ప్ర . లక్షలాది , కోట్లాది రూపాయలతో నిర్మించిన అక్రమ కట్టడాలను , నివాస గృహాలను , పదుల అంతస్తుల భ0వనాలను కూల్చడం న్యాయమా ( DISMANTLING OF NATIONAL ASSET IS JUSTIFIED) ?
జ . లక్షలాది , కోట్లాది రూపాయలతో నిర్మించిన కట్టడాలను , నివాస గృహాలను , పదుల అంతస్తుల భవనాలను కూల్చడం న్యాయం కాదు . అవి అక్రమ కట్టడాలైనా , సక్రమ కట్టడాలైనా అవి మన దేశ సంపద . సంపదను నాశనం చేసుకుంటే , మనదేశం బికారి అవుతుంది . ఇతర దేశాల ముందు తల వంచాల్సి వస్తుంది . అభి వృద్ధి చెందిన దేశంగా ఎప్పటికీ కాదు .
యికపోతే, లక్షలాది , కోట్లాది రూపాయలతో నిర్మించిన కట్టడాలు , నివాస గృహాలు , పదుల అంతస్తుల భవనాలు ప్రకృతి సృష్టించినవి కావు . వీటిని మానవులు లక్షలాది , కోట్లాది రూపాయల ఖర్చుతో , ఎన్నో వ్యయప్రయాసలతో , ఎన్నో సంవత్సరాలు , నిద్ర ఆహారాలు మాని నిర్మించినవి . మేదావి ఇంజేనీర్ల , ఆర్కి టెక్టుల తెలివి తేటలకు ప్రతీకలు . వీటిని ప్రకృతి నాశనం చేస్తుంది కాని ఇలాంటి కట్టడాలును , నివాస గృహాలను , పదుల అంతస్తుల భవనాలను ప్రకృతి సృష్టించదు . నిర్మించదు .
అయితే , ఈ నిర్మాణాల వెనుక అవినీతి (అవినీతి పరులు ) ఉండవచ్చు . మోసం (మోస కారులు ) ఉండవచ్చు . అధికార దుర్వినియోగం (అధికార దుర్వినియోగ పరులు ) ఉండవచ్చు. ఈ నిర్మాణాలు అక్రమమే కావచ్చు . అన్యాయమే కావచ్చు . కాని ఇక్కడ తప్పు కట్టడాలది కాదు , నివాస గృహాలది కాదు , పదుల అంతస్తుల భవనాలది కాదు .
ఆ తప్పు మనసున్న , ప్రాణమున్న స్వ్వార్ధ పరులది . అవినీతి పరులది . అవినీతి కి తోడ్పడిన లేదా అవకాశాలు కల్పించే చట్టాలది కావచ్చు . ఓటు బ్యాంకు కోసం నడిపే రాజకీయాలది కావచ్చు . అందరికీ సమానమైన న్యాయం కల్పించని న్యాయ వ్యవస్థది కావచ్చు . వేలాది కోట్ల బ్యాంకుల అప్పులు ఎగ్గొట్టే వారికి జై కొట్టే సమాజానిది కావచ్చు . కాని ప్రాణం లేని కట్టడాలది కాదు . నివాస భవనాలది కాదు. పదుల అంతస్తుల భవనాలది కాదు . అవసరమైతే , దానికి సంభందించిన మనుష్యులను శిక్షించాలి గాని ప్రాణం లేని దేశ సంపదను కాదు .
ఒక చెట్టుకు చెదలు పడుతే , ఆ చెదలకు మందులు వేసి నివారిస్తాం గాని , చెట్టును నరికి వేయం కదా .
బిడ్డకు జబ్బు చేస్తే , తల్లి దండ్రులు వైద్యుడి దగ్గరకు తీసుకు వెళ్లి మందులు ఇప్పిస్తారు గాని , బిడ్డను చంపుకోరు కదా .
పంటకు తెగులు పడుతే , మందులు పిచికారి కొడుతారు గాని , పంటను నాశనం చేసుకోరు కదా.
విద్యార్ధి తప్పు చేస్తే , గురువు తల్లి దండ్రులను పిలిపించి కొన్సిల్లింగ్ చేస్తాడే గాని , మంచి మాటలు చెబుతాడే గాని , విద్యార్ధిని చంపడు కదా .
ఏదేని అక్రమ సంబందం తో ఒక శిశువు జన్మిస్తే , అలాంటి వారిని రక్షిస్తారే గాని శిక్షించరు కదా . అంతే కాదు , వారికి హక్కులు కల్పిస్తారు . ఆ అక్రమ సంభందం ఏర్పరుచుకున్న వారికి శిక్షలు వేస్తారు .
అందుకని అత్యవసర పరిస్థితులలో తప్పా , లక్షలాది కోట్ల ప్రజల డబ్బుతో , ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి , ఎన్నో ఏండ్లు కష్టపడి ఇంజినీర్లు , కూలీలు నిర్మించిన కట్టడాలను , నివాస భవనాలను , పదుల అంతస్తుల భవనాలను కూల్చడం న్యాయం కాదు. ధర్మం కాదు. అవసరమైతే , న్యాయంగా చెందాల్సిన వారికి కెటాయించడం చేయాలి . లేదా మరో విధంగా వాటిని సద్వినియోగం చేయాలి . ఒక వేల కూల్చు కుంటూ పోతే, ఎన్ని యేండ్ల నాటి కైనా 'భారత దేశం' అభివృద్ధికి నోచుకోని దేశం గా పిలువబడుతుంది గాని , అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించ బడదు .