Monday, July 22, 2024

కత్తి కంటే గొప్పది కలం

అంశం:కలం
శీర్షిక: *కత్తి కంటే కలం గొప్పది*
కవి: మార్గం కృష్ణ మూర్తి
ఊరు: హైదరాబాద్

అవినీతి అంతమొందించ
కరుడు గట్టిన నేతల 
దుమ్ముదులిపేయ
విషనాగుల్లాంటి 
మూడనమ్మకాల 
పార ద్రోలా
తరతరాల
భారతీయ సంస్కృతి
సాంప్రదాయాలను రక్షించ
ప్రకృతి సౌందర్యాలను కాపాడ
దేశం సంపదను సంరక్షించ
శత్రు మూకలను తరిమి కొట్ట
అన్నదాతలను ఆదుకొన
వీరు సైనికులను ప్రోత్సహించ
కత్తులు కటారాలే కావాలా?
ఉద్యమాలే చేయాలా?
యుద్ధాలే రావాలా?

భారతం వ్రాసిన  వ్యాసుడు 
ఏ కత్తి పట్టాడు ,
ఎక్కడ చేసాడు యుద్ధం?

రామాయణం వ్రాసిన వాళ్మీకి 
ఏ ఆయుధం పట్టాడు, 
ఎక్కడ చేసాడు యుద్ధం?

భగవద్గీత వ్రాసిన కృష్ణుడు
ఏ ఖడ్గం చేతబూనాడు
ఎప్పుడు చేసాడు యుద్ధం ?

నన్నయ తిక్కన ఎర్రన
కాలిదాసు  విశ్వనాధుడు 
శ్రీ శ్రీ  దాశరథి గిడుగు కాళోజీ
సినారె ఇలా ఎందరో
ఏ యుద్ధం చేయకుండానే
సాధించారు ఘన విజయాలు!

అహముతో సాధించలేనివెన్నియో
అభిమానంతో సాధించవచ్చు!
అజ్ఞానంతో సాధించలేని వెన్నియో
విజ్ఞానంతో సాధించవచ్చు!
కత్తితో సాధించలేనివెన్నియో
కలంతో సాధించ వచ్చు!

ఆందుకే ,
*కత్తి కంటే కలం గొప్పది*
*దళం కంటే గళం గొప్పది*
*అహం కంటే అభిమానం గొప్పది*
*అజ్ఞానం కంటే విజ్ఞానం గొప్పది*

*ఒక్క సిరా చుక్క లక్షమెదళ్ళను కదిలించగలదన్న*
ఆంగ్ల సామెతను మరిచి పోగలమా!

 

No comments: