ప్ర : విద్యుత్తు (Electricity/Current/Power) ' వినియోగాన్ని 'ముందు చెల్లింపు' (Prepaid) విధానం చేయడం అవసరమా ?
జ : విద్యుత్తు (Electricity/Current/Power) వినియోగాన్ని 'ముందు చెల్లింపు' (Prepaid) విధానముగా మార్చాలి .
'ప్రీపేయిడ్ ' విధానం వలన విద్యుత్తు (Electricity/Current/Power) అవసరం లేని పేద, మద్య తరగతి వర్గాల ద్వారా విద్యుత్తు ఆదా అవుతుంది . అలానే విద్యుత్తు ఎక్కువగా అవసర మున్న వారికి , అందు బాటులో ఉంటుంది .
గుజరాత్ , ముంబాయి మినహా దేశ మంతా విద్యుత్తు కొరత అనేది జగమెరిగిన సత్యం . మనకు ముఖ్యంగా ఐదు మార్గాల్లో అనగా థర్మల్ పవర్ ( బొగ్గు ద్వారా ), హైడ్రల్ పవర్ ( నీటి ద్వారా ) , విండ్ పవర్ ( గాలి ద్వారా ), అటామిక్ పవర్ (ఆటమ్స్ ద్వారా ), సోలార్ పవర్ ( సూర్య శక్తి ద్వారా ) విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది. నాచురల్ గ్యాస్ , ఆయిల్ మరియు బయోగ్యాస్ ద్వారా కూడా కొంత వరకు విద్యుత్తు ఉత్పత్తి జరుగు తుంది . ఒక్కో పవర్ ది ఒక్కో సమస్య . అందువలననే , విద్యుత్తు (Electricity/Current/Power) ఉత్పత్తి ఎక్కువ గా లేక పోవడం , అదే సమయంలో విని యోగం అధికంగా ఉండటం వలన పరిశ్రమలకు విద్యుత్తు అందక , అనేకంగా మూత బడి పోతున్నాయి . ఉత్పత్తులు తగ్గి పోతున్నాయి . నిరుద్యోగ సమస్య జఠిల మయి పోతున్నది . వ్యవసాయానికి విద్యుత్తు అందక పంటలు ఎండి పోతున్నాయి . గతంలో గృహ అవసరాలకు కూడా సరిపోక , రోజూ 2 నుండి 4 గంటలు విద్యుత్తు నిలిపివేయడం జరుగు తుంది . ప్రజలు విసిగి వేసారి పోతున్నారు . భవిష్యత్తులో విద్యుత్తు అవసరాలు , ఇంకా పెరుగుతాయి గాని తగ్గవు .
ఇన్ని సమస్యలను అధిగ మించా లంటే , మన ముందున్న మార్గాలు రెండే రెండు . అవి ఒకటి అన్ని రకాలుగా విద్యుత్తు ఉత్పత్తి పెంచడం. ముఖ్యంగా పుష్కలంగా లభించే సోలార్ పవర్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం . రెండవది ప్రజలందరూ పొదుపు పాటించడం . ఖచ్చితంగా పొదుపు పాటించాలంటే " విద్యుత్తు వినియోగాన్ని 'ప్రీ పేయిడ్' చేయడమే ఉత్తమమైన మార్గం " .
No comments:
Post a Comment