ప్ర : పైసా ఖర్చు లేకుండా , నల్ల ధనాన్ని ( BLACK MONEY), దొంగ నోట్లను (FAKE NOTES), బినామీ ఆస్తులను ( BENAMI ASSETS) , అవినీతిని ( CORRUPTION) , అరి కట్ట లేమా ?
జ :" నొప్పివ్వక తానొవ్వక పన్నులు వసూలు చేయువారు ధన్యులు సుమతీ " అన్నట్లు , పైసా ఖర్చు లేకుండా , ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగ కుండా , పారదర్శకత గల ప్రభత్వ విధానాలా ద్వారానే ( SYSTEMS DEVELOPMENTS), నల్ల ధనాన్ని ( BLACK MONEY), దొంగ నోట్లను (FAKE NOTES), బినామీ ఆస్తులను ( BENAMI ASSETS), అవినీతిని ( CORRUPTION) , సునాయాసంగా అరి కట్ట వచ్చు . అది ఎలాగంటే ,
01. భారత దేశంలో నివసించే ప్రతి ఒక్కరికీ ( ఆస్తులు కలిగి ఉన్న ఒక నెల బిడ్డతో సహా ) , ఒకే ఒక 'ఆధార్ కార్డు' ఉండాలనే నిబంధన ఉన్నట్లు గానే , ఒకే ఒక 'పాన్ కార్డు ' ఉండాలనే నిబంధన ఉన్నట్లుగానే , ఒకే ఒక 'డ్రైవింగ్ లైసెన్స్' ఉండాలనే నిబంధన ఉన్నట్లుగానే , ఒకే ఒక ' పాస్ పోర్ట్ ' ఉండాలనే నిబంధనఉన్నట్లుగానే , ఒకే ఒక ' ఓటర్ కార్డు ' ఉండాలనే నిబంధనఉన్నట్లు గానే , ఒకే ఒక ' బ్యాంకు అకౌంట్ ' ఉండాలనే నిభందనను , ఒకే ఒక ' సెల్ ఫోన్ నెంబరును ' కలిగి ఉండాలనే నిబంధనను ప్రవేశ పెట్టి తప్పని సరీగా అమలు చేయాలి. అలానే ఒక బ్యాంకు నుండి మరో బ్యాంకు కు మారడానికి , ఒక సెల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ నుండి మరొక సర్వీస్ ప్రొవైడర్ కు మారడానికి పోర్టబిలిటీ ఫెసిలిటీ (PORTABILITY FACILITY) కల్పించాలి .
02. ఇతర ప్రభత్వ శాఖల రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నిటిని , పెట్టుబడులను , పొదుపు పథకాలను , జీవిత భీమాలను , బ్యాంకు అప్పులను ' పాన్ కార్డు ' కు, ' ఆధార్ కార్డు ' కు లింక్ చేయాలి .
03. విదేశాలతో " వ్యాపార సమాచార మార్పిడికి " ఒప్పందాలు చేసుకోవాలి . మన దేశం నుండి వెళ్లి , విదేశాల్లో గాని , చంద్ర మండలంలో గాని ఏ వ్యాపారం చేసినా , ఎలాంటి ఆస్తులు కొన్నా , వాటి వివరాలు తెలిపే విధంగా ఒప్పందాలు చేసుకోవాలి .
04. దీనిని ఏ ప్రభుత్వం వచ్చినా , ఎలాంటి స్వార్ధం , పక్ష పాతం , తాత్కాలిక రాజకీయ లబ్దికి ఆశించ కుండా అమలు చేయాలి . అలానే నిరంతరం పర్యవేక్షించాలి , అంతే .
దీని వలన నల్ల ధనాన్ని ( BLACK MONEY), దొంగ నోట్లను (FAKE NOTES), బినామీ ఆస్తులను ( BENAMI ASSETS), అవినీతిని ( CORRUPTION) , ఎలా అరి కట్ట వచ్చు ?
01. 'బ్యాంకు అకౌంట్' ద్వారా ఒక వ్యక్తికి అకౌంటులో డబ్బు ఎంత ఉందో క్షణాల్లో తెల్సి పోతుంది . అంతే కాకుండా , ఆ డబ్బు ఎక్కడినుండి వస్తుంది, ఎక్కడికి వెలుతుంది , ఎందుకు వెలుతుంది మొదలైన సమాచారం అధికారులు తెలుసుకోవడం వీలవుతుంది . ఏమేమి కొటున్నారో , ఏమేమి అమ్ముతున్నారో తెల్సి పోతుంది . ఇప్పటి వరకు డబ్బు ఎలా సంపాదించారో , ఆదాయ పన్నులు ఎంత ఎగ్గొట్టారో తెల్సి పోతుంది . (ఐ . టి . రిటర్న్స్ తో పని లేదు).
02. ' పాన్ నెంబర్ ' కు ఇతర ప్రభుత్వ రిజిస్ట్రార్ శాఖలను , 50 వేలకు మించి కొనుగోలు చేసే బంగారానికి , వస్తువుల బిల్లులకు లింక్ చేసి నట్లవుతే , వారి స్థిర , చర ఆస్తులు ఏమిటో , బంగారం ఎంతో , వస్తువులు ఏమిటో , వాటిని కొన్న ధర ఏమిటో , మార్కెట్ ధర ఏమిటో, పొదుపు ఏమిటో , పెట్టుబడులు ఏమిటో , ఇన్సూరెన్స్ లు ఏమిటో క్షణాల్లో తెల్సిపోతుంది .
03. ' ఆధార్ కార్డు నెంబర్ ద్వారా , వారి వ్యక్తి గత , కుటుంభ వివరాలన్నీ మరియు వారి జీవనసరళి తెలిసిపోతాయి.
04. ' సెల్ ఫోన్ నెంబర్ ' ద్వారా వారి ఫోన్ లావా దేవీలు , ఎవరెవరితో సంభందాలు ఉన్నాయి , ఎప్పడు మాట్లాడారు , ఏ సమయంలో మాట్లాడారు , వారు ఎక్కడెక్కడ సంచరించారు , ప్రతి ఒక్కటి తెల్సి పోతాయి .
05. ' పాస్ పోర్ట్ ' ద్వారా వారు ఏ తేదీన , ఏ సమయాన విదేశాలకు వెల్లారు , ఎన్ని సార్లు వెల్లారు . ఎందుకు వెల్లారు మొదలైన విషయాలు తెలిసి పోతాయి .
అవినీతి పరుల వ్యవహారాలన్నీ ఒకే గూటికి చేరు తాయి కాబట్టి , దీని వలన అతను లేదా ఆమె సంపదను ఎలా కూడబెట్టారో తెలుసుకోవచ్చు . వారి పూర్వీకుల ఆదాయం ఏమిటి , వీరికి ప్రస్తుత ఆదాయ వనరులు ఏమిటి , వీరి ఖర్చులు ఏమిటి , వీరికి అదనంగా వచ్చిన సంపద ఎక్కడిది మొదలైన అన్ని విషయాలు సునాయాసంగా తెలుసుకోవచ్చు.
అంతే కాకుండా , వీరు పన్నులు చెల్లిస్తున్నారా లేక తప్పించు కుంటున్నారా, వీరు ఎక్కడెక్కడ అప్పులు తీసుకున్నారు , ఎలా తీరుస్తున్నారు , వీరు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు అర్హులా కాదా మొదలైన ఎన్నో విషయాలను సులువుగా తెలుసుకోవచ్చు .
అప్పుడు ఆదాయ పన్నుల అధికారులు, ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు,సి.బి.ఐ. అధికారులు సునాయాసంగా , తక్కువ సమయంలో కేసులను డీల్ చేసే అవకాశం కలుగుతుంది . ఈ విధముగా అవినీతిని ( CORRUPTION) , నల్ల ధనాన్ని ( BLACK MONEY), దొంగ నోట్లను (FAKE NOTES), బినామీ ఆస్తులను ( BENAMI ASSETS) సునాయాసంగా అరి కట్ట వచ్చు . ఒక వ్యక్తికి ఒకే అకౌంట్ ఉండటం వలన , బ్యాంకుల అడ్మినిస్ట్రేషన్ వ్యయాలను , సగానికి సగం తగ్గించ వచ్చు . బ్యాంకుల ఆదాయాలు యధావిధిగా కొనసాగుతాయి .
పన్నుల ద్వారా ప్రభుత్వాలకు విపరీతమైన ఆదాయం లభిస్తుంది . దానిని కేవలం సంక్షేమ పథకాల కోసమనే కెటాయించకుండా , ప్రకృతి వనరుల అభివృద్ధికి , మానవ వనరులను అభివృద్ధికి , దేశ భద్రతకు , వాతా వరణ పరి రక్షణకు, మౌలిక వసతులకు , విద్య , ఆరోగ్యానికి ఖర్చు చేయాలి . ఆ విధంగా ఉపాధి అవకాశాలను పెంచి , దేశంలో పేద ధనిక అంతరాలను తగ్గించాలి . అంతే గాని ప్రజలను కేవలం బిక్ష గాండ్లుగా , ఓటు బ్యాంకుగా, జీవిత కాలమంతా ప్రభుత్వాలపై ఆధార పడేట్లుగా మార్చ కూడదు . ప్రజలు వాల్ల కాళ్లపై వారు జీవించే విధంగా తయారు చేయాలి .

దీని వలన పెద్దగా డబ్బు ఖర్చు అవుతుందా చెప్పండి !. ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ముందా చెప్పండి !. ఇది ఏమైనా అసాధ్యమా చెప్పండి !.
కానీ ఇప్పుడు, సడన్ గా "పెద్ద నోట్ల రద్దు" నిర్ణయం వలన ప్రజలలో అనేకమైన అపోహలున్నాయి . తమ తమ నల్ల కుబేరుల కొమ్ము కాస్తున్నారని , పెద్ద పెద్ద అప్పులు ఎగ్గొట్టిన వారి అప్పులను తీర్చి, వారిని రక్షిస్తున్నారని, పేదల సొమ్మును వారికే దోచి పెడుతున్నారని , ఇది ఎంతో ఖర్చు తో కూడు కున్నదని, కాల యాపన అని, డిజిటల్ విధానం వలన హాకింగ్ విస్తరించి ప్రజలు తీవ్రంగా నష్ట పోతారని , అయినా ఇది అంత సక్సెస్ కాదని అనేకమైన రక రకాల అపోహలు వెల్లు వెత్తు తున్నాయి . లక్షల కోట్ల డబ్బు ఖర్చు అయ్యింది . ప్రజలు కొందరు చని పోయారు. కొందరు లాఠీల దెబ్బలు తిన్నారు . అనేక మైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు . ఉపాధి కోల్పోయారు . వ్యాపారాలు దెబ్బ తిన్నాయి . ఇక మరి కొందరు కొత్తగా , వచ్చిన అవకాశాన్ని పోనీయ కూడదని , అవినీతి ఊబిలో ఇరుక్కొని జైళ్ల పాలయ్యారు . పరువు పోగొట్టుకున్నారు . ఉద్యోగాలు పోగొట్టుకున్నారు . నిజాయితీ పరులు కోలుకోలేని విధంగా పెట్టుబడులు నష్ట పోయారు . రియలెస్టేట్ తీవ్రంగా దెబ్బ తిన్నది . వేచి చూడాలి , ఏమి జరుగ బోతుందో .
సరే ఈ రోజు కాక పోయినా , ఎదో ఒక రోజు నా సలహాలను అమలు చేస్తారనే నమ్మకం నాకు ఉంది . "సంభవామీ యుగే యుగే ".
www.sollutions2all.blogspot.com
No comments:
Post a Comment