అందుకు ముఖ్యమైన కారణాలను పరిశీలిస్తే,
01. భారతీయులై యుండి, 25 సం.రాలు నిండి, మానసికంగా బాగా ఉంటే చాలు, పోటీ చేయడానికి అవకాశం ఉండటం
02. విద్య లేక పోయినా, ఎన్ని కేసులు ఉన్నా, ఎంతటి అవినీతికి పాల్పడినా , పోటీ చేయడానికి అర్హత కలిగి ఉండటం
03. వారసత్వాలకే అధిక అవకాశాలు ఉండటం
04. చనిపోయిన అభ్యర్థుల వారసులకు, అర్హత లేక పోయినా పోటీ చేయడానికి అవకాశాలు కల్పించడం
05. ఎన్నికలలో చేసే ఖర్చుపై నియంత్రణ లేకపోవడం , ఇలా మరెన్నో..
06. యువతీ యువకులు రాజకీయాల్లోకి రావడానికి ప్రోత్సాహం లేక పోవడం
07. డెబ్భై యేండ్లు నిండిన వృద్ధులు కూడా , రాజకీయాల్లో పోటీ చేయడానికి అవకాశాలు ఉండటం
ఇప్పుడు ప్రజలు ముఖ్యంగా కోరుకునేది,
పార్టీలు ఏవైనా కానీ, అవి కాంగ్రెస్, బిఎస్పీ, బిజేపి,ఎం.ఐ.ఎమ్ , బి.ఎస్.పి. మరియు ఇతర పార్టీలు ఏవైనా కావచ్చు.
ప్రజాస్వామ్య దేశంలో, ప్రజలే గెలవాలంటే, ప్రజాభిప్రాయాలను , ప్రజల ఆశయాలను వమ్ము చేయకుండా ఉండాలంటే, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే, తక్షణమే ఈ చర్యలు చేపట్టాలి.
01. అభ్యర్థుల "పిరాయింపుల నివారణ " చట్టాన్ని తీసుకుని రావాలి
02. ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా, ప్రజల విశ్వాసాలకు వ్యతిరేకంగా పాల్పడే అభ్యర్థులను " కాల్ బ్యాక్ " చేసే చట్టాన్ని తీసుకుని రావాలి.
03. అప్పటి వరకు గెలిచిన ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు , ఓటర్ల అభిప్రాయాలను, ఆకాంక్షలను, ఆశలను వమ్ము చేయకుండా, నైతిక భాద్యత వహించి, ఇతర పార్టీల లోకి పిరాయించకుండా ఉండాలి. ఒక వేళ ఇతర పార్టీల లోకి వెళ్ళాలనుకుంటే, గెలిచిన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, ఓటర్ల అభిప్రాయాలకు , ఓటు వేయడానికి విలువైన సమయం వెచ్చించి నందుకు, నష్ట పరిహారం కట్టించి, వేరే పార్టీలోకి వెళ్ళాలి. ఇది స్వతంత్ర అభ్యర్ధులకు కూడా వర్తిస్తుంది.
04. ఓటర్ల ఓటు హక్కును దుర్వినియోగ పరిచే విధంగా, అగౌరవ పరిచే విధంగా, ఓటర్ల నమ్మకాన్ని చెదరగొట్టే విధంగా, ఓటర్లు 3 గంటలు క్యూలైన్లలో నిలబడి, ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వేయకుండా, అబ్సల్యూట్ పవర్స్ ను స్పీకర్లకు తొలగించాలి.
05. పార్టీ పిరాయించడానికి , మా ప్రాంతాల అభివృద్ధి కొరకు అని సాకు చూపెడుతున్నారు. కాబట్టి, ఏ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధికి నోచుకోని అన్ని గ్రామాలను, మండలాలను, జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలి. ఎన్నికల వరకే పార్టీలు, అభ్యర్థులు మరియు ఓటర్లు. ఆ తరువాత అందరూ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలే అని భావించాలి.
06. ఇతర పార్టీల లోకి వెళ్ళే ఎమ్మెల్యేలను , ఎంపీలను, ఆయా నేతల గెలుపు కొరకు కష్ట పడిన కార్యకర్తలు, ఓట్లు వేసిన ఓటర్లు సామదాన భేదోపాయాలతో పార్టీ పిరాయించకుండా చూడాలి.
07. బిల్లులు పాస్ చేసే సమయాలలో, అవి ప్రజోపయోగకరమైనవి అయినట్లయితే, బయట నుండి సపోర్ట్ చేయవచ్చు.
08. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను, అవినీతిని, మోసాలను, భూకబ్జాలను ప్రశ్నించడానికి, వ్యక్తులుగా కాకుండా, "ప్రజా మేధావుల సంఘాలను" ఏర్పాటు చేయాలి.అలానే పిరాయించే నేతలను వీరు గట్టిగా అడ్డుకోవాలి
No comments:
Post a Comment