ప్ర . IS IT POSSIBLE TO SAVE THE BANK CHARGES? బ్యాంక్ చార్జీలను తగ్గించు కోవడం సాధ్యమా ?
జ . Yes it is possible to save the Bank Charges. అవును. బ్యాంక్ చార్జీలను తగ్గించు కోవడం సాధ్యమే .
ముందుగా బ్యాంక్ చార్జీలు ఏ అకౌంట్లో పడుతున్నాయి ? ఎలా పడుతున్నాయి ? ఎందుకు పడుతున్నాయి ? ఎప్పడు పడుతున్నాయి ? ఎంత పడుతున్నాయి ,అనలైజ్ చేసుకోవాలి . ఒక్కొక్కరి ట్రాన్సక్షన్స్ ఒక్కోరకంగా ఉంటాయి . వారి వారి అవసరాలను బట్టి , వారి కున్న అకౌంట్లు , డెబిట్ కార్డులు , క్రెడిట్ కార్డులను బట్టి ఒక్కొక్కరి బ్యాంక్ చార్జీలు ఒక్కోరకంగా ఉంటాయి .
బ్యాంకు చార్జీలు తగ్గించుకోవాలని ఆసక్తి ఉంటే ఈ క్రింది వాటిని పరిశీలించ వచ్చు :
01. చాలా మందికి , అనేక మైన బ్యాంక్ అకౌంట్లు ఉంటున్నాయి . అవసరం లేని వాటిని క్లోజ్ చేయండి . దీని వలన ఈ అకౌంట్ కు సంభందించిన , అనగా ATM Card , Debit Card ,Credit Card , SMS , Bank Account Maintenance, Bank statement, With Drawl, Deposit మొదలైనవన్నీ తగ్గి పోతాయి .
02. కొందరు ఒక బ్యాంక్ అకౌంటులో పెద్ద మొత్తం ఉంచి , మిగిలిన అకౌంట్లను పట్టించు కోరు . దీని వలన మినిమమ్ బ్యాలన్స్ తక్కువగా ఉన్న అకౌంట్లలో బ్యాంక్ చార్జీలు పడుతాయి . పట్టించుకోక పోతే మైనస్ బ్యాలెన్స్ కూడా రావచ్చు . అప్పుడు ఆ మైనస్ బ్యాలన్స్ ను డిపాజిట్ చేస్తేనే , బ్యాంక్ అకౌంట్ ను క్లోజ్ చేయడం వీలవుతుంది . అందు వలన , ఎక్కువ మొత్తం ఉన్న బ్యాంక్ అకౌంట్ లో నుండి తీసి , బాలన్స్ తక్కువగా ఉన్న బ్యాంక్ అకౌంట్లలో వేస్తే , మినిమమ్ బ్యాలన్స్ బ్యాంకు చార్జీలు తగ్గి పోతాయి . కాబట్టి తక్షణమే ఉపయోగం లేని మరియు మరిచి పోయిన అకౌంట్లను వెతికి పట్టి క్లోజ్ చేయండి . లేదంటే మైనస్ బ్యాలన్స్ లోకి వెళ్లి పోతుంది . అప్పుడు మైనస్ బ్యాలన్స్ కాళీయర్ చేసే దాక అకౌంట్ క్లోజ్ చేయడం వీలు కాదు . ప్రతి బ్యాంక్ అకౌంట్ కు ' ఆధార్ ' మరియు ' పాన్ కార్డు ' నెంబర్ లింక్ చేస్తారు .( అసలు GST రిజిస్ట్రేషన్ తోటే అన్ని లింక్ అయి పోతున్నాయి ).
03. అనవసరమైన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తగ్గించు కోవాలి . ఒక నెలలో 3 ట్రాన్సక్షన్స్ కంటే ఎక్కువ కాకుండా చూసుకోవాలి . అంతా ఆన్ లైన్లోనే వ్యవహారాలు సాగించాలి . మెయిన్ అకౌంట్ సెల్ నెంబర్ కే ' OTP' నెంబర్ వచ్చే విధంగా ఏర్పాటు చేసు కోవాలి . సాధ్య మైనంత వరకు ప్రతి 15 రోజులకోసారి 'పాస్వర్డ్ ' మార్చు కోవాలి . అలానే స్వంత 'లాప్ టాప్ ' లేదా ' కంప్యూటర్ ' లోనే ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ చేయాలి .
04. సాధ్యమైనంత వరకు హోమ్ బ్రాంచిలోనే నగదు డిపాజిట్ చేయాలి . విత్ డ్రా చేయాలి . దీని వలన బ్యాంక్ చార్జీలు తగ్గించు కోవచ్చు . SBI బ్యాంకులో , ఇతర బ్రాంచులలో డబ్బులు వేసినా , తీసినా, ఒక్కో ట్రాన్సక్షన్ కు 50/- రూ . లు . డిపాజిట్ అయినా అకౌంట్లో కట్ అయి పోతాయి .
05. ఎక్కువ సార్లు ATM లకు వెళ్లకుండా ప్లాన్ చేసుకోవాలి . ప్రతి నెలా కొంత మొత్తాన్ని , అవసరాన్ని బట్టి , పిల్లల లేదా ఫ్యామిలీ బేసిక్ అకౌంట్లకు ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి . అక్కడి నుండి డబ్బులు డ్రా చేసినా . వేసినా , ATM , DEBIT , కార్డులను వదినా చార్జీలు , ఏ బ్యాంక్ అకౌంట్ లోనూ పడవు . అయితే కొన్ని నిభందనలు ఉన్నాయి . అవి ఏమంటే , నెలలో 4 ట్రాన్సాక్ష న్స్ కంటే ఎక్కువ చేయ నీయరు . పది వేల కంటే ఎక్కువ తీయ లేము . లక్ష కంటే ఎక్కువ నిలువ ఉండరాదు . యాభై వేళా కంటే ఎక్కువ ఒకే సారి డిపాజిట్ చేయ వీలు లేదు . కనీస నిల్వ నిబంధన లేదు .
06. అన్ని ఖాతాలు ఉంచాలనుకుంటే , మినిమమ్ బ్యాలన్స్ ఉన్న అకౌంట్లకు , SMS అలర్టులు , ATM , DEBIT ,CREDIT కార్డులను క్యాన్సిల్ చేయాలి . దీని వలన బ్యాంక్ చార్జీలు తగ్గి పోతాయి . నెల కోసారి పాస్ బుక్ ఎంట్రీ చేయించుకుంటే సరి పోతుంది .
07. గ్యాస్ కనెక్షన్ ను మినిమమ్ బ్యాలన్స్ ఉన్న అకౌంట్ కు లింక్ చేయాలి . ఇందులో సబ్సిడీ అమౌంట్ క్రెడిట్ అవుతూ ఉంటుంది . దానిని అలానే ఉంచండి .
08. నగదు రహిత లావాదేవీలను పెంచు కోవాలి .
09. ఇన్సూరెన్స్ అకౌంట్ ను , మెయిన్ అకౌంటుకు లింక్ చేయాలి .
10. బ్యాంక్ అకౌంటులో ఎక్కువ మొత్తము ఉన్నట్లయితే , ఎప్పటి కప్పుడు F.D. లు గాను , R.D లు గాను మార్చు కోవాలి . దీని వలన సేవింగ్ అకౌంట్ కంటే కాస్త ఎక్కువ వడ్డీ వస్తుంది . 15 రోజుల నుండి ఎంత కాలానికైనా F.D. లు చేసు కోవచ్చు . మరల అర గంటలో , కావాలనుకున్నప్పుడు , F.D లను క్యాన్సిల్ చేసి సేవింగ్ అకౌంట్ కు మార్చు కోవచ్చు .
11. అత్యవసర మైనప్పుడు , బ్యాంక్ చార్జీల కంటే ఎక్కువ ఆదాయం వస్తుందనుకున్నపుడు , ఇంట్లో ధైర్యానికి ఉండాలనుకున్నపుడు , బ్యాంక్ చార్జీలు పడినా పెద్ద సమస్య కాదు . అప్పుడు నిరభ్యరంతంగా , బ్యాంకులో కనీస నిల్వ మైంటైన్ చేయ నవసరం లేదు . భయ పడ నవసరం లేదు .
12. ప్రతి ఒక్కరికి పోస్టాఫీస్ లో గాని , పోస్ట్ పేమెంట్ బ్యాంకులో గాని , ఒక అకౌంట్ ఉండటం , అన్నివిధాల శ్రేయస్కరం . చిన్న బ్యాంక్ అకౌంట్ల లాగానే , కనీస నిల్వ నిభందనలు లేవు , పోస్టల్ చార్జీలు ఉండవు . ఒక్కో సారి బ్యాంకులు పని చేయ నప్పుడు , దూర భారమైనప్పుడు , వీటిని ఉపయోగించు కోవచ్చు .
13. అయితే పోస్టాఫీసులు , బ్యాంకులు డబ్బుకు పూర్తిగా భరోసా నిస్తాయి , నమ్మకాన్ని కలిగిస్తాయి , అందులో ఉంచిన డబ్బులు ఎక్కడికి పోవు అని గ్రుడ్డిగా ఎప్పుడూ నమ్మ కూడదు . ' గ్రహ చారం బాగా లేక పోతే , తాడే పామై కరుస్తుంది అన్నట్లు ' , అకౌంటులో ఉన్న డబ్బులు మాయ మయ్యే అవకాశాలు లేకపోలేదు . గతంలో ఒక వ్యక్తి , బ్యాంకులో డబ్బు భద్రంగా ఉంటుందని రూ . లు . 25,000/- , వడ్డీ కూడా కల్సి వస్తుందని హాయిగా కాలం గడుపుతున్నాడు . ఒక విధంగా , బ్యాంకుపై నమ్మకంతో మరిచి పోయాడు కూడా . అకౌంట్ ను రెగ్యులర్ గా ఉపయోగించక పోవడం వలన అది కాస్తా , ఇన్ ఆపరేటివ్ అకౌంట్ గా మారి పోయింది . యేండ్లు గడిచాయి . ఎవరూ అకౌంట్ హోల్డర్ లేడని , ఆ డబ్బులకు కాస్తా రెక్కలు వచ్చి ఎగిరి పోయాయి . అంటే ఎవరో ఒకరిద్దరు కల్సి , ఆ డబ్బులను కాజేశారు . కొన్ని యేండ్ల తరువాత , అసలు అకౌంట్ హోల్డర్ కు అవసరం ఏర్పడి , ఆ డబ్బుల గురించి గుర్తుకు వచ్చి , బ్యాంకులో వాకబు చేశాడు . అప్పుడు బ్యాంక్ వారు అతనికి తెలిపిన విషయం మేమంటే , నీ అకౌంట్ ఎప్పుడో క్లోజయింది . డబ్బులు ఎప్పుడో నీవే డ్రా చేసి ఉంటావు . ఇప్పడు ఆ రికార్డ్స్ కూడా వెంటనే అందుబాటులో లేవు అన్నారు . అప్పుడు అతనికి ఏమి చేయాలో పాలు పోలేదు. ఆ విషయం ఆ నోటా , ఈ నోటా పడి ప్రధానమంత్రి ఆఫీసు వరకు వెళ్ళింది . అక్కడి నుండి ఫోన్ రాగానే , ఆగ మేఘాలమీద , ఆ బ్యాంకు వారు , అతని అకౌంటులో గప్ చుప్ గా , వడ్డీతో సహా మొత్తం డబ్బును జమ చేశారు . ఈ స్టోరీ అంత చదివాక చాలా మందికి ఆ అకౌంట్ హోల్డర్ ఎవరో గుర్తుకు వచ్చే ఉంటుంది ...
ఆ అకౌంట్ హోల్డర్ ఎవరో కాదు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ . అబ్దుల్ కలాం గారు .
ఇక బ్యాంకుల్లో సైబర్ నేరాలు మనకు తెలియనివి కావు . ఈ విధంగా డబ్బు పొదుపు చేసుకుని నష్ట పోయిన ప్రజలు వెలది మంది ఉన్నారు . అందు కనీ ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి . ' అవసరానికి ఉపయోగ పడని పొదుపు, తనకు మాలిన ధర్మం ఎప్పుడూ పనికి రాదు '.
.
www.sollutions2all.blogspot.in