వీలు కాదా ?
కొన్ని సంధర్భాలలో చేయ వచ్చు . అదియును 18 సంవత్సరాలు దాటిన తరువాతనే . అవి ఏమంటే , అమ్మాయికి పెళ్లి జరుగుతే .
No comments:
Post a Comment