ప్ర : వ్యవసాయం (AGRICULTURE) ఎవరికి శాపం ? ఎవరికి స్వర్గధామం ?
జ : వ్యవసాయం (AGRICULTURE) రైతులకు శాపం . అవినీతి పరులకు , నల్లకుబేరులకు స్వర్గధామం .
జ : వ్యవసాయం (AGRICULTURE) రైతులకు శాపం . అవినీతి పరులకు , నల్లకుబేరులకు స్వర్గధామం .
అవును , వ్యవసాయం (AGRICULTURE) రైతులకు శాపం . ఎందుకని మీరనవచ్చు . చూడండి సాలు గాలం , రాత్రి అనకా , పగలు అనకా వ్యవసాయం పనులూ చేస్తే వారికి చివరికీ మిగిలేది శూన్యం. ఎండు డొక్కలు ,అప్పులే కదా మిగిలేది . సన్న కారు రైతులనే తీసుకుందాం . వారు 1 నుండి 5 ఎకరాల భూములను కొనుగోలు చేయాలంటే కొన్ని లక్షల మొత్తం పెట్టుబడి పెట్టాలి . ఆ తరువాత , కాలాన్ని బట్టి దున్ని , గొర్రు గొట్టి , విత్తనాలు చల్లి , పసి పిల్లలను పెంచినట్టు మొక్కలను పెంచి , నాటు వేయాలి లేదా మొక్కలను నాటాలి . వీటికి నీరు కావలి . సన్నటి ఎండా కావలి . గాలి కావలి . సరియయిన సమయంలో ఎరువులు కావాలి . నిరంతరం కరెంటు కావాలి . సరియయిన సమయంలో వర్షాలు పడాలి . వర్షాలు లేక పోతే చెరువులు నిండవు , బావులలో నీరు ఉండదు . ఆ తరువాత మొక్కలపైన లేదా చెట్ల పైన లేదా వరి పైన పురుగు వాలకుండా , దోమలు వాల కుండా రసాయన ఎరువులు పిచుకారి చేయాలి . ఎప్పటికప్పుడు , వీటన్నిటికీ కూలీలు కావాలి . వీటన్నిటికీ మరల సాలుసరి పెట్టు బడులు , పంట తీరును బట్టి వేల నుండి లక్షల్లో ఉంటుంది . ఈ విధంగా తీసుకు వచ్చిన పెట్టుబడి డబ్బుకు , వేలల్లో వడ్డీలు కట్టాలి . పెట్టు బడి పెట్టిన సావుకారికి గులాముగా తిరుగాలి . ఇంతా చేసినా , చివరికి ఆ పంట పండుతుందో లేదో తెలియదు . చేతికి వస్తుందో లేదో తెలియదు . పంట చేతికి వచ్చే సమయాన ఒక్క తుఫాన్ వచ్చిందనుకోండి , ఇంత కాలం చేసిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది . విత్తనాలు వేసే ముందర సరైన వర్షాలు లేక పోయినా , పంటలు చేతికి వచ్చే ముందు జోరుగా వర్షాలు కురిసినా , నాసిరకం విత్తనాలు అయినా , కల్తీ ఎరువులైనా , కనీసం రోజుకు 8 గంటలు కరెంటు లేక పోయినా దిగుబడి తగ్గి పోతుంది . తీరా పంట చేతికి వచ్చాక , మార్కెట్ లో కొనే వారు లేక పోతే , ధరలు లేక పోతే , ఇక రైతుల బాధలు వర్ణనానీతం . రైతులు వరుణ దేవుళ్ళ పైనా , ప్రభుత్వాల పైనా , కమీషన్ ఏజెంట్ల పైనా భారం వేసి జీవితాలు గడపాలి . మెజారిటీ రైతులకు టెక్నాలిజీ తెలియక పోవ డం , దిగుబడి పెంచుకునే విధానం తెలియక పోవడం , ఖర్చులను తగ్గించుకునే విధానాలు తెలియక పోవడం మొదలైన కారణాల వలన , రైతులు నష్టాల పాలవుతున్నారు , అప్పుల పాలవుతున్నారు . వీటికి తోడు పన్నులు . ఒక వైపు శ్రమ , మరో వైపు అప్పులు . ఈ విధంగా వ్యవసాయం రైతులకు శాపమే కదా . ఇక కౌలు దారుల జీవితాలు మరింత దారుణం . వీరికి రుణ మాఫీలు అందవు . ప్రభుత్వ సబ్సీడీలు అందవు .
అయితే , వ్యవసాయం (AGRICULTURE) మరి ఎవరికి లాభం ?. ఎవరికి స్వర్గధామం ?
వ్యవసాయం (AGRICULTURE) అవినీతి పరులకు , అక్రమ సంపాదకులకు , నల్లకుబేరులకు లాభము . అలానే స్వర్గ ధామం కూడాను . వీరికి వ్యవసాయం అనేది అక్రమ సొమ్ములను దాచుకోడానికి , పన్నులు ఎగ్గొట్ట దానికి , ఒక చక్కటి మరుగు ( HIDDEN PLACE) , ఒక చక్కని ముసుగు ( MASK) లాంటిది . ఇప్పటి వరకు మన వ్యవస్థలో , ఎవరికీ ఎక్కడినుండి డబ్బు వస్తుందో , ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నారో కనిపెట్టే యంత్రాగము లేదు, ఆ ఆలోచనా లేదు . ఎవరైనా సరే , కనీసం ఒక సం .రం లోపల తప్పనిసరీగా రిజిస్ట్రేషన్ చేయించాలి, దానికి ఖచ్చితంగా 'పాన్ ' నెంబరును , ' ఆధార్ ' నెంబరును , 'సెల్ ' నెంబరును , 'బ్యాంక్ అకౌంట్ ' నెంబరును లింక్ చేయించాలని లేదు . ఎందుకంటే ఆ నల్లకుబేరులు , కీలకమైన వారు రెండూ వారే కాబట్టి . వీరికి వ్యవసాయ పంటలపై అంతగా రాబడి అవసరం లేదు .
ఎందు కంటే వీరిపైనా , వీరి బినామీ పేర్లపైనా భూములు రిజిష్టర్ అవుతాయి , పాసుబుక్కులు వస్తాయి కాబట్టి , రుణ మాఫీలు వీరికే అందుతాయి , ప్రభత్వ సబ్సీడీలు వీరికే అందుతాయి . నల్లధనం , అక్రమ సొమ్ము సేఫ్ గా ఉంటుంది . భూముల ధరలు పెరుగుతుంటాయి . భూములు ఎప్పుడు కొనాలి , ఎక్కడ కొనాలి , ఏది కొంటె వ్యవసాయ భూమి అవుతుంది , పట్టణానికి ఎన్ని కిలో మీటర్ల దూరంలో కొనాలి , ఎందువలన భవిష్యత్తులో భూముల ధరలు పెరుగుతాయి , ఎక్కడి సైడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి ? ఎవరిని బినామీగా పెట్టుకోవాలి ? తేడా రాకుండా ముందే ఏమి చేయాలి ? మొదలైన విషయాలలో కరెక్టుగా స్కెచ్ వేసుకుంటారు . ఇక వ్యవసాయ (AGRICULTURE) భూములు కొన్నా , అమ్మినా , లక్షల్లో , కొట్లల్లో ఆదాయం వచ్చినా రూపాయి ఆదాయ పన్ను కట్టేది లేదు . అలానే పంటల ఆదాయం పై రూపాయి పన్ను కట్టవల్సిన అవసరం లేదు . అసలు ఇలాంటి బిల్లులు పాస్ చేసుకునేది ఎవరు ? వారే కదా . అదే బ్యాంకుల్లో పొదుపు చేసుకుంటే , పెట్టు బడులు పెడితే , సాలుకు వడ్డీ 10, 000/- దాటినా ముందుగానే, మూలం లోనే పన్ను (టి . డి . ఎస్ ) వసూలు చేస్తారు . అదే వ్యవసాయ (AGRICULTURE) భూములపై పన్ను వసూలు చేయ డానికి, అసలు వీరికి భూమి ఉన్నట్లు ఏ వ్యవస్థ కని పెట్ట గలదు? ఉంటె బినామీ పేర్ల మీద లేక పోతే కేవలం బాండు పేపర్లమీదనే కదా . ఇక వీరు నివసించేది పట్టణాలలో , భూములు కొనేది గ్రామాలలో . వీరి కాలుకు ఒక ముల్లు కుచ్చదు, ఒక తేలు పాము దరి చేరదు . ఆ బాధలన్నీ అనుభవించేది కౌలు దారులు లేదా బినామీ దారులు లేదా నమ్మిన బంట్లు . అలాంటప్పుడు వ్యవసాయం (AGRICULTURE) , అవినీతి పరులకు , అక్రమ సంపాదకులకు , నల్ల కుబేరులకు , స్వర్గ ధామమే కదా ! భూతల స్వర్గమే కదా ! ఒప్పుకుంటారుకదూ!
అందుకనే వ్యవసాయ భూములపైనా , బినామీ భూములపైనా సర్జికల్ స్ట్రైక్ జరగాలి . దానిని ప్రభుత్వాలు జప్తు చేసుకుని , ముందుగా దేశం లోని పేదలందరి నివాస గృహాలకు ఉచితంగా కెటాయించాలి . ఆ తరువాత వ్యవసాయ కౌలు దారులకు , పేద రైతులకు పంచి వేయాలి .
నా ఆలోచనలు ఎప్పుడో ఒకప్పుడు , ఎదో ఒక రోజు వాస్తవ రూపం దాల్చక తప్పదు . సమయం కోసం వేచి చూద్దాం .
అందుకనే వ్యవసాయ భూములపైనా , బినామీ భూములపైనా సర్జికల్ స్ట్రైక్ జరగాలి . దానిని ప్రభుత్వాలు జప్తు చేసుకుని , ముందుగా దేశం లోని పేదలందరి నివాస గృహాలకు ఉచితంగా కెటాయించాలి . ఆ తరువాత వ్యవసాయ కౌలు దారులకు , పేద రైతులకు పంచి వేయాలి .
నా ఆలోచనలు ఎప్పుడో ఒకప్పుడు , ఎదో ఒక రోజు వాస్తవ రూపం దాల్చక తప్పదు . సమయం కోసం వేచి చూద్దాం .
No comments:
Post a Comment