శీర్షిక: రక్షాబంధన్
(అమ్మలోని మొదటి అక్షరం "అ" , నాన్న లోని చివరి అక్షరం "న్న" ని కలుపుతే వచ్చే వచ్చే పదం "అన్న". ఈ బంధాన్ని కలకాలం నిలుపుకోడానికి సోదరులకు కట్టే రాఖీనే రక్షా బంధన్)
ప్రక్రియ: మణిపూసలు
(రూపకర్త: శ్రీ వడిచర్ల సత్యం)
పూర్వకాలమందునుండె
దేవత రాక్షసులకుండె
పుష్కరకాలము యుద్దము
ఇది అనాదిగ వస్తుండె!
యుద్దాల నడ్డుకొనను
తమను రక్షించుకొనను
దేవతలు రాఖి కట్టిరి
ఇంద్రుడి కుడి చేతికిను!
ఇంద్రుడికి శక్తి వచ్చెను
దేవతలను రక్షించెను
అదియేశ్రావణపూర్ణిమ
మూడు లోకాలు మెచ్చెను!
అదే ఆనవాయితిగను
నేడు కొనసాగుతుండెను
సోదరి తన సోదరులకు
రాఖీని కట్టు చుండెను!
ఆపదల్లో ఉన్నపుడు
రాఖి కడుతే సోదరుడు
తమను రక్షించుతాడని
అనే విశ్వాసముమెండు!
సోదరులు బహుమానమును
సోదరిమణులకిచ్చియును
ప్రేమతోటి సాగనంపు
నదియె రాఖి పౌర్ణమియును!
....***....
No comments:
Post a Comment