ప్ర . రూ . లు . 500/- మరియు 1,000/- పెద్ద నోట్ల రద్దు వలన (BENEFITS WITH THE DEMONETISATION OF HIGH VALE NOTES Rs.500/- AND 1,000/-) ఎవరికీ లాభం ? ఎవరి నష్టం ? సాధారణంగా ప్రయోజనాలు ఏమిటి ? ఉపయోగాలు ఏమిటి?
జ : రూ. లు . 500/- మరియు 1,000/- పెద్ద నోట్ల రద్దు ( DEMONETISATION OF HIGH VALE NOTES Rs.500/- AND 1,000/-) వలన కొందరికి లాభాలు ఉన్నాయి . మరికొందరికి నష్టాలు ఉన్నాయి . అవి ఎలాగో విశ్లేషిద్దాం .
01. రూ . లు . 500/- మరియు 1,000/- పెద్ద నోట్ల రద్దు ( ( BENEFITS WITH THE DEMONETISATION OF Rs.500/- AND 1,000/-) వలన , సమాంతరంగా నడిచే నల్ల ధనం కట్టడి అవుతుంది . ఫేక్ కరెన్సీ పూర్తిగా రద్దయి పోతుంది . అలానే ఉత్పాధకతకు ఉపయోగ పడకుండా , బీరువాలలో , గోదాములలో మూలుగుతున్న నల్లధనం , అవినీతి సొమ్ము , ఇప్పడు బ్యాంకింగ్ వ్యవస్థ లోకి వచ్చి , ఆర్ధిక వ్యవస్థ వృద్ధి పధంలో నడుస్తుంది .
02. వాస్తవ మైన డబ్బంతా బ్యాంకులలోకి చేరి , కొంత కాలం తరువాత లోన్ల ద్వారా పరిశ్రమలకు చేరి ఉత్పాధక శక్తి పెరుగుతుంది . ఒక వేల నల్లధనంగా మారిన వాస్తవమైన డబ్బు , దొరికి పోతామేమో నని బ్యాంకులలో జమ చేయపోయినా , వాటిని రద్దు చేసి దానికి సరిపడా విలువ గల నోట్లను రిజర్వు బ్యాంక్ ముద్రిస్తుంది . దానిని పేదల సంక్షేమ పథకాలకు వినియోగించ వచ్చు . లేదా దేశాభి వృద్ధికి , ఉపాధి కల్పనకు లేదా ప్రభుత్వ అప్పులను తీర్చడానికి ఉపయోగించ వచ్చు .
03. రూ . లు . 500/- మరియు 1,000/- పెద్ద నోట్ల రద్దు (DEMONETISATION Rs.500/- AND 1,000/-) వలన నల్ల ధనం (BLACK MONEY) , అవినీతి ( CORRUPTION) కొంత వరకు తగ్గుమొఖం పడుతుంది . మరల రూ . లు . 500/- మరియు 2,000/- పెద్ద నోట్లు ( HIGH VALE NOTES Rs.500/- AND 2,000/-) విడుదల అయ్యాయి కాబట్టి , నల్లధనం వాయిదా పడవచ్చు . అయితే ఒక యేడాది తరువాత రూ . లు . 2,000/- పెద్ద నోట్లన్నీ ధనవంతుల చేతిలోకి వెళ్ళాక , వాటిని రద్దు చేసి , ఆన్లైన్ సిస్టం, ప్లాస్టిక్ కార్డ్స్ వినియోగాన్ని పెంచినట్లవుతే , నల్ల ధనం పూర్తిగా ఫిల్టర్ అవుతుంది .
04. బంగారం , వెండి ధరలు తగ్గు మొఖం పడుతాయి . బంగారం , వెండి ధరలు తగ్గడం వలన ధనికులు , నల్లధన కుబేరులు నష్టపోతారు , సామాన్య ప్రజలు , కనీసం వారి అవసరాలకు కొనుక్కునే ధరలు అందుబాటులోకి వస్తాయి .
05. ఒక వైపు నల్లధనం తగ్గడం , మరో వైపు ఫేక్ మనీ పూర్తిగా లేకుండా పోవడం వలన , నేడు ప్రజల చేతిలో ఉన్న డబ్బుకు విలువ ఏర్పడుతుంది . ఉదా : రూ . లు . 10/- లు , రూ . లు . 100/- విలువగా గుర్తించ బడుతాయి . ( డిమాండ్ సప్ప్లై సిద్ధాంతం ప్రకారం ) . ఆ కారణంగా ప్రజలు వృధాగా ఏది పడితే అది కొనడానికి ఇష్ట పడరు . అలానే , అమ్మకపు దారు ఎంత అంటే అంతకు అమ్మడానికి పోటీ పడరు . ఇది కష్ట పడి సంపాదించిన డబ్బుగా గుర్తిస్తారు . అందుకని ,నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుమొఖం పడుతాయి . దాని వలన సామాన్య ప్రజలు లాభ పడుతారు .
06. ఉత్పాధక శక్తి పెరగడం వలన , వస్తు సేవల ధరలు తగ్గడం వలన , ద్రవ్యోల్భణం ఆటోమేటిక్ గా తగ్గు తుంది .
07. వృధా ఖర్చులు తగ్గి పోతాయి . చెడు వ్యసనాలు తగ్గ వచ్చు . ఇప్పటికి లాగ నగదు అందుబాటులో ఉండదు కాబట్టి .
08. ప్రజలలో పొదుపు శక్తి పెరుగుతుంది . డబ్బు విలువ పెరుగుతుంది .
09. ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి . దీని వలన ప్రతి కుటుంభం ఆర్ధికంగా ఎదుగుతుంది .
10. వ్యవస్థలో నగదు చలామణి తగ్గుతుంది కాబట్టి , ప్రతి ట్రాన్సాక్షన్ చెక్కుల రూపేనా లేదా ఆన్ లైన్ ద్వారా చేస్తారు కాబట్టి , ఆదాయం ఖర్చులు బయటపడి , విధిగా చెల్లించాల్సిన పన్నులు చెల్లిస్తారు . ఇక పన్నులు ఎగ్గొట్టడం కుదరదు . దీని వలన ప్రభుత్వానికి పన్నుల రూపేనా అధిక ఆదాయం వస్తుంది . దీనిని తిరిగి ప్రభత్వాలు అభివృద్ధి పథకాలకు , సంక్షేమ పథకాలకు ఉపయోగించడానికి వీలు కలుగుతుంది .
11. నగదు చలామణి తగ్గుతుంది కాబట్టి , ఖర్చు లు బ్యాంకుల ద్వారానే చెల్లించాలి కాబట్టి , వ్యాపారస్తులకు వాస్తవ ఆదాయం చెక్కుల రూపేన లేదా బ్యాంకులకు రావాల్సి ఉంటుంది . అందువలన ఇక బిల్లులు లేని వ్యాపారాలు ఉండవు . బిల్లులతో వ్యాపారం చేసినప్పుడు , ఇక వారు వ్యాట్ , సి ఎస్ . టి , ఎక్సయిజ్ పన్ను , సర్వీస్ టాక్స్ , ఆదాయ పన్ను , టి . డి . ఎస్ (TDS) , టి .సి . ఎస్ (TCS) ఎగ్గొట్టే ప్రశ్నే తలెత్తదు . రేపు "జి ఎస్ టి " విధానంలో కూడా పన్నులు ఎగ్గొట్టే ప్రసక్తే ఉండదు .
12. హవాలా వ్యాపారాలపై నియంత్రణ పెరుగుతుంది . హవాలా వ్యాపారాలు తగ్గుతాయి .
13. లోకల్ చిట్టీల వ్యాపారాలు , ప్రయివేట్ ఫైనాన్సియల్ వ్యాపారాలు , బెట్టింగులు తగ్గుతాయి . దీని వలన సామాన్య ప్రజలు మోస పోకుండా ఉండే అవకాశం ఉంటుంది . అలానే లా & ఆర్డర్ కు ఎలాంటి సమస్యలు ఉండవు .
14. భూముల ధరలు , ఫ్లాట్ల ధరలు కనీసం 10 నుండి 20% వరకు తగ్గి , సొంత గృహం సాకారం చేసుకోవాలనుకునే, సామాన్య ప్రజలకు భూములు అందుబాటు ధరల లోకి వస్తాయి . గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి . అధిక భూములు ఉన్న వారు , రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వారు నష్ట పోతారు . అప్పులు తీసుకుని ఇండ్లు కొనుక్కున్న వారు , ఇటు ఇండ్ల విలువ తగ్గి , అటు అప్పుల భారం పెరిగి ( డబ్బు విలువ పెరిగింది కాబట్టి ) , ఫిక్సెడ్ ఆదాయం లేని వారు ఇబ్బంది పడాల్సి రావచ్చు .
15. ఇప్పటికే అప్పులు ఇచ్చిన వారు లాభ పడుతారు . అప్పు తీసుకున్న వారు చాలా నష్ట పోతారు . డబ్బు విలువ పెరిగింది కాబట్టి , వీరిపై అధిక భారం పడుతుతుంది .
16. దిన కూలీలా రేట్లు తగ్గుతాయి . అయితే వస్తు ధరలు తగ్గు తాయి కాబట్టి , వీరికి పెద్దగా సమస్య ఉత్పన్నం కాదు .
17. ఫేక్ మనీ , నల్ల ధనం , అవినీతి సొమ్ముతో నడిపించే అసాంఘిక కార్యకలాపాలు , పబ్బులు , డాబుసరి ఫంక్షన్లు , మరో రకమైన పనులు జరుగకుండా కట్టడి చేయడానికి వెసులుబాటు కలుగుతుంది .
18. పేదలు , సామాన్యులు , నిజాయితీ పరులు ధైర్యంగా , తలెత్తుకుని , సంతోషంగా , హాయిగా జీవించే అవకాశం కలుగుతుంది . వీరికి మానసిక తృప్తి ఏర్పడుతుంది .
19. బ్యాంకులలో , పోస్టాఫీసులలో నగదు రూపేణా లేదా ఫిక్సడ్ డిపాజిట్ల రూపేణా , బాండ్ల రూపేణా ఉన్న వారు మరియు ఇతర త్రా స్థిర వడ్డీలతో పొదుపు చేసుకున్న వారు లాభ పడుతారు . అప్పులు చేసిన వారు నష్టపోతారు . భారంగా ఫీలవుతారు .
20. షేర్లలో , మ్యూచువల్ ఫండ్సులో పెట్టుబడులు పెట్టిన వారు , తక్కువసమయం కొరకు పెట్టుబడులు పెట్టిన వారు త్కాలికంగా నష్ట పోతారు . కానీ రాబోయే కాలాల్లో స్థిరంగా ఫైనాన్సియల్ మార్కెట్ వృద్ధి చెందు తుంది కాబట్టి , లాభాల బాట పడుతారు.
21. ఎక్కువ కిరాయి గల ఇండ్లు చాలా మట్టుకు ఖాళీ అవుతాయి . ఇండ్ల , ఫ్లాట్స్ రెంట్స్ తగ్గు తాయి . ఇది పేద మధ్య తరగతి ప్రజలకు ఊరట నిస్తాయి .
22. పనులు దొరకక , డబ్బు లభించక , ఆకలికి తాల లేక కొందరు మరల గ్రామాల వలస పడితే , మరికొందరు చిల్లర దొంగ తనాలకు, దోపిడీ దొంగ తనాలకు తెగబడవచ్చు .
23. రైతులు పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు ఉండవు . తాత్కాలికంగా నష్ట పోతారు. కొంత కాలం పోయాక , వారి ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి , ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది .
24. తాత్కాలికంగా ప్రభత్వాల అన్ని రాబడులు , సేల్స్ టాక్స్ , రిజిస్ట్రేషన్స్ పన్ను లు తగ్గి పోతాయి . అయితే పాత నోట్ల అనుమతి వలన , ప్రాపర్టీ టాక్స్ , కరెంటు పన్నులు , పాత బకాయీలు , ట్రాఫిక్ బకాయిల రాబడి పెరుగుతుంది . రాబోయే కాలాల్లో , అందరూ పన్నులు చెల్లించాల్సిన పరిస్థితి విధిగా ఏర్పడుతుంది కాబట్టి , ప్రభుత్వాలకు విపరీతమైన ఆదాయం పెరుగుతుంది . దుబారా తగ్గుతుంది . అలానే , ఇప్పడు అసలు పేదలు ఎవరో , ధనవంతులు ఎవరో బయట పడుతారు కాబట్టి, మరియు పార దర్శకత ఉంటుంది కాబట్టి , సంక్షేమ పథకాలకు నిధులు తక్కువగా అవరం ఏర్పడుతాయి .
25. 30 డిసెంబర్ ,2016 వరకు దేవుళ్ళ హుండీలలో నల్ల ధనం ఆదాయం పెరుగుతుంది . ఆ తరువాత నల్ల ధనం ఉండదు కాబట్టి దేవుళ్ళ హుండీల లో ఆదాయం తగ్గుతుంది .
26. మూఢ నమ్మకాలకు పెట్టే వృధా ఖర్చులు తగ్గి పోతాయి . అసంఘటిత పొదుపు పధకాల మూలంగా నష్ట పోవడం అంటూ ఉండదు . కానీ , ఆన్ లైన్ మోసాలు , హ్యాకర్స్ మోసాలు వెన్నంటే ఉంటాయి .
27. ప్రజలు ప్రతి రూపాయిని బ్యాంకులలో గాని , పోస్టాఫీసులలో గాని డిపాజిట్ చేస్తారు కాబట్టి , వారికి ప్రతి రూపాయి మీద , ప్రతి రోజుకు , సాలుకు 4% చొప్పున వడ్డీ లభిస్తుంది .
28. ప్రజలు నగదు మొత్తం బ్యాంకుల లోనో , పోస్టాఫీసుల లోనో వేయాలి కాబట్టి , అప్పుడు నిరుపేదలెవరో (BPL) , పేదలెవరో , మధ్య తరగతి వారెవరో , ధనవంతులెవరో , నల్ల కుబేరులెవరో ఇట్టే తెల్సి పోతుంది . అలానే ప్రభుత్వాలకు పన్నులు వసూలు చేయడం సులువవుతుంది . ఆదాయం పెరుగుతుంది .
29. ప్రజలకు బ్యాంకింగ్ అవేర్నెస్ , డిజిటల్ అవేర్నెస్ ఏర్పడు తుంది . పొదుపు అలవాటవుతుంది . మిత వ్యయం అలవాటవుతుంది . సమయం వచ్చినప్పుడు కష్టాలను ఎలా ఎదుర్కోవాలో బోధపడుతుంది. భవిష్యత్తు కు నిధులు ఏర్పరుచుకో గలుగుతారు . భద్రత ఏర్పడుతుంది . ఇంకా జీవించాలనే ఆశ ఏర్పడుతుంది . ఇంకా ఎదో సాధించాలనే తపన ఉంటుంది .
30. రద్దయిన నల్ల ధన మొత్తం నుండి ప్రధాన మంత్రి గారు , కొంత మొత్తాన్ని పేదల ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేయవచ్చు . ఎందుకంటే ఎన్నికల వాగ్ధానాలలో ఇది ఉంది కాబట్టి . లేదా పరోక్షంగా వారికి మేలు చేసే ఏవైనా పధకాలను ప్రవేశ పెట్ట వచ్చు .
31. అందరూ పన్నుల పరిధిలోకి రావడం వలన , ఇప్పటి వరకు విధిగా పన్నులు కడుతున్న ప్రయివేటు , ప్రభుత్వ ఉద్యోగులు , నిజాయితీ పరులు మానసికంగా సంతృప్తి పొందుతారు .
32. పూర్తిగా అవినీతి రహిత దేశం కావడం వలన , పారదర్శక దేశం అవడం వలన , దేశ ప్రతిష్ట ప్రపంచ పటం లో అత్యున్నత స్థాయిలో నిలుస్తుంది . విదేశీయులకు మన దేశం పై నమ్మకం , గౌరవం , ఏర్పడుతుంది .
33. వరకట్నాలు , పసుపు కుంకుమ ఆస్తులు తగ్గు మొఖం పడుతాయి . పేద మధ్య తరగతి ఆడపిల్లల తల్లి దండ్రులకు కొంత ఊరట కలుగు తుంది .
34. స్కూల్లల్లో , కాలేజీలలో డొనేషన్లు తగ్గి పేద, మధ్య తరగతి విద్యార్థులకు మేలు జరుగు తుంది .
35. లోటు బడ్జెట్ తగ్గుతుంది . తాత్కాలికంగా జి. డి . పి . 1 - 2 % (GROSS DOMESTIC PRODUCT) తగ్గినా దీర్ఘ కాలంలో , స్థిరంగా అభి వృద్ధి చెంది జి. డి . పి . (GROSS DOMESTIC PRODUCT) పెరుగుతుంది .
36. SLR,( STATUTARY LIQUID RATIO) ,CRR ( CASH RESERVE RATIO) పెరుగ వచ్చు . బ్యాంకు రేట్ , ప్రైమ్ లెండింగ్ రేటు , రేపో రేటు , రివర్స్ రెపోరేటు తగ్గ వచ్చు . బ్యాంక్ డిపాజిట్ల పైనా , బ్యాంకులు ఇచ్చే లోన్ల పైనా వడ్డీలు తగ్గ వచ్చు .
37. ఆదాయ పన్నులు తగ్గించుకోడానికి కొందరు తెలివి గల వారు , వారి అదనపు ఆదాయాలను , వారి భాగ స్వాముల అకౌంట్లకు , తల్లి దండ్రుల అకౌంట్లకు తరలించవచ్చు . వీరికి కొత్తగా బ్యాంకు , పోస్టాఫీసు అకౌంట్లు తెరువ వచ్చు . ' పాన్ ' కార్డులు తీసుకోవచ్చు . ఈ విధంగా చేయడం వలన భార్య లేదా భర్త కు , తల్లి దండ్రులకు, పిల్లలకు ఆర్ధిక భద్రత ఏర్పడుతుంది . వీరి ఒక్కొక్కరి అకౌంట్లలో 2 లక్షల 50 వేల వరకు డిపాజిట్ చేయ వచ్చు . వీటి పైనా పన్నులు ఉండవు . వీటిపై వచ్చే వడ్డీల పైనా పన్నులు ఉండవు . ఎందుకంటే ప్రతి ఒక్కరికి ' పాన్ ' నెంబర్ ఉంటుంది . అప్పుడు ప్రతి ఒక్కరు సెపరేటు అస్సెస్సీ అవుతారు కాబట్టి .
38. ట్రాన్సాక్షన్స్ అన్నీ బ్యాంకు త్రూ చేయడము వలన , అసలు నిరు పేదలు ఎవరో , పేదలు ఎవరో , మధ్య తరగతి వారు ఎవరో , ధన వంతులు ఎవరో , కుబేరులు ఎవరో ప్రభుత్వాలకు ఇట్టే తెలిసిపోతుంది . దీని వలన కొన్ని వేల కోట్ల వృధాగా చెల్లించే సంక్షేమ పథకాలను అరి కట్ట వచ్చు . మనకు స్వాతంత్య్రం వచ్చి 67 సం . రాలు దాటింది . ఎవరికి రిజర్వేషన్లు అవసరమో , ఎవరికీ రిజర్వేషన్లు అవసరం లేదో ఒక నిర్ణయానికి రావచ్చు .
39. పెద్ద నోట్ల రద్దు ప్రభావం వలన మరియు డిజిటల్ విధానం వలన , ఎవరు ధన వంతులో , ఎవరు పేద వారో నిమిషాలలో తెల్సిపోతుంది . దీని కారణంగా , ఎక్కువ మంది విధిగా ఆదాయ పన్ను పరిధిలోకి వస్తారు . పన్నులు చెల్లించ కుండా తప్పించు కోలేరు . ఆ విధంగా ప్రభుత్వానికి అధిక ఆదాయం లభిస్తుంది . ఆ విధంగా వచ్చిన ఆదాయాన్ని ప్రాధాన్యతా రంగాలకు వెచ్చించి , ఉపాధి అవకాశాలను మెరుగు పరుచ వచ్చు . నిత్యావర వస్తువుల ధరలను తగ్గించ వచ్చు . దేశ అప్పులను తీర్చ వచ్చు .
39. అంతా పారదర్శకంగా , అవినీతి రహితంగా , కొంత వరకు మోసాలు లేకుండా వ్యవస్థ నడుస్తుంది కాబట్టి , లా & ఆర్డర్ పై , కోర్టుల పై భారం తగ్గుతుంది . కానీ సైబర్ నేరాలు పెరుగుతాయి .
నోట్ : పై వన్నీ ఇప్పటికిప్పుడే అమలు జరుగుతాయనుకోవడం అత్యాశే ఆవుతుంది . దీనికి కొన్ని సం. రాలు పడుతుంది . జనవరి 01 ,2018 లో పై అంచనాలను , వాస్త వాలను పరిశీలన చేస్తాను .
www.sollutions2all.blogspot.com

No comments:
Post a Comment