ప్ర : "ఆలోచన ఒకటి, ఆదాయాలు రెండు " ( ONE THOUGHT , INCOMES TWO ) అంటే ఏమిటి ?
జ:"ఆలోచన ఒకటి, ఆదాయాలు రెండు " (ONE THOUGHT , INCOMES TWO) అంటే, ఒకే విధానం (నిబంధన) లేదా ఒకే చట్టం ద్వారా ప్రభత్వం రెండు విధాలుగా ఆదాయం పొంద వచ్చు . అంటే ఒక వైపు పన్నుల రూపేణా ఆదాయాన్ని సమకూర్చు కోవచ్చు మరియు ధన వంతులకు , నల్ల కుబేరులకు సంక్షేమ పధకాలను , సబ్సీడీలను రద్దు చేస్తూ వ్యయాన్ని అరికట్ట వచ్చు . అలాగే నల్లధనాన్ని అరికట్ట వచ్చు . పన్నులు ఎగ్గొట్టే వారినుండి ఆదాయాన్ని సునాయాసంగా వసూలు చేయ వచ్చు . ఒక సిస్టం ను డెవలప్ చేస్తే ఎవ్వరినీ బ్రతిమి లాడ నవసరం లేదు . వాలంటరీగా సబ్సిడీ గ్యాస్ రద్దు చేసుకోండి అని దేశ ప్రధాని స్థాయి లాంటి వారు , ధన వంతులను బుజ్జగించా నవసరం అంతకూ లేదు . అయితే ఇవన్నీ వ్యవస్థలన్నీ , ప్రభుత్వాలన్నీ , ప్రభత్వ అధికారులందరూ నిజాయితీ గా , పారదర్శకంగా ఉన్నపుడే ప్రయోగించాలి . అప్పుడే సక్సెస్ అవుతుంది .
ఇప్పుడు చూస్తున్నాం , పెద్ద నోట్ల రద్దు కారణంగా ప్రతి రోజు ప్రజలు లైన్లల్లో నిలబడి డబ్బులు డ్రా చేస్తున్నారు . అయితే కొందరు వారి కోసమే లైన్లల్లో నిలబడుతున్నారా లేక వారి బినామీల బలి అవుతున్నారా తెలియడం లేదు . సాధారణంగా పేద వారు అన్నపుడు వారికీ , కేవలం 4 వేల నుండి 8 వేల రూపాయల వరకు నెల మొత్తం సరిపోతాయి . అప్పుడే వారిని పేద వారు అంటారు . లేదంటే వారిని మధ్య తరగతి వారు లేదా ధన వంతులు అని అంటారు . ఆ 4 వేల నుండి 8 వేల రూపాయల ను కేవలం మొదటి రెండు రోజులలోనే మార్చుకోవడమో , డ్రా చేయడమో జరిగి ఉంటుంది . కానీ ఇంకా లైన్లల్లో నిలబడి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు . సరే కొందరికి ప్రత్యేక అవసరాలు ఉండి ఉంటాయి . అవి చాలా అరుదు . కానీ ఇంత మంది ప్రజలు ప్రతి రోజు లైన్లలో నిలబడుతున్నారంటే దానికి మరేవైన కారణాలు ఉండి ఉంటాయి . ఇక మరికొందరు నల్లకుబేరులు , మా డబ్బు మా డబ్బు అని అంటున్నారు . మా డబ్బును డ్రా చేయనీయడం లేదని అంటున్నారు . అయితే కొద్దీ మంది దగ్గరికే ఇంత పెద్ద మొత్తం డబ్బు ఎలా వస్తుంది ? కొద్దీ కాలం లోనే కుబేరులుగా ఎలా మారి పోతున్నారు ? వీరి వద్ద అలీ బాబా మంత్ర దండం ఏమైనా ఉందా ? వీరికేమైనా ప్రత్యేకంగా 4 చేతులు ఉన్నాయా ? 4 కాళ్ళు ఉన్నాయా ? వీరికి 48 గంటల సమయం ఉందా ? రెండు మెదడులు ఉన్నాయా ? ఎలా కను రెప్ప మరల్చే సమయంలోనే కోట్లు గడిస్తున్నారు . ఇది అంతా కేవలం ప్రజల నిరక్ష రాస్యత , అమాయకత్వం , వ్యవస్థల లోని అవకాశాలు , వ్యవస్థలలోని లోపల వలననే . అన్ని వ్యవస్థలను గుప్పెట పట్టిన రాజకీయ వ్యవస్థల వలననే . ఇక్కడే అత్యధిక స్వార్ధం ఉండటం వలననే . దీనిని ప్రక్షాళన చేయడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి . ' సంభ వామి యుగే యుగే' .
సరే అసలు విషయానికి వద్దాం . ప్రభుత్వం , పన్నులను ఆదాయాన్ని బట్టి మాత్రమే కాకుండా , ఖర్చును బట్టి వారి ఆదాయాన్ని అంచనా వేసి ( ఏది ఎక్కువైతే అది ) దాని మీద ఆదాయపన్నులు వేయాలి . అలానే వారి ఖర్చులను బట్టి సంక్షేమ పధకాలు వర్తింప చేయాలి . అంటే అధికంగా ఖర్చు బెట్టే సామర్ధ్యం ఉన్న వారు ధన వంతుల క్రిందికే వస్తారు . అప్పుడు వారికీ సంక్షేమ పధకాలను వర్తింప చేయ నవసరం లేదు . అప్పుడు ప్రభుత్వాలకు పన్నుల రూపేణా ఆదాయం లభిస్తుంది . సంక్షేమ పధకాల ఖర్చు తగ్గుతుంది . అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు ( ONE SHOT FOR TWO BIRDS) అన్నట్లు .
అయితే ఇవన్నీ ప్రభుత్వాలు నిజాయితీ గా , పారదర్శకంగా ఉన్నపుడు మాత్రమే ఉపయోగించాలి . దీనిని ప్రయోగించే వారు ఎవరైనా సరే , ముందుగా ఆత్మ విమర్శ చేసుకోవాలి . ఆ తరువాతనే పేద మధ్య తరగతుల వారిపై ఈ సూత్రాన్ని ప్రయోగించాలి . ముందుగా నల్ల ధన కుబేరుల నుండి సామాన్యుల వద్దకు ఈ ప్రయోగం రావాలి . బ్యాంకుల అప్పులు ఎగ్గొట్టి విదేశాలలో , స్వదేశాలలో విహరించే వారి నుండి ముందుగా అప్పులు , వడ్డీలు , పన్నులు వసూలు చేయాలి . స్వదేశం లో నివసిస్తూ విదేశాలలో దాస్తున్న సంపదలను ముందుగా జప్తు చేయాలి . శిక్షలు అమలు చేయాలి . ఆ తరువాతనే సామాన్య , మధ్య తరగతి ప్రజల వద్దకు రావాలి . నేను పదే పదే ఎందుకు చెబుతున్నానంటే , సులువుగా పని అయిపోతుందని , మొదట సామాన్య , మధ్య తరగతి ప్రజలపైనే , ఈ విధానాన్ని ప్రయోగించి , వారిని మరింత పేదలను చేయకూడదని మనవి .
No comments:
Post a Comment