Friday, December 2, 2016

రేషన్ షాపులలో రేషను తీసుకోకపోతే "తెల్ల రేషన్ కార్డు ల" ను రద్దు చేయడం సబబేనా ?


ప్ర : రేషన్  షాపులలో  రేషన్  తీసుకోకపోతే  "తెల్ల రేషన్ కార్డు ల" ను రద్దు  చేయడం సబబేనా ?

జ : రేషన్  షాపులలో రేషన్ తీసుకోకపోతే "తెల్ల రేషన్ కార్డు ల" ను రద్దు  చేయడం సబబు కాదు. 
రేషన్ కార్డులను  ఇస్స్యూ చేయడానికి , పేదలను  గుర్తించడానికి  , ప్రభుత్వం , ప్రభుత్వ అధికారులు  పేద ప్రజలు  పనులు  మానుకొని ఎన్ని ఇబ్బందులు  పడ్డారో  గుర్తుకు  తెచ్చు కుంటే , రేషన్  కార్డులను రద్దు చేయాలనే ఆలోచన  రాదు . దేశంలో  గాని , ప్రపంచంలో  ఎక్కడా గాని జరగని విధంగా , ఒకే రోజు  రాష్ట్ర మొత్తం  పకడ్బంధీగా  " కుటుంభ సర్వే " జరిపి , పార దర్శకతకు  ప్రతి ఒక్కరూ  ఎన్ని కష్టాలు  పడ్డారో  గుర్తుకు తెచ్చుకుంటే , రేషన్ కార్డులను  రద్దు  చేయాలనే  ఆలోచన  రాక పోవచ్చు .  

ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన "తెల్ల రేషన్ కార్డులు", అనేక విధాలుగా ఉపయోగ పడుతున్నాయి . ఒక విధంగా చెప్పాలంటే వీటిని " బహు లార్ద సాధక కార్డులు" అని చెప్ప వచ్చు.

రేషన్ షాపులో  రేషన్ తీసుకోనంత  మాత్రాన రేషన్  కార్డులను  రద్దు చేయడం సరి కాక పోవచ్చు . 
రేషన్  తీసుకోక పోవడానికి  ఎన్నో కారణాలు ఉండ వచ్చు : అవి ,

01. 80% ప్రజలు  పట్టణాలలో  రెంటుకు  ఉండే వారే . వారు ఇండ్లు మారుతూ ఉండ వచ్చు . అలంటి వారు , రేషన్ షాపును మార్చుకుని  ఉండక పోవచ్చు . దూరంగా పోవడం వలన  రేషన్ తీసుకోక  పోవచ్చు . 

02. రేషన్ షాప్ యజమానులు , పున్నానికో  , అమావాస్యకో తెరుస్తూ ఉండ వచ్చు . ఎప్పుడు తెరుస్తారో ఎప్పుడు మూస్తారో  ప్రజలకు తెలియక పోవచ్చు . 

03. రేషన్ బియ్యం  తో పాటు , అనవసరంగా  అవసరం లేని  ప్రయివేటు సరుకులను ఎక్కువ ధరకు  అంట గడుతూ ఉండ వచ్చు . 

04. కొందరికి  ఆ బియ్యము  తినడం వీలు కాక  పోవచ్చు .  వేరే విధంగా  ఉపయోగించు కోడానికి  2 లేదా 3 నెలల కొక సారి  తీసుకోడానికి  ఇష్ట పడుతూ ఉండ వచ్చు . 

05. రేషన్ యాజ మానులు చిల్లర లేక  ఎక్కువ డబ్బు వసూలు  చేస్తుండ వచ్చు .  

06. రెక్కాడితే గాని డొక్కాడని చిరు ఉద్యోగులకు , రేషన్ షాప్ సమయాలు  కుదురక  పోవచ్చు . 

07. నాసి రకం సరుకులు  సరఫరా చేస్తుండ వచ్చు . 

08. రేషన్ యజమానులు  ప్రజలపై  చిరాకు పడుతూ ఉండ వచ్చు .  

అయితే  ఏమి చేయాలి ?

ప్రభుత్వ ముఖ్య లక్ష్యం , సంక్షేమ  పధకాలు  పేదలకు  అందించాలి మరియు దుర్వినియోగాన్ని  అరికట్టాలి. అంతే కదా .  అందుకు ఏమి  చేయాలంటే ,

01. నిష్పక్ష పాతంగా , పారదర్శకంగా  బోగస్  రేషన్ కార్డులను  గుర్తించి  రద్దు చేయాలి . 
02. అసలు  రేషన్ కార్డులకు  అర్హులు ఎవరో , ముందు నియమ నిబంధనలను రూపొందించాలి . 20 లక్షల కంటే  ఎక్కువ  విలువ గల సొంత ఇల్లు ఉండి , మరొక పోర్షన్ ను కిరాయికి  ఇచ్చి  జీవించే వారు  పేద వారు  ఎలా అవుతారు ?  కారు, ట్రక్కు , బస్సు , లారీ  ఉన్న వారు పేద వారు  ఎలా అవుతారు .  సాలుకు రూ . లు .   5 లక్షల కంటే ఎక్కువ   ఆదాయం  ఉన్న వారు       ( ఆదాయ పన్ను కట్టే వారు ) పేదలు ఎలా అవుతారు? ప్రభుత్వ పెన్షన్స్ ( ఆసరా పెన్షన్లు కాదు ) అందుకునే వారు పేదలు  ఎలా అవుతారు .  ఇలాంటి వారిని  గుర్తించి , బోగస్ రేషన్ కార్డులను  రద్దు చేయండి . 
03. రేషన్ బియ్యం  తీసుకుని , ఎదో విధంగా వినియోగించకుండా , ఎక్కువ ధరకు  అమ్మే వారిని గుర్తించి  కేవలం వారికీ  రేషన్ ను  రద్దు చేయండి . ( అంటే వారు  ఆ బియ్యం తిన లేరో , లేక  అవసరం లేదో )
03. ఆదే   విధంగా రేషన్ బియ్యం కొనే  దుకాణపు  దారులకు మొదటి సారి  రెండు రెట్లు , రెండవ సారి  5 రెట్లు , 3 వ సారి  10 రెట్లు  పెనాల్టీలు వేయండి . 
04. ఒక వేల  రేషన్ డీలర్ అమ్ముతున్నట్లైయితే  అలానే పెనాల్టీలు వేయండి . లైసెన్స్  రద్దు చేయండి . 
05. మరో క్యాటగిరీ  బియ్యాన్ని  కాస్త ఎక్కువ ధరకు , అంటే రూ . లు. 5/- లేదా  10/- కి  సరఫరా చేసే ప్రయత్నం   చేయండి . 
06. నాసి రకం సరుకులను , ఎక్కువ ధర గల  ప్రయివేట్  సరుకులను  బలవంతంగా  అంట గట్టకుండా  చర్యలు  చేపట్టండి .  సరుకులు  కొనే ఛాయిస్ ప్రజలకే ఉండాలి . 
07. ఒక  టైం ప్రకారం  రేషన్ షాపులు తెరిచే విధంగా చర్యలు చేపట్టండి .
08. తూకం  సక్రమంగా ఉండేట్లు  చూడాలి .  
09. డీలర్లకు సక్రమంగా , సహేతుకమైన కమీషన్లు చెల్లించాలి . 
10. ఒక వేల  ఏమైనా ఉంటే , ఇక నుండి ఎక్కడా అవినీతి ఉండ  కుండా చూడాలి . 
11. క్లోజింగ్ స్టాక్ ను బేస్  చేసుకుని , తదుపరి  నెల రేషన్ ను   పంపించండి .  
12. స్వైపింగ్ మెషన్ ద్వారా , ఈ  వ్యాలెట్ల ద్వారా  చెల్లింపులు చేయించండి . 

రేషన్ కార్డులను  " ఒక కార్డు - ఒక ప్రయోజనం " అనే విధంగా  రద్దు చేయడం కాకుండా, తెల్ల రేషన్ కార్డు లను అర్హులకే చేరేవిదంగా నియంత్రిస్తే సరి పోతుంది. రేషన్ సరుకులు దుర్వినియోగం కాకుండా చర్యలు  చేపడితే బాగుంటుంది .  విది విధానాలు రూపొందించి , అమలు చేస్తే సరి పోతుంది .

"అయితే  యే  రద్దు ప్రయత్నం చేసినా , ముందుగా  నల్ల ధన  కుబేరుల  భరతం పట్టండి . ఇలాంటి వారికి  ' సబ్సిడీ  గ్యాస్ వదులు  కొండి ' అని  ' రేషన్ వదులుకోండి , అని ' ఇతర సబ్సిడీలు వదులు  కొండి ' అని  బుజ్జగించడం గాని , బ్రతిమి లాడటం  చేయకండి . లంచాల  కుభేరులకు  సంక్షేమ  పధకాలు  అంద  కుండా  చూడండి . అవినీతి కోటీశ్వరుల  కూపీ లాగండి . వ్యవస్థలో  నిజాయితీ ఉందని నిరూపించండి . ఎలాంటి పక్ష పాతం  లేదని , ఎలాంటి స్వార్ధం లేదని  తెలియజేయండి . పారదర్శకత్వాన్ని  అమలు చేయండి .  ఆ విధముగా  సామాన్య ప్రజలు అవినీతికి , అడ్డ దారులకు పాల్పడకుండా  ఉండే విధంగా  వాతా వారణాన్ని కల్పించండి . అవినీతి  నల్ల కుబేరులపై   పంజా విసరాలి  గాని , సగటు పేదలపై  భ్రహ్మస్త్రం  వేయ రాదు . "
  
నేడు "తెల్ల రేషన్ కార్డులు"  రేషన్ షాపులలో  నిత్యావసర సరుకులను  కొనుక్కోవడానికి  కాకుండా , 'ఆరోగ్య శ్రీ' సేవలు పొంద డానికి మరియు ఫి రియంబర్స్ మెంటుకు , అడ్డ్రస్  ప్రూఫ్ కు , వోట్ వేయడానికి , బ్యాంకులో అకౌంట్ తెరవడానికి , రెండు పడకల గదుల  ఇండ్ల అర్హతకు మరియు  మరెన్నో  సంక్షేమ పథకాలకు  ఉపయోగ పడు చున్నవి . ఇలాంటి వాటిని , కొంత కాలం , లేదా పూర్తిగా రేషన్ తీసుకోక పోవడం  కారణంగా  రద్దు చేస్తామనడం సరి కాదు . అవసరమైతే రేషన్ మాత్రమే రద్దు చేయండి .  అంత వరకు  ప్రభుత్వానికి ఖర్చు మిగులు బాటు అవుతుంది . రేషన్ సరఫరా దారులు మోసాలు చేయ కుండా కట్టడి జరుగు తుంది . రేషన్ షాపులో  కాస్త మంచి బియ్యాన్ని  రెండవ  కాటగిరీలో రూ . లు . 5/- కు సరఫరా చేస్తే  ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది . ప్రయివేటు సరుకులను  ఎక్కువ ధర  సరుకులను , నాసి రకం సరుకులను అంట గట్ట కుండా నియంత్రిస్తే  బాగుంటుంది .  

నేడు అనేక మంది ధన వంతుల కు , స్వంత  గృహాలు  ఉండి , ఇండ్లను, ఫ్లాట్స్ ను  కిరాయీలకు ఇచ్చి దొరల్లా బ్రతికే వారికి , బడా వ్యాపారస్తులకు , ఆదాయా పన్నులు కట్టే వారికి , కార్లు , బస్సులు ఉన్న వారికి , భూములు ఆస్తులు ఉన్న వారికి , లక్షల్లొ బ్యాంకుల్లో నిధులు ఉన్నవారికి , ప్రభుత్వ ఉద్యోగస్తులకు , సం. రానికి 3 లక్షల కంటే ఎక్కువ ఆదాయం గల వారికి , రాజ కీయ నాయకుల , అధి కారుల అండతో "తెల్ల రేషన్ కార్డు లు" సులభంగా అందుతున్నాయి . ఇదంతా  కేవలం " వోట్ బ్యాంక్ " కోసమే  అనేది  పచ్చి నిజం .  అందుకని , కొన్ని నియమాలను  రూపొందించుకుని , వాటిని అతిక్రమించిన  అనర్హుల రేషన్ కార్డులను , బోగస్ రేషన్ కార్డులను , బినామి రేషన్ కార్డులను తొలగించాలి . తెలంగాణా లోగో ను ముద్రించి ఇష్యూ చేయాలి .

బోగస్ , బినామి "తెల్ల రేషన్ కార్డు లు" తొలగించడానికి , ప్రభుత్వ పరమయిన చర్యలే కాకుండా , ప్రజలు ఇన్ఫర్మేషన్ ఇవ్వ డానికి కొంత మొత్తం  పారి తోషికం, గుర్తింపు పత్రం ఇవ్వ చూపాలి . వారి వివరాలను గోప్యంగా ఉంచాలి , రక్షణ  కల్పించాలి . తెలుప వలిసిన సెల్  నెంబర్ , ఇ  మెయిల్ అడ్డ్రస్ , పోస్టల్ అడ్డ్రస్ అన్ని పేపర్లలో ప్రకటించాలి .

www.sollutions2all.blogspot.com

No comments: