"ప్రకృతి సిద్ధమైనవి, అసాధారణమైన సంఘటనలను , అసాధారణమైన జీవులను మినహాయిస్తే , సాదారణంగా యే సమస్య అయినా మనిషి సృష్టించు కున్నదే . కాబట్టి ప్రతి సమస్యకు ఒక పరిష్కారముంటుంది . లేదా ప్రత్యామ్నాయమైనా ఉంటుంది . సమస్యను పరిష్కరించడం ద్వారా మనకు ప్రయోజనం కలుగుతే దానిని సమస్య అనే కంటే ఇది ఒక " అనుభవం " (Experience) " అవకాశం " (Turning point) అనుకోవడం సరియైనది . ప్రయత్నించి చూడండి. విజయం మీదే . సర్వే జన: సుఖినో భవంతు "
Pages
- Home
- About us
- Privacy Policy
- Disclaimer
- సామాజిక సమస్యలు & పరిస్కారాలు (SOCIAL PROBLOMS & SOLUTIONS)
- వివాహ వ్యవస్థ (MARRIAGE SYSTEM)
- ఎన్నికల సంస్కరణలు (ENNIKALA SAMSKARANALU)
- జ్యోతిష్యం (JYOTHISHYAM)
- Quiz /Puzzles
- AROGYAME MAHABHAGYAM
- బాల గేయాలు
- సీస పద్యాలు -ఛందస్సు - వీడియోలు (SEESA PADYALU - CHANDASSU- VIDEOS)
- ఛందస్సు (CHANDASSU ) - నేర్చుకుందామా !
- షేర్ మార్కెట్ /మ్యూచువల్ ఫండ్స్ (SHARE MARKET & MUTUAL FUNDS)
- కవి పరిచయాలు / INTRODUCTION OF POETS
- జీవిత సత్యాలు / LIFE CHANGING QUOTES / JEEVITHA SATYALU
- ఐడియాలు / టిప్స్ & ట్రిక్స్ (IDEAS / TIPS & TRICKS )
- ఛందస్సు (CHANDASSU ) - నేర్చుకుందామా !
- Sinima Songs -Lyrics / సినిమా పాటల - లిరిక్స్
- Budget 2023
- తెలుగు సాహిత్య ప్రక్రియల వీడియోలు / Sahitya Prakriyala Videos
Total Pageviews
Tuesday, December 19, 2023
రాజకీయ మార్పుల ఆవశ్యకత/ ప్రభుత్వాల మార్పు ఆవశ్యకత
Monday, December 18, 2023
తలసరి అప్పు అప్పు అంటే ఏమిటి? What is mean by per capita Debt?
Tuesday, December 12, 2023
మహిళలకు తెలంగాణా అంతటా ఉచిత ప్రయాణం (FREE BUS TRAVEL TO WOMEN IN TELANGANA
"ఉచితం" అనేది రెండు వైపుల పదునైన ఆయుధం లాంటిది. ఉచితం పేర్లు ఏవైనా అవి కొందరికి మేలు కలిగిస్తే మరికొందరికి సమస్యలను సృష్టిస్తాయి. ఉచితాల వలన ప్రభుత్వానికి కొన్ని లాభాలుంటే, కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ఉచితాల వలన కొన్ని రాష్ట్రాలు, దేశాలు అప్పుల పాలై కుప్ప కూలినవి కూడా ఉన్నాయి.
01. మహిళలకు ఉచిత ప్రయాణం వలన, ఆర్ధిక భారం తగ్గుతుంది. బస్ పాస్ ల డబ్బు, బస్సు చార్జీలు మిగలడం వలన, పేద మహిళలు వాటిని ఇతర ఖర్చులకు పొదుపుగా వాడుకుంటారు.
02. చిరు ఉద్యోగులకు, విద్యార్థినులకు, అనారోగ్యంతో ఉన్న వారు , అడ్డకూలీలకు, దూర ప్రాంతాల వ్యాపారస్తులకు చాలా మేలు జరుగుతుంది.
03. అనారోగ్యంతో ఉన్న మహిళలు, వారి పిల్లలు , 5 సం.లోపు ఉన్న మగ పిల్లలకు కూడా మెరుగైన వైద్యం కోసం పట్టణాలకు వచ్చే వారికి , ఉచిత బస్సు ప్రయాణం ఎంతో ఊరట నిస్తుంది.
04. పాచి పనులు, నర్సు పనులు, ఇతర సర్వీసులు అందించే వారు, ఇంటి కిరాయీలు తక్కువగా ఉన్న చోట నివసిస్తారు. రవాణా చార్జీల భారం భరించలేక, ఆ చుట్టుపక్కలనే, తక్కువ డబ్బులకు పని చేస్తారు.
ఇప్పుడు వారు ఏ ప్రాంతాలలో డబ్బులు ఎక్కువగా ఇస్తారో అక్కడికి వెళ్ళి ఎక్కువ డబ్బు సంపాదించు కోగలరు
05. రవాణా చార్జీల వలన కొందరు, వారి పనులను వాయిదా వేసుకుంటారు. 4, 5 పనులకు కలిపి ఒకేసారి వెలుతారు. ఇప్పుడు అలా పెండింగ్ పెట్టరు.
06. ఏ మీటింగ్ లు ఉన్నా, మహిళలందరు కలిసి, ఎంత దూరమైనా వెళ్ళి పోతారు.
07. విద్యార్ధినులను, ఉద్యోగ మహిళలను స్కూటర్ల పై , కార్లలో డ్రాప్ చేసే , తల్లిదండ్రులకు, భర్తలకు, ఎంతో డబ్బు, సమయం ఆదా అవుతుంది,
08. స్త్రీలకు ఆర్థిక సాధికారత పెరుగుతుంది. స్వేచ్ఛ, ధైర్యం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రయాణాలపై అవగాహన పెరుగుతుంది.
09. మహిళలు, గుళ్ళకు, ఫంక్షన్లకు , విహారాలకు, బంధువుల ఇండ్లకు వెలుతూ ఉండటం వలన ప్రశాంతత లభిస్తుంది.
10. చిన్న చిన్న పనులకు, మగవారు స్కూటర్లపై, కార్లలో వెళ్ళే బదులు, వారి కూతుర్లను, భార్యలను, తల్లులను పంపిస్తారు. దీని వలన ఫ్యామిలీకి అధిక డబ్బు, సమయం ఆదా అవుతుంది.
11. స్త్రీలే అధికంగా వెలుతారు కాబట్టి, బస్సులలో సెక్యూరుడుగా ఫీలవుతారు.
12. దూర ప్రాంతాలని, బస్సు చార్జీల భారం భరించలేక, కొందరు పేద విద్యార్థినిలు, మధ్యలోనే చదువులు మానేస్తున్నారు. అలాంటి వారు ఇప్పుడు చదువుకోడానికి ఆసక్తి చూపుతారు.
13. అంతే కాకుండా రవాణా చార్జీలు భరించలేక కొందరు ఆడ పిల్లలను దగ్గరలోని ఏదో ఒక స్కూల్ లో చదివిస్తున్నారు. ఇప్పుడు వారు ఎంత దూరమైనా మంచి స్కూళ్ళలో చదివించడానికి అవకాశం ఉంది.
14. మరికొందరు పట్టణాలలో, రూములు రెంటుకు తీసుకుని చదవడానికి, ఉద్యోగం చేయడానికి, చాలా డబ్బు ఖర్చు అవుతుంది. రిస్క్ అవుతుంది, సేఫ్టీ ఉండటం లేదు. ఇప్పుడు వారు ఇంటి నుండే పట్టణాలకు వెళ్ళి చదువుకుని లేదా ఉద్యోగం చేసి రాత్రి వరకు ఇంటికి చేరవచ్చు.
15. రవాణా ఖర్చు లేక పోతే అన్ని ప్రాంతాలలో ధరలు తగ్గి పోతాయి.
16. రవాణా చార్జీలు లేక పోవడం వలన, గ్రామీణ ప్రాంతాల మహిళలు, అక్కడ తక్కువ ధరలకు అమ్మే బదులు, పట్టణాలకు వచ్చి ఎక్కువ ధరలకు కూరగాయలు, పండ్లు, పూలు, ఇతర వస్తువులు, మధ్య దళారులు లేకుండా అమ్మకో గలరు.
17. స్త్రీల మూవ్ మెంట్ పెరుగుతుంది. ఇప్పటి వరకు రవాణా చార్జీలు ఉండటం వలన, ఒంటింటి కుందేలు లాగానే ఉండేవారు. ఇప్పుడు అది ఉండదు. అవసరాలు ఉంటే ఎక్కడికైనా వెలుతారు.
19. పర్యాటక రంగం అభివృద్ధి చెందగలదు. దీని వలన ప్రభుత్వానికి పరోక్ష పన్నుల రూపంలో ఆదాయం పెరుగగలదు.
ఇప్పుడు ఇక కొన్ని నష్టాల గురించి తెలుసుకుందాం:
01. మహిళలకు బస్సు చార్జీలు ఉచితమైతే, అది ప్రభుత్వానికి నష్టం. రోజుకి అది సుమారుగా 7 కోట్ల రూపాయలు ఉంటుందని అని ఒక అంచనా
02. బస్సు చార్జీలు ఉచితం కావడం వలన, మెట్రో, ఎంఎం టీఎస్ ట్రేన్లలో ప్యాసెంజర్లు తగ్గిపోతారు. అందువలన వీటికి నష్టం వాటిల్లుతుంది.
03. బస్సులలో ట్రాన్స్ జెండర్స్ కు ఫ్రీ అవకాశం కల్పించారు . వీరిలో ఎవరు నిజమైన ట్రాన్స్ జెండర్సో తెలియదు. బెగ్గింగ్ కొరకు చీరెలు కట్టుకుని ప్రయాణం చేస్తే, మహిళలకు చాలా ఇబ్బంది కరంగా మారవచ్చు.
04. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వలన, ధనవంతులు, ఆదాయ పన్నులు కట్టే వారు, కార్లు, బస్సులు ఉన్న వారు కూడా, ఆర్టీసి బస్సులలో ప్రయాణించడం వలన, ప్రభుత్వానికి అధిక భారం పడుతుంది. అలానే బస్సులలో అనవసరంగా రద్దీ పెరుగుతుంది. దీని వలన స్థోమత గల, ఉద్యోగ భాద్యత గల మహిళలకు అన్ కంఫర్ట్ గా ఉంటుంది.
05. మహిళలకు అధిక భారం పెరుగుతుంది. ప్రతి పనికి, పేద మగవారు, మీకు ఉచితం కదా అని, మద్యానికి , మందులకు, బ్యాంకులకు, షాపింగ్ లకు స్త్రీలనే బయటకు పంపిస్తారు. మగవారు చెసే బయటి పనులన్నిటికీ స్త్రీలనే పంపించడానికి ఆలోచిస్తారు.
06. మొదట సరదాగానే ఉంటుంది. కానీ కొంత కాలం తర్వాత వారు చాలా భారంగా ఫీలవుతారు. ఆ తర్వాత బయట స్నేహాలు పెరిగి, ఇతర వ్యాపకాలకు అలవాటు పడవచ్చు.
07. కుటుంబాలలో, ప్రతి రోజూ ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది. అలాంటి సమస్యలు జరిగినప్పుడు, స్త్రీలు ఇంట్లోనే సర్దుకు పోయే వారు. ఇప్పుడు అలా ఇంటి పట్టున ఉండకుండా, ప్రశాంతత కొరకు అని ఎక్కడికైనా వెళ్ళి పోతారు.
దీని వలన మరిన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంది.
08. బస్సు ప్రయాణం ఉచితమని తిరిగే అలవాటు ఉన్న కొందరు ప్రక్క స్త్రీలను వెంటేసుకుని తిరగడం వలన ఉన్నతమైన మంచి కుటుంబాలలో, భార్యా భర్తల సంబంధాలు, తల్లిదండ్రులు పిల్లల సంబంధాలు దూరమయ్యే అవకాశాలను కొట్టి పారేయ లేము.
09. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం లేక పోలేదు
10. పని ఉన్నా లేకున్నా బస్సులలో ఉచితం కాబట్టి, మహిళలు ప్రయాణించడం వలన, బస్సులలో మహిళల సంఖ్య పెరిగి, ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుంది.
11. ఉచితం అనగానే రద్దీ, దీనికి తోడు, అన్నీ మరిచి, బస్సులలో ఆనందంగా ఉంటారు. దొంగలకు అలాంటి అవకాశమే కావాలి. ఆ కారణంగా బస్సులలో దొంగతనాలు జరిగే అవకాశం లేక పోలేదు.
12. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావడం వలన, ఆటోలకు, వోలా, ఊబర్ లాంటి టాక్సీ లకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. చక్రాలు తిరుగుతేనే వారు ఇ.ఎమ్.ఐలు , పిల్లల ఫీజులు, టాక్స్ లను కట్టగలరు. కుటుంబాలను పోషించుకోగలరు. లేదంటే వారి కుటుంబాలు రోడ్డున పడగలవు.
13. ద్వి చక్ర వాహనాల అమ్మకాలు తగ్గి పోతాయి.
మధ్య దళారులకు నష్టం వాటిల్లుతుంది.
బస్సులు ఉచితం అని ఓ పది మంది మహిళలు కలిసి రెగ్యులర్ గా , గుళ్ళకు, విహార యాత్రలకు తెలంగాణా అంతటా తిరుగు తుంటే, ప్రభుత్వానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణం మరింత ప్రయోజనకరంగా మారాలంటే ఏమి చేయాలి?
ఉచితాలకు అలవాటు పడిన ప్రజలు, హామీ ఇచ్చిన హామీలలో ఏ చిన్న మార్పు చేసినా విరుచుకు పడుతారు. వీరికి తోడు ప్రతి పక్షాలు మరియు విమర్శకులు తోడవుతారు. ఇది సహజం. అయినప్పటికీ,
01. ఆదాయ పన్నులు చెల్లించే వారు, కార్లు, బస్సులు ఉన్న, ధనవంతులైన మహిళలు, వారి పిల్లలు, ఉచితం మాకు వద్దు అనే మహిళలు, వారే స్వచ్చందంగా ఉచిత బస్సులలో ప్రయాణించ వీలు లేకుండా, వారికి ఉచిత కార్డులను ఇష్యూ చేయకూడదు. దీని వలన కొంత వరకైనా ఆటో, టాక్సీ డ్రైవర్ లకు మరియు ప్రభుత్వానికి కొంత మేలు జరుగ గలదు.
02. విద్యార్ధినులకు, ఉద్యోగం కొరకు వెళ్ళే మహిళలకు, చిరు ఉద్యోగులకు, పేద మహిళా కూలీలకు, చిరు వ్యాపారస్తులకు, అర్హులైన ట్రాన్స్ జెండర్స్ కు , మాత్రమే ఫ్రీ కార్డులను ఇష్యూ చేయాలి.
03. ముందుగా, ఇప్పటి వరకు బస్ పాస్ లు కలిగిన మహిళలందరికీ, విద్యార్ధినులందరికీ, ఫ్రీ కార్డులను జారీ చేయాలి. ఆ తర్వాత ఇతర మహిళలకు జారీ చేయాలి.
04. ఆఫీస్, స్కూల్ టైమ్ లలో, అవసరమైన రూట్లలో మహిళలకు స్పెషల్ బస్సులను వేయాలి.
బస్సుల సంఖ్యను పెంచాలి, సమయపాలన పాటించాలి
05. ప్రభుత్వ పాఠశాలలో ఫ్రీ అంటే ఎంత మంది పిల్లలు చదువుతున్నారు. అలానే బస్సులలో ఉచితం అన్నంత మాత్రాన అందరూ బస్సులలో నే వెళ్ళరు . వారి సౌకర్యం, వేగం , సెక్యూరిటీ , ఇంటి వరకు చేరే విధానం చూసుకుంటారు. వీధుల్లోకి, ఇండ్ల వరకు బస్సులు పోవు . ఆటో , టాక్సీ వారు ఇవన్నీ గమనించి, ప్రయాణికులలో మన్నత పెంచు కుంటే, వారి గిరాకీ ఎక్కడికి పోదు. ధరలు తగ్గించి పోటీ పడాలి.
07. గ్రామ ప్రాంతాలకు, పల్లె వెలుగు బస్సులను పెంచాలి
08. ఆర్టీసీకి నష్టం రాకుండా, వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తూ, ఆర్టీసి ఆదాయ వనరులను పెంచాలి.
09. ఆర్టీసీకి నెలకోసారి, మహిళలకు సంబంధించిన చార్జీలను చెల్లించాలి
19. ప్రభుత్వానికి నష్టం కలుగకుండా, టూరిజం , పార్కింగ్స్ అభివృద్ధి చేయాలి. దీని వలన ప్రభుత్వానికి పరోక్ష పన్నుల రూపంలో ఆదాయం పెరుగగలదు.
11. నిజాయితీగా అభివృద్ధి పనులు చేపడుతూ, మెల్లగా మెల్లగా ఉచితాలను తగ్గించడానికి ప్రయత్నాలు చేపట్టాలి. ప్రజలలో చైతన్యం తీసుకు రావాలి. ఇది వ్యవస్థలలోనే రావాలి. ఓటు బ్యాంకు కొరకు ఉచితాలను ఇవ్వాలని పోటీ పడుతున్నారు. ఉచితాలకు అలవాటు పడిన ప్రజలు, ఎవరు ఎక్కువ ఉచితాలు ఇస్తే వారికి ఓటు వేస్తున్నారు. లేదంటే ఇంట్లో నుండి కదలడం లేదు. ఉచితాలను ప్రోత్సహించే వారికి కఠిన శిక్షలు వేసే, ఎన్నికల వ్యవస్థ రావాలి. ఓటర్లకు పంచే డబ్బు, ఏ ప్రాంతంలో పట్టుబడితే, ఆ ప్రాంతంలో అభివృద్ధికే , మొత్తం డబ్బును ఖర్చు చేసే చట్టాలు రావాలి.
Friday, December 8, 2023
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు సలహాలు, సూచనలు
ఏ ప్రభుత్వమైనా, ప్రజల ఆలోచనలను, సూచనలను, సలహాలను తీసుకుంటూ, పరిపాలన సాగిస్తేనే, ప్రభుత్వం పది కాలాల పాటు ఫరిడవిల్లు తుంది. అలానే నాయకులు చరిత్రలో, ప్రజలు గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచి పోతారు .
రాష్ట్రం అప్పుల పాలు కాకుండా, మిగులు నిధులుతో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, అన్ని వర్గాల , అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని వయస్సుల వారు సంతోషంగా జీవిస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే, పాలకులు
ప్రజల సలహాలు, సూచనలు తప్పక పరిశీలనకు తీసుకుంటారని ఆశిస్తున్నాం.
నేడు జీవన వ్యయం అనూహ్యంగా పెరిగింది కాబట్టి, అర్బన్ ఏరియాలో నివసించే వారి వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్న వారిని, అదే రూరల్ ఏరియాలో నివసించే వారి వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉన్న వారిని ఈ 6 గ్యారంటీ పథకాలకు అర్హులుగా పరిగణించాలి. అలాగే తప్పకుండా ఈ 6 గ్యారంటీలను అమలు చేయాలి.
అలానే 5 నుండి 10 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారిని మధ్యతరగతి గాను పరిగణించాలి.
అర్హులైన వారికి ఈ 6 గ్యారంటీలను అమలు చేయడం సాధ్యమా అంటే , ఖచ్చితంగా సాధ్యమే.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి, అవినీతి సొమ్మును రికవరీ చేస్తూ, భూకబ్జాలను తిరిగి రాబట్ట గలుగుతే, భూసీలింగ్ లను అమలు చేసినట్లయితే, అవినీతి పథకాలను అరికట్టి నట్లయితే, తక్షణమే ధరణి పోర్టల్ ప్రక్షాళన చేపడితే ఈ 6 గ్యారంటీలు కచ్చితంగా సాధ్యమవుతాయి. సులభంగా అమలు జరుగుతాయి కూడా.
01. మహాలక్ష్మి పథకం ద్వారా, అర్హులైన మహిళలకే, ప్రతినెలా 2500 రూ.లు ఇవ్వాలి. ఆదాయ పన్నులు కట్టే వారికి, కార్లు, లారీలు, బస్సులు ఉన్న కుటుంబాల మహిళలకు వర్తింప చేయకూడదు. ప్రతి కుటుంబానికి 500 రూ.లకే గ్యాస్ సిలిండర్ తప్పక ఇవ్వాలి, మహిళలకు తెలంగాణా అంతటా ఆర్టీసి బస్సులలో ఉచిత ప్రయాణం అమలు చేయాలి. అయితే చాలా బస్సు రవాణా సౌకర్యాలు లేవు. అలాంటి రేట్లను గుర్తించి బస్సులను నడుపాలి. ఇప్పటి వరకు ఆయా రూట్లలో, ఆటోలు, క్యాబ్ లో పైన ఆధారపడాల్సి వస్తున్నది. మరో విషయం, ఉచిత ప్రయాణం కాబట్టి మహిళలు ఎక్కువగా ప్రయాణం చేయడం జరుగుతుంది. కాబట్టి, రద్దీ ఉన్న రూట్లను గుర్తించి, మహిళలకు సెపరేట్ బస్సులను వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
02. రైతు భరోసా పథకం ద్వారా, ప్రస్తుతం ఉన్నటువంటి, రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలి. ఆ తర్వాత 10 ఎకరాల లోపు మాగాణి భూమి ఉన్నవారికి, 15 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న వారికి మాత్రమే రైతు రుణమాఫీ వర్తింప చేయాలి.
03. అలానే రైతు బంధు పథకం 10 ఎకరాల లోపు మాగాణి భూమి, 15 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న వారికే వర్తింప చేయాలి. మైనింగ్ భూములకు, గుట్టలకు, కాలేజీల భూములకు, బీడు భూములకు, భూస్వాములకు రైతు బంధు పథకం, రుణమాఫీ వర్తింప జేయకూడదు. ఇక పోతే,
భూమిని సాగు చేసేది, భూమిని అభివృద్ధి చేసేది , రైతుల భూమిని కాపాడేది , రేయింబవళ్ళు కష్టపడేది, పంట పండినా, పండక పోయినా, గిట్టుబాటు ధర దొరకక పోయినా భరించేది , పంటలను పండించేది కౌలు దారులు కాబట్టి , కౌలు దారులకు సం.రానికి 15000 రూ.లు (రెండు దఫాలుగా) ఇవ్వాలి.
ఒక వేళ రైతులే పంటలు పండిస్తే, రైతులకే రైతు బంధు , రుణమాఫీ వర్తింప చేయాలి.
04. అలానే మీరు ఇచ్చిన గ్యారంటీల ప్రకారం వ్యవసాయ కూలీలకు సం. రానికి 12000 రూ.లు ఇవ్వాలి . కూలీలు అంటే రైతు బంధు రాని వారు మాత్రమే కూలీలు. కూలీలకు ప్రత్యేక కార్డులను జారీ చేయాలి. , ప్రతి వరి పంట క్వింటాల్ కు 500 బోనస్ అది రైతులు కావచ్చు, కౌలు దారులు కావచ్చు ఇవ్వాలి. అలాగే, రైతులకు నాణ్యమైన ఎరువులను, సమయానికి పంపిణీ చేయాలి. నీరు విద్యుత్ సమృద్ధిగా అందించాలి. పండిన పంటలు నిల్వ చేసుకోడానికి, ప్రతి మండలంలో గిడ్డంగులను నిర్మించాలి. పండిన పంటకు ,మధ్య దళారులు లేకుండా, గిట్టుబాటు ధరను కల్పించాలి. రైతులు పండించే పంటలపై, అమ్మకాలపై రైతులకే/ కౌలు దారులకే పూర్తి స్వేచ్ఛ ఉండాలి.
05. గృహ జ్యోతి పథకం ద్వారా, పేద, మధ్య తరగతి వారికి మాత్రమే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలి. దీనికి , గత సంవత్సరం వినియోగించిన ఆవిరేజ్ యూనిట్లను బేస్ చేసుకుని , కొంత పర్సెంట్ యూనిట్లను అదనంగా కలిపి, ఎల్జిబిలిటీని నిర్ణయించాలి. ఆపై వినియోగించిన వారికి బిల్లులు వేయాలి. అందరికీ ఉచితం అనగానే సాధారణంగా, విద్యుత్ బంధు చేయాలని, పొదుపుగా వాడుకోవలనే ఆలోచన ఉండదు. దీని వలన ప్రభుత్వంపై భారం అధికంగా పడుతుంది. కరెంట్ వాడకం పై సామాజిక బాధ్యతను పెంచాలి.
06. ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా, భూకబ్జాలను గురైన భూములను సేకరించి, అర్హులైన పేదలకు, మధ్య తరగతి వారికి మాత్రమే ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలి. ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు దశల వారీగా ఇవ్వాలి.
ఇండ్లు లేని వారు , వారే ఇండ్లు కట్టుకుంటానంటే 100 గజాలు ఉచిత స్థలాన్ని ఇవ్వాలి. ఇండ్లు లేని జర్నలిస్టులకు, కళాకారులకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలి.
ఉద్యమకారులకు గ్యారంటీలో చెప్పిన ప్రకారం 250 గజాలు ఇండ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వాలి.
మరి కొందరు ఇండ్లు లేని వారికి , డబ్బు మేము కూడా చెల్లించగలం అనేవారికి, సబ్సిడీతో 10 లక్షల లోపు ఇండ్లు నిర్మించి ఇవ్వాలి. పూర్తిగా ప్రభుత్వం పైననే భారం పడకుండా, ఇలా ప్రజల భాగస్వామ్యంతో, అందరికీ ఇండ్లు సమకూరే అవకాశం ఉంటుంది. అలానే, ఆల్రెడీ ఇండ్లు ఉన్న వారికి , ఇండ్లు గానీ, ఇంటి స్థలం గానీ, ఇండ్లు నిర్మించు కోడానికి డబ్బు గానీ ఇవ్వ కూడదు.
07. యువ వికాసం పథకంలో మీరు ఎలాగో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావించ లేదు. దానికి బదులుగా ముఖ్యమైన ప్రాంతాలలో , ఉద్యోగం వచ్చే వరకు, ఉచిత స్కిల్స్ డెవలప్ మెంట్ కోచింగ్ సంస్థలను ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక యువతీ యువకులకు ఉచిత వసతి , ఉచిత భోజనం కల్పించాలి. ప్రతి మండలంలో ఒక కోచింగ్ సెంటర్ ను, కాలేజీలను ఏర్పాటు చేయాలి. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ను ఏర్పాటు చేయాలి. ప్రయివేట్ స్కూళ్ళకు ధీటుగా, నాణ్యమైన విద్యను అందించాలి.
నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలి.
ప్రభుత్వ శాఖలలో ఖాలీగా ఉన్న ఉద్యోగాలను
ఏ సంవత్సరానివి ఆ సంవత్సరంలోనే, నోటిఫికేషన్లు జారీ చేసి, పరీక్షలు జరిపించి భర్తీ చేయాలి. ఏ అక్రమ బిల్డింగ్ లను కూలగొట్ట కుండా, వాటిని విద్యార్ధులకు వసతి గృహాలుగా మార్చాలి.
08. చేయూత పథకం ద్వారా, అర్హులైన వారికి ఆసరా పెన్షన్ 4000 చెల్లించాలి. అలానే 10 లక్షల ఆరోగ్యశ్రీని భీమాను కల్పించాలి.
09. ఈ 6 గ్యారంటీల అమలుకు ప్రత్యేక వెబ్సైట్ ను
ఏర్పాటు చేయాలి మరియు దాని వివరాలు, అప్లై చేసుకునే విధానం, నియమ నిబంధనలు ప్రచారం చేయాలి.
10. తెలంగాణా రాష్ట్రం కొరకు బలిదానాలు చేసిన కుటుంబాలకు , వారి పిల్లలకు ఆర్ధిక భరోసా, ఆరోగ్య భరోసా మానసిక స్థైర్యాన్ని కల్పించాలి.
11. పార్టీలతో సంబంధం లేకుండా, ప్రతిపక్షాలు, గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా, అన్ని గ్రామాలను, పట్టణాలను సమానంగా అభివృద్ధి చేయాలి. గ్రామాలను, పట్టణాలకు ధీటుగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉపాధి అవకాశాలు, ప్రయివేట్ పాఠశాలలకు , ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యను అందించాలి. అలానే ఉచిత వైద్యశాలలను అభివృద్ధి చేస్తే పట్టణాలకు వలసలు తగ్గుతాయి. పట్టణాలలో రద్ధీ తగ్గుతుంది.
12. బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తి వేయాలి.
13. అక్రమ కేసులను, విచారణ చేసి ,ఎత్తి వేయాలి.
14. ప్రజలకు ప్రశ్నించే స్వేచ్ఛను, సమస్యలపై ధర్నాలు చేసుకునే స్వేచ్ఛను, ప్రభుత్వ కార్యాలయాలు, సభలకు, సచివాలయంలోకి అనుమతితో ప్రవేశించేందుకు స్వేచ్ఛను కల్పించాలి.
15. అర్హులైన పేద మధ్యతరగతి వారి కుటుంబాల వారికే రేషన్ కార్డులు వర్తింప చేయాలి. అవి రెండు రకాలుగా ఉండాలి. పేదలకు 1 రూపాయికి కిలో బియ్యం , మధ్య తరగతి వారికి 5 రూ.లకు కిలో సన్న బియ్యం ఇవ్వాలి. అప్పుడే అన్ని రేషన్ కార్డులు ఉపయోగం లోకి వస్తాయి. నేడు దొడ్డు బియ్యం తెచ్చుకుని, తినలేక, అమ్ము కుంటున్నారు. మరికొందరు తెచ్చుకోడానికే ఇష్ట పడటం లేదు. తీసుకోని బియ్యం దొడ్డిదారి పడుతున్నాయి. అన్నపూర్ణ కార్డులకు ఉచిత బియ్యం యధావిధిగా అమలు చేయాలి.
ప్రతి రేషన్ కార్డుకు, ఆధార్ నెంబర్ లింక్ చేయాలి.అప్పుడే అవినీతి, అక్రమాలు తగ్గిపోతాయి.
16. ట్రాఫిక్ ఛలాన్ల రేట్లు తగ్గించాలి.
17. పెట్రోల్ డీజిల్ పై పన్నులను తగ్గించాలి.
18. ఓటరు కార్డులకు, ఆధార్ నెంబర్ ను లింక్ చేయాలి. అప్పుడే ఒకే వ్యక్తి పేరు రెండు చోట్ల రిజిస్టర్ అవదు. దీని వలన రెండు ప్రాంతాలలో, రెండు రాష్ట్రాలలో ఓటు వేయడం ఆగిపోతుంది. దొంగ ఓట్లు పడవు
19. గ్రామాలలో, గ్రేటర్ హైదరాబాద్ లో మోరీలను, డ్రైనేజీ సిస్టంను సరిచేయాలి.
20. కనీసం ప్రతి 5 కి.మీ. దూరంలో ఒక పార్కింగ్ బిల్డింగ్ లను నిర్మించాలి.
21. గ్రేటర్ హైదరాబాద్ లో జనాభా రద్ధీని తగ్గించాలి. రింగ్ రోడ్ల వరకు మెట్రోరైలును విస్తరింప జేయాలి. రింగ్ రోడ్ల చుట్టూ టౌన్ షిప్ లను , ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను , విద్య వైద్యం ఉపాధి సంస్థలను నెలకొల్పాలి.
23. రాష్ట్ర ఆదాయం పెంచడానికి, విదేశీ పెట్టుబడులను, విదేశీ ఉపాధి సంస్థలను రప్పించాలి. టూరిజంను అభివృద్ధి చేయాలి.
24. సామాన్యులకు ఓటు హక్కు కావాలని కృషి చేసిన డా. అంబేడ్కర్ గారి కృషికి ఫలితం దక్కాలంటే, ఓటుకు విలువను పెంచాలంటే, ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి ఆసక్తి చూపాలంటే, ఓటరు ఆత్మాభిమానం దెబ్బ తీయకుండా ఉండాలంటే, "పార్టీ పిరాయింపుల నివారణ చట్టాన్ని" మరియు " అవినీతికి పాల్పడే, హామీలను అమలు చేయని అభ్యర్థుల కాల్ బ్యాక్ చట్టాన్ని" తీసుకుని రావాలి.