Tuesday, July 16, 2024

రక్షా బంధన్

శీర్షిక: రక్షాబంధన్

(అమ్మలోని మొదటి అక్షరం "అ" , నాన్న లోని చివరి అక్షరం "న్న" ని కలుపుతే వచ్చే వచ్చే పదం  "అన్న". ఈ బంధాన్ని కలకాలం నిలుపుకోడానికి సోదరులకు కట్టే రాఖీనే రక్షా బంధన్)

ప్రక్రియ: మణిపూసలు
(రూపకర్త: శ్రీ వడిచర్ల సత్యం)

పూర్వకాలమందునుండె
దేవత రాక్షసులకుండె
పుష్కరకాలము యుద్దము
ఇది అనాదిగ వస్తుండె!

యుద్దాల నడ్డుకొనను
తమను రక్షించుకొనను
దేవతలు రాఖి కట్టిరి 
ఇంద్రుడి కుడి చేతికిను!

ఇంద్రుడికి శక్తి వచ్చెను
దేవతలను రక్షించెను
అదియేశ్రావణపూర్ణిమ
మూడు లోకాలు మెచ్చెను!

అదే ఆనవాయితిగను
నేడు కొనసాగుతుండెను
సోదరి తన సోదరులకు
రాఖీని కట్టు చుండెను!

ఆపదల్లో ఉన్నపుడు
రాఖి కడుతే సోదరుడు
తమను రక్షించుతాడని
అనే విశ్వాసముమెండు!

సోదరులు బహుమానమును
సోదరిమణులకిచ్చియును
ప్రేమతోటి సాగనంపు
నదియె రాఖి పౌర్ణమియును!
            ....***....

యధా రాజా ,తధా ప్రజా!

 తేది: 13.08.2022


అంశం: స్వార్

శీర్శిక: యధారాజా తధాప్రజా


భగ భగ మండే వెలుగులతో

నవగ్రహాల రాజు  భాస్కరుడు

నవగ్రహాల రాణి చంద్రమతి

కోట్లాది తారలు, పంచ భూతాలు

నిత్యం డేగ కళ్ళతో  వీక్షిస్తున్నా!


చావడులు ఎన్ని ఉన్నా

చట్టాలు ఎన్ని ఉన్నా 

సి.సి. కెమరాలు ఎన్ని ఉన్నా

సి.బి.ఐ.లు ఎన్ని ఉన్నా

జీతాలను పెంచుకుంటూ

ఐదేళ్ళ సేవకే పెన్సన్లను తీసుకుంటూ

నటన చేస్తుండే స్వార్ధ నేతలు

విశ్వమంతా వ్యాపించే అవినీతిపరులు!


దీపముండగానే ఇల్లుచక్కబెట్టుకున్నచందాన

అధికారం చేపట్టి అందలమెక్కను

దేశ సంపదలను దోచుకునను

అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నా

రిజర్వేషన్లను కదిలించరైరి!


ఓటుబ్యాంక్ ను పదిలపరచుకుంటూ

ఏలు తుండిరి దేశాన్ని యధేచ్ఛగా

యధా రాజా తధా ప్రజ అన్నట్లు

సాగుతుండే లోకం

చావకుండ బ్రతుక కుండ 

గడుస్తుండే పేదల జీవితం!

ఎగరవే జాతీయ జెండా

దేశ భక్తి గీతం:

శీర్షిక: జాతీయ జెండా!

ఎగరవే.... ఎగరవే....జాతీయ జెండా
ఎగరవే ....ఎగరవే... మువ్వొన్నెల జెండా
పైపైకి ...ఎగరవే ... వజ్రోత్సవ జెండా!

ఝాన్సీ ,  అల్లూరి నేతాజీ
గాంధీ నెహ్రూ అంబేత్కర్
భగత్ సర్ధార్ మరెందరో 
త్యాగ మూర్తుల త్యాగఫలం
ఎగరవే ... ఎగరవే .. జాతీయ జెండా
ఎగరవే ...ఎగరవే... మువ్వొన్నెల జెండా
పైపైకి... ఎగరవే ... వజ్రోత్సవ జెండా!

ఇంటింటా ప్రతి యింటా
వాడ వాడన , ప్రతి బడినా
వీది వీదినా ప్రతి మదినా
దేశం రాష్ట్రాల నలుమూలలా
ఎగరవే ... ఎగరవే ..జాతీయ జెండా
ఎగరవే... ఎగరవే.. మువ్వొన్నెల జెండా
పైపైకి ..ఎగరవే... వజ్రోత్సవ జెండా!

ప్రజలకు ధైర్యాన్నిచ్చు జెండా
జనులకు శక్తి నిచ్చు జెండా
యువతకు ఊపిరి నిచ్చు జెండా
నరులలో ఐక్యత పెంచు జెండా
ఎగరవే ....ఎగరవే ..జాతీయజెండా
ఎగరవే.. ఎగరవే.. మువ్వొన్నెల జెండా
పైపైకి.. ఎగరవే... వజ్రోత్సవ జెండా!

కుల మతాలు నీకు లేవు
పేద ధనికకు తావు లేదు
ప్రాంతీయతలు  లేవు
పార్టీల సంకెళ్ళు నీకు  లేవు
ఎగరవే... ఎగరవే... జాతీయ జెండా
ఎగరవే...ఎగరవే.... మువ్వొన్నెల జెండా
పైపైకి...ఎగరవే...వజ్రోత్సవ జెండా!

ఏ దేశాన ఎగిరినా ఎనలేని గౌరవం
ఏ కాలాన ఎగిరినా ఎనలేని ఆనందం
ఎక్కడ ఎగిరేసినా ..ఉన్నతం నీ భావం
ఎప్పుడు ఎగరేసినా.. ఉన్నతం నీ స్వరూపం
ఎగరవే....ఎగరవే..జాతీయజెండా
ఎగరవే...ఎగరవే...మువ్వొన్నెల జెండా
పైపైకి ... ఎగరవే..వజ్రోత్సవ జెండా..!

దేశ గౌరవం పెంచను దేశ భక్తిని పెంచను
దేశ కీర్తిని పంచను దేశ సార్వభౌమత్వాలను నిలుపను
జనుల శక్తిని పెంచను
ఎగరవే... ఎగరవే...జాతీయ జెండా
ఎగరవే...ఎగరవే...మువ్వొన్నెల జెండా
పైపైకి ...ఎగరవే.. వజ్రోత్సవ జెండా!

పింగళి వెంకయ్య రూపుదిద్దిన
మూడు రంగుల జెండా
ముచ్చటైన జెండా
కాశాయం ,తెలుపు ,ఆకుపచ్చ
ధైర్యానికి ,శాంతికి పాడిపంటలకు చిహ్నాలు
అశోక ధర్మ చక్రం చైతన్యానికి చిహ్నాలు
ఎగరవే... ఎగరవే...జాతీయ జెండా
ఎగరవే...ఎగురవే...మువ్వొన్నెల జెండా
పైపైకి ...ఎగరవే...వజ్రోత్సవజెండా!

త్యాగమూర్తులను గుర్తుచేస్తూ
నవతారాలను మేల్కొల్పుతూ
వజ్రోత్సవాలు జరుపుకుంటూ
ఎగరవే... ఎగరవే...జాతీయ జెండా
ఎగరవే.. ఎగరవే..మువ్వొన్నెల జెండా
పైపైకి... ఎగరవే...వజ్రోత్సవ జెండా!
 

ప్రజలకో న్యాయం - పాలకులకో న్యాయమా ?

 శీర్శిక: ప్రజలకో న్యాయం - పాలకులకో న్యాయమా?


ఇంటిపై  పన్ను

పెట్రోల్ పై పన్ను

డిజిల్ పై పన్ను

ఏదీ అవినీతి నేతలపై పన్ను?


త్రాగే నీటిపై పన్ను

తినే తిండిపై పన్ను

సిగరెట్లపై పన్ను

ఏదీ అవినీతి సర్కారుపై పన్ను?


ఆల్కాహాల్ పై పన్ను

ఉద్యోగులపై వృత్తి పన్ను

ఉద్యోగులపై ఆదాయ పన్ను

ఏదీ నేతల జీతాపై పన్ను?


ఉద్యోగుల బోనస్ పై పన్ను

ఉద్యోగుల బత్తాలపై పన్ను

ఇతర ఆదాయాలపై పన్ను

ఏదీ నేతల ఇతర ఆదాయాలపై పన్ను?


వ్యాపారస్తుల ఆదాయాలపై పన్ను

ఆదాయపన్నులపై సర్ చార్జ్

ఆదాయపన్నులపై సెస్సు

ఏదీ ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై పన్ను?


టానిక్, మందుబిల్లలపై పన్ను

హాస్పిటల్ బిల్లులపై పన్ను

హాస్పిటల్ రూములపై పన్ను

ఏదీ సర్కారు అలసత్వంపై పన్ను?


ఆల్కాహాల్ పై టాక్స్

రహదారులపై టోల్ టాక్స్

వెహికిల్స్ పై టాక్స్

ఏదీ అక్రమ దోపిడిపై టాక్స్?


రాంగ్ రూట్ లో వస్తే చలాన్

త్రాగి డ్రైవ్ చేస్తే చలాన్

ఆక్సిడెంట్ జరుగుతే ఫైన్

ఏదీ ఉద్యోగుల లంచాలపై ఫైన్? 


వేహికిల్ రోడ్డుపై ఆగిపోతే ఫైన్

ఇన్స్యూరెన్స్ లేకపోతే ఫైన్

పొల్యూషన్ రషీదు లేకపోతే ఫైన్

ఏదీ ప్రజలను త్రాగుబోతులను చేస్తే ఫైన్?


నీటి బిల్లులపై పన్ను

కరెంట్ బిల్లులపై పన్ను

సినిమా టికెట్లపై పన్ను

ఏదీ చట్టాలను అమలు చేయకపోతే పన్ను?


కిరాణా షాపులపైనా పన్ను

ప్యాకింగ్ తో కూడిన ప్రతి వస్తువుపై పన్ను

ఇన్స్యూరెన్స్ ప్రీమియంపై పన్ను

ఏదీ నేతల పెన్సన్లపై పన్ను?


పెట్టుబడులపై పన్ను

స్కూలు ఫీజులపై పన్ను

కూడబెట్టుకున్న పొదుపుపై పన్ను

ఏదీ నల్లధనంపై,భూకబ్జాలపై పన్ను?

కాళన్నా /kalaña

 శీర్షిక: కాళన్నా! 

   ************* 

అన్యాయాలను  అక్రమాలను  ఏకి పారేసిన కాళన్నా!

ఫిరంగి లాంటి మాటలు ,నిప్పుకణికల్లాంటి కవితలతో కాళన్నా!

కవిత్వాన్ని కాలాతీతం చేసిన అక్షర నిధివి కాళన్నా!

"పుట్టుక నీది , చావు నీది  బ్రతుకంతా దేశానిదని"

అని ఆవేశాన్ని వెళ్ళగక్కావు కాళన్నా!

"అన్యాయాన్ని ఎదిరిస్తే  *నా గొడవ* కు  సంతృప్తని,

అన్యాయం అంతరిస్తే *నా గొడవ* కు ముక్తని ,

అన్యాయాన్ని ఎదిరించువాడే  నాకారాధ్యుడని"

అని కుండ బద్దలు కొట్టావు  కాళన్నా!

నాడూ తప్ప లేదు నీకు కవుల అంతరాలన్నా!

శ్రీవిశ్వనాధ , దేవులపల్లి , రాయప్రోలులకు

దక్కిన గౌరవాలు  నీకెక్కడివన్నా!

అయినా ,

కలం , కాగితం చేత పట్టకుండానే , భారత ప్రభుత్వ

*పద్మ విభూషణ్*  బిరుదాంకితుడివైనావు  కాళన్నా!

తెలంగాణా ప్రభుత్వమూ  ప్రకటించే నీ జయంతిని

*తెలుగు భాషా దినోత్సవం* గా కాళన్నా!


ఓ మనిషీ / Oh Manishi

 *మేడే సందర్భంగా*

అంశం: ఓ మనిషి


ఓ మనిషీ!

ముసి ముసి నవ్వులతో

మురిసి పోతున్నావు


కూసమిడిచిన పాము వోలె

బుస కొడుతున్నావు


ఎందుకో ఈ ఎగిసి పాటు

ఎందుకో ఈ మిడిసి పాటు

అహంకారం అసూయ అహంభావం వద్దు 

ఎందుకంటే 

రాత్రంతా కష్టపడి విరిసిన పుష్పానికే

తెలియదు తెల్లవారితే దాని పయనం 

దేవుడి గుడికో లేక శ్మశానానికో 

నిరు పేదలపై , అమాయకులపై

ఎందుకంత ఏవగింపు అసహనం 

సాటి మనిషిని మేటిగా చూడలేవు 


నీవు

అమ్మ కడుపు నుండీ గాక ఆకాశం

నుండి ఊడి పడ్డావా?

చదువుల సరస్వతిని గణపతి వోలె 

పుక్కెట పట్టి పుట్టావా?

బంగారు గనిని ధన లక్ష్మి వోలె

బుజాన పెట్టుకుని వచ్చావా?

లేక సంజీవిని హనుమంతుడి వలే

ఒక్క చేతితో ఎత్తుకొచ్చావా?

లేక శ్రీకృష్ణుడి వలే

గోవర్ధన గిరిని చిటికెన వేలుతో ఎత్తావా?

ఏమిటి నీ సత్తా?

అంతా నాకే తెలుసనే అహంకారమెందుకు?


అందరూ నాకంటే తక్కువనే

అహంభావ మెందుకు?


ఒక్క సారి ఆత్మ విమర్శ చేసుకో

"నేనూ ఒక మనిషినేనని గుర్తు పెట్టుకో"


కుల మత ప్రాంత భేదాలు సృష్టించి

రాష్ట్రాలలో , దేశాలలో

అల జడులు యుద్దాలు సృష్టిస్తావు


బ్యాంకులను కొల్లగొట్టి విదేశాల్లో దాక్కుంటావు

నోట్లను ఎరవేసి ఓట్లు దండుకుంటావు

అవినీతి ఓట్లతో అధికారం చేపడుతావు


పేదలను దోచుకుని విదేశీ బ్యాంకుల్లో 

వ్యాపార సంస్థలలో పెట్టు బడులు పెడుతావు

అమాయకపు అబలలపై అఘాయిత్యాలు చేసి

ఏమీ ఎరుగ నట్లు నటిస్తావు

ప్రశ్నించే గొంతుకలపై ఉక్కు పాదం మోపుతావు

నమ్మిన నరులను మోసం చేసి కోట్లు పోగేస్తావు

ఈ శరీరం ఈ సంపద 

నీ భార్యా పిల్లలు బంధువులు, మిత్రులు

శాశ్వతమనుకుంటున్నావా? ఎప్పటికీ కారు 

నీ నడ్డిని విరిచే రోజు దగ్గరలోనే ఉంది

నీకు గుణపాఠం చెప్పే రోజు అతి చేరువలోనే ఉంది

నీ పాపాల చిట్టా నిండు కుంటున్నది

తస్మాత్ జాగ్రత్త!

నీకు పడే శిక్షలు ఎక్కడో కాదు, 

మరెప్పుడో కాదు నీవున్న లోకాననే

అవీ నీవు బ్రతికుండగానే!


Sunday, July 7, 2024

భార్యను కోల్పోయిన భర్త (దీర్ఘ కవిత)( HUSBAND WHO LOST WIFE)

 వచన కవిత

శీర్షిక: భార్యను కోల్పోయిన భర్త

అందమైన తారలు
ఆకాశంలో మెరుస్తున్న
చూడ గలమే గానీ
తాకలేము

ఇష్టమైన భార్య
విశ్వంలో విహరిస్తున్నా
ఊహించ గలమే గానీ
మాట్లాడ లేము

వస్తువు విలువ
అది ఉన్నప్పుడు
తెలియదు
కానీ అది లేనప్పుడు
తెలుస్తుంది

భార్య విలువ
ఆమె ఉన్నప్పుడు
తెలియదు
కానీ ఆమె లేనప్పుడు
స్పష్టంగా
తెలుస్తుంది

భర్త లేకుండా
భార్య జీవించ గలదు
కానీ భార్య లేకుండా
భర్త జీవించడం
చాలా దుర్లభం 

ఒంటరి
ఆడ వారంటే
సమాజంలో
ఒక సానుభూతి
ఉంటుంది

ఒంటరి
మగ వారంటే
సమాజంలో
అసహనం 
ఉంటుంది 

ఏదేని
ఒక ప్రదేశానికి
వెళ్ళినా
ఒక ఫంక్షన్ కు
వెళ్ళినా
వెంట భార్య ఉంటేనే
భర్తకు గౌరవం
భార్య, భర్తకు
కొండంత ధైర్యం

ఒక సమస్య
వచ్చిందంటే
ఒంటరి స్త్రీ
ఎదుటి వారితో
చెప్పుకో గలదు
జాలి కలిగే టట్లు
ఏడ్వగలదు
సానుభూతి
పొందగలదు

భర్తను కోల్పోయిన
మహిళకు
తన తల్లి దండ్రుల
అన్న దమ్ముల
అక్కా చెల్లెండ్ల
సమాజం సానుభూతి
ప్రభుత్వ సహాకారం
ఉంటుంది
తన పిల్లలను
పోషించు కోగలదు
తానూ జీవించ గలదు

భార్య లేని భర్త
తన సమస్యను
ఎవరికీ చెప్పుకోలేడు
ఏడ్చే హక్కు 
పుట్టుకతోనే కోల్పోతాడు
గత్యంతరం లేక లోలోనే
మధన పడుతాడు

భార్యను
కోల్పోయిన భర్తకు
ఎవరు సహకారం
అందించరు
సమాజంలో
గౌరవం
దొరకదు
తీసుకుందా మనుకున్నా
అహం అడ్డు వస్తుంది

భర్త లేని స్త్రీలు
మగవారితో
నవ్వుతూ
మాట్లాడారంటే
ఆనందంలో
ఏదో ఒక సహాయం
తక్షణమే లభిస్తుంది

భార్య లేని పురుషులు
ఆడవారితో
నవ్వుతూ
మాట్లాడారంటే
అనుమానిస్తారు
ఆవేశంతో
ఊగిపోతారు
ఆమడ దూరంలో
ఉంచుతారు

ఒంటరి స్త్రీలు
తమ ఇంటి పనులను
వంట పనులను
చక్కగా చేసుకోగలరు
ఒక్క ఐదవ తనం
పోతుందే తప్పా
స్వేచ్ఛగా
హాయిగా
జీవించ గలరు

నాలుగు రోజులు
ఊరికి పోతేనే
ఇల్లు పెంట కుప్ప
అవుతుంది
ఒంటరి పురుషులు
ఇంటి పనులు
చేసుకోవడం
వంట పనులు
చేసుకోవడం
కష్ట తరంగా
మారుతుంది

ఎన్ని ఆస్తులున్నా
ఎంత డబ్బున్నా
ఎంత గొప్ప
ఉద్యోగం చేస్తున్నా
ఎంత పెద్ద
వ్యాపారం చేస్తున్నా
ఎంత పెన్షన్ వచ్చినా
ఇంటికి వచ్చేసరికి
మాట్లాడేందుకు
గ్లాసెడు మంచినీరు
ఇచ్చేందుకు
కప్పెడు కాఫీ
ఇచ్చేందుకు
బాధలు
పంచుకునేందుకు
భార్య లేకుంటే
ఆ జీవితం నరకం
అనుభవిస్తే గానీ
బాధేమిటో
తెలియదు 

డబ్బుంటే
పని మనిషిని
పెట్టు కోవచ్చను కుంటారు
పనులు
చేయించుకోవచ్చనుకుంటారు
స్విగ్గీతో
జుమాటాతో
ఆన్లైన్లో 
కాళ్ళ వద్దకు ఆహారం
తెప్పించుకోవచ్చనుకుంటారు

ఏ పని మనిషైనా
ఏ ఆన్లైన్ వారైనా
ఎంత డబ్బు చెల్లించినా
పని చేసి
వెళ్లి పోతారు తప్పా
ప్రక్కన కూర్చుని
స్వాంతన నివ్వరు
ధైర్యాన్ని ఇవ్వరు
సేవలు చేయరు

ముసలి తనంలో
ఓ టాబ్ లెట్
అందివ్వాలన్నా
ఓ హాస్పిటల్ కు
వెళ్ళాలన్నా
అర్ధ రాత్రి వేల
మంచి నీళ్ళు
కావాలన్నా
భార్య లేని జీవితం
నరకం
అది అనుభవిస్తేనే
అర్ధమవుతుంది

పిల్లలు ఉన్నా
రెక్కలు వచ్చిన పక్షుల్లా
వారి ఉద్యోగాలు
ఎక్కడెక్కడో
కలిసి ఉన్నా ...
సేవలందించే
కొడుకులు కోడళ్ళు
కూతుర్లు అల్లుండ్లు
చాలా అరుదు

ఆరు పదులు
దాటిన పెద్దలకు
కొడుకులు కోడళ్ళు
కూతుర్లు అల్లుండ్లు
బాధ్యతతో
మానవత్వంతో
సేవలందించాలి
కంటికి రెప్పలా
కాపాడాలి

లేదా
పెద్ద మనసుతో
కోరుకునే
ఒంటరి మహిళలతో
వివాహం జరిపించాలి

ఈ సమాజంలో
ఎలాగైనా జీవించగలను
అనే మానసిక స్థైర్యం వలన
భర్తలు లేని స్త్రీల ఆయుష్షు
పెరుగుతుంది

ఈ సమాజంలో
ఆస్తులు, సంపదలున్నా
డబ్బు, పెన్సన్లున్నా
పేరు, ప్రతిష్ఠలున్నా
అనారోగ్యం
జీవించే మానసిక ధైర్యం
లేక పోవడంతో
భార్యలు లేని
పురుషుల ఆయుష్షు
తగ్గుతుంది

ఒక అర్ధాంగిగా
ఒక తల్లిగా
ఒక చెల్లిగా
ఒక అక్కగా
ఒక వదినగా
ఒక డాక్టర్ గా
ఒక ఆర్ధిక వేత్తగా
ఒక ఉద్యోగిగా
ఒక సలహాదారుగా
ఒక సేవకు రాలిగా
బహుముఖ ప్రజ్ఞాశాలి
భార్య

అందుకే
భార్య భర్తలు
బ్రతికున్నంత కాలమైనా
ప్రేమగా , సంతోషంగా
ఆనందంగా
కాలం గడపాలి
కష్ట సుఖాలు
పంచుకోవాలి
భాద్యతలను
నెరవేర్చుకోవాలి
రేపటి తరానికి
ఆదర్శంగా నిలువాలి

పురుషులు
మొదటి నుండే
మనసును సిద్ధం
చేసుకోవాలి
ఇలాంటి ఒక రోజు
వస్తుందని గుర్తించాలి
పాజిటివ్ ఆలోచనలు
పెంచుకోవాలి

ఒక వయసు దాటాక
ఒంటరి జీవితం
ప్రాక్టీస్ చేయాలి
ఆర్ధిక స్థోమత
పెంచుకోవాలి
అనారోగ్యం లేకుండా
చూసుకోవాలి
అందరితో కలుపుగోలుగా
ఉండాలి
స్థోమతకు తగ్గ
దాన గుణం
సేవా గుణం 
ఏదో ఒక వ్యాపకం 
అలవర్చుకోవాలి
అప్పుడప్పుడు
చిన్న చిన్న బహుమతులు
పిల్లలకు ఇవ్వాలి

నా డబ్బు
నా ఆస్తులు
నా ఇష్టమని
చెడు అలవాట్లకు
బానిసలు
కాకూడదు
సరియైన ఆహారం
తీసుకోవాలి
సేవాకార్యక్రమాలలో
ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో
యోగాసనాలలో
ఇష్టమైన వృత్తులలో
నిమగ్నమై పోవాలి
ప్రకృతిపై
దృష్టి మరల్చాలి

దేని పైననూ
ఆశలు,
కోరికలు
పెంచుకో కూడదు
ఎవరిపైననూ
కోపం, తాపం
ఈర్ష్య, అసూయ
మోహం,
మాత్సర్యాలను
చూపకూడదు

ఈ లోకంలో
ఏ వస్తువు
ఏ మనిషీ
ఏ జీవి
శాశ్వతం కాదనీ
గుర్తుంచు కోవాలి
విధి రాతను
ఎవరు తప్పించ లేరు

జీవించినంత కాలం
భార్య లేని భర్తలు
ప్రశాంతంగా
సంతోషంగా
జీవించడం
అలవర్చుకోవాలి

Monday, July 1, 2024

మానవ విలువలు (HUMAN VALUES)

వచన కవిత 
శీర్షిక: మానవ విలువలు 

 స్వేచ్ఛంటే 
 ఇదేనా 
 లిబరలైజేషనంటే 
 ఇదేనా 
 ప్రవైటేజషనంటే 
 ఇదేనా 
 గ్లోబలైజేషనంటే 
 ఇదేనా 
 మేధావులు సాధించిన 
ఘనత ఇదేనా 

 కాలువలకు 
 అడ్డుకట్టలు 
 వేయవచ్చు గానీ 
 సముద్రాలకు 
నదులకు 
 అడ్డు కట్టలు 
వేయడం 
సాధ్యం కాదనో ఏమో 

 ఏమిటో 
 ఈ చట్టాలు 
 కేసులను 
 తగ్గించాలని 
 కాబోలు 

 సహజీవనం 
 చేయవచ్చని 
 బలవంతాలు 
 రేప్ లు చేయకూడదని 
మేజర్లై ఉంటే చాలనే 
ఉభయులకు 
 ఇష్టాలుంటే చాలనే 

 పాశ్చాత్య పోకడలు 
 పెరుగు తుండే 
వోయోలు 
 నిండిపోతుండే 
 రేవ్ పార్టీలు 
 జరుగుతుండే 
 లివింగ్ రిలేషన్ షిప్ 
 సంస్కృతి 
 విజృంభిస్తుండే 

 ఎవరు 
ఎవరితోనో 
 తిరుగుతుండే 
 వావి వరసలు 
 లేకుండే 

 వయసు భేదం 
 తెలియకుండే 
 వివాహికులా 
 అవివాహికులా 
 పట్టింపులు 
లేకుండే 

 నిండు 
సంసారాలు 
 సాగర
తీరాలవుతుండే 

 పెళ్లికి ముందే 
 అగ్రిమెంట్లు 
 రిలేషన్ షిప్ 
 విత్ బెనిఫిట్స్ 

 కలిసి 
జీవించవచ్చు 
 ఏమైనా చేసుకోవచ్చు 
 మల్లీ బయట 
 ఎవరి 
పర్సనల్ లైఫ్ 
 వారిదే 

 ఎవరు 
ఎవరి తోనైనా 
 తిరుగ వచ్చు 
 ఎంజాయ్ చేయవచ్చు 

 అగ్రిమెంట్ 
కాలంలో 
 మనసులు శరీరాలు 
 కలిస్తే పెళ్లి 
 లేదంటే లొల్లి 
 ఎవరి దారి వారిదే 
 లేదంటే గోదారే 

 ఇదేనా 
 భారతీయ వేదాలలో 
 పురాణాలలో 
 ఇతిహాసాలలో 
ఉన్న సారం ?

 ఇదేనా 
 భారతీయ సంస్కృతి ?
 ఇదేనా 
 ఋషులు 
ప్రసాదించిన 
 భారతీయ విశిష్టత ?

 ఇదేనా 
 భారతీయ 
పెళ్లి గొప్ప తనం ?

 ఇదేనా 
 నూరేళ్ళ 
వివాహ బంధమంటే ?

ఆకు మీద 
 ముల్లు పడ్డా 
 ముల్లు మీద 
 ఆకు పడ్డా 
 జరిగిన నష్టం 
 పూడ్చ లేనిది 
 కలిగిన కష్టం 
 తీర్చ లేనిది 

 మానవ విలువలు 
 రేపటి తరాలకు 
 ఆస్తులు 

 మానవ విలువలు 
వెలకట్టలేని 
 సంపదలు 

 విలువలను 
 కాలదన్నిన రోజు 
 రేపటి తరాల జీవితాలు 
 అగమ్య గోచరాలు!

Friday, May 31, 2024

వివాహ వ్యవస్థ - సహజీవన వ్యవస్థ

 వచన కవిత 

శీర్షిక: వివాహ వ్యవస్థ - సహజీవన వ్యవస్థ 

రోజు రోజుకుమానవ

సంబంధాలు

దిగజారి పోతున్నాయి
ఒకరిపై ఒకరికి
ప్రేమలు గౌరవాలు
తగ్గి పోతున్నాయి
వివాహ వ్యవస్థపై
కుటుంబ వ్యవస్థపై
నమ్మకాలు
కరిగిపోతున్నాయి

అక్కడక్కడ
జీడి గింజల్లాంటి
హీనుల వలన
గురువింద గింజల్లాంటి
నీచుల వలన
సమాజం
భ్రష్టు పట్టి పోతుంది!



విధి రాతను
ఎవరూ తప్పించ లేరు
తల రాతను
ఎవరూ మార్చ లేరు !

భార్యది ఒక వంశము
భర్తది ఒక వంశము
భార్యది ఒక గోత్రం
భర్తది ఒక గోత్రం
భార్యది ఒక ఊరు
భర్తది ఒక ఊరు
భార్యది ఒక కులం
భర్తది మరొక కులం కావచ్చు
భార్యది ఒక మతం
భర్తది మరొక మతం కావచ్చు
భార్యది ఒక దేశం
భర్తది మరొక దేశం కావచ్చు
భార్య స్వభావం భార్యది
భర్త స్వభావం భర్తది
భార్య ఆలోచనలు భార్యవి
భర్త ఆలోచనలు భర్తవి
భార్య కోరికలు భార్యవి
భర్త కోరికలు భర్తవి
భార్య జీన్స్ భార్యవి
భర్త జీన్స్ భర్తవి
ఒకరి ఆలోచనలు
మరొకరికి కలువక పోయినా
ఒకరి యిష్టాలు
మరొకరికి కష్టమైనా
ఒకరి స్వభావం
మరొకరికి నచ్చక  పోయినా
ఒకరి స్వేచ్ఛకు
మరొకరు అడ్డుతగిలినా
ఒకరి కోరికలకు
మరొకరు భంగం కలిగించినా
భర్తకు భార్యే
యమురాలవుతుందో
భార్యకు భర్తే
యముడవుతాడో
ఎవరికీ తెలియదు


పిల్లలకు తల్లిదండ్రులే
యమదూతలవుతారో
తల్లి దండ్రులకు పిల్లలే
యమదూతలవుతారో
ఎవరూ కాన లేరు

రోజు రోజుకు
మానవ సంబంధాలు
అదుపు తప్పుతున్నాయి
ఒకరిపై ఒకరికి
ప్రేమలు, గౌరవాలు
తగ్గిపోతున్నాయి
వివాహ వ్యవస్థపై
కుటుంబ వ్యవస్థ పై నమ్మకాలు
మృగ్యమవుతున్నాయి!

కాలం గడుస్తున్న కొద్దీ
తరం మారుతున్న కొద్దీ
మనుష్యుల జీవితాలు
యాంత్రికంగా మారుతున్నాయి
ఒకరికోసం ఒకరు బ్రతకాలన్న
ఆశలు మృగ్యం మవుతున్నాయి

ఒకరు పోతే మరొకరు
స్వేచ్ఛగా బ్రతుకవచ్చన్న
ఆశలు చిగురిస్తున్నాయి
ఒంటరి జీవితానికే
మొగ్గుచూపుతున్నారు
ఒంటరైన వాండ్లను చూస్తూ
ఎంతో హాయిగా, స్వేచ్ఛగా
జీవిస్తున్నారని
మదన పడుతున్నారు
చర్చించుకుంటున్నారు

రోజు రోజుకు
మానవ సంబంధాలు
హీన మవు తున్నాయి
ఒకరిపై ఒకరికి
ప్రేమలు, గౌరవాలు
తగ్గిపోతున్నాయి
వివాహ వ్యవస్థపై
కుటుంబ వ్యవస్థ పై నమ్మకాలు
కరిగి పోతున్నాయి!

రూపాయి రూపాయి కూడ బెట్టి
ఎవరు ఎవరి కోసం పొదుపు చేయాలనీ
తిన కుండా త్రాగ కుండా మదుపు చేసి
ఇన్స్యూరెన్స్ ఎవరు ఎవరికోసం కట్టాలనీ
రేయింబవళ్ళు శ్రమించి
ఎవరు ఎవరి కోసం ఆస్తులు కూడ బెట్టాలనీ
వాపోతున్నారు

ఒంటరి జీవితం కొరకు
ఒంటరి స్వేచ్ఛ కొరకు
జనాలు పెంపర్లాడుతుంటే
బ్రతకడానికి సరిపడ సంపాదిస్తే
చాలనుకుంటున్నారు

రోజు రోజుకు మానవ సంబంధాలు
మసక బారుతున్నాయి
ఒకరిపై ఒకరికి ప్రేమలు, గౌరవాలు
తగ్గి పోతున్నాయి
వివాహ వ్యవస్థపై
కుటుంబ వ్యవస్థ పై నమ్మకాలు
మసకబారు తున్నాయి!

ఇంటి పెద్దలు మరణించినా
భాగస్వామి మరణించినా
ఇంట్లో వారి ఫోటో
అస్తికలు కలుపు వరకే
వారి ఆనవాలు వద్దని గోల
కర్మలు చేయవద్దని రబస
మాషికాలు , తద్దినాలు
వాళ్ళు చూస్తున్నారా
అని హేళన

సంస్కృతి
సాంప్రదాయాలను
హేళన చేస్తే
మనుషులకు
జంతువులకు
తేడా ఉండదు


దహన
సంస్కారాలు
కర్మలు
మాషికాలు
తద్దినాలు
జరిపించకుంటే
పితృ దోషాలు
తప్పవు
తరతరాలకు
పితృ దోషాలు
నీడలా
వెంటాడుతాయి

రోజు రోజుకు
మానవ సంబంధాలు
మంట కలుస్తున్నాయి
ఒకరిపై ఒకరికి
ప్రేమలు, గౌరవాలు
తగ్గి పోతున్నాయి
వివాహ వ్యవస్థపై
కుటుంబ వ్యవస్థపై నమ్మకాలు
క్షీణించి పోతున్నాయి!

నేటి తరానికి
వివాహ వ్యవస్థపై కంటే
సహజీవన వ్యవస్థపైననే
మక్కువ పెరుగుతుంది ! 

Friday, May 24, 2024

అమ్మ (MOTHER)

 వచన కవిత

శీర్షిక : అమ్మ


(ముందుగా "మాతృ మూర్తి రోజు" శుభాకాంక్షలు)

అమ్మ
అమ్మంటే ఆత్మీయత
అమ్మంటే అనురాగం
అమ్మంటే అపురూపం
అమ్మంటే ఆణిముత్యం!

సృష్టికి మూలం అమ్మ
సృజనకు ప్రతి రూపం అమ్మ !

జన్మ నిచ్చేది అమ్మే
జన్మ రహస్యం తెలిసేది ఒక అమ్మకే!

జగతిలో అమ్మకు అమ్మే సాటి
అమ్మకు లేరు ఎవరూ పోటి!

కని  పెంచేది అమ్మ
కంటికి రెప్పలా కాపాడేది అమ్మ !
విశ్వాన్ని చూపేది అమ్మ
విజయాన్ని కాంక్షించేది అమ్మ !

రక్షణకు నెలవు అమ్మ
శిక్షణకు నెలవు అమ్మ
నిస్వార్ధానికి ప్రతీక అమ్మ
త్యాగానికి ప్రతీక అమ్మ!

కాలికి ముల్లు గుచ్చినా
కంటిలో నలుసు పడినా
మనసుకు గాయమైనా
అమ్మా.. అని అమ్మనే స్మరిస్తాం!

అమ్మ గుణం మంచైనా, చెడైనా
అమ్మది శుక్ల రూపమైనా, కృష్ణ రూపమైనా
అమ్మ కుంటి వారైనా ,గూని వారైనా
అమ్మ గుడ్డి వారైనా ,ఎడ్డి వారైనా
అమ్మ పేద రాలైనా, ధనికు రాలైనా
అమ్మ వయసు రాలైనా, ముసలి వారైనా
అమ్మ గుణం మంచైనా, చెడైనా
అమ్మది శశి రూపమైనా, కృష్ణ రూపమైనా
అమ్మ అమ్మే
అమ్మది దైవ స్వరూపం
అమ్మకు  రారు ఎవరూ సాటి
అమ్మకు లేరు ఎవరూ పోటీ!

అమ్మ ఒక ఆత్మ
అమ్మ ఒక పరమాత్మ
అమ్మ ఒక దైవం
అమ్మ ఒక దైవాంశ సంభూతం!

లాభ పడడానికి
అమ్మను క్షోభ పెట్టకు
పరువు కోసం
అమ్మకు చెరుపు చేయకు
హోదా పెరిగిందని
అమ్మను బాధ పెట్టకు !


అమ్మకు ప్రేమను పంచుదాం
అమ్మ ప్రేమకు పాత్రులమవుదాం
అమ్మకు సేవలు చేద్దాం
అమ్మ ఆశీస్సులు పొందుదాం!


కర్మ సిద్ధాంతం (PRINCIPLE OF WORK)


వచన కవిత
శీర్షిక: కర్మ సిద్ధాంతం


సృష్టి
విచిత్రమైనది
ప్రకృతి
శక్తివంతమైనది

భూమి
నిత్యం
తన చుట్టూ
తాను తిరుగుతుంది
సూర్యుడి చుట్టూ
తిరుగుతుంది
పగలు రేయిని
ఏర్పరుస్తుంది

భానుడు
ప్రతినిత్యం
తూర్పునే
ఉదయిస్తాడు
పడమరనే
అస్తమిస్తాడు


సృష్టికి
లోకంలో
అందరూ
సమానమే

వారు
సెలబ్రిటీలా
రాజకీయ నాయకులా
ధనవంతులా
పేద వారలా
పండితులా
పామరులా
మాట కారులా
మూగ వారలా
దానికి
సంబంధం లేదు
విధి రాతను
ఎవరూ
మార్చ లేరు

కర్మ
సిద్ధాంతం
ఎప్పటికీ
మారదు

తెలిసి చేసినా
తెలియక చేసినా
కర్మ కర్మే
కర్మ
నీడలా
వెంటాడుతూనే
ఉంటుంది

యోగాలు
చేసినా
యాగాలు
చేసినా
లాయర్లకు
కోట్లు వెదజల్లినా
చట్టాలను
అనుకూలంగా
మార్చుకున్నా
జనులను
మభ్యపెట్టినా

కోట్లు
కూడ బెట్టినా
లక్షలు
ఖర్చు పెట్టినా
శిక్షలు
పడక తప్పవు

నేడు
భార్యా
ఇద్దరు పిల్లలు ఉండి
భార్యా పిల్లలను
అనాధలను చేసి
ప్రకృతిని ధిక్కరించిన
రావణ కావచ్చు

భర్తా
ఇద్దరు పిల్లలు ఉండి
భర్తా పిల్లలను
దిక్కు లేని వారిని చేసి
కర్మను కాలదన్నిన 
పదేళ్లు పెద్దదైన
రక్కసి కావచ్చు

రేపు
మరొకరు కావచ్చు
మరో సంఘటన కావచ్చు
ఏదైనా
కర్మ సిద్ధాంత
ఫలితమే !

నిప్పు (FIRE)P

 వచన కవిత

శీర్షిక: నిప్పు


ఆకాశంలో
ఉరుములు మెరుపులు
అంతలోనే
కుంభ వర్షం
కాసేపట్లోనే
బీభత్సం
మరికాసేట్లోనే
ప్రశాంతత
అంతా
ప్రకృతి విచిత్రం

భూమి పైన
మనుషులు
ఎన్ని వేషాలు
ఎన్ని యాసలు
ఎన్నియో భాషలు
ఏమి విలాసాలు
ఎన్ని అట్ట హాసాలు

ఈగ
వాలకుండా
చుట్టూరా
రక్షక భటులు
పిలుస్తే వాలే
పరిచారకులు!

బండ్లు
ఓడలవుతాయి
ఓడలు
బండ్లవుతాయన్నట్లు

కాలాన్ని
ఎవరు
ఎదిరించగలరు?
ప్రకృతిని
ఎవరు
శాసించ గలరు?

ఒకే సారి
నింగిలోకి ఎత్తుతుంది
ఒకే సారి
అతః పాతాళానికి తొక్కుతుంది

కాలం గిర్రున తిరిగే
కళ్ళెదుటే గూడు
కదులుతుండే నేడు !

అయినా
మేక పోతు
గాంభీర్యం
లేదు
ఏ కొంచెమైనా
ఔదార్యం

ఏదీ
రాజ సింహాసనం
మసక బారే
పరువు ప్రతిష్ట
కంటికి కానరాని
రక్షక భటులు
కనుమరుగైన
పరిచారకులు!


శిశిర
ఋతువులో
రాలు తున్న
చెట్ల ఆకులలా
చెట్టు కొకరు
పుట్ట కొకరు

పిలిచినా
పలుకని
బంధు మిత్రులు
అరిచినా
కసురుకునే పనివారలు
సహకరించని
కాళ్ళు చేతులు!

నింగిలో
నక్షత్రాలు
ఎన్ని ఉన్నా
ఏమి ఫలం
అవి
ప్రకాశించక పోతే
ఎంత విద్య నేర్చినా
ఏమి లాభం
వినయమనేది 
లేకపోతే
భూకబ్జాలెన్ని చేసినా
ఏమి భాగ్యం
భూమికే
భారమై పోతే!

కాయవల్లే వగరు
కులం వల్లే పొగరు
గర్వం అనేది
బుసలు కొడితే
సర్వం
కోల్పోక తప్పదు !

అర్ధం
చేసుకోలేని
మనిషికి
ఎంత చెప్పినా
వ్యర్ధమే

చెవిటి
వాడి ముందు
శంఖం
ఊది నట్లే

*నిప్పు*
రగులు కున్నాక
మండ కుండా
ఆరుతుందా!

తప్పు
చేశాక
రాజైనా భటుడైనా
శిక్ష పడక
తప్పు తుందా!

Saturday, May 11, 2024

భారత దేశ ఆశా జ్యోతి శ్రీ నరేంద్ర మోడీ

 లఘు కవిత


శీర్షిక: భారత దేశ ఆశా జ్యోతి
శ్రీ నరేంద్ర మోడీ
(ప్రక్రియ: మణి పూసలు
రూపకర్త: శ్రీ వడిచర్ల సత్యం గారు)
01.
పేద తనమున పుట్టాడు
టీ అమ్మి జీవించాడు
దామోదర్ దాస్ మోడి
హీరాబెన్ లా తనయుడు
02.
కార్యదక్షత గలవాడు
గొప్పా త్యాగ శీలుడు
మానవతా వాదియు
అద్వితీయ దార్శనికుడు
03.
దేశభక్తిగల ధీరుడు
పోరాటాలా యోధుడు
ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త
నిత్యా చైతన్య పరుడు
04. 
మహా జ్ఞానవంతుడు
అతి నిరాడంబరుడు
నిస్వార్ధ పరుడేకాదు
నిజాయీతీ పరుడు
05.
బహుభాషా కోవిదుడు
కవి రచయిత ,పండితుడు
విశ్వ జనుల ఆలంబన
గొప్ప ఉపాన్యాసకుడు
06.
గొప్ప సంస్కరణవాది
మహా వేదాంత వాది
నివురుగప్పిన నిప్పు
మంచి మానవతవాది 
07.
చేయును నిత్యం ధ్యానం
అమ్మంటె పంచ ప్రాణం
విదేశాల్లో ముఖ్యులకు
యిచ్చు గీత బహుమానం
08.
గుజరాత్ లో ముఖ్యమంత్రి
దేశ విదేశాన మైత్రి
మౌన మునిగా నేడు
భారతప్రధానమంత్రి
09.
తలాక్ ను రద్దుచేసాడు
కశ్మీరు కలిపేశాడు
ఆర్ధిక పరిస్థితులనూ
గాడిలోనా పెట్టాడు
10.
నల్లధనం అరికట్టను
అవినీతిని తగ్గించను
పెద్దనోట్ల రద్దుచేసి
కొత్తవి, ప్రవేషపెట్టెను
11.
కరోనాను అరికట్టిరి
ప్రజలనెల్ల ఆదుకునిరి
అందరినీ ఒప్పించి
అయోధ్యనూ నిర్మించిరి
12.
పెంచె జగతిలో ఖ్యాతి
పెట్టె శత్రువుకు భీతి
దేశ జనుల రక్షకుడు
భారత ఆశా జ్యోతి

Wednesday, May 8, 2024

దిక్కు లేని పక్షులు

అంశం: సామాజికం

శీర్షిక: "దిక్కు లేని పక్షులు"
ప్రక్రియ: మణిపూసలు (లఘు కవితలు)
(రూప కర్త: శ్రీ వడిచర్ల సత్యం )

పరువుగల కుటుంబం
అన్యోన్య కుటుంబం
చిన్న మనస్పర్ధలొచ్చె
విడిపోయె కుటుంబం!

సంపాదనకనీ పోయె
అవకాషముందని పోయె
నీవెంతని అహము తోటి
భర్త భార్య నిడిచి పోయె!

సంపాదనలొ పడిపోయె
త్రాగుడుకు బానీసాయె
కుటుంబాన్ని మరవడంతొ
అనుబంధం దూరమాయె!

అందముందని భార్య 
వయసుఉందని భార్య
భర్తపై తాను అహముతొ
పనివాడితొ వెళ్ళె భార్య!


మోజులో వాడుకునే
లోగుట్టు తెలుసుకునే
ఉన్నదంతా ఊడ్చుకొని
తరిమి తరిమి కొట్టెనే!

సమస్యలూ సహజము
అందరికవి నిత్యము
కూర్చుని మాట్లాడుకునిన
ఉండేడిది ఫలితము !

ఉభయులకూ అర్ధమాయె
కాలమంత గడిచిపోయె
కోర్టుల చుట్టూ తిరుగుతు
దిక్కు లేని పక్షులాయె !

భర్త పెళ్ళి చేసుకున్న
భార్య పెళ్లి చేసుకున్న 
అది రెండో పెళ్ళేగా
ఎలా పెళ్లి చేసుకున్న!

కలిసి మాట్లాడుకుంటే
తప్పులు తుడిచేసుకుంటే
స్వర్గమే ఆ కుటుంబము
ఒకరికొకరు కలిసుంటే!

మణి పూసలు ప్రక్రియ లక్షణాలు:
01. ప్రతి కవితలో 4 పాదాలు ఉండాలి
02. ప్రతి పాదంలో 10 నుండి 12 మాత్రలే ఉండాలి
03.  1,2 మరియు 4 వ పాదంలో సమానమైన.  
        మాత్రలే ఉండాలి
04. 3 వ పాదంలో 10 నుండి 12 మధ్యలో
        మాత్రలు ఉండాలి.
05. 1,2 మరియు 4 వ పాదం ఒకేరకమైన అక్షరం
        చివరన ఉండాలి
06. 3 వ పాదం ఏ అక్షయమైన చివరన ఉండవచ్చు.
07. 4 పాదాలలో సమన్వయం ఉండాలి

మానవ నైజం P

శీర్షిక: మానవ నైజం


మనిషీ తినేది ఒక మెతుకు
దాని కొరకు నిత్యం వెతుకు
ఆపై చేస్తాడొక సొతుకు
పరువు పోయాక ఎందుకు ఆ బ్రతుకు !

పొగిడించుకోవాలని ఆశ
ఎవరూ పొగడక పోతే నిరాశ
ఆపై రోజంతా దుర్భాష
అసహనంతో వెళ్ళగక్కుతారు గోస!

నీచులకుండదు ఏ ఆశయం
అనువనునా ఉంటుంది స్వార్ధం 
ప్రతి దానికీ ఏదో ఒక సంశయం
రోజంతా త్రాగుతారు కషాయం
తోటి వారిపై కప్పుతారు విషవలయం!

తుమ్మ చెట్టైనా ఇచ్చు మేత మేకకు
మర్రిచెట్టైనా ఇచ్చు నీడ మనిషికి
తులసి మొక్కైనా పోయు ప్రాణం పోయే జీవికి
కానీ కుటిలుడు క్షణం క్షణం లాగుతుండు 
ఎదిగే వారిని క్రిందికి!

పాముకు కోరల్లోనే విషం
తేలుకు కొండిలోనే విషం
కుక్కకు పండ్లలోనే విషం
కానీ మనిషికి నిలువెల్లా విషం!

తాను చేస్తే సంసారం 
అదే ఎదుటి వారు చేస్తే వ్యభిచారం 
మనిషికి మనిషిపై ఎందుకో అసహనం 
తోటి వారిపై ఎంతో కోపం 
నేడు ఇదే మానవ నైజం!

ప్రకృతి అనేది ఒక శక్తి
దాని ముందర మనిషి ఒక వ్యక్తి
పెంచుకోకూడదు ప్రతి దానిపై ఆసక్తి
సద్వినియోగపరుచు కోవాలి యుక్తి
పరమాత్మ పై పెంచాలి భక్తి
దొరుకుతుంది రేపు నీకు ముక్తి !