Tuesday, December 27, 2016

పెద్ద నోట్ల రద్దుకు ( BAN OF HIGH VALUE NOTES) సంభందించి ప్రజల సందేహాలకు , సమాధానాలు :

 పెద్ద నోట్ల రద్దుకు  ( BAN OF  HIGH VALUE NOTES) సంభందించి  ప్రజల  సందేహాలకు , సమాధానాలు :

మనం  చూసే చూపును  బట్టి , యిష్టాన్ని  బట్టి   వస్తువు  గుణం , రంగు మారుతూ ఉంటుంది  . మనం ఆలోచించే  విధానాన్ని బట్టి  , మన ఆలోచనలుంటాయి . మనం  పాజిటివ్ గా  ఆలోచిస్తే , పాజిటివ్ ఆలోచనలే వస్తాయి . మనం  నెగెటివ్ గా  ఆలోచిస్తే  , నెగెటివ్  ఆలోచనలే  వస్తాయి .  పెద్ద నోట్లు రద్దయిన దగ్గరి నుండి  ప్రజలు  వివిధ  టి. వి. చానళ్లలో  వెలిబుచ్చే  సందేహాలకు , సమాధానాలు  ఇక్కడ పొందు పరుస్తున్నాను . 

ప్ర :01.  మోడీ  గారు మరియు  రిజర్వు బ్యాంక్   రూ . లు . 500/- , 1,000/- నోట్లను  రద్దు చేసి మరల అంతకంటే   పెద్ద నోట్లయిన  రూ . లు . 2,000/- ను  ఎందుకు  ముద్రించి నట్లు ?

జ .ఎ )  ఒకే సారి  పెద్ద నోట్లను  ఎక్కువ మొత్తములో   రద్దు చేయడం వలన , ప్రజలకు  కలిగే  ఇబ్బందిని  మరియు ఆర్ధిక వ్యవస్థ  చిన్నా  భిన్నం కౌకుండా  ఉండడానికి , తక్కువ సమయం లో , పెద్ద నోట్లతో  కాంపన్ షేట్  చేయడానికి  పెద్ద నోట్లను  ముద్రించడం  జరిగి యుండ వచ్చు.  

బి )  మరో కారణం కూడా ఉంది ఉండ వచ్చు . అది ఏమంటే , కొంత కాలం  తరువాత, ఎదో రకంగా  పెద్ద నోట్లన్నీ  నల్ల కుబేరుల , అవినీతి పరుల  వద్దకే చేరుతాయి . పేదలు , సామాన్యులు  పెద్ద నోట్లను  సాధారణంగా   ఎక్కువ కాలం నిలువ ఉంచు కోలేరు . కాబట్టి  కొంత కాలం తరువాత  మరల  వాటిని కూడా రద్దు చేస్తే , 100%  పెద్ద నోట్ల రద్దు విజయ వంతం అవుతుంది .  ఎందుకంటే  మరల వారు బ్యాంకుల లోనే డిపాజిట్ చేయాలి . ఇన్ని  రోజులు వారు  బ్యాంకులనుండి  ఎంత డ్రా చేశారో రికార్డులు బ్యాంకుల దగ్గర ఉంటాయి . అంత కంటే  ఎక్కువ డిపాజిట్ చేయడానికి వీలు  ఉండదు . ఇక  డైరెక్ట్ ఎక్చేంజ్ కు   బ్యాంకు లేదా  పోస్టాఫీసు  అకౌంట్లు లేని వారికి   మాత్రమే. అది కూడా కేవలం  కేవలం  రూ . లు . 10,000/- వరకు  పరిమితం  చేయాలి .  ఆ విధంగా  అవినీతి పరుల   కోట్లాది అక్రమ డబ్బు నిల్వలు  పనికి రాకుండా పోతాయి .  అందుకని ఇలాంటి ఆలోచన కూడా  మోడీ గారికి , రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కు ఉండ వచ్చు .  ఉంటే  మాత్రం  ఇది 100% విజయ వంతం అవుతుంది .     

ప్ర :02.  రిజర్వు బ్యాంక్  ఇప్పటి వరకు  , పెద్ద నోట్ల  రద్దు  చేసిన దగ్గరి నుండి   కనీసం  60 సార్లు  సవరణలు  చేశారు.  ఇంకా ఎన్ని సవరణలు  చేస్తారో   తెలియదు . ఇది ఎంత వరకు  సబబు ?

జ :   అవును . మొదట  నిర్ణయించిన  విధానాలకు అనేక మైన  సవరణలు చేశారు . ఇంకా చేయ వచ్చు కూడా .  అందుకు కారణం లేక పోలేదు . మనది  ప్రజా స్వామ్య దేశం . సుమారుగా 127 కోట్ల జనాభా  గల  దేశం . భిన్న  మతాలు , భిన్న కులాలు , భిన్న సంస్కృతి , భిన్న సాంప్ర దాయాలు , భిన్న ఆలోచనలు , భిన్న  ఆర్ధిక అవసరాలు  గల దేశం మనది .  ఇలాంటి దేశంలో , ముందు నిర్ణయించిన  విధానాలకే  కట్టుబడి ఉండి ,  ప్రజల అవసరాలకు  అనుకూలంగా , పరిస్థితులకు  అనుగుణంగా  సవరణలు  చేయక పోతే ,  అప్పుడు  ప్రజలే  వీరిని  నియంత , అని , హిట్లర్ అని , ముస్సోలిని  అని  అనవచ్చు  .  అలాంటి అపవాదు రాకుండా  ఉండ డానికి , ప్రజల అవసరాలకు  అనుకూలంగా , ప్రజల విన్నపాలను దృష్టిలో పెట్టుకుని , వారు పడే  బాధలను , కష్టాలను , అవసరాలను , సహకారాన్ని అందించే  రాజకీయ నాయకుల  వత్తిడులను  పరిగణలోకి  తీసుకుని , క్షణ క్షణానికి మారుతున్న పరిస్థితులను బట్టి , ప్రభుత్వం కొంత నష్ట పోయినా , ఒక మెట్టు దిగి వచ్చి , సామాన్య ప్రజలకు అనుకూలంగా  సవరణలు చేయడం జరుగుతున్నది .  ఇంత పెద్ద  కార్యక్రమానికి  99% ప్రజలు  సహనం తో , సపోర్ట్ చేస్తున్నారు .  కేవలం 1% మాత్రమే  వ్యతిరేకిస్తున్నారు . అలాంటి ప్రజానీకానికి  , వారికీ  అనుకూలంగా  , పెద్ద నోట్ల రద్దును విరమించుకోకుండా  , సవరణలు  చేయడంలో తప్పేముంది .  ప్రజల విన్నపాలను మన్నించ కుండా  , ఒక నియంతలా ప్రవర్తించడం మంచిదా ?  నల్ల కుబేరులను  అణిచి వేస్తూ ,  పేద మధ్య తరగతి ప్రజలకు  అనుకూలంగా  సవరణలు చేయడం మంచిదా ? మీరే  చెప్పండి . 
  
పెద్ద నోట్లు  రద్దు చేసే టప్పుడు  సమయం తక్కువ , కేవలం కొద్దిమంది మేధావులతోటే  సమాలోచనలు చేసి ఉండవచ్చు . రహస్యంగా  ప్రకటించాల్సిన పరిస్థితి . అప్పటి పరిస్థితులు వేరు . వారు దానికి అనుగుణంగానే  నిర్ణయాలు తీసుకుని  ఉండి ఉంటారు . మరల  ఇంత పెద్ద మొత్తంలో పెద్ద నోట్ల రద్దు అనేది , దేశంలోనే మొదటి సారి . ప్రపంచములోనే  రెండవ అతిపెద్ద  జనాభా గల దేశం మనది .  వీటికి తోడు   ఊహించని విధంగా  , కొన్ని బ్యాంకుల ద్వారా  పేక్  నోట్లను  గమనించడం  ,  ఆర్ . బి .ఐ .  బ్యాంకు , పోస్టాఫీస్ , సెక్యూరిటీ  ఉద్యోగులే  మోసాలకు  పాల్పడటం ,  కొందరు  కమీషన్లకు  కక్కుర్తి పడటం , ఒకే  వ్యక్తి  పది బ్యాంకులలో  డబ్బు  మార్చు కోవడం , ఒకే వ్యక్తి  10 ఏ . టి. ఎం . కార్డులను తీసుక వెళ్లి  డ్రా చేసుకోవడం , చేస్తులనుండి  పెద్ద మొత్తంలో కొత్త నోట్లు దరి మళ్లడం , అతి కొద్దీ సమయం  వెసులు బాటులోనే  వేల  కోట్ల రూపాయలతో  బంగారాన్ని కొనుగోలు చేయడం ,  మొదలైనవి  అనేకంగా  జిమ్మిక్కులు జరుగుతుండటం వలన , సవరణలు  చేయ వలసి  రావచ్చు .  ఇక ముందు  కూడా  చేయవలసి రావచ్చు . దీనిని మనం ( పేద మధ్య తరగతి ప్రజలు )  పాజిటివ్ గా అర్ధ చేసుకోవాలి .    

ప్ర :03.   రూ . లు . 2,000/- పెద్ద నోట్ల  వలన , మాకు చిల్లర దొరకక చాలా ఇబ్బంది అవుతుంది . దీనిని అధిగమించడమెలా ?

జ :  రూ . లు . 2,000/- పెద్ద నోట్ల  వలన ,  చిల్లర దొరకక  , ఒక వారం  పది రోజుల వరకు చాలా ఇబ్బంది అయ్యింది వాస్తవమే.  ఈ ఒక్క విషయంలో  ముందే  , రిజర్వ్ బ్యాంక్  చిన్న నోట్లయిన  రూ . లు . 100/-, 50/- , 20/-, 10/-, లను  ముద్రించి ఉంటే  బాగుండేది . దీని వలన ఎవరికీ , పెద్ద నోట్ల రద్దు గురించి అనుమానం వచ్చి ఉండేది  కాదు .  సమయం  తక్కువగా ఉండటం , అవి ఎన్ని ముద్రించినా  , పెద్దనోట్లకు  సరితూగవు అని అనుకుని  ఉండ వచ్చు . కానీ అవి పేదలకు ఎంతో ఉపయోగ  పడేవి.  అయితే అప్పటి వరకూ  పాత  నోట్లను , కొన్ని చోట్ల వాడ టానికి అనుమతి ఇచ్చారు .  ఆ తరువాత  డిజిటల్ విధానం  అందుబాటులోకి వచ్చింది . ఇవే కాకుండా , అప్పటికే   RTGS/NEFT/IMPS/ ATM CARDS/ DEBIT CARDS/ CREDIT CARDS/ SWIPING MACHINES/PAYTM  మొదలైనవి అందు బాటులో ఉన్నాయి . వాటిని ఉపయోగించుకుని  డబ్బును బదిలీ చేసుకోవచ్చు .  బిల్లులు చెల్లించ వచ్చు , వస్తువులు కొనుగోలు చేయ వచ్చు .  రైతు బజార్లలో  కూపన్స్ జారీ  చేయడం  ప్రారంభించారు .  ఆ తరువాత  మొబైల్ బ్యాంకింగ్ , కేవలం  ఆధార్ కార్డు నెంబరుతో  , బయో మెట్రిక్ విధానం ద్వారా   డబ్బు చెల్లించడం , వస్తువులు కొనుగోలు చేయడం  ప్రారంభించారు . రూ . లు . 500/- నోట్లు  కూడా  మెల్ల మెల్లగా  అందుబాటులోకి వస్తున్నాయి  .  అందుకని , రూ . లు . 2,000/- నోట్లను బ్యాంకుల లోనే  ఉంచి  నగదు రహిత విధానానికి  అలవాటు పడవచ్చు .  

మరో ముఖ్య విష్యం , ప్రస్తుత పరిస్థితులను  బట్టి  , ప్రతి ఒక్కరూ  రెండు బ్యాంకులలో  అకౌంట్  ఓపెన్ చేయాలి . లేదా ఒకటి  బ్యాంక్ లో  మరొకటి  పోస్టాఫీసులో  అకౌంటును  ఓపెన్ చేయాలి . ఒక అకౌంటుకు  ఆధార్  నెంబర్ లింక్ చేయాలి . దీనికి  డెబిట్ కార్డు  తీసుకోవాలి . ఈ అకౌంటు లో ఎప్పుడూ  కొంత మొత్తమే డబ్బు ఉంచి , బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్  చేయాలి . రెండవ అకౌంట్లో మిగిలిన పెద్ద మొత్తం ఉంచి , అవసరం ఉన్నపుడు , అవసరం మేరకు చిన్న మొత్తంలో , ఆధార్ లింకు చేసిన ( డెబిట్ కార్డు ఉన్న)  అకౌంట్ కు  ట్రాన్స్ఫర్ చేయాలి . రెండవ అకౌంట్ కు  చెక్ ఫెసిలిటీ గాని , విత్డ్రాయల్  ఫెసిలిటీ మాత్రమే ఉండాలి . దీని వలన  సైబర్  నేరాల నుండి  తప్పించుకునే  వీలు కలుగుతుంది .  

మొబైల్ ఫోన్ బ్యాంకింగ్  చేయాలనుకున్నప్పుడు , రెండు  ఫోన్లను ఉపయోగించాలి . ఒకటి కేవలం  ఫోన్  బ్యాంకింగ్ కొరకు , మరొకటి  పర్సనల్  యూస్  , డేటా సేవింగ్ కొరకు  ఉపయోగించాలి .   ఈ విధంగా చేయడం వలన  సైబర్ నేరాల వలన కలిగే  నష్టాన్ని మినిమైజ్  చేసు కోవచ్చు . 

అలానే  నెల  వారీ సరుకులను , మందులను , ఇతర వస్తువులను  పెద్ద నోట్లతో ఒక్క సారే తెచ్చు కోవచ్చు .   దీని వలన ఒక క్రమ శిక్షణ , పొదుపు , బ్యాంకింగ్ విధానం  అలవాటు అవుతుంది . ఒకో  సమయంలో   ఆర్ధిక కష్ట  నష్టాలను  ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో  అనుభవం వస్తుంది .  మరో విషయం ఏమంటే ,  మీరు డబ్బును బ్యాంకులోనే  ఉంచి  నట్లయితే , మీ ప్రతి రూపాయికి , ప్రతిరోజుకి  , సం . రానికి 4% చొప్పున  , బ్యాంకు వారు , ప్రతి 6 నెలలకు వడ్డీ జమ చేస్తారు .  మీరు పొదుపుగా డబ్బు వాడటం వలన ,  బ్యాంకులో  డబ్బు  పెరుగుతుంది  . అలానే దానిపైనా  వడ్డీ  లభిస్తుంది.  

ప్ర :04. రూ.లు. 500/- నోట్లనే  ముందుగా  ఎందుకు ముద్రించి  , బ్యాంకులకు సరఫరా చేయలేదు ? 

జ : రూ.లు. 500/- నోట్లనే  ముందుగా   ముద్రించి  , బ్యాంకులకు సరఫరా చేయక  పోవడానికి  కొన్ని కారణాలను  ఊహించ వచ్చు . అవి , మొదటిది . ముందుగా చెప్పుకున్నట్లు , ఈ నోట్లు , పెద్ద నోట్ల విలువను , అతి తక్కువ సమయంలో  కాంపన్షేట్  చేయలేక పోవచ్చని రిజర్వ్ బ్యాంక్  అనుకుని ఉండి  ఉండ వచ్చు . ఇక రెండో కారణం ,  డైరెక్టుగా డబ్బు మార్చే టప్పుడు  , బ్యాంకులో డిపాజిట్ చేసే టప్పుడు  , పాత 500/- నోట్లతో , కొత్త 500/- నోట్లు  మిస్యూస్ అయ్యే అవకాశముందని ఉహించి ఉండవచ్చు . బ్యాంకులో  అవసరాలకు డిపాజిట్ చేసే టప్పుడు  , డినామినేషన్స్  వేసే  అవసరం ఉంది .  అవి  పాత  నోట్లా  తెలియదు . అప్పుడు అవి మిస్యూస్ అయ్యే అవకాశముంటుంది .    

ప్ర : 05. ఈ పెద్ద నోట్ల రద్దు సమస్య  ఎప్పుడు తీరుతుంది ? ఇప్పటికీ  బ్యాంకుల ముందు , ఏ . టి . ఎం . ల ముందు  శాంతాడంత  బారులు కట్టి నిలబడుతున్నారు ?

జ :  పెద్ద నోట్ల రద్దు ప్రకటించి 46 రోజులు అయినా , ఈ నగదు సమస్య  తీరక పోవడానికి  అనేక కారణాలు ఉన్నాయి . అందులో  మొదటిది , నల్ల కుబేరుల  మనుష్యులే  బ్యాంకుల వద్ద  అధికంగా క్యూలు కడుతుండ   వచ్చు . దీని వలన  పేద , మధ్య తరగతి ప్రజలకు ఇబ్బంది కలుగుతుండ  వచ్చు .  రెండవది , ఆర్ . బి .ఐ .  బ్యాంకు , పోస్టాఫీస్ , సెక్యూరిటీ  ఉద్యోగులే  మోసాలకు  పాల్పడటం ,  కొందరు  కమీషన్లకు  కక్కుర్తి పడటం  వలన  నగదు ప్రజలకు అందుబాటులోకి రాకుండా పోయింది . మూడోది , పెద్ద మొత్తాలలో , చెస్టులనుండే  డైరెక్టుగా , అవి నీతి పరుల , నల్ల కుబేరుల వద్దకు  చేరడం  వలన  , బ్యాంకులలో నగదు నిల్వలు తగ్గి పోయాయి . నాలుగవది , ఇలా పట్టు బడ్డ  డబ్బు , పంచనామా జర్గి , విచారణ పూర్తయి , నల్ల డబ్బు అని నిర్ధారణ అయి , కోర్టు తీర్పు వచ్చే వరకు , ఆ పట్టుబడ్డ డబ్బును ఎవ్వరు ముట్టుకోడానికి వీలు లేదు . ఐదవది , ప్రజలు  ఇప్పడు కొంత పానిక్ గా మారి పోయారు . భయాందోలనకు  గురి అయి , ఏ అవసరాలు ఎప్పుడు వస్తాయో అని , బ్యాంకులో ఉంటే ఏమి వస్తుందని , ప్రతి రోజూ  నిల బడి  కొంత డబ్బును  డ్రా చేసుకుంటున్నారు . ఈ విధంగా  ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తగా  ఓ పది  వేలో , పాతిక వేలో నగదు ఇంట్లో  ఉండేటట్లుగా  డ్రా చేసుకుని  పెట్టుకుంటున్నారు .  

వాస్తవానికి  , గతంలో ఉన్నంత రద్దీ  బ్యాంకుల వద్ద , ఏ . టి . ఎం . ల  వద్ద ఇప్పుడు లేదు . క్రమంగా తగ్గి పోతుంది . డిజిటల్ విధానం పూర్తిగా అందుబాటులోకి వస్తే  మరియు  రిజర్వ్ బ్యాంక్  చిన్న నోట్లయిన  రూ . లు .500/- 100/-, 50/- , 20/-, 10/-, లను , అత్యిధికంగా  అందు బాటులోకి  తీసుక రాగలుగుతే  ఈ పెద్ద నోట్ల రద్దు సమస్య    తగ్గి పోతుంది .  ప్రజలు కూడా వాస్త వాలను అర్ధం చేసుకుని , భయపడకుండా , ప్యానిక్ గా మారకుండా , డిజిటల్ విధానాన్ని , పొదుపు విధానాన్ని ఆల వాటు  చేసుకున్నట్లయితే , ఈ సమస్య తీరడానికి   మరో 30 రోజులు పట్ట వచ్చు . 

www.sollutions2all.blogspot.com

No comments: