Wednesday, November 30, 2016

TO

THE PRIME MINISTER.
GOVT. OF INDIA
NEW DELHI

Respected Sir,

WHAT ARE THE NEXT STEPS TO BE TAKEN, AFTER 30 TH DECEMBER,2016?

This is the continution to the earlier suggessions mail dtd. 23.11.2016.

01. Must  do the "Surgical strike" on gold holding corrupted and Black money people.

02. Must do the " Surgical strike" on Agricultural Income. Most of the corrupted  and Black money people , purchasing  agriculture lands and selling the lands and escaping from Income Tax. It is a big loop hole in the Income Tax act, 1961. 

03. Must do the "Surgical strike" on 'Corrupted and Black money" house owners. By captaring lands and with the  'Corrupted and Black money" constructing flats and houses and giving rents with huge rates and escaping from income tax and property tax. Must fix each family

"నగదు రహిత వ్యవస్థ" (CASH LESS SOCIETY) కోసం సలహాలు ఏమిటి ?

ప్ర : "నగదు రహిత వ్యవస్థ" (CASH LESS SOCIETY)  కోసం  సలహాలు  ఏమిటి ?

జ : "నగదు రహిత వ్యవస్థ" (CASH LESS SOCIETY)   కోసం  అనేకమైన  సలహాలను  చెప్పు కోవచ్చు . అందులో  ముఖ్యమైనవి,

01. ముందుగా  ప్రజలలో" ఆర్ధిక  క్రమ శిక్షణ" ను  ప్రోత్సహించాలి . మితిమీరిన  కోరికలను  తగ్గించుకునే విధంగా  వారిని సిద్ధం చేయాలి . (MUST PREPARE  THE PEOPLE TO  FINANCIAL PLAN AND TO REDUCE THE ABNORMAL DESIRES).

02. వృధా ఖర్చులను  తగ్గించుకునే విధంగా   మరియు  పొదుపును  పెంపొందించుకునే  విధంగా  ప్రజలను మోటివేట్  చేయాలి . ఆ విధంగా  నగదు వాడకాన్ని / చలామనిని  తగ్గించాలి.

03. ప్రభుత్వమే  సరిపడే  అన్ని  "ప్లాస్టిక్  టోకెన్స్"  తయారు  చేసి  ప్రజలకు పంపిణీ చేయాలి . "ప్లాస్టిక్  టోకెన్స్" రూ . లు .20/-, 10/-,5/-, 2/- మరియు 1/- డినామినేషన్లలో   తయారు  చేయాలి .  వాటిపైన  క్లియర్  గా  " ON DEMAND WE WILL PAY RS.---- TS" అని  ముద్రించాలి . వీటిని  సరఫరా చేయడానికి , ప్రతి  ప్రభుత్వ సంస్థ  వద్ద  ( ఉదా ; RTC, GHMC, MEE SEVA, ELECTRICITY DEPT., GOVT. HOSPITALS ETC.,) స్వైపింగ్ మెషన్లను  ఏర్పాటు చేయాలి . అక్కడ  అవసరమైన వారు  కార్డును  స్వైపింగ్  చేసి టోకెన్స్ తీసుకునే విధంగా మరియు  వద్దనుకున్నపుడు  టోకెన్స్ వాపస్ చేసి  నగదు తీసుకునే విధంగా లేదా  బ్యాంకు అకౌంటుకు గాని  పోస్టాఫీస్  అకౌంటుకు గాని  జమ చేసే విధంగా   ఏర్పాటు చేయాలి . ఈ  "ప్లాస్టిక్  టోకెన్స్"  ను  అన్ని చోట్ల  ఆక్సెప్ట్  చేసే విధంగా ( బస్సులలో , కిరానా షాపుల్లో , పాన్ షాపులలో , కూరగాయల మార్కెట్లో , పాలు అమ్మే చోట ) , ప్రభుత్వం  సర్క్యులర్ ను  విడుదల చేయాలి . 

04. గ్రామాలలో  పూర్వీకుల కాలం నాటి  "బార్టర్ విధానం " (BARTER SYSTEM)  ను ప్రోత్సహించాలి . "బార్టర్ విధానం " అనగా , ఒకరి వస్తు  సేవలను వాటి విలువ ఆధారంగా  , మరొకరి  వస్తు  సేవలతో  మార్పిడి చేసుకోవడం అన్న మాట . ఉదా :   A  అనే వారికీ  1కె జి . బెండకాయలు కావలి .  అవి  B వద్ద ఉన్నాయి . B  వాటి విలువకు సమానంగా  పావు శేరో , అద్ద  శేరో  వడ్లో , జొన్నలో తీసుకుని  బెండ కాయలు  ఇస్తారు  . అలానే సేవలు . ఈ రోజు మీరు మాకు పనికి వస్తే , మీకు అవసరమైనప్పుడు  మేము మీకు పనికి వస్తాము .  ఇలా  అనేక మైన  వాటిని నగదు లేకుండా  అవసరాలు తీర్చు కోవచ్చు . 

05. రేషన్ షాపులలో , "బయో మెట్రిక్  సిష్టం " ద్వారా  అంటే వేలు ముద్రల ద్వారా , వారి బ్యాంకు అకౌంటుకు లేదా  పోస్టాఫీస్  అకౌంటుకు   డెబిట్ అయ్యే విధంగా  చేయాలి . ఇది విజయం కావాలంటే , రేషన్ కార్డు లు  ఉన్న వారందరికి  విధిగా  బ్యాంకు  అకౌంట్ ఉండాలి . అలానే  ఆధార్ కార్డు ఉండాలి . దీనికి బ్యాంకు అకౌంట్ కు లేదా  పోస్టాఫీస్  అకౌంటుకు లింక్ చేసి ఉండాలి . రేషన్ కార్డులోని సభ్యులే  రేషన్ షాపుకు వెళ్ళాలి . బ్యాంకు అకౌంట్ లేదా  పోస్టాఫీస్  అకౌంటుకులో  బ్యాలెన్స్  ఉండాలి .  మెషన్లో  అకౌంట్ నెంబర్  టైపు చేయగానే  బ్యాలెన్స్ తెలిసే విధంగా వ్ సాఫ్ట్ వేర్ తయారు చేయాలి . అలానే డెబిట్ అయినా తరువాత , దానికి సంభందించిన  రసీదు  వచ్చే ఏర్పాట్లు చేయాలి . లేదంటే మిస్యూజ్ అయ్యే అవకాశం లేక పోలేదు . 

06. గ్రామాలలో ని  పోస్టాఫీసులను  బలోపేతం చేయాలి . ప్రతి పోస్టాఫీసులో  ఎస్ . బి . అకౌంట్లు తెరిచే విధంగా  ఏర్పాటు చేయాలి .  ఏజెంట్లను దరి చేయ నీయ  రాదు . ప్రతి పోస్టాఫీసులో  ఒక స్వైపింగ్ మెషిన్  ను  ఏర్పాటు చేయాలి . పోస్టల్ చార్జీలను  చెల్లించడానికి  డబ్బు పొదుపు చేసుకోడానికి ,  మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి  వీలవుతుంది .

07.  నమ్మకమైన  ప్రజలకు  కిరానా  షాపుల వారు , కూరగాయలు అమ్మే వారు , ఇతర వస్తువులు అమ్మే వారు  నెల అంతా  ఉద్దెర (CREDIT)  ఇచ్చే ఏర్పాట్లు చేసుకుని , నెల తరువాత లేదా  జీతం వచ్చిన తరువాత  డెబిట్ కార్డు ద్వారా  లేదా  చెక్కు ద్వారా పేమెంట్ చేయవచ్చు . నమ్మకం లేని  ప్రజలు  అంటే  తెలియని  వ్యక్తులు కావచ్చు , డబ్బు ఎగ్గొట్టే వారు  కావచ్చు , అలాంటి  వారు ముందు గానే  డెబిట్ కార్డు ద్వారా  వారి వద్ద  బ్యాలెన్స్ పెట్టి  లేదా   ఒకే సారి నెల మొత్తం  సామాను  తీసుకుని  డెబిట్ కార్డు ద్వారా చెల్లించి  లేదా చెక్కు ఇచ్చి  కొనుక్కోవచ్చు . ఎక్కడా నగదు అవసరం ఉండదు . 

08. అన్ని భాషలలో  మొబైల్  పేమెంట్ విధానం , స్వైపింగ్ మెషిన్లను , పి.ఓ.ఎస్.  మెషిన్లను , ఈ . వ్యాలెట్స్ ను   విస్తృతంగా  అందుబాటులోకి తీసుకుని రావాలి .  ప్రజలకు  మొబైల్ బ్యాంకింగ్ అవగాహనపై  ట్రైనింగ్ ఇవ్వాలి . మోసాలు జరుగకుండా  ఏర్పాటు చేయాలి .  ఇంటర్నెట్ ను , కరెంటును  నిరంత  రాయంగా  సరఫరా  అయ్యేట్లు చూడాలి . 

09. సాధారణంగా  గ్రామీణ ప్రజలకు బస్తా నిండా  బియ్యం , కుండా నిండా నీరు  మరియు చేతిలో నగదు ఉంటె  , వారు  ఎంతో ధైర్యంగా (భద్రతగా ) ఫీలవుతారు . అలాంటిది  చేతిలో నగదు  లేక పోయే సరికి  వారికి  అభద్రతా భావం ఏర్పడుతుంది .  అందుకని ,  నగదు రహిత విధానం వలన  మనకే ప్రయోజనం  అని, బ్యాంకులో  ఉండడం వలన  మీ  డబ్బుకు పూర్తి భద్రత  ఉంటుందని , దానిపైనా   సాలుకు  4%  వడ్డీ  కూడా  జమ అవుతుందని, ప్రజలు  అర్ధం చేసుకునే విధంగా ( వారి వారి భాషలో) వారికి పూర్తి  నమ్మకం కలిగించ గలగాలి .  

10. ఉద్యోగులకు  వేతనాలను , వృద్ధులకు , వికలాంగులకు  మినహా అందరికి  పెన్షన్లను , వారి బ్యాంకు అకౌంట్లకే  ట్రాన్స్ఫర్ చేయాలి . 

11. పరిస్థితులను బట్టి  , ఎప్పటికప్పుడు  టెక్నోలోజీని  ఉపయోగించుకుని మార్పులు చేర్పులు చేస్తూ ఉండాలి . 

12. రోడ్ల పైనా , గుడుల వద్ద  , బస్సు  స్టాప్ లలో , మరెక్కడైనా  బిక్ష గాండ్లు  లేకుండా , ట్రైన్లల్లో కొజ్జాలు (చెప్పలేనటువంటి  చేస్టలతో) ,  డబ్బులు వసులు  చేయ కుండా  ప్రభుత్వాలు నిషేధించాలి . వారి వెనుకాల ఉన్న  బ్రోకర్లను  కట్టడి చేయాలి .  నిరు పేదలైన , ఏ ఆసరా లేని  వారికి , అంగ వికరులకు , వృద్దులకు  ప్రభుత్వమే  జీవనోపాధి కలిగించాలి . వసతి కల్పించాలి .    ప్రజలు కూడా ఒక్క రూపాయి కూడా వేయ కూడదు . బిక్షాటన  వృత్తిని ప్రోత్సహించ కూడదు . నిజంగా వారు నిరు పేద  బిక్ష గాండ్లు  అయితే ,  వారిని  ఉత్పాదకతకు  వినియోగించుకోవాలి  గాని , సోమరులుగా తయారు చేయకూడదు . ట్రాఫిక్ కు , పాద చారులకు  ఇబ్బంది కలుగ కుండా  నిషేధించాలి .     

13. గుడులలో , దేవాలయాలలో  నగదు వేయడం నిషేధించాలి . ఇప్పడు గుడులు కమర్షియల్ అయినాయి .  ధన వంతులు , అధిక  డబ్బు ఉన్న వారు  డెబిట్ కార్డుల ద్వారా  , చెక్కుల ద్వారా , నెఫ్ట్ , ఆర్ . టి . జి . ఎస్  ల ద్వారా  చెల్లించ వచ్చు . లేదా ఆన్ లైన్ల ద్వారా చెల్లించ వచ్చు . ఒకరు హుండీలో నగదు  వేసే సరికి పేద వారు  కూడా వారిని  అనుసరించాల్సి వచ్చి  జేబులు  గుల్లా చేసుకుంటున్నారు . అత్యవసారాలకు చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోతుంది . చిలుకూరు బాలాజీ  గుడిలో రూపాయి వేయకున్నా  పుణ్యం దక్కినప్పుడు , మన:శాంతి లభించి నప్పుడు , తిరుపతి , ఇతర  పెద్ద పెద్ద దేవాలయ హుండీల లో డబ్బు  వేస్తేనే పుణ్యం వస్తుందా ?  ఇక వీటికి తోడు , కుజ దోషమని , ఆ దోషమని  , ఈ దోషమనీ  దోచుకునే  పద్దతులను , మూఢ  నమ్మకాలను పూర్తిగా నిషేధించాలి .  టి . వి . ఛానళ్లలో , పేపర్లలో ప్రకటనలు  ఇచ్చి  ప్రజలను  భయబ్రాంతులకు గురి చేయ కుండా  ప్రభుత్వం  చర్యలు  చేపట్టాలి . 

14. ప్రజలకు   బ్యాంకింగ్ పై  పూర్తి  అవగాహన, భద్రత  ఏర్పడే వరకు , నమ్మకం కలిగేవరకు , నగదు  వ్యవరాలను కూడా  కంటిన్యూ  చేయాలి . అది కేవలం ఒక అప్షన్  మాత్రమే . అంతే కానీ, డిజిటల్ సిస్టం   ఇప్పుడే  మ్యాండేటరీ కాకూడదు .

www.sollutions2all.blogspot.com
www.margamkrishnamurthyideas.blog.com
www.margamkrishanamurthyideas.blogspot.com



Tuesday, November 22, 2016

SUGGESTIONS FOR THE UNION BUDGET FOR THE YEAR 2017- 18?


Q: SUGGESTIONS FOR THE UNION BUDGET FOR THE YEAR 2017-18?

A: SUGGESTIONS  FOR THE UNION BUDGET FOR THE YEAR 2017-18.

First the "UNION BUDGET"  must be with a good aim,Transparent and strong intention to develop all the community and all the regions of the country and protect the country.Every one have only 24 hours a day. Out of 24 hours every one is working about 8 to 10 hrs a day only . But only 10% of the people are becoming too rich and 90% of the people are becoming too poor to middle class. Only few regions are being developed. Only few communities are being developed.  why? where are the loop holes? The young generation should understand these economic imbalances in the country and must try for stop the corruption & Black money and selfishness and rectify the loop holes in the laws and give more powers to the Election commission, RBI and  CBI. So,

01. The aim of the Union  budget should control the Corruption , Black money and Fake money.

02. It should make the poor ( those includes labor, cast professionals, employees and must change the beggars) to become rich.

03. It should develop the Industries and Infrastructure.

04. It should remove the poverty.

05. It should reduce the fear in the people and create interest to live.

06. It should increase the employment opportunities.

07. It should improve the moral responsibilities & Accountability in the people.

08. It should able to utilize all the resources including man power.

09. It should encourage the the exports and Imports and Foreign Direct investments.

10. It should encourage the rich people to pay the taxes as a responsibility.

11. It should encourage all types of people to work for their own country interestingly.

12. There should not be any scope for selfishness.

13. It should not make the people to become as vote bank and should not make the people as beggars, liar's , deceivers and thieves. 

Simply 1% increase of tax and 0.5% decrease of tax, increase of 1% rebate and decrease of 0.25% surcharge etc. all these are make confuse the people and critical for the remembering of Tax calculations.

Today, even degree passed people also are not able to understand the income tax calculations and not able to file the Income tax returns independently. Hence further simplified the returns filing system.

The present Income tax system highly punishing,  only  the salaried employees, by way tax. Because the employers are maintaining the salaries records perfectly. Where as the Big kirana shop people, Pan shops, Hotels, Chat bandies  , Barber shops, Poojaries, Vasthu , Jyotish consultants , Real estate and all types of Brokers , Cloth business people, political leaders , Lawyers, Doctors, Commission agents, do not maintain any  records and hence they are becoming too rich and constructing so many buildings , purchasing  lands , Businesses , Gold , Dollars  and holding  Black Money  within months or within years, by evading taxes. And no act is touching them. So this type of vote Bank system is not correct.

In every family, there are children, men, women, Sr.citizens and super Sr.citizens etc., Then why the different tax slabs and different calculations?

The Tax system should be able to make the poor and rich equal. Collect the more taxes from rich people and use the money for development of country and the poor welfare  & development schemes. The abolish of wealth tax is not correct system.  Even after 67 years of Independence, about 60% families do not have houses. 10% of people have  more than 10 houses or flats  and they are earning lakhs and crores of rupees as the Rents or Leases. Years to geather Rich people are becoming to Rich and Poor are becoming too poor. For the economic balance , the Rich people have to pay tax more. Hence  must restore the  ' Wealth Tax Act'  and charge 1% for the above 50 Lakh value of wealth. And must develop the systems to remove all subsidies and welfare schemes to the " Rich and Black money people". Service tax to be abolished  to poor & middle class people those who are earning below Rs.5 Lakh ina year.

Further,  I would request the respected and honorable Finance Minister, Prime Minister and President of India to consider the following suggestions in the coming Financial Budget.Declare the Tax holiday for 5 years as a 5 years plan for individuals, providing an option to file the returns for refunds and other reasons. So that IT officers will put more concentration on " rich , corrupted and Black Money People".

Increase the IT exemption limit to Rs. 5 lacks. Common to all the people ( No Man , No Woman, No Senior Citzen and No Super Senior Citizen. They are already in this slab only. Just you make to all). So that the people  improve financially little higher side . IT officers , unnecessary concentration and waste of time on no income 'Returns' may also  be reduced. Further they can concentrate more time on Crore people , Black Money people and Rich people and Tax evaders.  Further, once yearly income  should be arrived from not only  all types of incomes , but also  their yearly  Expenses , Savings and Investments.  And the slabs Rs. Rs.5.01 lacks to Rs.10 lacks  , the tax should be 10%,  Rs.10.01 to Rs.15 lacks 20% and Rs.15.01 lacks to and above 30%. Under sec.80cc, increase the limit to Rs.6 lacks to all the individuals and remove all the  exemption, rebate sections ( Ex: HRA, Medical, Conveyance, handy cap , trade mark etc,. all )  and education Cess  etc., Surcharge  may be remain same as 10% for above 1 Crore.

Waive all the old pending tax demands of individuals below Rs.25,000/- as of date.

Introduce the Taxes on Big Kirana shop people, Cloth business people , Hotels, Pan Shops, Chat Bandies, Lawyers ,Doctors and others.

Introduce the Tax on all the political and party funds.

These five years , concentrate on Black Money and corrupted money. Concentrate these five years to collect the Black Money and corrupted money of Indians from Indian banks and International Swiss banks.

These five years, Identify, collect and sell or put action  on the Benami Assets with the co ordination of ACB, CID, CBI, state and central vigilance and Inter poll. Simplify the tax calculations and should be easy to understand the even a 10th standard people and create interest in them  to pay tax for the sake of nation and prove their honesty. Do not make the people liar's and Tax evaders.

Rich people, corrupted people and Black money people must pay more Income Tax. 

Hence, Wealth tax exemption limit may be increased to Rs.50 lacks only. Should not more than that. Do not show more tax  benefits to the Corrupted and Black Money people.  Tax rate should be as it is 1%.

"Some of the names Trusts, Societies, Nilayas and Machineries and Charities etc.,  are masks of the corruption & Black money."  Hence Introduce the system of perfect auditing, controlling   and collect the taxes on their Incomes and Assets. Unfortunately, today we do not have the famous leaders like Mahatma Gandhi , Swamy Vivekananda , Vinobha bave , Jaya prakash Narayan etc., to recover the corrupted money and Black Money with their honest and sweet words. That means without any force , punishment and legal procedure.

Through this type of Budget also the Govt. will able to recover more funds (Taxes & Black money) to use for the Industries & Infrastructure development, employment generation,education and can use the funds for poor welfare schemes. The poor will become rich and live with the morality as well as comfortable. Once the corrupted people punished and recovered the black money and Binami assets, utilize all the man power , common & genuine People will get the confidence in the govt. and other people fear to do the corruption and build up the black money. 


www.sollutions2all.blogspot.com
www.margamkrishnamurthyideas.blog.com

Sunday, November 20, 2016

రూ .లు . 500/- మరియు 1,000/- నోట్ల తరువాత (DEMONETISATION OF RS.500/- ,1,000/- NOTES) బయటకు వస్తున్న సిత్ర ,విసిత్రాలు ఏమిటి ?

ప్ర : రూ .లు . 500/- మరియు 1,000/- నోట్ల  తరువాత (AFTER BAN OF RS.500/- ,1,000/- NOTES)  బయటకు వస్తున్న సిత్ర ,విసిత్రాలు ఏమిటి ?

జ :01. రైతులు  గత కొన్ని సంవత్సరాల నుండి , పంటల మూలంగా  నష్టపోతున్నా మనేది , ఆ కారణంగానే , రెండు  తెలుగు  రాష్ట్రాల రైతులకు  సుమారుగా  రూ .లు . 60,000 కోట్లు , ఋణ  మాఫీ జరిగిందనేది  వాస్తవం . కానీ పెద్ద నోట్ల తరువాత  , కొందరు  రైతులు మీడియా ద్వారా  , "మా వద్ద  10 లక్షల  నుండి 30 లక్షల  రూపాయలు దాకా  గత  10 సంవత్సరాల నుండి  పంటల ద్వారా  ఆదాయం వచ్చినది ఉన్నది , దీనిని  డిపాజిట్ చేయ వచ్చా , అని నిపుణుల సలహా అడుగుతున్నారు  ". ఒక వైపు  వ్యవసాయంపై  నష్టాలు  వస్తున్నాయని  రుణాలు మాఫీ చేయించుకుంటున్నారు . మరో వైపు  గత 10 సంవత్సరాలనుండి  రూ . లు . 10 లక్షల  నుండి 30 లక్షల వరకు , వ్యవసాయం  పై  ఆదాయం ఉంది . అది కూడా  అధిక విలువగల  నోట్లలో , నగదు రూపంలో  దాచి పెట్టుకున్నాం  అని అంటున్నారు . రైతుల రుణాలు తప్పా? , రుణ మాఫీ తప్పా ?, వ్యవసాయ  ఆదాయం  తప్పా ?  సిత్రంగా  ఉంది కదూ . 

02. మరొకరు  , నేను గత  20 నుండి 30 సంవత్సరాలనుండి , రూపాయి రూపాయి కూడబెట్టుకుని , రూ . లు . 3 నుండి 5  వరకు వడ్డీలకు ఇచ్చి , రేయింబగళ్లు  ఎంతో కష్టపడి , నేడు 30 లక్షల రూపాయల వరకు  సంపాదించుకున్నాను . నాకు ఏ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వ లేదు . ఇప్పడు ఆ డబ్బంతా  పెద్ద నోట్ల లోనే ఉంది . నేను ఏమి చేయాలి ? అని మీడియా ద్వారా  ఆడిటర్ల సలహా అడుగుతున్నారు . ఇది చట్ట బద్ధత లేని వ్యాపారం అని , ఇది నల్ల డబ్బుక్రిందికే  వస్తుందన్న  విషయం మరిచి పోతున్నారు . సిత్రంగా ఉంది కదూ . 

03.' జన్ ధన్ ఖాతాలు'  తెరిచిన  పేదలు , " మేము గత 10 సంవత్సరాలనుండి , లక్షలకు లక్షలు కూలి పని చేసి సంపాదించుకున్నాం , అవి కూడా పెద్ద నోట్లలోనే  దాచుకున్నాం . వాటిని జాన్ ధన్ ఖాతాలలో డిపాజిట్ చేయ వచ్చా ? " అని మీడియా ద్వారా నిపుణుల సలహా కోరుతున్నారు . లక్షలకు లక్షలు  నగదు రూపంలో ఉంటే , వారు పేదలు  ఎలా అవుతారు . సిత్రంగా ఉంది కదూ . 

04. కొందరు  ఎంత డబ్బు డిపాజిట్ చేసుకున్నా మినహా యింపు  ఇవ్వాలని , నాయకులే సూచనలు చేస్తున్నారు . పెద్ద నోట్ల రద్దు అనేది  దేశం మొత్తానికి  వర్తిస్తుంది కానీ , ఈ కొందరి విషయం లో మినహా యింపు  ఎందుకివ్వాలి . లింగ బేధం ఎందుకో  ? ఈ కొందరికి , మరికొందరికి తేడా ఏమిటి ?  సిత్రంగా ఉంది కదూ . 

05. కేవలం , బ్యాంకులు , పోస్టాఫీసులలోనే  ఐ . డి . జిరాక్స్ లను అడుగు తున్నారు , డిక్లరేషన్ / డినామినేషన్ ఫారం  తీసుకుంటున్నారు. కాని , మీరెక్కడా  తీసుకుంటున్నట్లు  లేదు . సిత్రంగా ఉంది కదూ  .   

06. దేశం లో  మాక్సిమం  ఓక లక్ష   నల్ల ధన  కుబేరులు గాని  , ధన వంతులు గానీ   ఉండవచ్చు . వారెవ్వరూ  , ఒక్కరంటే  ఒక్కరు  కూడా బ్యాంకుల వద్ద , ఏ . టి . ఎం . ల వద్ద  కనపడరే .  వీరి వద్ద డబ్బు ఉన్నట్టా లేనట్టా ? కేవలం డబ్బంతా  పేద ప్రజల దగ్గరే ఉందా ?  లేక వీరినే  బ్యాంకులలో , ఏ .టి . ఎమ్  . లలో  నిలబెట్టీ  రద్దీ సృష్టిస్తున్నారా ? సిత్రంగా ఉంది కదూ .  

07. అవినీతి నిర్మూలనకే  పుట్టామన్నట్లుగా  గళ మెత్తిన మేధావులు  , నేడు నల్ల ధన  రద్దుకు , ఫేక్ నోట్స్ రద్దుకు , అవినీతి రహిత భారత్ కు  అడ్డు పడుతున్నారు .   సిత్రంగా ఉంది కదూ . 

08. పెద్ద నోట్ల రద్దు చేసి  10 రోజులైనా  , రూ  . లు.  500/-  నోట్లు, ఇంత వరకు మార్కెట్ కు రాలేదు . సిత్రంగా ఉంది కదూ .   

09. ఈ  52 రోజులలో మరె న్ని సిత్రాలు జరుగనున్నాయో ! వేచి చూద్దాం . 

Friday, November 18, 2016

DEMONETISATION రూ .లు . 500/- , 1,000/- నోట్ల రద్దు వలన ప్రజలకు ఏర్పడుతున్న రద్దీ మరియు నేడు ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలకు పరిష్కారమేమిటి ( SOLUTIONS TO FINANCIAL PROBLEMS)? బ్యాంకులలో రద్దీ ఎలా తగ్గించాలి ? ప్రధాన మంత్రి గారు సడన్ గా తీసుకున్న నిర్ణయం సరియయినది అని ప్రజలకు నమ్మకం ఏర్పడాలి అంటే ఏమి చేయాలి ?

ప్ర : రూ .లు . 500/- , 1,000/- నోట్ల రద్దు వలన   ప్రజలకు ఏర్పడుతున్న రద్దీ  మరియు   నేడు  ఎదుర్కొంటున్న  ఆర్ధిక  సమస్యలకు పరిష్కారమేమిటి ( SOLUTIONS TO FINANCIAL PROBLEMS) ?  బ్యాంకులలో రద్దీ ఎలా తగ్గించాలి ? ప్రధాన మంత్రి గారు  సడన్ గా  తీసుకున్న నిర్ణయం  సరియయినది  అని  ప్రజలకు నమ్మకం ఏర్పడాలి అంటే ఏమి చేయాలి ?

జ :  ఇది  సుమారుగా 127 కోట్ల  జనాభాకు  సంభందించిన  వ్యవహారం. నీతికి అవినీతికి మధ్య పోరాటం .  అంతే కాకుండా, రహస్యాన్ని  మెయింటేన్  చేయాల్సిన అవసరం ఉంది . ఎందుకంటే ,   ముందుగా తెలిస్తే  నల్ల కుబేరులు  సర్దుకుంటారు . ఈ కారణంగా ,  మన ప్రధాన మంత్రి గారు   సడన్ గా తీసుకున్న  నిర్ణయం కాబట్టి , ఈ సమస్యకు  పరిష్కారం అంత  సులభం కాదు .తేదీ  08. 11. 2016 న ప్రకటనకు ,  అర్ధ రాత్రి కేవలం  3 , 4 గంటల  సమయముంటేనే , ఆ సమయంలో   300 నుండి 400 కోట్ల  బంగారం కొనుగోలు జరిగిందని  వార్తలు  వచ్చాయి . 


ఏమైనప్పటికి , మనసు పెట్టి  ఆలోచిస్తే  ప్రజలకు  అనేక  పరిష్కార మార్గాలు   దొరుకుతాయి . ఒక సాహసో పేతమైన  నిర్ణయానికి  సహకరించాలన్న  మనసు  ఉంటే , వందలకొద్దీ  ఐడియాలు  మనకు వస్తాయి .  మన  భారత దేశంలో కోట్లాది మంది మేధావులున్నారు . ఒక్కొక్కరి మెదడులో వేలాది ఐడియాలున్నాయి . కానీ వాటిని  సద్వినియోగం లోకి తెచ్చే  సరియయిన నాయకుడు లేడు . దేహానికి  మూలా శంఖ  ఎంత ప్రమాద కరమో  , అలానే  దేశ ప్రగతికి , నల్లధనం , ఫేక్ నోట్స్ అంత కంటే ఎక్కువ ప్రమాద కరమని అర్ధం చేసుకుంటే ,అంతే కాకుండా , దీని వలన  దేశ ఆర్ధిక ప్రగతి , ప్రతిష్ట  ప్రపపంచంలోనే  నెంబర్  వన్  అవుతుందనే నమ్మకం ఉంటే ,  ఈ 52 రోజులు పడే బాధలు , కష్టాలు  కేవలం దూది  పింజల్లా  తేలిపోతాయి . 


అన్ని రకాల మీడియాలలో   చూస్తుంటే  ప్రజలు  కొంత ఇబ్బంది పడ్డట్లు ఫీలయినా , భవిష్య్తతుపై  మరియు  ప్రధాన మంత్రి గారి పై  పూర్తి  నమ్మకంతో ఉన్నారు . సర్దుకు పోతున్నారు . సంతోషంగా  వారి భావాలను వ్యక్త పరుస్తున్నారు . కానీ రెచ్చ గొట్టే వారు  వేయి  కొక్కరు  ఉన్నారు . వీరివలననే  సమస్య మరింత  పెరిగినట్లవుతుంది . 

అయితే  పాత నోట్ల మార్పిడికి, సత్వర  క్రొత్త నోట్ల  చలామనికి  ,  సామాన్య ప్రజల  బాధలను కష్టాలను  తగ్గించడానికి  కొన్ని ఐడియాలు :

01. మొబైల్  బ్యాంకుల ద్వారా , మొబైల్  ఏ. టి. ఎం . ల ద్వారా  ( గట్టి భద్రతతో )  సామాన్య ప్రజల వద్దకే  వెల్లి  పాత నోట్లకు , క్రొత్త  నోట్లను   మార్పిడి చేయాలి .  అది కూడా పరిమిత మొత్తానికే . 

02. బ్యాంకుల   కరస్పాండెంట్ల  ద్వారా  , కనీసం రోజుకు  లక్ష రూపాయలైనా  , ప్రతి  పేద ఇంటికి వెళ్లి  మార్పిడి చేయాలి . 

03. పేర్ల ద్వారా , వీడియోల ద్వారా , ఐ . డి . నెంబర్ల  ద్వారా  , రిపీటెడ్ గా వచ్చే వ్యక్తులను అరికట్టే సాఫ్టువేర్  ను  రూపొందించాలి . వారికి  అవగాహన కల్పించాలి , కౌన్సిలింగ్ చేయాలి .    ( కానీ "ఇంకు గుర్తు"  పెట్ట కూడదు . అలా పెట్టడం వలన , వారు  రోజు వారీగా   డబ్బు  మార్పిడి చేసుకునే హక్కును హరించి నట్లవుతుంది . ఎందుకంటే ఆ "ఇంకు గుర్తు " నెల వరకు పోదు. అంతే కాకుండా  రేపు  యు . పి . లో జరుగబోయే ఎన్నికలమీద ప్రభావం పడుతుంది .  గుర్తు ఉండటం వలన  ఓటు వేసిన వారీగా  , బయటకు నెట్టివేసే  ప్రమాదం ఉంది . ) 

04. బ్యాంకులకు , ఏ . టి . ఎం .లకు  త్వర త్వరగా  , సరిపడా డబ్బును సమకూర్చాలి . బ్యాంకులలో  కొన్నీ అదనపు  కౌంటర్లను ఏర్పాటు చేయాలి .  అన్ని ఏ . టి . ఎం. లు  పని చేసే విధంగా  చర్యలు చేపట్టాలి . అధిక సంఖ్యలో  ఏ.టి . ఎం . లను  ఏర్పాటు చేయాలి .  వాటిని గ్రామాలలో సహితం ఏర్పాటు చేయాలి . ముఖ్యంగా పోస్టాఫీసులు ఈ అవకాశాన్ని  సద్వినియోగం  చేసు కోవాలి . 

05. ఇప్పటికే  రాష్ట్ర ప్రభుత్వాలు , అనేకమైన  డబ్బు మార్పిడి చర్యలు  చేపట్టింది . వీటి వలన ప్రభుత్వాలకు కూడా  ఆదాయాలు దండిగా సమకూరుతున్నాయి . అయితే  దీనిని  , సమస్యలు సద్దుమనిగేంత  వరకు పెంచుతూ పోవాలి .  ప్రధాని  ప్రధాన  ఆశయం ,  నల్లధనం  తెల్లధనంగా మారాలి , ఫేక్ నోట్లు రద్దు కావలి .  అందుకని  సమయం పొడిగించడం వలన ,  ప్రధాని ఉద్దేశ్యాలకు ఎలాంటి ముప్పు వాటిల్లదు . 

06. సామాన్య  ప్రజానీకానికి , సీనియర్ సిటిజన్స్ కు , విక లాంగులకు , ఈ 2,000/- నోట్లు  , పాత నోట్లకంటే  మరింత ఇబ్బందిగా మారిపోయింది . వారికి " పేనం నుండి  పొయ్యిలో పడ్డట్లు " గా  అవుతున్నది . అందుకని  వీరికి బ్యాంకులలో  రూ . లు. 500/- ,100/- , 50/- నోట్లనే అందించే విధంగా ఏర్పాట్లు చేయాలి . లేక పోతే అధికంగా  నిబంధనలకు అనుగుణంగా  ముద్రించాలి .  ఏ.టి. ఎం . లలో  రూ . లు. 2,000/- , 500/- నోట్లనే  పెట్టాలి . దీని వలన  ఎక్కువ స్పెస్  ఆక్యుపై కాదు , ఎక్కువ మందికి చెల్లించ  వీలవుతుంది . తక్కువ సమయం పడుతుంది . 

07. ప్రజలు  రోజూ  విలువైన  సమయాన్ని వృధా చేసుకునే బదులు , డబ్బు అవసరం లేనపుడు , బ్యాంకులలో, పోస్టాఫీసులలో   డిపాజిట్  చేసుకుంటే సరిపోతుంది . సేవింగ్  అకౌంట్ అయితే రూ . లు . 2,50,000/- వరకు , కరెంట్ అకౌంట్ అయితే  12,50,000/-  వరకు , అదే జన్  ధన్  ఖాతాలలో రూ . లు . 50,000/- వరకు  వేసుకోవచ్చు . ఎలాంటి ఇబ్బంది లేదు . ( అది మీ డబ్బయితేనే  సుమా ) . ఒకే సారి 24,000/- డ్రా చేసుకుంటే మళ్ళీ నెల వరకూ  బ్యాంక్  మొఖం చూడ నవసరం లేదు . పెద్ద మొత్తాలు  ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే , చెక్కులు వాడవచ్చు , NEFT/RTGS  , ఆన్ లైన్  నెట్ బ్యాంకింగ్ లను , డెబిట్ , క్రెడిట్ కార్డులను , PAYTM లను వినియోగించుకోవచ్చు .  

08. ప్రతి బ్యాంకు  ముందర  ప్రజలకు , నోట్ల మార్పిడి , డిపాజిట్స్  అవగాహన  కల్పించడానికి , ఉచితంగా ఫార్మ్స్ ఇవ్వడానికి , ఏ జిరాక్స్ లు కావాలో చెప్పడానికి , బ్యాంక్  సిబ్బందిని   లేదా  ఆసక్తి  గల  స్వచ్ఛంధ  యువతీ యువకులను ఏర్పాటు చేయాలి . ప్రజలు లైన్లను వెతుక్కోడానికి , ఎదో ఒక లైనులో నిల బడి తీరా అక్కడికి పోయాక , ఈ లైన్ కాదు  ఆ లైన్ అన్నపుడు , వారి బాధ  వర్ణనా  తీతం. ఆ డాక్యుమెంట్ లేదు , ఈ డాక్యుమెంట్ లేదు అంటే , వారికి ఆ రోజంతా వృథా  అవుతుంది . 

09. రేపు బ్యాంకుల  ప్రజల సొమ్ముతో , ప్రభుత్వ సొమ్ముతో  మరియు  పాత  బకాయిలు  వసూలై , కళ కళ  లాడుతాయి కాబట్టి , మరియు ప్రజలకు బ్యాంకింగ్  అవగాహనా పెరుగుతుంది  కాబట్టి , ప్రజలకు సాధ్యమైనన్ని సదుపాయాలు కల్పించి , వారి మన్ననలను పొందాలి .  ఈ అవకాశాన్ని సద్వినియోగం  చేసుకోవాలి .  

10. బ్యాంకింగ్   అవగాహన  ఉన్న  ప్రజలు  కూడా  పేదలకు  , వృద్ధులకు , వికలాంగులకు , వారి వంతు సహాయాన్ని అందించి , చిన్న చిన్న  మొత్తాల పాత నోట్లకు , క్రొత్త నోట్లు గాని , రూ . లు. 100/- లు , 50/- లు గాని  ఇచ్చి  సహకరించా లి , అలానే  మీరు మీ  లిమిట్  దాట  కుండా ఆ పాత నోట్లను  బ్యాంకులో వేసుకోవచ్చు  లేదా అనేక విధాలుగా  మార్పిడి చేసుకోవచ్చు .  ప్రతి ఒక్కరు ఒక ముగ్గురికి  కనీసం ఒక్కో నోటులో (500/- నోటు కావచ్చు  లేదా 1,000/-నోటు కావచ్చు) సహకరించినా  చాలు . ఈ సమస్యనుండి  సత్వరంగా బయట పడుతాం . 

11. అలానే , పెద్ద నోట్ల రద్దు వలన, నల్ల ధనాన్ని అరికట్టడం వలన , ఫేక్ నోట్ల ను  అరికట్టడం  వలన , అవినీతిని  నిర్ములించడం వలన  కలిగే ప్రయోజనాలను , ప్రతి  సామాన్యుడికి  అర్ధమయ్యే విధంగా , ప్రభుత్వం విస్తృతంగా  ప్రచారం చెయ్యాలి . నమ్మకం కలిగించాలి . అవి ఎలాగంటే , ఉదా : ఒక డాక్టర్ కోర్స్ చదువాలంటే  అసలు 2 లక్షలు ఫీజు . కానీ ఇప్పడు  80 లక్షలు కట్టి చేరుతున్నారు . దాని వలన పేద మధ్య తరగతి వారు వాటిల్లో చేరలేక పోతున్నారు . రేపు ఎవ్వరూ  అలాంటి  నల్లధనం  కట్ట కుండానే  చేర  వచ్చు . డొనేషన్లు ఎక్కడ ఉండవని , బెట్టింగులు , రేస్ కోర్సులు ఉండవని ,  వస్తువుల ధరలు తగ్గుతాయని , ఉద్యోగాలు పెరుగుతాయని , భూముల ధరలు తగ్గుతాయని , వాస్తవాలను  వివిధ  రూపాలలో ప్రచారం చేయాలి . 

12. డబ్బు అవసరాలను  ప్రజలు  తగ్గించుకునే  లేదా వాయిదా వేసుకునే  ప్రయత్నం  చేయాలి .ఎలాగంటే , పొగ త్రాగడం బందు చేయాలి . పొగ త్రాగడం వలన  ఆరోగ్యం చెడుతుంది , మరల  హాస్పటల్ చుట్టూ  తిరిగి  డబ్బు  ఖర్చు చేయాలి . నాన్ వెజ్  తినడం వలన  తొందరగా  ముసలి తనం వస్తుంది . డబ్బు ఖర్చు అవుతుంది . బయట  తిను బండారాలను , ప్లాస్టిక్ కప్పులలో టీ లు , కాఫీలను   త్రాగడం బందు చేయాలి . వీటి వలన  ఆరోగ్యం చెడుతుంది , డబ్బు ఖర్చు అవుతుంది .  కూల్ డ్రింకులను, హాట్ డ్రింకులను త్రాగడం  మాను కోవాలి . వీటి వలన ఆరోగ్యం చెడుతుంది , డబ్బు వృధాగా ఖర్చు అవుతుంది . దగ్గరి ప్రాంతాలకు  నడిచి వెళ్లడం వలన , వ్యాయాయం చేసి నట్లవుతుంది . డబ్బు ఖర్చు కాదు . దూర ప్రాంతాలకు , సాధ్యమైనంత వరకు  బస్సులు , ట్రైన్లను  ఉపయోగించుకోవాలి . ప్రతి దానికి , ఆటో లను , క్యాబులను , కార్లను , టూ  వీలర్లను  వినియోగించు కోవడం వలన , అధిక డబ్బు వృధా అవుతుంది . బేకరీలలో  జంకు ఫుడ్స్ , కేకులను  తినడం  నిలిపి చేయాలి . ఇవి తినడం వలన అనారోగ్య పాలవడం తప్పా  మరేమి ప్రయోజనం లేదు . అందు వలన వీటిని తినడం  బందు చేయాలి . ఈ విధంగా  డబ్బు పొదుపు  చేసుకోవచ్చు . ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చు .  ఇలా మీకు తెలిసినవి ఎన్నో ఉండ వచ్చు .  ఈ విధంగా  డబ్బు అవసరాలను తగ్గించు కోవాలి . పొదుపు పెంచు కోవాలి .  

13. పేదలు , మధ్య తరగతి వారు   డబ్బు విలువ గుర్తించి , డబ్బు కష్టాలు  నెమరు వేసుకుని , పని చేసుకునే శక్తి గల బిక్ష గాండ్లకు  డబ్బులు వేయకండి . వారిని సోమరులుగా  మార్చ కండి . తనకు మాలిన ధర్మం  చేయకండి .  ఒక రూపాయే  రేషన్ షాపులో  ఒక కిలో బియ్యానికి సమానమని  గుర్తు పెట్టుకోండి . ఇక  వాస్తులు , జ్యోతిష్యాలని , రాళ్ళని , రప్పలని , కుజ దోష పూజలని , జపాలని  , వేలకు వేలు , లక్షలకు లక్షలు  దొంగ బాబాలకు , స్వాములకు  దార  పోయకండి . ప్రారబ్ధ ఖర్మల నుండి  ఎవ్వరూ  తప్పించుకోలేరని గుర్తించండి .   మీరు ఎన్ని పూజలు చేసినా  , పెద్ద నోట్ల రద్దును వెనక్కి తీసుకోరు . 

14. వీటికి తోడు , వెంట వెంటనే , పూర్తి ఆధారాలు  ఉన్న  నల్ల కుబేరులపై , పన్నులు ఎగ్గొట్టిన వారిపై  , బ్యాంకుల అప్పులను ఎగ్గొట్టి  తిరుగుతున్న వారిపై , చర్యలు చేపట్టాలి .  అలానే పెద్దనోట్లు రద్దు చేసిన  తరువాత , నిబంధనలను అతిక్రమించిన వారిపై  చర్యలు ప్రారంభించాలి . అప్పుడే  పేద మధ్య తరగతి  ప్రజలకు , నిజాయితీ పరులకు  ప్రధానిపై, కేంద్ర ప్రభుత్వంపై   నమ్మకం ఏర్పడుతుంది .   

15. అలానే  మీకు వచ్చిన   ఆలోచనలను  , ఉపాయాలను   కూడా  అమలు చేయ వచ్చు , బయటి ప్రపంచానికి తెలియ జేయ వచ్చు .  పది మందికి తోడ్పడ   వచ్చు . 

"సర్వే జన : సుఖినో భవంతు " 

Tuesday, November 15, 2016

రూ లు . 1,000/- మరియు 500/- నోట్ల రద్దు (DEMONETISATION) తరువాత ఇంకేమి చేయాలి( WHAT ARE THE NEXT ACTIONS) ? ప్రధాన మంత్రి గారి మనుసులో ఇంకేమి ఉండ వచ్చు ?

ప్ర : రూ లు . 1,000/- మరియు 500/- నోట్ల రద్దు (DEMONETISATION)తరువాత  ఇంకేమి చేయాలి( WHAT ARE THE NEXT ACTIONS) ? ప్రధాన మంత్రి గారి మనుసులో  ఇంకేమి ఉండ వచ్చు ?

జ : ప్రపంచంలో  ఇప్పటివరకు   యే   ప్రధాన మంత్రి గాని , రాష్ట్రపతి గాని , మరెవ్వరూ   సాహసించని  గొప్ప నిర్ణయాన్ని , మన ప్రధాన మంత్రి  గారు,  అవినీతిని  , నల్లధనాన్ని  మరియు ఫేక్  నోట్స్ ను  అరికట్టే , విప్లవాత్మకమైన , సాహసోపేతమైన  నిర్ణయానికి  దేశ ప్రజలందరూ  కొన్ని క్షణాలు షాక్కు  గురైయ్యారు ,  ఆ తరువాత,  ప్రజలు  కొన్ని బాధలు పడుతున్నా ,  సర్దుకు పోతున్నారు . సమర్థిస్తున్నారు . జేజేలు పలుకుతున్నారు .  ఈ రోజు కొద్దిగా కష్ట పడినా  , రేపు   దేశం లోని  పేద  , మధ్య తరగతి  మరియు నిజాయితీ పరులకు  ఆర్ధిక మేలు , న్యాయం  మరియు  గుర్తింపు లభిస్తుందని, అవినీతి పరులకు , నల్లధన కుబేరులకు ,  వేదికలపై  నీతులు పలికే నేతలకు , ఉగ్ర వాదానికి  మనకళ్ల ముందే  , మన కాలంలోనే  కట్టడి జరుగుతుందనే   నమ్మకంతో  , ఆశతో  ఉన్నారు . ప్రజల వద్ద నుండి  సేకరించిన డబ్బుతో  కార్పోరేట్ల  వేలకోట్ల  బకీయీలను  రద్దు చేయరనే  విశ్వాసంతో, ఎన్ని కష్టాలకైనా  ఓర్చుకుంటున్నారు .  వారందరిదీ  ఒకటే బాధ , సరియయిన సమయంలో  పేదలకు, రైతులకు   చిల్లర డబ్బులు లేదా కొత్త  నోట్లు  అందించలేక పోతున్నారని మాత్రమే . అయితే  130 కోట్ల జనాభాకు  1, 2 రోజులలో అందిచడమనేది  సామాన్యమైన విషయం కాదు .  మరో విషయం ఏమంటే , నల్ల కుబేరుల మనుష్యులే  రిపీటెడ్ గా రావడం, సరిపడే కొత్త  నోట్లు అందుబాటులో లేక పోవడం , ఏ టి ఎం  లు అన్నీ అందుబాటులోకి రాక పోవడం, డిసెంబర్ 30 వరకు  టైం ఉన్నా , అనేకమైన ఇతర  ఆన్లైన్  పద్ధతులున్నా , డబ్బు మేనేజ్మెంట్ అవగాహన లేక పోవడం వలన లైన్లలో నిలబడటం కారణంగా, సామాన్య ప్రజలకు  ఇబ్బంది కలుగుతున్నట్లు వార్తలు . 


ప్రధాన మంత్రి గారు ,  భారత  దేశంలో  అవినీతి అంటూ  ఉండకూడదని ,  " స్వచ్చ  భారత్ " ను  చూడాలని ఎన్ని కలలు  కంటున్నారో ,   ఎంత పట్టుదలతో  ఉన్నారో , ఎంత  భావోద్వేగంతో  మాట్లాడుతున్నారో , ప్రజలు  కూడా అంతే పట్టుదలతో  భావోద్వేగంతో  సహక రించడానికి  సిద్ధం గా ఉన్నారు .    దేశంలో సుమారుగా 99% ప్రజలు  అవినీతి నిర్మూలనకు  , నల్లధనాన్ని అరికట్టడానికి ,  ఫేక్  నోట్స్ ను ఏరి పారేయడానికి , ఉగ్ర వాదాన్ని తుద ముట్టడించి డానికి , ప్రధాన మంత్రి గారి  నిర్ణయానికి  అండగా ఉన్నారు . కేవలం  1%  నల్ల కుబేరులే  , అవినీతి పరులే  ప్రధాన మంత్రి  నిర్ణయానికి వ్యతిరేకంగా  ఉన్నారు .  ఎందుకంటే అయ్యో  ఇన్ని రోజులు  మోసం చేసి సంపాదించింది   ఇప్పడు పోతుందే అని , రేపు సంపాదించ బోయే నల్లధన సంపద  , పేదలను గుప్పిట్ల పెట్టుకునే  అవకాశం  పోతుందనే బాధ తో కుమిలి పోతున్నారు .  చంద్ర మండలంలోని ఆస్తులు సూర్యుని వేడికి కరిగి పోతున్నాయని  రగిలి పోతున్నారు . 



రూ లు . 1,000/- మరియు 500/- నోట్ల రద్దు తరువాత  ఇంకేమి చేయాలి( WHAT ARE THE NEXT ACTIONS, AFTER BAN OF  HIGH VALUE NOTES ) ? ప్రధాన మంత్రి గారి మనుసులో  ఇంకేమి ఉండ వచ్చు ?



ప్రధానమంత్రి గారి మనసులో  ఏముందో తెలియదు గాని  , ప్రజలు కొండత ఆశతో ఉన్నారు . నమ్మకంతో ఉన్నారు . అయితే  , వారి మనసులోని ఆలోచనలకు తోడు , ఈ క్రింది  చర్యలు కూడా  పరిగణలోకి  తీసుకుంటే ప్రజలు మరింత హర్షిస్తారు , గర్వంగా  మరియు గౌరవంగా  జీవిస్తారు . గెలుపు  ఓటమిలు , చావు బ్రతుకులు సహజం . కానీ  ప్రజలకు  చేసే మంచి చర్యలు  శాశ్వతంగా  నిలిచి పోతాయి మరియు   అవే  వారిని ఉన్నత శిఖరానికి చేర్చుతాయి .  ఆ చర్యలు ఏమంటే ,



01. కనీసం  1,000  కోట్ల నిధులు  వెచ్చించి అయినా , దేశం మొత్తం పైనా  ఒక స్వతంత్ర  " సి . బి . ఐ . (CBI)  ని ఏర్పాటు చేయాలి . దీనిలో  రాష్ట్రాలలోని  అన్ని " సి ఐ డి " , ఏ సి బి " విజిలెన్స్ , ఎన్ఫోర్స్ మెంట్  మొదలైన అన్నిటిని , దీనిలో కలిపి వేయాలి . దీనిపై రాజకీయ నాయకుల ఆజమాయిషీ ఉండ కూడదు . ( ఎలక్షన్ కమీషన్  లాగ ) ,  ఒక వేల  దీనిని ఏర్పాటు చేయ పోతే , ప్రధాని  నిర్ణయం , ప్రజల  ఇంత శ్రమ  , మేధావుల  ఆలోచనలు  బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి . 



02. దీనికి  తోడు  ఫాస్ట్  ట్రాక్  కోర్టులను  ఏర్పాటు చేసి , 90 నుండి 180 రోజులలో  అవినీతి కేసులను  పూర్తి  చేయాలి . 



03.  డిసెంబర్ 30, 2016  తరువాత  , పూర్తిగా  ఆధారాలు ఉన్న   నల్ల కుబేరులపై  , నిష్పక్ష పాతంగా , సర్దార్ వల్లబ్ భాయి పటేల్  స్పూర్తితో " సర్జికల్ స్ట్రైక్ జరుగాలి ". అప్పుడే ప్రజలకు  ప్రభుత్వ నిర్ణయాలపై , ప్రకటనలపై  నమ్మకం , విశ్వా సం  ఏర్పడుతుంది . 


04. "బ్యాంక్  అప్పుల ఎగవేత దారులపై , పన్ను ఎగవేత దారులపై  సర్జికల్ స్ట్రైక్ జరగాలి ". 

05. దేశంలోని  బ్యాంకులలో , పోస్టాఫీసులలో , ఇన్సూరెన్సు  కంపెనీలలో , ఫైనాన్స్  కంపెనీలలో , పి . ఎఫ్ . సంస్థలలో ,  పేర్కొని పోయిన  " ఆన్ క్లైమ్డ్  నిధులు " ( UN CLAIMED DEPOSITS)  సుమారుగా  56 వేల  కోట్లు  ఉన్నట్లు అంచనా .  డిపాజిట్లు  చేపించుకునేటపుడు , పేరేమియమ్స్   కట్టించుకునేటప్పుడు , ప్రజల , ఉద్యోగస్తుల  అన్ని వివరాలు  , పేర్లు , అడ్డ్రస్ , సెల్ నెంబర్స్ , బ్యాంక్ అక్కౌంట్ నెంబర్స్ అన్నీ  తీసుకుంటారు . అదే సొమ్మును  డిపాజిట్ దారులకు , ఉద్యోగస్తులకు , పాలసీ హోల్డర్లకు  చెల్లింపులు చేయాల్సి వచ్చినప్పుడు  వారి  వద్ద  ఏ వివరాలు  ఉండవు .  డిపాజిట్ల  గురించి  గుర్తున్న వారిని  రెండు మూడు నెలలు  త్రిప్పుతారు  99 డాక్యుమెంట్లు  అడుగుతారు .  

ఉదా :  పి . ఎఫ్ .  క్లెయిమ్  కోసరం  , ఫామ్  C  సర్టిఫికెట్ తీసుకుని  ఒకరు వెళ్తే  ( 58 సం . రాలు దాటిన వారు ) వారు  సబ్మిట్ చేయమని సూచించిన  డాక్యుమెంట్లు  (1) అప్లికేషన్  పూర్తి వివరాలతో  సంతకాలతో  , పుట్టుమచ్చలతో  సహా  మరియు  గత ఎంప్లాయర్  సంతకం , వారి డిజిగ్నేషన్  ముద్ర , కంపెనీ ముద్ర  లేదా  బ్యాంకు  మేనేజర్ సంతకాలు , వారి డిజిగ్నేషన్ , బ్యాంకు  ముద్ర . (2)  10 రూ . ల  స్టాంప్ పేపరు  పై , ఎక్కడా  ఉద్యోగం చేయడంలేదని  అఫిడవిట్  వారి ప్రొఫార్మాలోనే . (3)  అఫిడవిట్ ను   నోటరైజ్ చేపించాలి . (4) ఆధార్ కార్డు  జిరాక్స్  మరియు  దానిపై సంతకం . (5) బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్  కాపీ  మరియు దానిపై  కంపెనీ యజమాని గాని  , బ్యాంకుమేనేజర్  సంతకం  మరియు వారి ముద్ర . (6)  మూడు  పోస్ట్ కార్డు  సైజు  ఫామిలీ గ్రూప్ ఫోటోలు  మరియు  వాటి వెనుకాల  కంపెనీ యజమాని గాని లేదా బ్యాంకు మేనేజర్  సంతకాలు  మరియు వారి ముద్రలు  కంపల్సరీ . (7) వరిజినల్  ఇ. పి . ఎస్ . స్కీమ్  సర్టిఫికెట్లు .  వీటిల్లో ఏది మిస్సయినా  ఇక అంతే సంగతులు . నెలకొద్దీ త్రిప్పడమే . ఈ వ్యవస్థలు  ఎప్పుడు  బాగు పడుతాయి . అప్లికేషన్ ఫామో  లేదా తెల్ల కాగితం మీదనో  పి . ఎఫ్ . నెంబర్  వేసి  అర్జీ  పెట్టుకుని , దానితో  స్కీమ్ వర్జినల్  సర్టిఫికెట్స్ , ఆధార్ కార్డు  జిరాక్స్ , ఒక వేల  బ్యాంక్ వివరాలు  లేక పోతే  పాస్ బుక్ జిరాక్స్ ఇస్తే , రెండు మూడు రోజులలో  వారి అకౌంటుకు  క్రెడిట్  ఇచ్చి వేయాలి . అలా చేయరు . ఇక  మరిచి పోయిన , చని పోయినా , వారి వివరాలు  కుటుంభ సబ్యులకు తెలియవు కాబట్టి , వారి కుటుంబాలకు చిల్లి గవ్వ కూడా  అందదు . వారి కుటుంబాల గురించి  వాకబు కూడా చేయరు . ఎలా అవాయిడ్ చేయాలనే చూస్తారు . 

ఆ విధంగా  పేరుకుపోయిన  సొమ్ము  నేడు సుమారుగా  56 వేల  కోట్లు ఉందని అంచనా . అందుకని  దీనిపై  " సర్జికల్ స్ట్రైక్ " జరగాలి . 

06. " విదేశీ  నల్లధనంపై  సర్జికల్ స్ట్రైక్ జరగాలి ". విదేశీ నల్లధనాన్ని  రికవరీ చేయాలి . 

07. దేశం లోని  భూమిని  అంతా మ్యాపింగ్ చేయాలి . మొదట  మినిమమ్ చార్జీలతో  రిజిస్టర్ చేయించుకునే విధంగా  అవకాశం కల్పించాలి . ఆ తరువాత  బినామీ ఆస్తులన్నిటిని రద్దు చేసి , ప్రతి  పేద కుటుంబానికి  రెండు గదులు  గల  ఒక నివాస గృహాన్ని  కేటాయించాలి . 


08. మరల బ్లాక్  మనీ అక్యుమ్యులేట్ అయ్యాక , సరియైన సమయంలో  రూ . లు . 2,000/- నోట్లను    రద్దు చేసి  రూ . లు . 250/- నోట్లను  జారీ చేయాలి .  సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవాలి . 



09.  1947 లో స్వాతంత్య్రం  వచ్చిన  నాటి నుండి  రిజర్వేషన్స్  కారణంగా  పెదాలు పేదలుగానే ఉండిపోతున్నారు . ధన వంతులు  మరింత ధన వంతులుగా  ఎదుగు తున్నారు . స్వాతంత్య్రం  వచ్చి  70  సం . రాలు . దాటినా  అవే  రిజర్వేషన్స్ కంటిన్యూ  అవుతున్నాయి .  నేడు అన్ని కులాల్లో , అన్ని మతాల్లో , అన్ని ప్రాంతాల్లో  పేద ప్రజలు ఉన్నారు .  అందుకని  కులాన్ని బట్టి , మతాన్ని బట్టి , ప్రాంతాలను బట్టి  కాకుండా , వారి ఆర్ధిక  పరిస్థిని బట్టి  రిజర్వేషన్లు  ఉండే  విధంగా  " రిజర్వేషన్స్ పై  సర్జికల్  స్ట్రైక్ " జరగాలి . 



10. ప్రతి ఒక్కరికి   ఆధార్ నెంబరులాగా , పాన్  నెంబర్ లాగా  " ఒకే సెల్ నెంబర్ " ఉండే విధంగా  సర్జికల్ స్ట్రైక్ జరుగాలి .  




11. ప్రతి ఒక్కరికి  ఆధార్ నెంబరులాగా , పాన్  నెంబర్ లాగా " ఒకే బ్యాంకు అకౌంట్ నెంబర్ "   ఉండే విధంగా  సర్జికల్ స్ట్రైక్ జరుగాలి .



12. "ఆన్ లైన్ మోసాలు జరుగ కుండా , కంప్యూటర్లలో  వైరస్ చొరబడి కుండా  సర్జికల్ స్ట్రైక్ జరుగాలి ".



13. "పేద  మధ్య  తరగతి  ప్రజల  నిరక్ష రాస్యత పై , అనారోగ్యాలపై , ఆర్ధిక స్థితి గతులపై  సర్జికల్ స్ట్రైక్  జరగాలి ".  రికవరీ చేసిన  నల్ల ధనాన్ని , ప్రతి  ఒక కుటుంభం అకౌంట్లో  2,50,000/- డిపాజిట్ చేయాలి . ఒకవేల  ఇప్పటికే , పేదల అకౌంట్లలో , నల్లకుబేరులు  డిపాజిట్ చేస్తే , ఆ మొత్తాన్ని వారికే  చెందే విధంగా చట్టం తేవాలి . 

14. " ఫేక్ ప్రకటనల (ADVERTISEMENTS) పై  సర్జికల్ స్ట్రైక్ జరగాలి " . ప్రజల అవసరాలను , అవకాశాలను , వారి  బలహీనతలను, ఆసరాగా చేసుకుని  చిన్నా  పెద్దా కంపెనీలు   , ఎలక్ట్రానిక్  మాధ్యమాల ద్వారా  విపరీతంగా  ప్రకటనలు  (ADVERTISEMENTS) గుప్పిస్తూ  , ప్రజలను  రెచ్చగొడుతున్నారు . ఒక వస్తువు  పనికి వచ్చినా , పనికి రాకపోయినా , అవసరం ఉన్నా , అవసరం  లేక పోయినా , వారు  టెంప్ట్ అయ్యేవిధంగా  , కలర్ ఫుల్ గా , హాస్యోక్థముగా  ప్రకటనలు చేసి , ప్రజల  సొమ్ముకు , జేబులకు  చిల్లులు పెడుతున్నారు . వారి పొదుపుకు గండీ పెడుతున్నారు . ఒక  కొత్త  వస్తువు మార్కెట్ లోకి వచ్చి నప్పుడు , దాని ఉపయోగాలు  మరియు  దానిపై  అవగాహన  మాత్రమే  కల్పించాలి  గాని , అవసరం ఉన్నా , లేకపోయినా , అది పనికి వచ్చినా  , పనికి రాక పోయినా  , ఖచ్చితంగా కొనే  విధంగా  ప్రేరేపించ కూడదు . మరియు  ఆ వస్తువులు  మనుష్యులకు గాని , పర్యావరణానికి గాని హాని కలిగించ కూడదు .  ఆ వస్తువు లు  ప్రజలకు ఉపయోగ పడక పోయినా , హాని కలిగించినా , కంపెనీలు పది రెట్ల  నష్ట పరిహార వాగ్ధానం చేయాలి . ఒక వస్తువు కొంటే  మరో వస్తువు  ఉచితం అన్నా  కూడా , ఆయా ఉచిత వస్తువుల వలన నష్టం కలిగినా , నష్ట పరిహారం   పది రెట్లు చెల్లించే  విధంగా  వాగ్ధానం చేయాలి . ఉదా : పలానా క్రీమ్ వాడితే 6 వారాల్లో  తల తలా మెరుస్తారు  అని ప్రకటనలు గుప్పిస్తారు . 10 వారాలు వాడినా  తల తలా  మెరువకపోతే  , ఎక్కడైతే కొన్నారో , ఆ షాప్ లోనే పది రెట్ల  డబ్బు చెల్లించే విధంగా  కట్టడి చేయాలి .   పలానా పేస్టు  వాడితే  పండ్లు తల తలా  మెరుస్తాయి అని ప్రకటనలు చేస్తే , అవి వాడిన  ప్రజలకు  , పండ్లు మెరువక , పాసు పండ్లుగా మారినా లేదా పండ్లు ఊడి పోయినా  , దానికి పది రెట్లు  సొమ్ము మరియు నష్ట పరిహారం  చెల్లించే విధంగా  నియమ నిభందనలు ఉండాలి . అలానే సబ్బులు , నూనెలు , కాస్మొటిక్స్ , హెల్త్ కేర్ ఐటమ్స్ , బట్టలు , అన్ని రకాల మందులు , వజ్రాలు , రుద్రాక్షలు , ఆభరణాలు  మొదలైనవి . 

15. నియంత్రణ లేని , ట్రస్టులపై , స్వచ్ఛంధ  సంస్థలపై , మిషనరీలపై ,ఫౌండేషన్లపై , దేవాలయ నిధులపై  " సర్జికల్ స్ట్రైక్ " జరగాలి . 



16. మహాత్మా  గాంధీ గారు  చెప్పినట్లు , లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పినట్లు , దేశానికి  వెన్నెముకైన  గ్రామాల  అభివృద్ధిపై దృష్టి సారించాలి . వ్యవసాయానికి , పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి . 


17. ప్రజలకు ఉపాధి  కల్పించి  ఉత్పాదకతను  పెంచాలి గాని , ప్రజలను  , ఓటు బ్యాంకు  కోసమని , పేదలను బిక్ష గాండ్లుగా మార్చ కూడదు . 


18. మరో  ముఖ్య విషయం ,  ఒక వేల  ఇప్పడు  గనుక   అధిక  విలువ గల  పెద్ద నోట్ల  రద్దు ను విరమించుకుంటే  , ఇక  ఈ భారత దేశం  పూర్తిగా  అవినీతిపరుల , నల్ల కుబేరుల గ్రిప్  లోకి  వెళ్లి పోయి , పేద ప్రజలకు  రక్షణ కరువవుతుంది .  ఇన్ని రోజులు పేదలు  ఎదుర్కొన్న బాధలు , కష్టాలు  బూడిదలో పోసిన పన్నీరవుతుంది . ప్రజలకు , ప్రధానిపై ఉన్న నమ్మకం మూడవ  సారి  వమ్ము  అవుతుంది .  అంతే కాకుండా , మొత్తం  రాజకీయ , ఆర్ధిక , జ్యూడిషయరీ  వ్యవస్థలపై ననే  విశ్వాసం  సడలుతుంది . 





Saturday, November 12, 2016

రూ . లు . 500/- మరియు 1,000/- పెద్ద నోట్ల రద్దు ( BENEFITS WITH THE DEMONETISATION OF Rs.500/- AND 1,000/-) వలన ఎవరికీ లాభం ? ఎవరి నష్టం ? సాధారణంగా ప్రయోజనాలు ఏమిటి ? ఉపయోగాలు ఏమిటి?రూ . లు . 500/- మరియు 1,000/- పెద్ద నోట్ల రద్దు వలన (BENEFITS WITH THE DEMONETISATION OF HIGH VALE NOTES Rs.500/- AND 1,000/-) ఎవరికీ లాభం ? ఎవరి నష్టం ? సాధారణంగా ప్రయోజనాలు ఏమిటి ? ఉపయోగాలు ఏమిటి?

ప్ర . రూ . లు . 500/- మరియు 1,000/- పెద్ద నోట్ల  రద్దు వలన   (BENEFITS WITH THE  DEMONETISATION OF HIGH VALE NOTES Rs.500/- AND 1,000/-)   ఎవరికీ  లాభం ? ఎవరి నష్టం ? సాధారణంగా  ప్రయోజనాలు ఏమిటి ? ఉపయోగాలు ఏమిటి?



జ : రూ. లు . 500/- మరియు 1,000/- పెద్ద నోట్ల  రద్దు ( DEMONETISATION  OF HIGH VALE NOTES Rs.500/- AND 1,000/-) వలన  కొందరికి  లాభాలు  ఉన్నాయి . మరికొందరికి నష్టాలు   ఉన్నాయి . అవి ఎలాగో విశ్లేషిద్దాం . 




01. రూ . లు . 500/- మరియు 1,000/- పెద్ద నోట్ల  రద్దు ( ( BENEFITS WITH THE DEMONETISATION OF Rs.500/- AND 1,000/-) వలన , సమాంతరంగా  నడిచే  నల్ల ధనం  కట్టడి అవుతుంది . ఫేక్  కరెన్సీ   పూర్తిగా  రద్దయి పోతుంది .  అలానే  ఉత్పాధకతకు  ఉపయోగ పడకుండా  , బీరువాలలో , గోదాములలో  మూలుగుతున్న  నల్లధనం , అవినీతి సొమ్ము , ఇప్పడు  బ్యాంకింగ్ వ్యవస్థ లోకి వచ్చి , ఆర్ధిక వ్యవస్థ  వృద్ధి పధంలో నడుస్తుంది . 




02. వాస్తవ మైన డబ్బంతా  బ్యాంకులలోకి  చేరి ,  కొంత కాలం  తరువాత  లోన్ల ద్వారా  పరిశ్రమలకు  చేరి  ఉత్పాధక  శక్తి పెరుగుతుంది .  ఒక వేల   నల్లధనంగా  మారిన  వాస్తవమైన  డబ్బు , దొరికి పోతామేమో నని  బ్యాంకులలో  జమ  చేయపోయినా ,  వాటిని  రద్దు చేసి  దానికి  సరిపడా  విలువ గల నోట్లను  రిజర్వు బ్యాంక్  ముద్రిస్తుంది . దానిని పేదల  సంక్షేమ పథకాలకు వినియోగించ వచ్చు . లేదా  దేశాభి  వృద్ధికి , ఉపాధి కల్పనకు  లేదా  ప్రభుత్వ  అప్పులను తీర్చడానికి  ఉపయోగించ వచ్చు .  




03. రూ . లు . 500/- మరియు 1,000/- పెద్ద నోట్ల  రద్దు (DEMONETISATION Rs.500/- AND 1,000/-) వలన నల్ల ధనం (BLACK MONEY)   , అవినీతి ( CORRUPTION)  కొంత వరకు  తగ్గుమొఖం పడుతుంది .   మరల రూ . లు . 500/- మరియు 2,000/- పెద్ద నోట్లు   (  HIGH VALE NOTES Rs.500/- AND 2,000/-)  విడుదల అయ్యాయి  కాబట్టి ,  నల్లధనం  వాయిదా పడవచ్చు . అయితే  ఒక  యేడాది  తరువాత  రూ . లు . 2,000/- పెద్ద నోట్లన్నీ  ధనవంతుల  చేతిలోకి  వెళ్ళాక , వాటిని  రద్దు చేసి , ఆన్లైన్  సిస్టం, ప్లాస్టిక్ కార్డ్స్  వినియోగాన్ని  పెంచినట్లవుతే  , నల్ల ధనం  పూర్తిగా  ఫిల్టర్  అవుతుంది  .  




04. బంగారం  , వెండి ధరలు  తగ్గు మొఖం పడుతాయి . బంగారం  , వెండి ధరలు  తగ్గడం వలన  ధనికులు  , నల్లధన కుబేరులు  నష్టపోతారు , సామాన్య ప్రజలు  , కనీసం వారి  అవసరాలకు  కొనుక్కునే  ధరలు  అందుబాటులోకి  వస్తాయి . 




05. ఒక వైపు  నల్లధనం  తగ్గడం , మరో వైపు  ఫేక్ మనీ పూర్తిగా లేకుండా పోవడం వలన , నేడు ప్రజల చేతిలో ఉన్న డబ్బుకు  విలువ  ఏర్పడుతుంది .  ఉదా : రూ . లు . 10/- లు , రూ  . లు . 100/-  విలువగా  గుర్తించ బడుతాయి . ( డిమాండ్ సప్ప్లై  సిద్ధాంతం ప్రకారం ) . ఆ కారణంగా  ప్రజలు  వృధాగా ఏది పడితే అది కొనడానికి  ఇష్ట పడరు . అలానే  , అమ్మకపు దారు ఎంత అంటే అంతకు అమ్మడానికి పోటీ పడరు .  ఇది కష్ట పడి  సంపాదించిన  డబ్బుగా  గుర్తిస్తారు .  అందుకని ,నిత్యావసర వస్తువుల   ధరలు  తగ్గుమొఖం పడుతాయి . దాని వలన సామాన్య ప్రజలు  లాభ పడుతారు .




06. ఉత్పాధక  శక్తి  పెరగడం  వలన , వస్తు  సేవల ధరలు తగ్గడం వలన , ద్రవ్యోల్భణం  ఆటోమేటిక్ గా తగ్గు తుంది . 




07. వృధా ఖర్చులు  తగ్గి పోతాయి . చెడు  వ్యసనాలు  తగ్గ వచ్చు . ఇప్పటికి  లాగ  నగదు  అందుబాటులో ఉండదు కాబట్టి .  




08. ప్రజలలో పొదుపు శక్తి పెరుగుతుంది . డబ్బు విలువ  పెరుగుతుంది . 




09. ఉద్యోగ అవకాశాలు  మెరుగవుతాయి . దీని వలన  ప్రతి కుటుంభం  ఆర్ధికంగా ఎదుగుతుంది . 




10. వ్యవస్థలో  నగదు  చలామణి   తగ్గుతుంది  కాబట్టి  , ప్రతి  ట్రాన్సాక్షన్  చెక్కుల రూపేనా  లేదా  ఆన్  లైన్  ద్వారా  చేస్తారు కాబట్టి , ఆదాయం ఖర్చులు  బయటపడి  , విధిగా చెల్లించాల్సిన  పన్నులు  చెల్లిస్తారు . ఇక పన్నులు ఎగ్గొట్టడం  కుదరదు .  దీని వలన  ప్రభుత్వానికి  పన్నుల రూపేనా  అధిక ఆదాయం వస్తుంది . దీనిని తిరిగి  ప్రభత్వాలు  అభివృద్ధి పథకాలకు , సంక్షేమ పథకాలకు  ఉపయోగించడానికి  వీలు కలుగుతుంది . 




11.  నగదు చలామణి   తగ్గుతుంది  కాబట్టి , ఖర్చు  లు  బ్యాంకుల ద్వారానే  చెల్లించాలి కాబట్టి ,  వ్యాపారస్తులకు  వాస్తవ ఆదాయం  చెక్కుల రూపేన  లేదా   బ్యాంకులకు  రావాల్సి ఉంటుంది . అందువలన ఇక  బిల్లులు లేని  వ్యాపారాలు ఉండవు . బిల్లులతో  వ్యాపారం చేసినప్పుడు  , ఇక వారు   వ్యాట్ , సి ఎస్ . టి , ఎక్సయిజ్ పన్ను , సర్వీస్  టాక్స్ , ఆదాయ పన్ను , టి . డి . ఎస్ (TDS) , టి .సి . ఎస్ (TCS) ఎగ్గొట్టే  ప్రశ్నే తలెత్తదు . రేపు  "జి ఎస్ టి "  విధానంలో కూడా   పన్నులు ఎగ్గొట్టే ప్రసక్తే ఉండదు . 




12. హవాలా  వ్యాపారాలపై  నియంత్రణ  పెరుగుతుంది . హవాలా  వ్యాపారాలు  తగ్గుతాయి . 




13. లోకల్  చిట్టీల  వ్యాపారాలు  , ప్రయివేట్   ఫైనాన్సియల్  వ్యాపారాలు ,  బెట్టింగులు  తగ్గుతాయి . దీని వలన సామాన్య  ప్రజలు  మోస పోకుండా ఉండే అవకాశం ఉంటుంది . అలానే లా & ఆర్డర్  కు  ఎలాంటి  సమస్యలు  ఉండవు . 



14. భూముల ధరలు , ఫ్లాట్ల  ధరలు  కనీసం 10 నుండి 20%  వరకు తగ్గి ,  సొంత  గృహం  సాకారం చేసుకోవాలనుకునే,   సామాన్య ప్రజలకు  భూములు  అందుబాటు ధరల లోకి  వస్తాయి . గృహ రుణాలపై వడ్డీ రేట్లు  తగ్గుతాయి .  అధిక  భూములు  ఉన్న వారు , రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వారు నష్ట పోతారు . అప్పులు తీసుకుని ఇండ్లు  కొనుక్కున్న వారు , ఇటు ఇండ్ల విలువ తగ్గి , అటు అప్పుల భారం పెరిగి           ( డబ్బు  విలువ పెరిగింది కాబట్టి ) , ఫిక్సెడ్ ఆదాయం లేని వారు  ఇబ్బంది పడాల్సి రావచ్చు .  



15. ఇప్పటికే అప్పులు ఇచ్చిన  వారు  లాభ పడుతారు . అప్పు తీసుకున్న  వారు  చాలా  నష్ట పోతారు .  డబ్బు విలువ  పెరిగింది కాబట్టి ,  వీరిపై  అధిక భారం పడుతుతుంది .  




16. దిన కూలీలా  రేట్లు  తగ్గుతాయి . అయితే  వస్తు ధరలు తగ్గు తాయి కాబట్టి , వీరికి పెద్దగా  సమస్య  ఉత్పన్నం కాదు . 




17. ఫేక్  మనీ  , నల్ల ధనం , అవినీతి సొమ్ముతో  నడిపించే  అసాంఘిక  కార్యకలాపాలు , పబ్బులు  , డాబుసరి  ఫంక్షన్లు  , మరో రకమైన  పనులు  జరుగకుండా  కట్టడి చేయడానికి  వెసులుబాటు  కలుగుతుంది .    




18. పేదలు  , సామాన్యులు ,  నిజాయితీ పరులు  ధైర్యంగా , తలెత్తుకుని  , సంతోషంగా , హాయిగా  జీవించే  అవకాశం  కలుగుతుంది . వీరికి  మానసిక తృప్తి  ఏర్పడుతుంది . 




19. బ్యాంకులలో , పోస్టాఫీసులలో  నగదు రూపేణా  లేదా  ఫిక్సడ్  డిపాజిట్ల  రూపేణా , బాండ్ల  రూపేణా ఉన్న వారు  మరియు ఇతర త్రా   స్థిర వడ్డీలతో పొదుపు చేసుకున్న వారు  లాభ పడుతారు . అప్పులు చేసిన వారు  నష్టపోతారు . భారంగా ఫీలవుతారు .  




20. షేర్లలో , మ్యూచువల్ ఫండ్సులో  పెట్టుబడులు పెట్టిన వారు , తక్కువసమయం కొరకు  పెట్టుబడులు  పెట్టిన వారు  త్కాలికంగా నష్ట పోతారు . కానీ  రాబోయే కాలాల్లో  స్థిరంగా  ఫైనాన్సియల్  మార్కెట్  వృద్ధి చెందు తుంది కాబట్టి , లాభాల బాట  పడుతారు.  




21. ఎక్కువ కిరాయి  గల ఇండ్లు చాలా మట్టుకు  ఖాళీ అవుతాయి .  ఇండ్ల , ఫ్లాట్స్  రెంట్స్ తగ్గు తాయి .  ఇది  పేద మధ్య తరగతి ప్రజలకు  ఊరట నిస్తాయి . 




22. పనులు  దొరకక , డబ్బు  లభించక , ఆకలికి  తాల లేక కొందరు  మరల  గ్రామాల వలస  పడితే , మరికొందరు  చిల్లర దొంగ తనాలకు, దోపిడీ  దొంగ తనాలకు   తెగబడవచ్చు .   




23. రైతులు పండించిన  ఉత్పత్తులకు  గిట్టుబాటు ధరలు  ఉండవు . తాత్కాలికంగా నష్ట పోతారు.  కొంత కాలం  పోయాక , వారి  ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి , ప్రజల  కొనుగోలు శక్తి పెరుగుతుంది 



24. తాత్కాలికంగా ప్రభత్వాల  అన్ని రాబడులు  , సేల్స్ టాక్స్ , రిజిస్ట్రేషన్స్ పన్ను లు  తగ్గి పోతాయి . అయితే  పాత నోట్ల  అనుమతి వలన , ప్రాపర్టీ టాక్స్ , కరెంటు పన్నులు , పాత బకాయీలు , ట్రాఫిక్ బకాయిల రాబడి పెరుగుతుంది .  రాబోయే కాలాల్లో , అందరూ  పన్నులు చెల్లించాల్సిన  పరిస్థితి విధిగా ఏర్పడుతుంది  కాబట్టి , ప్రభుత్వాలకు  విపరీతమైన  ఆదాయం పెరుగుతుంది .  దుబారా తగ్గుతుంది .  అలానే  , ఇప్పడు అసలు పేదలు  ఎవరో  , ధనవంతులు ఎవరో బయట పడుతారు కాబట్టి,  మరియు పార దర్శకత ఉంటుంది  కాబట్టి , సంక్షేమ పథకాలకు  నిధులు తక్కువగా  అవరం ఏర్పడుతాయి .  



25. 30 డిసెంబర్ ,2016 వరకు  దేవుళ్ళ హుండీలలో  నల్ల ధనం  ఆదాయం పెరుగుతుంది . ఆ తరువాత  నల్ల ధనం  ఉండదు కాబట్టి   దేవుళ్ళ హుండీల లో  ఆదాయం  తగ్గుతుంది . 



26. మూఢ  నమ్మకాలకు  పెట్టే  వృధా  ఖర్చులు తగ్గి పోతాయి . అసంఘటిత పొదుపు పధకాల మూలంగా నష్ట పోవడం అంటూ ఉండదు . కానీ , ఆన్ లైన్ మోసాలు , హ్యాకర్స్ మోసాలు  వెన్నంటే ఉంటాయి . 

27. ప్రజలు  ప్రతి రూపాయిని  బ్యాంకులలో గాని , పోస్టాఫీసులలో  గాని  డిపాజిట్ చేస్తారు కాబట్టి , వారికి  ప్రతి రూపాయి మీద , ప్రతి రోజుకు  , సాలుకు 4% చొప్పున వడ్డీ లభిస్తుంది . 

28. ప్రజలు  నగదు మొత్తం బ్యాంకుల లోనో , పోస్టాఫీసుల లోనో వేయాలి కాబట్టి ,  అప్పుడు  నిరుపేదలెవరో (BPL) ,  పేదలెవరో , మధ్య తరగతి వారెవరో  , ధనవంతులెవరో , నల్ల కుబేరులెవరో ఇట్టే  తెల్సి పోతుంది .  అలానే  ప్రభుత్వాలకు  పన్నులు  వసూలు  చేయడం సులువవుతుంది .  ఆదాయం పెరుగుతుంది . 

29. ప్రజలకు బ్యాంకింగ్ అవేర్నెస్ , డిజిటల్ అవేర్నెస్ ఏర్పడు తుంది . పొదుపు అలవాటవుతుంది . మిత వ్యయం అలవాటవుతుంది . సమయం వచ్చినప్పుడు  కష్టాలను  ఎలా ఎదుర్కోవాలో   బోధపడుతుంది. భవిష్యత్తు కు  నిధులు  ఏర్పరుచుకో గలుగుతారు . భద్రత ఏర్పడుతుంది . ఇంకా జీవించాలనే  ఆశ ఏర్పడుతుంది . ఇంకా ఎదో సాధించాలనే  తపన ఉంటుంది . 

30. రద్దయిన  నల్ల ధన మొత్తం నుండి  ప్రధాన మంత్రి గారు , కొంత మొత్తాన్ని  పేదల ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేయవచ్చు . ఎందుకంటే ఎన్నికల  వాగ్ధానాలలో  ఇది ఉంది కాబట్టి .  లేదా పరోక్షంగా  వారికి  మేలు చేసే  ఏవైనా  పధకాలను ప్రవేశ పెట్ట వచ్చు . 

31.  అందరూ  పన్నుల పరిధిలోకి రావడం వలన , ఇప్పటి వరకు  విధిగా పన్నులు కడుతున్న  ప్రయివేటు , ప్రభుత్వ ఉద్యోగులు  , నిజాయితీ పరులు  మానసికంగా  సంతృప్తి పొందుతారు . 

32. పూర్తిగా  అవినీతి రహిత దేశం కావడం వలన ,  పారదర్శక దేశం  అవడం వలన , దేశ ప్రతిష్ట  ప్రపంచ పటం లో  అత్యున్నత స్థాయిలో  నిలుస్తుంది .  విదేశీయులకు మన దేశం పై నమ్మకం , గౌరవం ,  ఏర్పడుతుంది . 

33. వరకట్నాలు , పసుపు కుంకుమ  ఆస్తులు  తగ్గు మొఖం పడుతాయి .  పేద మధ్య తరగతి  ఆడపిల్లల తల్లి దండ్రులకు కొంత ఊరట కలుగు తుంది . 


34. స్కూల్లల్లో  , కాలేజీలలో  డొనేషన్లు  తగ్గి  పేద, మధ్య తరగతి  విద్యార్థులకు  మేలు జరుగు తుంది . 


35. లోటు బడ్జెట్ తగ్గుతుంది . తాత్కాలికంగా  జి. డి . పి . 1 - 2 % (GROSS DOMESTIC PRODUCT)  తగ్గినా  దీర్ఘ కాలంలో , స్థిరంగా అభి వృద్ధి చెంది   జి. డి . పి . (GROSS DOMESTIC PRODUCT) పెరుగుతుంది . 


36. SLR,( STATUTARY LIQUID RATIO) ,CRR ( CASH RESERVE RATIO) పెరుగ  వచ్చు . బ్యాంకు రేట్ , ప్రైమ్ లెండింగ్  రేటు , రేపో రేటు , రివర్స్ రెపోరేటు  తగ్గ వచ్చు . బ్యాంక్ డిపాజిట్ల పైనా  , బ్యాంకులు ఇచ్చే లోన్ల పైనా  వడ్డీలు తగ్గ వచ్చు .  


37. ఆదాయ పన్నులు తగ్గించుకోడానికి  కొందరు  తెలివి గల వారు , వారి అదనపు ఆదాయాలను  , వారి భాగ స్వాముల  అకౌంట్లకు , తల్లి దండ్రుల అకౌంట్లకు  తరలించవచ్చు . వీరికి కొత్తగా బ్యాంకు , పోస్టాఫీసు అకౌంట్లు  తెరువ వచ్చు . ' పాన్ ' కార్డులు తీసుకోవచ్చు . ఈ విధంగా చేయడం వలన   భార్య లేదా భర్త కు , తల్లి దండ్రులకు, పిల్లలకు   ఆర్ధిక భద్రత ఏర్పడుతుంది . వీరి ఒక్కొక్కరి  అకౌంట్లలో  2 లక్షల 50 వేల  వరకు డిపాజిట్ చేయ వచ్చు . వీటి పైనా  పన్నులు ఉండవు . వీటిపై  వచ్చే వడ్డీల పైనా  పన్నులు ఉండవు . ఎందుకంటే  ప్రతి ఒక్కరికి  ' పాన్ ' నెంబర్  ఉంటుంది . అప్పుడు ప్రతి ఒక్కరు  సెపరేటు  అస్సెస్సీ  అవుతారు  కాబట్టి .   


38. ట్రాన్సాక్షన్స్  అన్నీ  బ్యాంకు త్రూ  చేయడము  వలన , అసలు  నిరు పేదలు  ఎవరో ,   పేదలు  ఎవరో , మధ్య తరగతి  వారు ఎవరో  , ధన వంతులు  ఎవరో , కుబేరులు ఎవరో  ప్రభుత్వాలకు  ఇట్టే  తెలిసిపోతుంది . దీని వలన  కొన్ని వేల  కోట్ల  వృధాగా చెల్లించే సంక్షేమ  పథకాలను  అరి కట్ట వచ్చు .  మనకు స్వాతంత్య్రం  వచ్చి 67 సం . రాలు దాటింది .  ఎవరికి  రిజర్వేషన్లు అవసరమో  ,  ఎవరికీ రిజర్వేషన్లు అవసరం  లేదో  ఒక నిర్ణయానికి  రావచ్చు . 


39. పెద్ద నోట్ల రద్దు ప్రభావం వలన మరియు  డిజిటల్ విధానం వలన , ఎవరు ధన వంతులో , ఎవరు పేద వారో  నిమిషాలలో  తెల్సిపోతుంది .  దీని కారణంగా , ఎక్కువ మంది విధిగా ఆదాయ పన్ను పరిధిలోకి  వస్తారు . పన్నులు చెల్లించ కుండా తప్పించు కోలేరు .  ఆ విధంగా ప్రభుత్వానికి  అధిక ఆదాయం  లభిస్తుంది . ఆ విధంగా వచ్చిన  ఆదాయాన్ని ప్రాధాన్యతా రంగాలకు వెచ్చించి  , ఉపాధి అవకాశాలను మెరుగు పరుచ వచ్చు . నిత్యావర వస్తువుల ధరలను తగ్గించ వచ్చు . దేశ అప్పులను తీర్చ వచ్చు . 


39. అంతా పారదర్శకంగా , అవినీతి రహితంగా , కొంత వరకు మోసాలు లేకుండా  వ్యవస్థ నడుస్తుంది కాబట్టి  ,  లా & ఆర్డర్  పై ,  కోర్టుల పై  భారం తగ్గుతుంది . కానీ  సైబర్ నేరాలు పెరుగుతాయి . 


నోట్ : పై వన్నీ  ఇప్పటికిప్పుడే  అమలు జరుగుతాయనుకోవడం  అత్యాశే ఆవుతుంది . దీనికి  కొన్ని సం. రాలు  పడుతుంది . జనవరి 01 ,2018 లో  పై అంచనాలను , వాస్త వాలను పరిశీలన  చేస్తాను .  

www.sollutions2all.blogspot.com

Tuesday, November 8, 2016

రూ . లు . 500/- మరియు రూ . లు . 1,000/- నోట్ల రద్దు ( DEMONETISATION OF Rs.500/- Rs.1,000/-) 08.11. 2016 అర్ధ రాత్రి నుండి , సరియైయినదేనా ?

ప్ర . నల్ల ధనాన్ని , అవినీతిని  అరికట్టడానికి  రూ . లు . 500/- మరియు  రూ . లు . 1,000/-  నోట్ల రద్దు  ( DEMONETISATION OF Rs.500/- Rs.1,000/-) సరియైయినదేనా ?

జ : భారత దేశంలో నల్ల ధనాన్ని , అవినీతిని  మరియు సుమారుగా  10 నుండి 20%  చలామణిలో  ఉన్న  ఫేక్  నోట్స్ ను  అరికట్టడానికి  రూ . లు . 500/- మరియు  రూ . లు . 1,000/- నోట్లను   ఈ రోజు అర్ధ  రాత్రి  నుండి       ( 08.11. 2016 అర్ధ రాత్రి నుండి )  రద్దు చేయాలని  నేడు ప్రధాన మంత్రి గారు తీసుకున్న  నిర్ణయం , ప్రకటన చాలా   సాహసోపేతమైనది , విప్లవాత్పకమైనది , అద్భుతమైనది మరియు సరియయినది. నల్ల ధనాన్ని , అవినీతిని మరియు  ఫేక్  నోట్స్ ను  నియంత్రించే  సాధనాలలో  ఇది  ఒక భాగం . 

కొందరు  రాజకీయ నాయకులు , వారి కార్య కర్తలు , కొందరు వ్యాపారస్తులు , కొందరు  బ్యూరోక్రాట్లు  చట్టాలలోని  లొసుగులను , మోసాలను , అవినీతిని , రిజర్వేషన్స్  ను అడ్డం పెట్టుకుని , అవినీతి సొమ్ముతో , నల్లధనంతో, బినామీ  వ్యాపారాలతో  ఎదిగి పోతూ , వేదికలమీద  నీతులు మాట్లాడుతూ ,  నిజాయితీగా  కష్టపడి  సంపాదించుకుంటూ  , సాహ్మణ్య జీవితం  గడిపే వారిని  చిన్న చూపు చూసే వారికి  " బ్లాక్  మనీ పై  సర్జికల్ స్ట్రైక్ "  చెంప పెట్టు లాంటిది .  


ప్రధాన మంత్రి గారి  ప్రకటన  ముఖ్య  సారాంశం  నల్ల ధనాన్ని  , అవినీతిని అరికట్టడం , మరియు  10% చలామణిలో ఉన్న  ఫేక్  నోట్స్  ను  పేద మధ్యతరగతి  ప్రజలకు  వస్తువుల ధరలు , భూముల ధరలు అందుబాటులోకి రావడం ,  ఉత్పత్తిని పెంచడం , ఉద్యోగ అవకాశాలను  మెరుగుపరచడం , ప్రతి కుటుంభం  ఆర్ధికంగా  ఎదుగడానికి  , నిజాయితీ  గల వారు  తల ఎత్తు కుని  ధైర్యంగా తిరిగే విధంగా  చేయడం , ఉగ్రవాదాన్ని అరికట్టడం  మరియు మరెన్నో  ఇతర  కారణాలు  ఇమిడి ఉన్నాయి . రూ . లు . 500/- మరియు  రూ . లు . 1,000/-  నోట్లను ఈ రోజు అర్ధ  రాత్రి  నుండి ( 08.11. 2016 అర్ధ రాత్రి నుండి ) రద్దు  చేయడం వలన  పేదలకు , నిజాయితీ పరులకు  ఎలాంటి సమస్య ఎదురుకాదు . పేదలకు ఖర్చు తక్కువ . నిజాయితీ పరులకు , క్రమశిక్షణ గలవారికి  చెడు  వ్యసనాలు ఉండవు . అందుకని వీరికి  పెద్ద నోట్ల రద్దు వలన  పెద్ద సమస్య ఉండదు . దానికి తోడు రేపు  పేదలకు , నిజాయితీ పరులకు  ఖచ్చితంగా  మేలు  జరుగు తుందను కున్నపుడు , ఈ వరం పది రోజుల  డబ్బు కొరత , పెద్ద సమస్యే కాదు . పైగా హర్షిస్తారు . ఈ అర్ధ రాత్రి నుండే అనడం కూడా  సరి అయినదే . పెద్ద నోట్ల రద్దు చేసిన  ముఖ్య ఉద్దేశ్యమే  నల్ల ధనాన్ని , అవినీతి సొమ్మును , ఫేక్ నోట్స్  ను  అరికట్టడం . ఏ కొద్దీ సమయం దొరికినా  , నల్లధనాన్ని  ఎక్కడికక్కడ  సర్దుబాటు చేసుకునే వారు . ఇలా తక్షణమే రద్దు చేయడం వలన , నల్ల ధన  వీరులకు , అవినీతి పరులకు  గిమ్మిక్కులు  చేసే  అవకాశం  చిక్కకుండా పోతుంది . అయితే  మరల  రూ . లు  500/- మరియు  రూ . లు . 2,000/- ప్రవేశ పెట్టే  నిర్ణయం తీసుకోవడం  వలన , కేవలం నల్లధనాన్ని , అవినీతిని  పోస్టుపోన్ చేయడమే  అవుతుంది . అవినీతికి  అలవాటు పడినవారు , అవకాశం ఉన్నవారు  మరో  2 లేదా 3 సంవత్సరాలలో  మరల నల్ల ధనాన్ని కూడబెట్ట  గలుగుతారు .  ఎందుకంటే  ఇప్పుడు పెద్ద మొత్తం విలువగల నోట్లు  అందుబాటులోకి రాబోతున్నాయి . ఈ వ్యవస్థలో ఆ అవకాశం ఉంది . అందుకని ప్రభుత్వాలు ఆ దిశగా కూడా నియంత్రణ చర్యలు  తీసుకోవాలి .  

ప్రధాన మంత్రి  గారి  ప్రకటన లోని  ముఖ్య అంశాలు :

01. రూ . లు . 500/- మరియు  రూ . లు . 1,000/-  నోట్లను ఈ రోజు అర్ధ  రాత్రి  నుండి       ( 08.11. 2016 అర్ధ రాత్రి నుండి ) రద్దు చేయాలని   ప్రధాన మంత్రి గారు  ప్రకటన చేశారు . 

02. వీటి  ప్లేసులో  కొత్త  రూ . లు . 500/- మరియు  2,000/- నోట్లను  విడుదల చేయడం.

03.అలానే రూ  లు . 100/-, 50/-, 20/-, 10/-, 5/- ,2/-,1/-  నోట్లు  మరియు  అన్ని కాయిన్స్  యధావిధిగా  చాలా మణిలో ఉంటాయి . 

03. తేదీ 08. 11. 2016 రోజున బ్యాంకుల ను మూసివేస్తారు . 

05. తేది . 08. 11. 2016  మరియు  09. 11. 2016 ఏ . టి . ఎమ్  లు పని చేయవు .  

06. తేదీ 10. 11. 2016  నుండి  ప్రజలు , రోజుకు  రూ . లు. 4,000/-  ప్రస్తుతం చేతిలో ఉన్న 500/-,  1,000/- నోట్లకు  బదులుగా  క్రొత్త 500/-,  2,000/- నోట్లను  బ్యాంకులనుండి , పోస్టాఫీసుల నుండి  తీసుకోవచ్చు .  ఇది  24. 11. 16 వరకు వర్తిస్తుంది . ఆ తరువాత  మరల రివ్యూ చేస్తారు . 

07. ఈ విధంగా  31. 12. 2016 వరకు  మార్చు కోవచ్చు . ఆ తరువాత  ఆ నోట్లు చెల్లు బాటే కాదు , మార్చు కోడానికి కూడా వీలు కాదు .  

08. చెక్ , డెబిట్ కార్డు , క్రెడిట్ కార్డుతో  మరియు  ఆన్ లైన్ లో  ఎంత  మొత్తానికైనా  ట్రాన్సక్షన్ చేసు కోవచ్చు . 

09. ఏ . టి . ఎమ్  ద్వారా  రోజుకు  10,000/- లకు  మించి  డ్రా  చేయడానికి  వీలు లేదు .  అలానే వారానికి 20,000/- లకు మించి డ్రా  చేయడానికి వీలు లేదు .

10. ప్రస్తుతం  అందు బాటులో  ఉన్న  రూ . లు . 500/- , 1,000/- నోట్లను  బ్యాంకులలో  గాని పోటాఫీసులలో గాని ఎంత  మొత్తమైనా  వారి వారి అకౌంట్లలో  డిపాజిట్ చేసు కోవచ్చు . అయితే  వారి  ఆధార్ కార్డును  గాని , ఓటర్  కార్డును గాని ,  పాన్  కార్డును  గాని చూపించాలి . పెద్ద మొత్తాలలో  డిపాజిట్ చేస్తే  , వీటికి సోర్సు  చూపించమని  ఆదాయ  శాఖ  నుండి  నోటీసులు రావచ్చు .    బ్యాంకుల్లో  సి .సి . కెమెరాలలో  అన్నీ రికార్డ్ చేస్తారు . 

11. పెట్రోల్  బంకులలో , హాస్పటల్  లలో , ప్రభుత్వ  స్టోర్సులలో కొనుగోలుకు , రేల్వే , బస్  , ఏర్ లైన్  టికెట్స్   కొనడానికి  ప్రస్తుతం అందుబాటులో ఉన్న   రూ . లు . 500/- మరియు  1,000/-  నోట్లు   తేదీ  30. 12. 2016   వరకు చెల్లు బాటు అవుతాయి . 

నల్ల ధనానికి  ముఖ్య కారణాలు  ఈ క్రింద  సూచించినవి .  వీటికి అనుగుణంగా  నిర్ణయాలు తీసుకుంటే  దేశం మరింత  అభివృద్ధి పథంలో  నడుస్తుంది  .  అదియును  గాక ముఖ్యంగా ,

01. చట్టం ముందు అందరూ ,( పేద , మధ్య తరగతి , ధనిక , కుల , మత, ప్రాంత , ఆశ్రిత పక్ష పాతం లేకుండా   మరియు అన్ని సమయాలలో )  సమానులే అన్న విధంగా  చర్యలు చేపడుతే  నల్ల ధనాన్ని , అవినీతిని  మరియు  ఫేక్  నోట్లను  సులువుగా  అరి కట్ట వచ్చు . 


02. ప్రతీది  నిస్వార్ధంగా ఉండాలి , స్వచ్చతగా ఉండాలి . ధృడ సంకల్పంతో ఉండాలి . కక్ష  సాధింపు  చర్యలు, ఆశ్రిత పక్ష పాతం  లేకుండా  ఉంటే  , ప్రజలు  , నాయకులను  ఆదర్శంగా  తీసుకుంటారు , అనుసరిస్తారు . 


03. ఆధార్ కార్డు , పాన్  కార్డు లాగా  , ప్రతి ఒక్కరికీ  ఒకే  బ్యాంక్ అకౌంట్ , ఒకే  సెల్ నెంబర్  ఉండే విధంగా చేయడం వలన  నల్ల ధనాన్ని  అరికట్ట వచ్చు .


04. పేదలకు , మధ్య తరగతి  ప్రజలకు , నిజాయితీ పరులకు  మేలు చేకూర్చాలనుకున్నా , ధైర్యాన్ని కల్పించాలన్నా ,  "వోట్ బ్యాంకు" విధానాలకు స్వస్తి పలకాలి . 


05. రాజకీయ నిధులకు 100% పన్నులు వేయడం కూడా వృధానే . అసలు  రాజకీయ నిధులపై  పూర్తిగా  నిషేధం  విధించాలి . 



06. అన్నిటికంటే  ముఖ్యముగా ,  గొప్ప  సాహసోపేతమైన  నిర్ణయం తో పాటు , రూ . లు . 1,000/- కోట్ల నిధులు వెచ్చించి , ఇంటిగ్రేటెడ్  మరియు  స్వయం  ప్రతి పత్తి గల  స్వతంత్ర  "సి . బి . ఐ "  ని  ఏర్పాటు చేయాలి.  అలానే  ప్రత్యేకమైన "ఫాస్ట్  ట్రాక్ " కోర్టులను  ఏర్పాటు చేసి  , అవినీతి కేసులను  90 రోజులలో పూర్తి చేసే టట్లుగా  చర్యలు తీసుకుంటే , నిజంగా  నేటి  మరియు రేపటి  తరాల పేదలకు , నిజాయితీ పరులకు న్యాయం జరుగు తుంది . మేలు కలుగుతుంది . ధైర్యం కలుగుతుంది .  తృప్తి  మిగులుతుంది .  అలానే  ఈ ప్రకటనకు  ముందు  ఆర్ధిక లావాదేవీలను  విచారించే  పూర్తి అధికారం  ఈ  " సి . బి . ఐ " కి వీలు కల్పించాలి . ప్రకటనకంటే ముందు 180 రోజుల బ్యాంకు  ట్రాన్సక్షన్స్,  భారతదేశంలో నివసించే వారందరివి , రూ.లు . 2 లక్షల 50 వేలకె మించిన ఖాతాలను , తెప్పించుకుని  వెరిఫై చేయించాలి .  అప్పుడే ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది . రేపు పడే కష్ట నష్టాలకు ఓర్చు కుంటారు . 



ఏది ఏమైనా  ప్రధాన మంత్రి గారి  నిర్ణయాన్ని  పేద , మధ్య తరగతి  ప్రజలు , నిజాయితీ పరులు స్వాగతిస్తారనడంలో  సందేహం లేదు . ఒకటి రెండు  రోజులు  కొంత ఇబ్బంది కలుగవచ్చు . కానీ దీర్ఘ కాలంలో  బావి తరాలకు  ఇది ఎంత గానో  ప్రయోజనం  చేకూరుస్తుంది  

అసలు నల్ల ధనానికి , అవినీతికి   ముఖ్య కారణాలు ఇవి , వీటిని  కూడా  దృష్టిలో పెట్టుకోవాలని  ప్రధాన మంత్రి గారికి  విన్నపం:

"MAIN REASONS FOR THE BLACK MONEY , CORRUPTION AND FAKE NOTES ARE AS UNDER , HENCE PRIME MINISTER MUST CONSIDER ALL THESE ALSO : "

01.Increase of selfishness and abnormal needs and desires of the people.

02.Un education and illiteracy.

03.Poor ness of the people. 

04.Regional, geographical and imbalances of natural resources.

05.Old sentiments, cultures, beliefs and weakness of the people.

06.Loop holes in laws and others.

07.As per the constitution "All are equal" But , in really, only poor and illiterate people arepunishing so easily,  quickly and seriously, comparatively rich people.

08.Lack of identification of good and honestly living people.And there is no respect aboutfaithfully and  morally and responsibly living people.Besides to that these people are calling as  innocent, useless, knowledge less and as waste candidates, in the society.

09.Further, if any one criticises or complaints about the corrupted people, the law and orderpolice concentrating their entire powers on criticisers and on those who made complaints andpunishing seriously in different ways.

10.Gov.ment policies, G.Os.and Tenders etc.,giving chances to do corruption.

11.Lack of control on Gov.ment and political powers.

12.More chances and powers to have lot of Un identified easy funds in politics and Gov.ments.

13.Defects in education system,Election system and Family  system in development of  children.

14.Because of people eagerness to get it finish their works with in minuts or hours. This type of behaviour leading to do the Corruption. 

15.Still Continuation of reservations for some casts, because of vote bank etc., making other casts to earn money  through other different roots (corruption) to survive in the society. 

16.Low salaries or delaying the salaries months to gether  in  industries, some times forcing to do the corruption to survive their life and family life.

17.The needs and desires of the people, loop holes in laws and Gov.ment policies, Political games etc., are  inspiring  the people to do the more corruption.

18.There are  no immediate punishments to the corrupted political leaders and buerocrats. Even if punishments are there over period (after some years), the maximum punishment period may be 7  years. That also caluculating from the day of going and attending the court.

19.There is no concrete system, procedure or laws to recover the entire Corrupted & Black money immediately from the  big corrupted people (leaders in corruption).

20.The 'Legislative' is ok, but the political leaders have the more domination than the 'Law'.

21Gov.ment Departments and high level officers attitudes also making  the low level employees and people to do the corruptions. Gov.ments departments like Excise,Mines, Sales Tax,Income Tax, Municipal  Office, Mines departments, Electricity departments, Pension Offices, Secretariats, P&A sections , Hospitals etc.,

22.The Liberalisation, Privatisation and Globalisation further given more freedom to increase  the  private Assets, Corruption  and Black Money etc.,from the year 2001.