ప్ర : ప్రజలకు మెంబర్ల ను వెనుకకు పిలిపించే అధికారాన్ని ( POWER TO CALL BACK MEMBERS) , హక్కులను కల్పించాలా ?
జ : ప్రజలకు మెంబర్ల ను వెనుకకు పిలిపించే అధికారాన్ని( POWER TO CALL BACK MEMBERS) , హక్కులను కల్పించాలి.
సభ్యుడు సమర్ధుడని , వ్యక్తిత్వం మంచిదని, అవినీతి పరుడు కాదని , గూండా కాదని , విద్యా వంతుడని అన్ని రకాలుగా పరిశీలించి , పరిశోధించి , తెలివిగా ప్రజలు వోట్లు వేస్తారు. కానీ రోజులు , నెలలు , యేండ్లు గడిచినా ,M.L.A.లు M.P. లు ( కొందరు )తమ ఇష్టం ప్రకారమో లేక తమ పార్టీ అధ్యక్షుడి మాట ప్రకారమో హైదరాబాద్ లోనో లేదా ఢిల్లీ ఏసీ గదుల్లో నో లేదా మరో పట్టణం లోనో దేశం లోనో హాయిగా తినుకుంటూ కూర్చొని , నిధులు సంపా దించు కుంటూ భూములు ( ముఖ్యంగా వ్యవసాయ భూములు ) , బంగారం కొనుక్కుంటూ , స్విస్ బ్యాంకులో దాచు కుంటూ , విదేశాలు చుట్టి వస్తూ, వారిని గెలిపించిన నియోజ వర్గం ప్రజల మొఖం చూడక పోతే , వారి భాదలను పట్టించు కోక పోతే , వారి ప్రాంతాన్ని అభి వృద్ది చేయక పోతే , ఇక ఆ '5' సం. రాలు ప్రజలు బాధలు పడాల్సిందేనా ?, గమ్మున చూస్తూ కూర్చోవలిసిందేనా? . అలాంటి వారిపై చర్య లేమిటి ? నేడు ఒక్కో మెంబరు సాలుకు 5 కోట్లు నియోజక వర్గ అభివృద్ధి కొరకు నిధులు తీసుకుంటూ 25% కూడా సద్వినియోగం చేయని వారున్నారని విన్నాం . సభలల్లో మాట్లాడని వారున్నారని తెలుసు కున్నాం . ప్రశ్నలడగ డానికి డబ్బులు తీసుకున్న వారున్నారని చూశాం . సభల్లో కొట్టు కునే వారిని టి .వి . చానాళ్ళ ద్వారా చూస్తున్నాం .
అందుకని,
01. గెలిచిన సభ్యులు , ప్రభుత్వం ఏర్పాటు చేసిన 90 రోజులలో వారి హామీలను
51% అయినా మొదలు పెట్టక పోయినా , మిగిలిన 49% హామీలు ఆ తరువాయి కాలం లో పూర్తి చేయక పోయినా , అలానే ప్రజల ఓట్ల చేత
గెలిచిన ప్రతి పక్ష పార్టీల
సభ్యులు ప్రశ్నించక పోయినా , నైతిక బాధ్యత వహించి సభ్యత్యానికి రాజీనామా చేయాలి
.
02. లేదా అలాంటి సభ్యులను వెనుకకు రప్పించే అవకాశం , అధికారం ఎన్నుకున్న ప్రజలకు వుండాలి. అలాంటప్పుడే , నాయకులు సాధ్య మయ్యే పనులకే హామీలు ఇస్తారు . అబద్ధాలు చెప్పరు.
అద్దం లో చంద మామను చూపించరు. ప్రజలను మోసం చేయరు , మోస కారులు ఎన్నికలకు పోటీ పడరు . చేత కాని వారు , పండు ముసలులు , మసి బోసి మారేడు కాయను చేసే వారు, వాక్చాతూర్యం లేని వారు ఎన్నికలకు దూరంగా వుంటారు . సీట్ల కోసం లక్షలు , కోట్లు కుమ్మరించరు. ఈ రకంగా నైనా ,అవినీతి కొంత వరకు తగ్గుతుంది.
03. అలానే ప్రభుత్వ సొమ్ములను దుర్వినియోగం చేసినా , కోట్లను కూడబెట్టినా , ప్రజలను పట్టించుకోక పోయినా , దేశ భద్రతకు , శాంతికి భంగం కలిగించినా , అవినీతికి పాల్పడినా , ఆశ్రీత పక్ష పాతం చూపినా , మెంబర్లను వెనుకకు పిలిపించి అధికారం ప్రజలకే ఉండాలి కాని , పార్టీ నాయకుడికి కాదు .
ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు , ఇలాంటి వాటికి రాజ్యాంగ సవరణలు చేయ లేవు . అందు కని , ప్రజల అభ్యర్ధనను మన్నించి ఎన్నికల కమీషన్ , లా కమీషన్ , జుడిస్యరీ వ్యవస్థ లేదా ప్రసి డెంటు గారు వారి వారి విశేసాధి కారాలను ఉపయోగించి ,
"ప్రజలకు మెంబర్ల ను వెనుకకు పిలిపించి , పదవి రద్దు చేసే అధికారాన్ని , హక్కులను కల్పించాలి".
అప్పుడే మంచి అభ్యర్ధులను ఎన్నుకున్నామన్న సంతోషం ఓటర్లకు ఉంటుంది . ఓ రోజంతా శ్రమించి వేసిన ఓటుకు విలువ ఉంటుంది. రాష్ట్రాలు , దేశం అభి వృద్ధి చెందుతుంది , ప్రజలు సుఖంగా జీవిస్తారు .
www.sollutions2all.blogspot.com
No comments:
Post a Comment