Friday, November 18, 2016

DEMONETISATION రూ .లు . 500/- , 1,000/- నోట్ల రద్దు వలన ప్రజలకు ఏర్పడుతున్న రద్దీ మరియు నేడు ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలకు పరిష్కారమేమిటి ( SOLUTIONS TO FINANCIAL PROBLEMS)? బ్యాంకులలో రద్దీ ఎలా తగ్గించాలి ? ప్రధాన మంత్రి గారు సడన్ గా తీసుకున్న నిర్ణయం సరియయినది అని ప్రజలకు నమ్మకం ఏర్పడాలి అంటే ఏమి చేయాలి ?

ప్ర : రూ .లు . 500/- , 1,000/- నోట్ల రద్దు వలన   ప్రజలకు ఏర్పడుతున్న రద్దీ  మరియు   నేడు  ఎదుర్కొంటున్న  ఆర్ధిక  సమస్యలకు పరిష్కారమేమిటి ( SOLUTIONS TO FINANCIAL PROBLEMS) ?  బ్యాంకులలో రద్దీ ఎలా తగ్గించాలి ? ప్రధాన మంత్రి గారు  సడన్ గా  తీసుకున్న నిర్ణయం  సరియయినది  అని  ప్రజలకు నమ్మకం ఏర్పడాలి అంటే ఏమి చేయాలి ?

జ :  ఇది  సుమారుగా 127 కోట్ల  జనాభాకు  సంభందించిన  వ్యవహారం. నీతికి అవినీతికి మధ్య పోరాటం .  అంతే కాకుండా, రహస్యాన్ని  మెయింటేన్  చేయాల్సిన అవసరం ఉంది . ఎందుకంటే ,   ముందుగా తెలిస్తే  నల్ల కుబేరులు  సర్దుకుంటారు . ఈ కారణంగా ,  మన ప్రధాన మంత్రి గారు   సడన్ గా తీసుకున్న  నిర్ణయం కాబట్టి , ఈ సమస్యకు  పరిష్కారం అంత  సులభం కాదు .తేదీ  08. 11. 2016 న ప్రకటనకు ,  అర్ధ రాత్రి కేవలం  3 , 4 గంటల  సమయముంటేనే , ఆ సమయంలో   300 నుండి 400 కోట్ల  బంగారం కొనుగోలు జరిగిందని  వార్తలు  వచ్చాయి . 


ఏమైనప్పటికి , మనసు పెట్టి  ఆలోచిస్తే  ప్రజలకు  అనేక  పరిష్కార మార్గాలు   దొరుకుతాయి . ఒక సాహసో పేతమైన  నిర్ణయానికి  సహకరించాలన్న  మనసు  ఉంటే , వందలకొద్దీ  ఐడియాలు  మనకు వస్తాయి .  మన  భారత దేశంలో కోట్లాది మంది మేధావులున్నారు . ఒక్కొక్కరి మెదడులో వేలాది ఐడియాలున్నాయి . కానీ వాటిని  సద్వినియోగం లోకి తెచ్చే  సరియయిన నాయకుడు లేడు . దేహానికి  మూలా శంఖ  ఎంత ప్రమాద కరమో  , అలానే  దేశ ప్రగతికి , నల్లధనం , ఫేక్ నోట్స్ అంత కంటే ఎక్కువ ప్రమాద కరమని అర్ధం చేసుకుంటే ,అంతే కాకుండా , దీని వలన  దేశ ఆర్ధిక ప్రగతి , ప్రతిష్ట  ప్రపపంచంలోనే  నెంబర్  వన్  అవుతుందనే నమ్మకం ఉంటే ,  ఈ 52 రోజులు పడే బాధలు , కష్టాలు  కేవలం దూది  పింజల్లా  తేలిపోతాయి . 


అన్ని రకాల మీడియాలలో   చూస్తుంటే  ప్రజలు  కొంత ఇబ్బంది పడ్డట్లు ఫీలయినా , భవిష్య్తతుపై  మరియు  ప్రధాన మంత్రి గారి పై  పూర్తి  నమ్మకంతో ఉన్నారు . సర్దుకు పోతున్నారు . సంతోషంగా  వారి భావాలను వ్యక్త పరుస్తున్నారు . కానీ రెచ్చ గొట్టే వారు  వేయి  కొక్కరు  ఉన్నారు . వీరివలననే  సమస్య మరింత  పెరిగినట్లవుతుంది . 

అయితే  పాత నోట్ల మార్పిడికి, సత్వర  క్రొత్త నోట్ల  చలామనికి  ,  సామాన్య ప్రజల  బాధలను కష్టాలను  తగ్గించడానికి  కొన్ని ఐడియాలు :

01. మొబైల్  బ్యాంకుల ద్వారా , మొబైల్  ఏ. టి. ఎం . ల ద్వారా  ( గట్టి భద్రతతో )  సామాన్య ప్రజల వద్దకే  వెల్లి  పాత నోట్లకు , క్రొత్త  నోట్లను   మార్పిడి చేయాలి .  అది కూడా పరిమిత మొత్తానికే . 

02. బ్యాంకుల   కరస్పాండెంట్ల  ద్వారా  , కనీసం రోజుకు  లక్ష రూపాయలైనా  , ప్రతి  పేద ఇంటికి వెళ్లి  మార్పిడి చేయాలి . 

03. పేర్ల ద్వారా , వీడియోల ద్వారా , ఐ . డి . నెంబర్ల  ద్వారా  , రిపీటెడ్ గా వచ్చే వ్యక్తులను అరికట్టే సాఫ్టువేర్  ను  రూపొందించాలి . వారికి  అవగాహన కల్పించాలి , కౌన్సిలింగ్ చేయాలి .    ( కానీ "ఇంకు గుర్తు"  పెట్ట కూడదు . అలా పెట్టడం వలన , వారు  రోజు వారీగా   డబ్బు  మార్పిడి చేసుకునే హక్కును హరించి నట్లవుతుంది . ఎందుకంటే ఆ "ఇంకు గుర్తు " నెల వరకు పోదు. అంతే కాకుండా  రేపు  యు . పి . లో జరుగబోయే ఎన్నికలమీద ప్రభావం పడుతుంది .  గుర్తు ఉండటం వలన  ఓటు వేసిన వారీగా  , బయటకు నెట్టివేసే  ప్రమాదం ఉంది . ) 

04. బ్యాంకులకు , ఏ . టి . ఎం .లకు  త్వర త్వరగా  , సరిపడా డబ్బును సమకూర్చాలి . బ్యాంకులలో  కొన్నీ అదనపు  కౌంటర్లను ఏర్పాటు చేయాలి .  అన్ని ఏ . టి . ఎం. లు  పని చేసే విధంగా  చర్యలు చేపట్టాలి . అధిక సంఖ్యలో  ఏ.టి . ఎం . లను  ఏర్పాటు చేయాలి .  వాటిని గ్రామాలలో సహితం ఏర్పాటు చేయాలి . ముఖ్యంగా పోస్టాఫీసులు ఈ అవకాశాన్ని  సద్వినియోగం  చేసు కోవాలి . 

05. ఇప్పటికే  రాష్ట్ర ప్రభుత్వాలు , అనేకమైన  డబ్బు మార్పిడి చర్యలు  చేపట్టింది . వీటి వలన ప్రభుత్వాలకు కూడా  ఆదాయాలు దండిగా సమకూరుతున్నాయి . అయితే  దీనిని  , సమస్యలు సద్దుమనిగేంత  వరకు పెంచుతూ పోవాలి .  ప్రధాని  ప్రధాన  ఆశయం ,  నల్లధనం  తెల్లధనంగా మారాలి , ఫేక్ నోట్లు రద్దు కావలి .  అందుకని  సమయం పొడిగించడం వలన ,  ప్రధాని ఉద్దేశ్యాలకు ఎలాంటి ముప్పు వాటిల్లదు . 

06. సామాన్య  ప్రజానీకానికి , సీనియర్ సిటిజన్స్ కు , విక లాంగులకు , ఈ 2,000/- నోట్లు  , పాత నోట్లకంటే  మరింత ఇబ్బందిగా మారిపోయింది . వారికి " పేనం నుండి  పొయ్యిలో పడ్డట్లు " గా  అవుతున్నది . అందుకని  వీరికి బ్యాంకులలో  రూ . లు. 500/- ,100/- , 50/- నోట్లనే అందించే విధంగా ఏర్పాట్లు చేయాలి . లేక పోతే అధికంగా  నిబంధనలకు అనుగుణంగా  ముద్రించాలి .  ఏ.టి. ఎం . లలో  రూ . లు. 2,000/- , 500/- నోట్లనే  పెట్టాలి . దీని వలన  ఎక్కువ స్పెస్  ఆక్యుపై కాదు , ఎక్కువ మందికి చెల్లించ  వీలవుతుంది . తక్కువ సమయం పడుతుంది . 

07. ప్రజలు  రోజూ  విలువైన  సమయాన్ని వృధా చేసుకునే బదులు , డబ్బు అవసరం లేనపుడు , బ్యాంకులలో, పోస్టాఫీసులలో   డిపాజిట్  చేసుకుంటే సరిపోతుంది . సేవింగ్  అకౌంట్ అయితే రూ . లు . 2,50,000/- వరకు , కరెంట్ అకౌంట్ అయితే  12,50,000/-  వరకు , అదే జన్  ధన్  ఖాతాలలో రూ . లు . 50,000/- వరకు  వేసుకోవచ్చు . ఎలాంటి ఇబ్బంది లేదు . ( అది మీ డబ్బయితేనే  సుమా ) . ఒకే సారి 24,000/- డ్రా చేసుకుంటే మళ్ళీ నెల వరకూ  బ్యాంక్  మొఖం చూడ నవసరం లేదు . పెద్ద మొత్తాలు  ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే , చెక్కులు వాడవచ్చు , NEFT/RTGS  , ఆన్ లైన్  నెట్ బ్యాంకింగ్ లను , డెబిట్ , క్రెడిట్ కార్డులను , PAYTM లను వినియోగించుకోవచ్చు .  

08. ప్రతి బ్యాంకు  ముందర  ప్రజలకు , నోట్ల మార్పిడి , డిపాజిట్స్  అవగాహన  కల్పించడానికి , ఉచితంగా ఫార్మ్స్ ఇవ్వడానికి , ఏ జిరాక్స్ లు కావాలో చెప్పడానికి , బ్యాంక్  సిబ్బందిని   లేదా  ఆసక్తి  గల  స్వచ్ఛంధ  యువతీ యువకులను ఏర్పాటు చేయాలి . ప్రజలు లైన్లను వెతుక్కోడానికి , ఎదో ఒక లైనులో నిల బడి తీరా అక్కడికి పోయాక , ఈ లైన్ కాదు  ఆ లైన్ అన్నపుడు , వారి బాధ  వర్ణనా  తీతం. ఆ డాక్యుమెంట్ లేదు , ఈ డాక్యుమెంట్ లేదు అంటే , వారికి ఆ రోజంతా వృథా  అవుతుంది . 

09. రేపు బ్యాంకుల  ప్రజల సొమ్ముతో , ప్రభుత్వ సొమ్ముతో  మరియు  పాత  బకాయిలు  వసూలై , కళ కళ  లాడుతాయి కాబట్టి , మరియు ప్రజలకు బ్యాంకింగ్  అవగాహనా పెరుగుతుంది  కాబట్టి , ప్రజలకు సాధ్యమైనన్ని సదుపాయాలు కల్పించి , వారి మన్ననలను పొందాలి .  ఈ అవకాశాన్ని సద్వినియోగం  చేసుకోవాలి .  

10. బ్యాంకింగ్   అవగాహన  ఉన్న  ప్రజలు  కూడా  పేదలకు  , వృద్ధులకు , వికలాంగులకు , వారి వంతు సహాయాన్ని అందించి , చిన్న చిన్న  మొత్తాల పాత నోట్లకు , క్రొత్త నోట్లు గాని , రూ . లు. 100/- లు , 50/- లు గాని  ఇచ్చి  సహకరించా లి , అలానే  మీరు మీ  లిమిట్  దాట  కుండా ఆ పాత నోట్లను  బ్యాంకులో వేసుకోవచ్చు  లేదా అనేక విధాలుగా  మార్పిడి చేసుకోవచ్చు .  ప్రతి ఒక్కరు ఒక ముగ్గురికి  కనీసం ఒక్కో నోటులో (500/- నోటు కావచ్చు  లేదా 1,000/-నోటు కావచ్చు) సహకరించినా  చాలు . ఈ సమస్యనుండి  సత్వరంగా బయట పడుతాం . 

11. అలానే , పెద్ద నోట్ల రద్దు వలన, నల్ల ధనాన్ని అరికట్టడం వలన , ఫేక్ నోట్ల ను  అరికట్టడం  వలన , అవినీతిని  నిర్ములించడం వలన  కలిగే ప్రయోజనాలను , ప్రతి  సామాన్యుడికి  అర్ధమయ్యే విధంగా , ప్రభుత్వం విస్తృతంగా  ప్రచారం చెయ్యాలి . నమ్మకం కలిగించాలి . అవి ఎలాగంటే , ఉదా : ఒక డాక్టర్ కోర్స్ చదువాలంటే  అసలు 2 లక్షలు ఫీజు . కానీ ఇప్పడు  80 లక్షలు కట్టి చేరుతున్నారు . దాని వలన పేద మధ్య తరగతి వారు వాటిల్లో చేరలేక పోతున్నారు . రేపు ఎవ్వరూ  అలాంటి  నల్లధనం  కట్ట కుండానే  చేర  వచ్చు . డొనేషన్లు ఎక్కడ ఉండవని , బెట్టింగులు , రేస్ కోర్సులు ఉండవని ,  వస్తువుల ధరలు తగ్గుతాయని , ఉద్యోగాలు పెరుగుతాయని , భూముల ధరలు తగ్గుతాయని , వాస్తవాలను  వివిధ  రూపాలలో ప్రచారం చేయాలి . 

12. డబ్బు అవసరాలను  ప్రజలు  తగ్గించుకునే  లేదా వాయిదా వేసుకునే  ప్రయత్నం  చేయాలి .ఎలాగంటే , పొగ త్రాగడం బందు చేయాలి . పొగ త్రాగడం వలన  ఆరోగ్యం చెడుతుంది , మరల  హాస్పటల్ చుట్టూ  తిరిగి  డబ్బు  ఖర్చు చేయాలి . నాన్ వెజ్  తినడం వలన  తొందరగా  ముసలి తనం వస్తుంది . డబ్బు ఖర్చు అవుతుంది . బయట  తిను బండారాలను , ప్లాస్టిక్ కప్పులలో టీ లు , కాఫీలను   త్రాగడం బందు చేయాలి . వీటి వలన  ఆరోగ్యం చెడుతుంది , డబ్బు ఖర్చు అవుతుంది .  కూల్ డ్రింకులను, హాట్ డ్రింకులను త్రాగడం  మాను కోవాలి . వీటి వలన ఆరోగ్యం చెడుతుంది , డబ్బు వృధాగా ఖర్చు అవుతుంది . దగ్గరి ప్రాంతాలకు  నడిచి వెళ్లడం వలన , వ్యాయాయం చేసి నట్లవుతుంది . డబ్బు ఖర్చు కాదు . దూర ప్రాంతాలకు , సాధ్యమైనంత వరకు  బస్సులు , ట్రైన్లను  ఉపయోగించుకోవాలి . ప్రతి దానికి , ఆటో లను , క్యాబులను , కార్లను , టూ  వీలర్లను  వినియోగించు కోవడం వలన , అధిక డబ్బు వృధా అవుతుంది . బేకరీలలో  జంకు ఫుడ్స్ , కేకులను  తినడం  నిలిపి చేయాలి . ఇవి తినడం వలన అనారోగ్య పాలవడం తప్పా  మరేమి ప్రయోజనం లేదు . అందు వలన వీటిని తినడం  బందు చేయాలి . ఈ విధంగా  డబ్బు పొదుపు  చేసుకోవచ్చు . ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చు .  ఇలా మీకు తెలిసినవి ఎన్నో ఉండ వచ్చు .  ఈ విధంగా  డబ్బు అవసరాలను తగ్గించు కోవాలి . పొదుపు పెంచు కోవాలి .  

13. పేదలు , మధ్య తరగతి వారు   డబ్బు విలువ గుర్తించి , డబ్బు కష్టాలు  నెమరు వేసుకుని , పని చేసుకునే శక్తి గల బిక్ష గాండ్లకు  డబ్బులు వేయకండి . వారిని సోమరులుగా  మార్చ కండి . తనకు మాలిన ధర్మం  చేయకండి .  ఒక రూపాయే  రేషన్ షాపులో  ఒక కిలో బియ్యానికి సమానమని  గుర్తు పెట్టుకోండి . ఇక  వాస్తులు , జ్యోతిష్యాలని , రాళ్ళని , రప్పలని , కుజ దోష పూజలని , జపాలని  , వేలకు వేలు , లక్షలకు లక్షలు  దొంగ బాబాలకు , స్వాములకు  దార  పోయకండి . ప్రారబ్ధ ఖర్మల నుండి  ఎవ్వరూ  తప్పించుకోలేరని గుర్తించండి .   మీరు ఎన్ని పూజలు చేసినా  , పెద్ద నోట్ల రద్దును వెనక్కి తీసుకోరు . 

14. వీటికి తోడు , వెంట వెంటనే , పూర్తి ఆధారాలు  ఉన్న  నల్ల కుబేరులపై , పన్నులు ఎగ్గొట్టిన వారిపై  , బ్యాంకుల అప్పులను ఎగ్గొట్టి  తిరుగుతున్న వారిపై , చర్యలు చేపట్టాలి .  అలానే పెద్దనోట్లు రద్దు చేసిన  తరువాత , నిబంధనలను అతిక్రమించిన వారిపై  చర్యలు ప్రారంభించాలి . అప్పుడే  పేద మధ్య తరగతి  ప్రజలకు , నిజాయితీ పరులకు  ప్రధానిపై, కేంద్ర ప్రభుత్వంపై   నమ్మకం ఏర్పడుతుంది .   

15. అలానే  మీకు వచ్చిన   ఆలోచనలను  , ఉపాయాలను   కూడా  అమలు చేయ వచ్చు , బయటి ప్రపంచానికి తెలియ జేయ వచ్చు .  పది మందికి తోడ్పడ   వచ్చు . 

"సర్వే జన : సుఖినో భవంతు " 

No comments: