ప్ర : రూ లు . 1,000/- మరియు 500/- నోట్ల రద్దు (DEMONETISATION)తరువాత ఇంకేమి చేయాలి( WHAT ARE THE NEXT ACTIONS) ? ప్రధాన మంత్రి గారి మనుసులో ఇంకేమి ఉండ వచ్చు ?
జ : ప్రపంచంలో ఇప్పటివరకు యే ప్రధాన మంత్రి గాని , రాష్ట్రపతి గాని , మరెవ్వరూ సాహసించని గొప్ప నిర్ణయాన్ని , మన ప్రధాన మంత్రి గారు, అవినీతిని , నల్లధనాన్ని మరియు ఫేక్ నోట్స్ ను అరికట్టే , విప్లవాత్మకమైన , సాహసోపేతమైన నిర్ణయానికి దేశ ప్రజలందరూ కొన్ని క్షణాలు షాక్కు గురైయ్యారు , ఆ తరువాత, ప్రజలు కొన్ని బాధలు పడుతున్నా , సర్దుకు పోతున్నారు . సమర్థిస్తున్నారు . జేజేలు పలుకుతున్నారు . ఈ రోజు కొద్దిగా కష్ట పడినా , రేపు దేశం లోని పేద , మధ్య తరగతి మరియు నిజాయితీ పరులకు ఆర్ధిక మేలు , న్యాయం మరియు గుర్తింపు లభిస్తుందని, అవినీతి పరులకు , నల్లధన కుబేరులకు , వేదికలపై నీతులు పలికే నేతలకు , ఉగ్ర వాదానికి మనకళ్ల ముందే , మన కాలంలోనే కట్టడి జరుగుతుందనే నమ్మకంతో , ఆశతో ఉన్నారు . ప్రజల వద్ద నుండి సేకరించిన డబ్బుతో కార్పోరేట్ల వేలకోట్ల బకీయీలను రద్దు చేయరనే విశ్వాసంతో, ఎన్ని కష్టాలకైనా ఓర్చుకుంటున్నారు . వారందరిదీ ఒకటే బాధ , సరియయిన సమయంలో పేదలకు, రైతులకు చిల్లర డబ్బులు లేదా కొత్త నోట్లు అందించలేక పోతున్నారని మాత్రమే . అయితే 130 కోట్ల జనాభాకు 1, 2 రోజులలో అందిచడమనేది సామాన్యమైన విషయం కాదు . మరో విషయం ఏమంటే , నల్ల కుబేరుల మనుష్యులే రిపీటెడ్ గా రావడం, సరిపడే కొత్త నోట్లు అందుబాటులో లేక పోవడం , ఏ టి ఎం లు అన్నీ అందుబాటులోకి రాక పోవడం, డిసెంబర్ 30 వరకు టైం ఉన్నా , అనేకమైన ఇతర ఆన్లైన్ పద్ధతులున్నా , డబ్బు మేనేజ్మెంట్ అవగాహన లేక పోవడం వలన లైన్లలో నిలబడటం కారణంగా, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నట్లు వార్తలు .
ప్రధాన మంత్రి గారు , భారత దేశంలో అవినీతి అంటూ ఉండకూడదని , " స్వచ్చ భారత్ " ను చూడాలని ఎన్ని కలలు కంటున్నారో , ఎంత పట్టుదలతో ఉన్నారో , ఎంత భావోద్వేగంతో మాట్లాడుతున్నారో , ప్రజలు కూడా అంతే పట్టుదలతో భావోద్వేగంతో సహక రించడానికి సిద్ధం గా ఉన్నారు . దేశంలో సుమారుగా 99% ప్రజలు అవినీతి నిర్మూలనకు , నల్లధనాన్ని అరికట్టడానికి , ఫేక్ నోట్స్ ను ఏరి పారేయడానికి , ఉగ్ర వాదాన్ని తుద ముట్టడించి డానికి , ప్రధాన మంత్రి గారి నిర్ణయానికి అండగా ఉన్నారు . కేవలం 1% నల్ల కుబేరులే , అవినీతి పరులే ప్రధాన మంత్రి నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారు . ఎందుకంటే అయ్యో ఇన్ని రోజులు మోసం చేసి సంపాదించింది ఇప్పడు పోతుందే అని , రేపు సంపాదించ బోయే నల్లధన సంపద , పేదలను గుప్పిట్ల పెట్టుకునే అవకాశం పోతుందనే బాధ తో కుమిలి పోతున్నారు . చంద్ర మండలంలోని ఆస్తులు సూర్యుని వేడికి కరిగి పోతున్నాయని రగిలి పోతున్నారు .
రూ లు . 1,000/- మరియు 500/- నోట్ల రద్దు తరువాత ఇంకేమి చేయాలి( WHAT ARE THE NEXT ACTIONS, AFTER BAN OF HIGH VALUE NOTES ) ? ప్రధాన మంత్రి గారి మనుసులో ఇంకేమి ఉండ వచ్చు ?
ప్రధానమంత్రి గారి మనసులో ఏముందో తెలియదు గాని , ప్రజలు కొండత ఆశతో ఉన్నారు . నమ్మకంతో ఉన్నారు . అయితే , వారి మనసులోని ఆలోచనలకు తోడు , ఈ క్రింది చర్యలు కూడా పరిగణలోకి తీసుకుంటే ప్రజలు మరింత హర్షిస్తారు , గర్వంగా మరియు గౌరవంగా జీవిస్తారు . గెలుపు ఓటమిలు , చావు బ్రతుకులు సహజం . కానీ ప్రజలకు చేసే మంచి చర్యలు శాశ్వతంగా నిలిచి పోతాయి మరియు అవే వారిని ఉన్నత శిఖరానికి చేర్చుతాయి . ఆ చర్యలు ఏమంటే ,
01. కనీసం 1,000 కోట్ల నిధులు వెచ్చించి అయినా , దేశం మొత్తం పైనా ఒక స్వతంత్ర " సి . బి . ఐ . (CBI) ని ఏర్పాటు చేయాలి . దీనిలో రాష్ట్రాలలోని అన్ని " సి ఐ డి " , ఏ సి బి " విజిలెన్స్ , ఎన్ఫోర్స్ మెంట్ మొదలైన అన్నిటిని , దీనిలో కలిపి వేయాలి . దీనిపై రాజకీయ నాయకుల ఆజమాయిషీ ఉండ కూడదు . ( ఎలక్షన్ కమీషన్ లాగ ) , ఒక వేల దీనిని ఏర్పాటు చేయ పోతే , ప్రధాని నిర్ణయం , ప్రజల ఇంత శ్రమ , మేధావుల ఆలోచనలు బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి .
02. దీనికి తోడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి , 90 నుండి 180 రోజులలో అవినీతి కేసులను పూర్తి చేయాలి .
03. డిసెంబర్ 30, 2016 తరువాత , పూర్తిగా ఆధారాలు ఉన్న నల్ల కుబేరులపై , నిష్పక్ష పాతంగా , సర్దార్ వల్లబ్ భాయి పటేల్ స్పూర్తితో " సర్జికల్ స్ట్రైక్ జరుగాలి ". అప్పుడే ప్రజలకు ప్రభుత్వ నిర్ణయాలపై , ప్రకటనలపై నమ్మకం , విశ్వా సం ఏర్పడుతుంది .
04. "బ్యాంక్ అప్పుల ఎగవేత దారులపై , పన్ను ఎగవేత దారులపై సర్జికల్ స్ట్రైక్ జరగాలి ".
05. దేశంలోని బ్యాంకులలో , పోస్టాఫీసులలో , ఇన్సూరెన్సు కంపెనీలలో , ఫైనాన్స్ కంపెనీలలో , పి . ఎఫ్ . సంస్థలలో , పేర్కొని పోయిన " ఆన్ క్లైమ్డ్ నిధులు " ( UN CLAIMED DEPOSITS) సుమారుగా 56 వేల కోట్లు ఉన్నట్లు అంచనా . డిపాజిట్లు చేపించుకునేటపుడు , పేరేమియమ్స్ కట్టించుకునేటప్పుడు , ప్రజల , ఉద్యోగస్తుల అన్ని వివరాలు , పేర్లు , అడ్డ్రస్ , సెల్ నెంబర్స్ , బ్యాంక్ అక్కౌంట్ నెంబర్స్ అన్నీ తీసుకుంటారు . అదే సొమ్మును డిపాజిట్ దారులకు , ఉద్యోగస్తులకు , పాలసీ హోల్డర్లకు చెల్లింపులు చేయాల్సి వచ్చినప్పుడు వారి వద్ద ఏ వివరాలు ఉండవు . డిపాజిట్ల గురించి గుర్తున్న వారిని రెండు మూడు నెలలు త్రిప్పుతారు 99 డాక్యుమెంట్లు అడుగుతారు .
ఉదా : పి . ఎఫ్ . క్లెయిమ్ కోసరం , ఫామ్ C సర్టిఫికెట్ తీసుకుని ఒకరు వెళ్తే ( 58 సం . రాలు దాటిన వారు ) వారు సబ్మిట్ చేయమని సూచించిన డాక్యుమెంట్లు (1) అప్లికేషన్ పూర్తి వివరాలతో సంతకాలతో , పుట్టుమచ్చలతో సహా మరియు గత ఎంప్లాయర్ సంతకం , వారి డిజిగ్నేషన్ ముద్ర , కంపెనీ ముద్ర లేదా బ్యాంకు మేనేజర్ సంతకాలు , వారి డిజిగ్నేషన్ , బ్యాంకు ముద్ర . (2) 10 రూ . ల స్టాంప్ పేపరు పై , ఎక్కడా ఉద్యోగం చేయడంలేదని అఫిడవిట్ వారి ప్రొఫార్మాలోనే . (3) అఫిడవిట్ ను నోటరైజ్ చేపించాలి . (4) ఆధార్ కార్డు జిరాక్స్ మరియు దానిపై సంతకం . (5) బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ కాపీ మరియు దానిపై కంపెనీ యజమాని గాని , బ్యాంకుమేనేజర్ సంతకం మరియు వారి ముద్ర . (6) మూడు పోస్ట్ కార్డు సైజు ఫామిలీ గ్రూప్ ఫోటోలు మరియు వాటి వెనుకాల కంపెనీ యజమాని గాని లేదా బ్యాంకు మేనేజర్ సంతకాలు మరియు వారి ముద్రలు కంపల్సరీ . (7) వరిజినల్ ఇ. పి . ఎస్ . స్కీమ్ సర్టిఫికెట్లు . వీటిల్లో ఏది మిస్సయినా ఇక అంతే సంగతులు . నెలకొద్దీ త్రిప్పడమే . ఈ వ్యవస్థలు ఎప్పుడు బాగు పడుతాయి . అప్లికేషన్ ఫామో లేదా తెల్ల కాగితం మీదనో పి . ఎఫ్ . నెంబర్ వేసి అర్జీ పెట్టుకుని , దానితో స్కీమ్ వర్జినల్ సర్టిఫికెట్స్ , ఆధార్ కార్డు జిరాక్స్ , ఒక వేల బ్యాంక్ వివరాలు లేక పోతే పాస్ బుక్ జిరాక్స్ ఇస్తే , రెండు మూడు రోజులలో వారి అకౌంటుకు క్రెడిట్ ఇచ్చి వేయాలి . అలా చేయరు . ఇక మరిచి పోయిన , చని పోయినా , వారి వివరాలు కుటుంభ సబ్యులకు తెలియవు కాబట్టి , వారి కుటుంబాలకు చిల్లి గవ్వ కూడా అందదు . వారి కుటుంబాల గురించి వాకబు కూడా చేయరు . ఎలా అవాయిడ్ చేయాలనే చూస్తారు .
ఆ విధంగా పేరుకుపోయిన సొమ్ము నేడు సుమారుగా 56 వేల కోట్లు ఉందని అంచనా . అందుకని దీనిపై " సర్జికల్ స్ట్రైక్ " జరగాలి .

06. " విదేశీ నల్లధనంపై సర్జికల్ స్ట్రైక్ జరగాలి ". విదేశీ నల్లధనాన్ని రికవరీ చేయాలి .
07. దేశం లోని భూమిని అంతా మ్యాపింగ్ చేయాలి . మొదట మినిమమ్ చార్జీలతో రిజిస్టర్ చేయించుకునే విధంగా అవకాశం కల్పించాలి . ఆ తరువాత బినామీ ఆస్తులన్నిటిని రద్దు చేసి , ప్రతి పేద కుటుంబానికి రెండు గదులు గల ఒక నివాస గృహాన్ని కేటాయించాలి .
08. మరల బ్లాక్ మనీ అక్యుమ్యులేట్ అయ్యాక , సరియైన సమయంలో రూ . లు . 2,000/- నోట్లను రద్దు చేసి రూ . లు . 250/- నోట్లను జారీ చేయాలి . సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవాలి .
09. 1947 లో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి రిజర్వేషన్స్ కారణంగా పెదాలు పేదలుగానే ఉండిపోతున్నారు . ధన వంతులు మరింత ధన వంతులుగా ఎదుగు తున్నారు . స్వాతంత్య్రం వచ్చి 70 సం . రాలు . దాటినా అవే రిజర్వేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి . నేడు అన్ని కులాల్లో , అన్ని మతాల్లో , అన్ని ప్రాంతాల్లో పేద ప్రజలు ఉన్నారు . అందుకని కులాన్ని బట్టి , మతాన్ని బట్టి , ప్రాంతాలను బట్టి కాకుండా , వారి ఆర్ధిక పరిస్థిని బట్టి రిజర్వేషన్లు ఉండే విధంగా " రిజర్వేషన్స్ పై సర్జికల్ స్ట్రైక్ " జరగాలి .
10. ప్రతి ఒక్కరికి ఆధార్ నెంబరులాగా , పాన్ నెంబర్ లాగా " ఒకే సెల్ నెంబర్ " ఉండే విధంగా సర్జికల్ స్ట్రైక్ జరుగాలి .
11. ప్రతి ఒక్కరికి ఆధార్ నెంబరులాగా , పాన్ నెంబర్ లాగా " ఒకే బ్యాంకు అకౌంట్ నెంబర్ " ఉండే విధంగా సర్జికల్ స్ట్రైక్ జరుగాలి .
12. "ఆన్ లైన్ మోసాలు జరుగ కుండా , కంప్యూటర్లలో వైరస్ చొరబడి కుండా సర్జికల్ స్ట్రైక్ జరుగాలి ".
13. "పేద మధ్య తరగతి ప్రజల నిరక్ష రాస్యత పై , అనారోగ్యాలపై , ఆర్ధిక స్థితి గతులపై సర్జికల్ స్ట్రైక్ జరగాలి ". రికవరీ చేసిన నల్ల ధనాన్ని , ప్రతి ఒక కుటుంభం అకౌంట్లో 2,50,000/- డిపాజిట్ చేయాలి . ఒకవేల ఇప్పటికే , పేదల అకౌంట్లలో , నల్లకుబేరులు డిపాజిట్ చేస్తే , ఆ మొత్తాన్ని వారికే చెందే విధంగా చట్టం తేవాలి .
14. " ఫేక్ ప్రకటనల (ADVERTISEMENTS) పై సర్జికల్ స్ట్రైక్ జరగాలి " . ప్రజల అవసరాలను , అవకాశాలను , వారి బలహీనతలను, ఆసరాగా చేసుకుని చిన్నా పెద్దా కంపెనీలు , ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా విపరీతంగా ప్రకటనలు (ADVERTISEMENTS) గుప్పిస్తూ , ప్రజలను రెచ్చగొడుతున్నారు . ఒక వస్తువు పనికి వచ్చినా , పనికి రాకపోయినా , అవసరం ఉన్నా , అవసరం లేక పోయినా , వారు టెంప్ట్ అయ్యేవిధంగా , కలర్ ఫుల్ గా , హాస్యోక్థముగా ప్రకటనలు చేసి , ప్రజల సొమ్ముకు , జేబులకు చిల్లులు పెడుతున్నారు . వారి పొదుపుకు గండీ పెడుతున్నారు . ఒక కొత్త వస్తువు మార్కెట్ లోకి వచ్చి నప్పుడు , దాని ఉపయోగాలు మరియు దానిపై అవగాహన మాత్రమే కల్పించాలి గాని , అవసరం ఉన్నా , లేకపోయినా , అది పనికి వచ్చినా , పనికి రాక పోయినా , ఖచ్చితంగా కొనే విధంగా ప్రేరేపించ కూడదు . మరియు ఆ వస్తువులు మనుష్యులకు గాని , పర్యావరణానికి గాని హాని కలిగించ కూడదు . ఆ వస్తువు లు ప్రజలకు ఉపయోగ పడక పోయినా , హాని కలిగించినా , కంపెనీలు పది రెట్ల నష్ట పరిహార వాగ్ధానం చేయాలి . ఒక వస్తువు కొంటే మరో వస్తువు ఉచితం అన్నా కూడా , ఆయా ఉచిత వస్తువుల వలన నష్టం కలిగినా , నష్ట పరిహారం పది రెట్లు చెల్లించే విధంగా వాగ్ధానం చేయాలి . ఉదా : పలానా క్రీమ్ వాడితే 6 వారాల్లో తల తలా మెరుస్తారు అని ప్రకటనలు గుప్పిస్తారు . 10 వారాలు వాడినా తల తలా మెరువకపోతే , ఎక్కడైతే కొన్నారో , ఆ షాప్ లోనే పది రెట్ల డబ్బు చెల్లించే విధంగా కట్టడి చేయాలి . పలానా పేస్టు వాడితే పండ్లు తల తలా మెరుస్తాయి అని ప్రకటనలు చేస్తే , అవి వాడిన ప్రజలకు , పండ్లు మెరువక , పాసు పండ్లుగా మారినా లేదా పండ్లు ఊడి పోయినా , దానికి పది రెట్లు సొమ్ము మరియు నష్ట పరిహారం చెల్లించే విధంగా నియమ నిభందనలు ఉండాలి . అలానే సబ్బులు , నూనెలు , కాస్మొటిక్స్ , హెల్త్ కేర్ ఐటమ్స్ , బట్టలు , అన్ని రకాల మందులు , వజ్రాలు , రుద్రాక్షలు , ఆభరణాలు మొదలైనవి .
15. నియంత్రణ లేని , ట్రస్టులపై , స్వచ్ఛంధ సంస్థలపై , మిషనరీలపై ,ఫౌండేషన్లపై , దేవాలయ నిధులపై " సర్జికల్ స్ట్రైక్ " జరగాలి .

16. మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు , లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పినట్లు , దేశానికి వెన్నెముకైన గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలి . వ్యవసాయానికి , పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి .
17. ప్రజలకు ఉపాధి కల్పించి ఉత్పాదకతను పెంచాలి గాని , ప్రజలను , ఓటు బ్యాంకు కోసమని , పేదలను బిక్ష గాండ్లుగా మార్చ కూడదు .
No comments:
Post a Comment