ప్ర : "నగదు రహిత వ్యవస్థ" (CASH LESS SOCIETY) కోసం సలహాలు ఏమిటి ?
జ : "నగదు రహిత వ్యవస్థ" (CASH LESS SOCIETY) కోసం అనేకమైన సలహాలను చెప్పు కోవచ్చు . అందులో ముఖ్యమైనవి,
01. ముందుగా ప్రజలలో" ఆర్ధిక క్రమ శిక్షణ" ను ప్రోత్సహించాలి . మితిమీరిన కోరికలను తగ్గించుకునే విధంగా వారిని సిద్ధం చేయాలి . (MUST PREPARE THE PEOPLE TO FINANCIAL PLAN AND TO REDUCE THE ABNORMAL DESIRES).
02. వృధా ఖర్చులను తగ్గించుకునే విధంగా మరియు పొదుపును పెంపొందించుకునే విధంగా ప్రజలను మోటివేట్ చేయాలి . ఆ విధంగా నగదు వాడకాన్ని / చలామనిని తగ్గించాలి.
03. ప్రభుత్వమే సరిపడే అన్ని "ప్లాస్టిక్ టోకెన్స్" తయారు చేసి ప్రజలకు పంపిణీ చేయాలి . "ప్లాస్టిక్ టోకెన్స్" రూ . లు .20/-, 10/-,5/-, 2/- మరియు 1/- డినామినేషన్లలో తయారు చేయాలి . వాటిపైన క్లియర్ గా " ON DEMAND WE WILL PAY RS.---- TS" అని ముద్రించాలి . వీటిని సరఫరా చేయడానికి , ప్రతి ప్రభుత్వ సంస్థ వద్ద ( ఉదా ; RTC, GHMC, MEE SEVA, ELECTRICITY DEPT., GOVT. HOSPITALS ETC.,) స్వైపింగ్ మెషన్లను ఏర్పాటు చేయాలి . అక్కడ అవసరమైన వారు కార్డును స్వైపింగ్ చేసి టోకెన్స్ తీసుకునే విధంగా మరియు వద్దనుకున్నపుడు టోకెన్స్ వాపస్ చేసి నగదు తీసుకునే విధంగా లేదా బ్యాంకు అకౌంటుకు గాని పోస్టాఫీస్ అకౌంటుకు గాని జమ చేసే విధంగా ఏర్పాటు చేయాలి . ఈ "ప్లాస్టిక్ టోకెన్స్" ను అన్ని చోట్ల ఆక్సెప్ట్ చేసే విధంగా ( బస్సులలో , కిరానా షాపుల్లో , పాన్ షాపులలో , కూరగాయల మార్కెట్లో , పాలు అమ్మే చోట ) , ప్రభుత్వం సర్క్యులర్ ను విడుదల చేయాలి .
04. గ్రామాలలో పూర్వీకుల కాలం నాటి "బార్టర్ విధానం " (BARTER SYSTEM) ను ప్రోత్సహించాలి . "బార్టర్ విధానం " అనగా , ఒకరి వస్తు సేవలను వాటి విలువ ఆధారంగా , మరొకరి వస్తు సేవలతో మార్పిడి చేసుకోవడం అన్న మాట . ఉదా : A అనే వారికీ 1కె జి . బెండకాయలు కావలి . అవి B వద్ద ఉన్నాయి . B వాటి విలువకు సమానంగా పావు శేరో , అద్ద శేరో వడ్లో , జొన్నలో తీసుకుని బెండ కాయలు ఇస్తారు . అలానే సేవలు . ఈ రోజు మీరు మాకు పనికి వస్తే , మీకు అవసరమైనప్పుడు మేము మీకు పనికి వస్తాము . ఇలా అనేక మైన వాటిని నగదు లేకుండా అవసరాలు తీర్చు కోవచ్చు .
05. రేషన్ షాపులలో , "బయో మెట్రిక్ సిష్టం " ద్వారా అంటే వేలు ముద్రల ద్వారా , వారి బ్యాంకు అకౌంటుకు లేదా పోస్టాఫీస్ అకౌంటుకు డెబిట్ అయ్యే విధంగా చేయాలి . ఇది విజయం కావాలంటే , రేషన్ కార్డు లు ఉన్న వారందరికి విధిగా బ్యాంకు అకౌంట్ ఉండాలి . అలానే ఆధార్ కార్డు ఉండాలి . దీనికి బ్యాంకు అకౌంట్ కు లేదా పోస్టాఫీస్ అకౌంటుకు లింక్ చేసి ఉండాలి . రేషన్ కార్డులోని సభ్యులే రేషన్ షాపుకు వెళ్ళాలి . బ్యాంకు అకౌంట్ లేదా పోస్టాఫీస్ అకౌంటుకులో బ్యాలెన్స్ ఉండాలి . మెషన్లో అకౌంట్ నెంబర్ టైపు చేయగానే బ్యాలెన్స్ తెలిసే విధంగా వ్ సాఫ్ట్ వేర్ తయారు చేయాలి . అలానే డెబిట్ అయినా తరువాత , దానికి సంభందించిన రసీదు వచ్చే ఏర్పాట్లు చేయాలి . లేదంటే మిస్యూజ్ అయ్యే అవకాశం లేక పోలేదు .
06. గ్రామాలలో ని పోస్టాఫీసులను బలోపేతం చేయాలి . ప్రతి పోస్టాఫీసులో ఎస్ . బి . అకౌంట్లు తెరిచే విధంగా ఏర్పాటు చేయాలి . ఏజెంట్లను దరి చేయ నీయ రాదు . ప్రతి పోస్టాఫీసులో ఒక స్వైపింగ్ మెషిన్ ను ఏర్పాటు చేయాలి . పోస్టల్ చార్జీలను చెల్లించడానికి డబ్బు పొదుపు చేసుకోడానికి , మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి వీలవుతుంది .
07. నమ్మకమైన ప్రజలకు కిరానా షాపుల వారు , కూరగాయలు అమ్మే వారు , ఇతర వస్తువులు అమ్మే వారు నెల అంతా ఉద్దెర (CREDIT) ఇచ్చే ఏర్పాట్లు చేసుకుని , నెల తరువాత లేదా జీతం వచ్చిన తరువాత డెబిట్ కార్డు ద్వారా లేదా చెక్కు ద్వారా పేమెంట్ చేయవచ్చు . నమ్మకం లేని ప్రజలు అంటే తెలియని వ్యక్తులు కావచ్చు , డబ్బు ఎగ్గొట్టే వారు కావచ్చు , అలాంటి వారు ముందు గానే డెబిట్ కార్డు ద్వారా వారి వద్ద బ్యాలెన్స్ పెట్టి లేదా ఒకే సారి నెల మొత్తం సామాను తీసుకుని డెబిట్ కార్డు ద్వారా చెల్లించి లేదా చెక్కు ఇచ్చి కొనుక్కోవచ్చు . ఎక్కడా నగదు అవసరం ఉండదు .
08. అన్ని భాషలలో మొబైల్ పేమెంట్ విధానం , స్వైపింగ్ మెషిన్లను , పి.ఓ.ఎస్. మెషిన్లను , ఈ . వ్యాలెట్స్ ను విస్తృతంగా అందుబాటులోకి తీసుకుని రావాలి . ప్రజలకు మొబైల్ బ్యాంకింగ్ అవగాహనపై ట్రైనింగ్ ఇవ్వాలి . మోసాలు జరుగకుండా ఏర్పాటు చేయాలి . ఇంటర్నెట్ ను , కరెంటును నిరంత రాయంగా సరఫరా అయ్యేట్లు చూడాలి .
09. సాధారణంగా గ్రామీణ ప్రజలకు బస్తా నిండా బియ్యం , కుండా నిండా నీరు మరియు చేతిలో నగదు ఉంటె , వారు ఎంతో ధైర్యంగా (భద్రతగా ) ఫీలవుతారు . అలాంటిది చేతిలో నగదు లేక పోయే సరికి వారికి అభద్రతా భావం ఏర్పడుతుంది . అందుకని , నగదు రహిత విధానం వలన మనకే ప్రయోజనం అని, బ్యాంకులో ఉండడం వలన మీ డబ్బుకు పూర్తి భద్రత ఉంటుందని , దానిపైనా సాలుకు 4% వడ్డీ కూడా జమ అవుతుందని, ప్రజలు అర్ధం చేసుకునే విధంగా ( వారి వారి భాషలో) వారికి పూర్తి నమ్మకం కలిగించ గలగాలి .
10. ఉద్యోగులకు వేతనాలను , వృద్ధులకు , వికలాంగులకు మినహా అందరికి పెన్షన్లను , వారి బ్యాంకు అకౌంట్లకే ట్రాన్స్ఫర్ చేయాలి .
11. పరిస్థితులను బట్టి , ఎప్పటికప్పుడు టెక్నోలోజీని ఉపయోగించుకుని మార్పులు చేర్పులు చేస్తూ ఉండాలి .
12. రోడ్ల పైనా , గుడుల వద్ద , బస్సు స్టాప్ లలో , మరెక్కడైనా బిక్ష గాండ్లు లేకుండా , ట్రైన్లల్లో కొజ్జాలు (చెప్పలేనటువంటి చేస్టలతో) , డబ్బులు వసులు చేయ కుండా ప్రభుత్వాలు నిషేధించాలి . వారి వెనుకాల ఉన్న బ్రోకర్లను కట్టడి చేయాలి . నిరు పేదలైన , ఏ ఆసరా లేని వారికి , అంగ వికరులకు , వృద్దులకు ప్రభుత్వమే జీవనోపాధి కలిగించాలి . వసతి కల్పించాలి . ప్రజలు కూడా ఒక్క రూపాయి కూడా వేయ కూడదు . బిక్షాటన వృత్తిని ప్రోత్సహించ కూడదు . నిజంగా వారు నిరు పేద బిక్ష గాండ్లు అయితే , వారిని ఉత్పాదకతకు వినియోగించుకోవాలి గాని , సోమరులుగా తయారు చేయకూడదు . ట్రాఫిక్ కు , పాద చారులకు ఇబ్బంది కలుగ కుండా నిషేధించాలి .
13. గుడులలో , దేవాలయాలలో నగదు వేయడం నిషేధించాలి . ఇప్పడు గుడులు కమర్షియల్ అయినాయి . ధన వంతులు , అధిక డబ్బు ఉన్న వారు డెబిట్ కార్డుల ద్వారా , చెక్కుల ద్వారా , నెఫ్ట్ , ఆర్ . టి . జి . ఎస్ ల ద్వారా చెల్లించ వచ్చు . లేదా ఆన్ లైన్ల ద్వారా చెల్లించ వచ్చు . ఒకరు హుండీలో నగదు వేసే సరికి పేద వారు కూడా వారిని అనుసరించాల్సి వచ్చి జేబులు గుల్లా చేసుకుంటున్నారు . అత్యవసారాలకు చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోతుంది . చిలుకూరు బాలాజీ గుడిలో రూపాయి వేయకున్నా పుణ్యం దక్కినప్పుడు , మన:శాంతి లభించి నప్పుడు , తిరుపతి , ఇతర పెద్ద పెద్ద దేవాలయ హుండీల లో డబ్బు వేస్తేనే పుణ్యం వస్తుందా ? ఇక వీటికి తోడు , కుజ దోషమని , ఆ దోషమని , ఈ దోషమనీ దోచుకునే పద్దతులను , మూఢ నమ్మకాలను పూర్తిగా నిషేధించాలి . టి . వి . ఛానళ్లలో , పేపర్లలో ప్రకటనలు ఇచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయ కుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి .
14. ప్రజలకు బ్యాంకింగ్ పై పూర్తి అవగాహన, భద్రత ఏర్పడే వరకు , నమ్మకం కలిగేవరకు , నగదు వ్యవరాలను కూడా కంటిన్యూ చేయాలి . అది కేవలం ఒక అప్షన్ మాత్రమే . అంతే కానీ, డిజిటల్ సిస్టం ఇప్పుడే మ్యాండేటరీ కాకూడదు .
www.sollutions2all.blogspot.com
www.margamkrishnamurthyideas.blog.com
www.margamkrishanamurthyideas.blogspot.com
14. ప్రజలకు బ్యాంకింగ్ పై పూర్తి అవగాహన, భద్రత ఏర్పడే వరకు , నమ్మకం కలిగేవరకు , నగదు వ్యవరాలను కూడా కంటిన్యూ చేయాలి . అది కేవలం ఒక అప్షన్ మాత్రమే . అంతే కానీ, డిజిటల్ సిస్టం ఇప్పుడే మ్యాండేటరీ కాకూడదు .
www.sollutions2all.blogspot.com
www.margamkrishnamurthyideas.blog.com
www.margamkrishanamurthyideas.blogspot.com
No comments:
Post a Comment