Tuesday, December 12, 2023

మహిళలకు తెలంగాణా అంతటా ఉచిత ప్రయాణం (FREE BUS TRAVEL TO WOMEN IN TELANGANA

"ఉచితం" అనేది రెండు వైపుల పదునైన ఆయుధం లాంటిది. ఉచితం పేర్లు ఏవైనా అవి కొందరికి మేలు కలిగిస్తే మరికొందరికి సమస్యలను సృష్టిస్తాయి. ఉచితాల వలన ప్రభుత్వానికి  కొన్ని లాభాలుంటే, కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ఉచితాల వలన కొన్ని రాష్ట్రాలు, దేశాలు అప్పుల పాలై  కుప్ప కూలినవి కూడా ఉన్నాయి.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన కలిగే 
 కొన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం:

01. మహిళలకు ఉచిత ప్రయాణం వలన, ఆర్ధిక భారం తగ్గుతుంది. బస్ పాస్ ల డబ్బు, బస్సు చార్జీలు మిగలడం వలన, పేద మహిళలు వాటిని ఇతర ఖర్చులకు పొదుపుగా వాడుకుంటారు.
02. చిరు ఉద్యోగులకు, విద్యార్థినులకు, అనారోగ్యంతో ఉన్న వారు , అడ్డకూలీలకు, దూర ప్రాంతాల వ్యాపారస్తులకు చాలా మేలు జరుగుతుంది.
03. అనారోగ్యంతో ఉన్న మహిళలు, వారి పిల్లలు , 5 సం.లోపు ఉన్న మగ పిల్లలకు కూడా మెరుగైన వైద్యం కోసం పట్టణాలకు వచ్చే వారికి , ఉచిత బస్సు ప్రయాణం ఎంతో ఊరట నిస్తుంది.
04. పాచి పనులు, నర్సు పనులు, ఇతర సర్వీసులు అందించే వారు, ఇంటి కిరాయీలు తక్కువగా ఉన్న చోట నివసిస్తారు. రవాణా చార్జీల భారం భరించలేక, ఆ చుట్టుపక్కలనే, తక్కువ డబ్బులకు పని చేస్తారు.
ఇప్పుడు వారు ఏ ప్రాంతాలలో డబ్బులు ఎక్కువగా ఇస్తారో అక్కడికి వెళ్ళి ఎక్కువ డబ్బు సంపాదించు కోగలరు
05. రవాణా చార్జీల వలన కొందరు, వారి పనులను వాయిదా వేసుకుంటారు. 4, 5 పనులకు కలిపి ఒకేసారి వెలుతారు. ఇప్పుడు అలా పెండింగ్ పెట్టరు.
06. ఏ మీటింగ్ లు ఉన్నా, మహిళలందరు కలిసి, ఎంత దూరమైనా వెళ్ళి పోతారు.
07. విద్యార్ధినులను, ఉద్యోగ మహిళలను స్కూటర్ల పై , కార్లలో డ్రాప్ చేసే , తల్లిదండ్రులకు, భర్తలకు, ఎంతో డబ్బు, సమయం ఆదా అవుతుంది,
08. స్త్రీలకు ఆర్థిక సాధికారత పెరుగుతుంది. స్వేచ్ఛ, ధైర్యం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రయాణాలపై అవగాహన పెరుగుతుంది.
09. మహిళలు, గుళ్ళకు, ఫంక్షన్లకు , విహారాలకు, బంధువుల ఇండ్లకు వెలుతూ ఉండటం వలన ప్రశాంతత లభిస్తుంది.
10. చిన్న చిన్న పనులకు, మగవారు స్కూటర్లపై, కార్లలో వెళ్ళే బదులు, వారి కూతుర్లను, భార్యలను, తల్లులను పంపిస్తారు. దీని వలన ఫ్యామిలీకి అధిక డబ్బు, సమయం ఆదా అవుతుంది.
11. స్త్రీలే అధికంగా వెలుతారు కాబట్టి, బస్సులలో సెక్యూరుడుగా ఫీలవుతారు.
12. దూర ప్రాంతాలని, బస్సు చార్జీల భారం భరించలేక, కొందరు పేద విద్యార్థినిలు, మధ్యలోనే చదువులు మానేస్తున్నారు. అలాంటి వారు ఇప్పుడు చదువుకోడానికి ఆసక్తి చూపుతారు.
13. అంతే కాకుండా రవాణా చార్జీలు భరించలేక కొందరు ఆడ పిల్లలను దగ్గరలోని ఏదో ఒక స్కూల్ లో చదివిస్తున్నారు. ఇప్పుడు వారు ఎంత దూరమైనా మంచి స్కూళ్ళలో చదివించడానికి అవకాశం ఉంది.
14. మరికొందరు పట్టణాలలో, రూములు రెంటుకు తీసుకుని చదవడానికి, ఉద్యోగం చేయడానికి, చాలా డబ్బు ఖర్చు అవుతుంది. రిస్క్ అవుతుంది, సేఫ్టీ ఉండటం లేదు. ఇప్పుడు వారు ఇంటి నుండే పట్టణాలకు వెళ్ళి చదువుకుని లేదా ఉద్యోగం చేసి రాత్రి వరకు ఇంటికి చేరవచ్చు.
15. రవాణా ఖర్చు లేక పోతే అన్ని ప్రాంతాలలో ధరలు తగ్గి పోతాయి.
16. రవాణా చార్జీలు లేక పోవడం వలన, గ్రామీణ ప్రాంతాల మహిళలు, అక్కడ తక్కువ ధరలకు అమ్మే బదులు, పట్టణాలకు వచ్చి ఎక్కువ ధరలకు కూరగాయలు, పండ్లు, పూలు, ఇతర వస్తువులు, మధ్య దళారులు లేకుండా అమ్మకో గలరు.
17. స్త్రీల మూవ్ మెంట్ పెరుగుతుంది. ఇప్పటి వరకు రవాణా చార్జీలు ఉండటం వలన, ఒంటింటి కుందేలు లాగానే ఉండేవారు. ఇప్పుడు అది ఉండదు. అవసరాలు  ఉంటే ఎక్కడికైనా వెలుతారు.
18. పార్లమెంట్ లో పాసైన మహిళా బిల్లు కంటే గొప్పగా , పూర్తి స్వేచ్ఛ లభించినట్లుగా, స్త్రీలు చాలా గొప్పగా ఫీలవుతుంటారు 
19. పర్యాటక రంగం అభివృద్ధి చెందగలదు. దీని వలన ప్రభుత్వానికి పరోక్ష పన్నుల రూపంలో ఆదాయం పెరుగగలదు.

ఇప్పుడు ఇక కొన్ని నష్టాల గురించి తెలుసుకుందాం:
01. మహిళలకు బస్సు చార్జీలు ఉచితమైతే, అది ప్రభుత్వానికి నష్టం. రోజుకి అది సుమారుగా 7 కోట్ల రూపాయలు ఉంటుందని అని ఒక అంచనా
02. బస్సు చార్జీలు ఉచితం కావడం వలన, మెట్రో, ఎంఎం టీఎస్ ట్రేన్లలో ప్యాసెంజర్లు తగ్గిపోతారు. అందువలన వీటికి నష్టం వాటిల్లుతుంది.
03. బస్సులలో ట్రాన్స్ జెండర్స్ కు ఫ్రీ అవకాశం కల్పించారు ‌. వీరిలో ఎవరు నిజమైన ట్రాన్స్ జెండర్సో తెలియదు. బెగ్గింగ్ కొరకు చీరెలు కట్టుకుని ప్రయాణం చేస్తే, మహిళలకు చాలా ఇబ్బంది కరంగా మారవచ్చు.
04. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వలన, ధనవంతులు, ఆదాయ పన్నులు కట్టే వారు, కార్లు, బస్సులు ఉన్న వారు కూడా, ఆర్టీసి బస్సులలో ప్రయాణించడం వలన, ప్రభుత్వానికి అధిక భారం పడుతుంది. అలానే బస్సులలో అనవసరంగా రద్దీ పెరుగుతుంది. దీని వలన స్థోమత గల, ఉద్యోగ భాద్యత గల మహిళలకు అన్ కంఫర్ట్ గా ఉంటుంది.
05. మహిళలకు అధిక భారం పెరుగుతుంది. ప్రతి పనికి, పేద మగవారు, మీకు ఉచితం కదా అని, మద్యానికి , మందులకు, బ్యాంకులకు, షాపింగ్ లకు స్త్రీలనే బయటకు పంపిస్తారు. మగవారు చెసే బయటి పనులన్నిటికీ స్త్రీలనే పంపించడానికి ఆలోచిస్తారు.
06. మొదట సరదాగానే ఉంటుంది. కానీ కొంత కాలం తర్వాత వారు చాలా భారంగా ఫీలవుతారు. ఆ తర్వాత బయట స్నేహాలు పెరిగి, ఇతర వ్యాపకాలకు అలవాటు పడవచ్చు.
07. కుటుంబాలలో, ప్రతి రోజూ ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది. అలాంటి సమస్యలు జరిగినప్పుడు, స్త్రీలు ఇంట్లోనే సర్దుకు పోయే వారు. ఇప్పుడు అలా ఇంటి పట్టున ఉండకుండా, ప్రశాంతత కొరకు అని ఎక్కడికైనా వెళ్ళి పోతారు.
దీని వలన మరిన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంది.
08. బస్సు ప్రయాణం ఉచితమని తిరిగే అలవాటు ఉన్న కొందరు  ప్రక్క స్త్రీలను వెంటేసుకుని తిరగడం వలన ఉన్నతమైన మంచి కుటుంబాలలో, భార్యా భర్తల సంబంధాలు, తల్లిదండ్రులు పిల్లల సంబంధాలు దూరమయ్యే అవకాశాలను కొట్టి పారేయ లేము.
09. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం లేక పోలేదు
10. పని ఉన్నా లేకున్నా బస్సులలో ఉచితం కాబట్టి, మహిళలు ప్రయాణించడం వలన, బస్సులలో మహిళల సంఖ్య పెరిగి, ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుంది.
11. ఉచితం అనగానే రద్దీ, దీనికి తోడు, అన్నీ మరిచి,  బస్సులలో ఆనందంగా ఉంటారు. దొంగలకు అలాంటి అవకాశమే కావాలి. ఆ కారణంగా బస్సులలో దొంగతనాలు జరిగే అవకాశం లేక పోలేదు.
12. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావడం వలన, ఆటోలకు, వోలా, ఊబర్ లాంటి టాక్సీ లకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. చక్రాలు తిరుగుతేనే వారు ఇ.ఎమ్.ఐలు , పిల్లల ఫీజులు, టాక్స్ లను కట్టగలరు. కుటుంబాలను పోషించుకోగలరు. లేదంటే వారి కుటుంబాలు రోడ్డున పడగలవు.
13. ద్వి చక్ర వాహనాల అమ్మకాలు తగ్గి పోతాయి.
మధ్య దళారులకు నష్టం వాటిల్లుతుంది.
బస్సులు ఉచితం అని ఓ పది మంది మహిళలు కలిసి రెగ్యులర్ గా , గుళ్ళకు, విహార యాత్రలకు తెలంగాణా అంతటా తిరుగు తుంటే, ప్రభుత్వానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణం మరింత ప్రయోజనకరంగా మారాలంటే ఏమి చేయాలి?

ఉచితాలకు అలవాటు పడిన ప్రజలు, హామీ ఇచ్చిన హామీలలో ఏ చిన్న మార్పు చేసినా విరుచుకు పడుతారు. వీరికి తోడు ప్రతి పక్షాలు మరియు విమర్శకులు తోడవుతారు. ఇది సహజం. అయినప్పటికీ,
01. ఆదాయ పన్నులు చెల్లించే వారు, కార్లు, బస్సులు ఉన్న, ధనవంతులైన మహిళలు, వారి పిల్లలు, ఉచితం మాకు వద్దు అనే మహిళలు, వారే స్వచ్చందంగా ఉచిత బస్సులలో ప్రయాణించ వీలు లేకుండా, వారికి ఉచిత కార్డులను ఇష్యూ చేయకూడదు. దీని వలన కొంత వరకైనా ఆటో, టాక్సీ డ్రైవర్ లకు మరియు ప్రభుత్వానికి కొంత మేలు జరుగ గలదు.
02. విద్యార్ధినులకు, ఉద్యోగం కొరకు వెళ్ళే మహిళలకు, చిరు ఉద్యోగులకు, పేద మహిళా కూలీలకు, చిరు వ్యాపారస్తులకు, అర్హులైన ట్రాన్స్ జెండర్స్ కు , మాత్రమే ఫ్రీ కార్డులను ఇష్యూ చేయాలి.
03. ముందుగా, ఇప్పటి వరకు బస్ పాస్ లు కలిగిన మహిళలందరికీ, విద్యార్ధినులందరికీ, ఫ్రీ కార్డులను జారీ చేయాలి. ఆ తర్వాత ఇతర మహిళలకు జారీ చేయాలి.
04. ఆఫీస్, స్కూల్ టైమ్ లలో, అవసరమైన రూట్లలో మహిళలకు స్పెషల్ బస్సులను వేయాలి.
బస్సుల సంఖ్యను పెంచాలి, సమయపాలన పాటించాలి
05. ప్రభుత్వ పాఠశాలలో ఫ్రీ అంటే ఎంత మంది పిల్లలు చదువుతున్నారు. అలానే  బస్సులలో ఉచితం అన్నంత మాత్రాన అందరూ బస్సులలో నే వెళ్ళరు . వారి సౌకర్యం, వేగం , సెక్యూరిటీ  , ఇంటి వరకు చేరే విధానం చూసుకుంటారు. వీధుల్లోకి, ఇండ్ల వరకు బస్సులు పోవు . ఆటో , టాక్సీ వారు ఇవన్నీ గమనించి, ప్రయాణికులలో మన్నత పెంచు కుంటే, వారి గిరాకీ ఎక్కడికి పోదు. ధరలు తగ్గించి పోటీ పడాలి. 
06. మెట్రో, ఎంఎం టీఎస్ లకు కూడా, ఎలాంటి నష్టం వాటిల్లదు. దానిలో ప్రయాణించే ధనికులు, వేగం, సేఫ్టీ కోరుకునే వారు వాటిల్లోనే వెలుతారు.
07. గ్రామ ప్రాంతాలకు, పల్లె వెలుగు బస్సులను పెంచాలి
08. ఆర్టీసీకి నష్టం రాకుండా, వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తూ, ఆర్టీసి ఆదాయ వనరులను పెంచాలి.
09. ఆర్టీసీకి నెలకోసారి, మహిళలకు సంబంధించిన చార్జీలను చెల్లించాలి
19. ప్రభుత్వానికి నష్టం కలుగకుండా, టూరిజం , పార్కింగ్స్  అభివృద్ధి చేయాలి. దీని వలన ప్రభుత్వానికి పరోక్ష పన్నుల రూపంలో ఆదాయం పెరుగగలదు.
11. నిజాయితీగా అభివృద్ధి పనులు చేపడుతూ, మెల్లగా మెల్లగా ఉచితాలను తగ్గించడానికి ప్రయత్నాలు చేపట్టాలి. ప్రజలలో చైతన్యం తీసుకు రావాలి. ఇది వ్యవస్థలలోనే రావాలి. ఓటు బ్యాంకు కొరకు ఉచితాలను ఇవ్వాలని పోటీ పడుతున్నారు. ఉచితాలకు అలవాటు పడిన ప్రజలు, ఎవరు ఎక్కువ ఉచితాలు ఇస్తే వారికి ఓటు వేస్తున్నారు. లేదంటే ఇంట్లో నుండి కదలడం  లేదు. ఉచితాలను ప్రోత్సహించే వారికి కఠిన శిక్షలు వేసే, ఎన్నికల వ్యవస్థ రావాలి. ఓటర్లకు పంచే డబ్బు, ఏ ప్రాంతంలో పట్టుబడితే, ఆ ప్రాంతంలో అభివృద్ధికే , మొత్తం డబ్బును ఖర్చు చేసే చట్టాలు రావాలి. 

Friday, December 8, 2023

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు సలహాలు, సూచనలు

 ఏ ప్రభుత్వమైనా, ప్రజల ఆలోచనలను, సూచనలను, సలహాలను తీసుకుంటూ, పరిపాలన సాగిస్తేనే, ప్రభుత్వం పది కాలాల పాటు ఫరిడవిల్లు తుంది. అలానే నాయకులు చరిత్రలో, ప్రజలు గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచి పోతారు .


రాష్ట్రం అప్పుల పాలు కాకుండా, మిగులు నిధులుతో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, అన్ని వర్గాల , అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని వయస్సుల వారు సంతోషంగా జీవిస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే, పాలకులు
ప్రజల సలహాలు, సూచనలు  తప్పక పరిశీలనకు తీసుకుంటారని ఆశిస్తున్నాం.

నేడు జీవన వ్యయం అనూహ్యంగా పెరిగింది కాబట్టి, అర్బన్ ఏరియాలో నివసించే వారి వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్న వారిని, అదే రూరల్ ఏరియాలో నివసించే వారి వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉన్న వారిని  ఈ 6 గ్యారంటీ పథకాలకు అర్హులుగా పరిగణించాలి. అలాగే తప్పకుండా  ఈ 6 గ్యారంటీలను అమలు చేయాలి.
అలానే 5 నుండి 10 లక్షల లోపు  వార్షికాదాయం ఉన్న వారిని మధ్యతరగతి గాను  పరిగణించాలి.

అర్హులైన వారికి ఈ 6 గ్యారంటీలను అమలు చేయడం సాధ్యమా అంటే , ఖచ్చితంగా సాధ్యమే.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి, అవినీతి సొమ్మును రికవరీ చేస్తూ, భూకబ్జాలను తిరిగి రాబట్ట గలుగుతే, భూసీలింగ్ లను అమలు చేసినట్లయితే, అవినీతి  పథకాలను అరికట్టి నట్లయితే, తక్షణమే ధరణి పోర్టల్ ప్రక్షాళన చేపడితే ఈ 6 గ్యారంటీలు కచ్చితంగా సాధ్యమవుతాయి. సులభంగా అమలు జరుగుతాయి కూడా.

01. మహాలక్ష్మి పథకం ద్వారా, అర్హులైన మహిళలకే,  ప్రతినెలా 2500 రూ.లు ఇవ్వాలి. ఆదాయ పన్నులు కట్టే వారికి, కార్లు, లారీలు, బస్సులు ఉన్న కుటుంబాల మహిళలకు వర్తింప చేయకూడదు. ప్రతి కుటుంబానికి 500 రూ.లకే గ్యాస్ సిలిండర్ తప్పక ఇవ్వాలి, మహిళలకు తెలంగాణా అంతటా ఆర్టీసి బస్సులలో ఉచిత ప్రయాణం అమలు చేయాలి. అయితే చాలా బస్సు రవాణా సౌకర్యాలు లేవు. అలాంటి రేట్లను గుర్తించి బస్సులను నడుపాలి. ఇప్పటి వరకు ఆయా రూట్లలో, ఆటోలు, క్యాబ్ లో పైన ఆధారపడాల్సి వస్తున్నది. మరో విషయం, ఉచిత ప్రయాణం కాబట్టి మహిళలు ఎక్కువగా ప్రయాణం చేయడం జరుగుతుంది. కాబట్టి, రద్దీ ఉన్న రూట్లను గుర్తించి, మహిళలకు సెపరేట్ బస్సులను వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వలన విద్యార్థినులకు, చిరు ఉద్యోగ మహిళలకు చాలా మేలు చేకూరుస్తుంది. ఆర్ధిక భరోసా నిస్తుంది. మహిళలకు ఉచితం అనేసరికి , వారి ఫ్యామిలీ తో కూడా వస్తారు కాబట్టి, బస్సుల్లో రద్దీ పెరుగుతుంది. ఆ విధంగా ఆర్టీసీ లాభాల బాట పడుతుంది.
02. రైతు భరోసా పథకం ద్వారా, ప్రస్తుతం ఉన్నటువంటి, రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలి. ఆ తర్వాత 10 ఎకరాల లోపు మాగాణి భూమి ఉన్నవారికి, 15 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న వారికి మాత్రమే రైతు రుణమాఫీ వర్తింప చేయాలి.
03. అలానే రైతు బంధు పథకం 10 ఎకరాల లోపు మాగాణి భూమి, 15 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న వారికే వర్తింప చేయాలి. మైనింగ్ భూములకు, గుట్టలకు, కాలేజీల భూములకు, బీడు భూములకు, భూస్వాములకు రైతు బంధు పథకం, రుణమాఫీ వర్తింప జేయకూడదు.  ఇక పోతే,
భూమిని సాగు చేసేది, భూమిని అభివృద్ధి చేసేది , రైతుల భూమిని కాపాడేది , రేయింబవళ్ళు కష్టపడేది, పంట పండినా, పండక పోయినా, గిట్టుబాటు ధర దొరకక పోయినా భరించేది , పంటలను పండించేది కౌలు దారులు కాబట్టి , కౌలు దారులకు సం.రానికి 15000 రూ.లు (రెండు దఫాలుగా)  ఇవ్వాలి.
ఒక వేళ రైతులే పంటలు పండిస్తే, రైతులకే రైతు బంధు , రుణమాఫీ వర్తింప చేయాలి.
04. అలానే మీరు ఇచ్చిన గ్యారంటీల ప్రకారం వ్యవసాయ కూలీలకు సం. రానికి 12000 రూ.లు ఇవ్వాలి . కూలీలు అంటే రైతు బంధు రాని వారు మాత్రమే కూలీలు. కూలీలకు ప్రత్యేక కార్డులను జారీ చేయాలి. , ప్రతి వరి పంట క్వింటాల్ కు 500 బోనస్ అది రైతులు కావచ్చు, కౌలు దారులు కావచ్చు ఇవ్వాలి. అలాగే,  రైతులకు నాణ్యమైన ఎరువులను, సమయానికి పంపిణీ చేయాలి. నీరు విద్యుత్ సమృద్ధిగా అందించాలి. పండిన పంటలు నిల్వ చేసుకోడానికి, ప్రతి మండలంలో గిడ్డంగులను నిర్మించాలి. పండిన పంటకు ,మధ్య దళారులు లేకుండా, గిట్టుబాటు ధరను కల్పించాలి. రైతులు పండించే పంటలపై, అమ్మకాలపై రైతులకే/ కౌలు దారులకే పూర్తి స్వేచ్ఛ ఉండాలి.

05. గృహ జ్యోతి పథకం ద్వారా, పేద, మధ్య తరగతి వారికి మాత్రమే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలి. దీనికి , గత సంవత్సరం వినియోగించిన ఆవిరేజ్ యూనిట్లను బేస్ చేసుకుని , కొంత పర్సెంట్ యూనిట్లను అదనంగా కలిపి, ఎల్జిబిలిటీని నిర్ణయించాలి. ఆపై వినియోగించిన వారికి బిల్లులు వేయాలి. అందరికీ ఉచితం అనగానే సాధారణంగా, విద్యుత్ బంధు చేయాలని, పొదుపుగా వాడుకోవలనే ఆలోచన ఉండదు. దీని వలన ప్రభుత్వంపై భారం అధికంగా పడుతుంది. కరెంట్ వాడకం పై సామాజిక బాధ్యతను పెంచాలి.

06. ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా, భూకబ్జాలను గురైన  భూములను సేకరించి, అర్హులైన  పేదలకు, మధ్య తరగతి వారికి మాత్రమే ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్  ఇండ్లు కట్టించి ఇవ్వాలి. ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు దశల వారీగా ఇవ్వాలి.
ఇండ్లు లేని వారు , వారే ఇండ్లు కట్టుకుంటానంటే 100 గజాలు ఉచిత స్థలాన్ని ఇవ్వాలి. ఇండ్లు లేని జర్నలిస్టులకు, కళాకారులకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలి.
ఉద్యమకారులకు గ్యారంటీలో చెప్పిన ప్రకారం 250 గజాలు ఇండ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వాలి.
మరి కొందరు ఇండ్లు లేని వారికి , డబ్బు మేము కూడా చెల్లించగలం అనేవారికి, సబ్సిడీతో 10 లక్షల లోపు ఇండ్లు నిర్మించి ఇవ్వాలి.  పూర్తిగా ప్రభుత్వం పైననే భారం పడకుండా, ఇలా ప్రజల భాగస్వామ్యంతో, అందరికీ ఇండ్లు సమకూరే అవకాశం ఉంటుంది. అలానే, ఆల్రెడీ ఇండ్లు ఉన్న వారికి  , ఇండ్లు గానీ, ఇంటి స్థలం గానీ, ఇండ్లు నిర్మించు కోడానికి డబ్బు గానీ ఇవ్వ కూడదు.

07. యువ వికాసం పథకంలో  మీరు ఎలాగో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావించ లేదు. దానికి బదులుగా ముఖ్యమైన ప్రాంతాలలో , ఉద్యోగం వచ్చే వరకు, ఉచిత స్కిల్స్ డెవలప్ మెంట్ కోచింగ్ సంస్థలను ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక యువతీ యువకులకు ఉచిత వసతి , ఉచిత భోజనం కల్పించాలి.  ప్రతి మండలంలో ఒక కోచింగ్ సెంటర్ ను, కాలేజీలను ఏర్పాటు చేయాలి. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ను ఏర్పాటు చేయాలి. ప్రయివేట్ స్కూళ్ళకు ధీటుగా, నాణ్యమైన విద్యను అందించాలి.
నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలి.
ప్రభుత్వ శాఖలలో ఖాలీగా ఉన్న ఉద్యోగాలను
ఏ సంవత్సరానివి ఆ సంవత్సరంలోనే, నోటిఫికేషన్లు జారీ చేసి, పరీక్షలు జరిపించి భర్తీ చేయాలి. ఏ అక్రమ బిల్డింగ్ లను కూలగొట్ట కుండా, వాటిని విద్యార్ధులకు వసతి గృహాలుగా మార్చాలి.
08. చేయూత పథకం ద్వారా, అర్హులైన వారికి ఆసరా పెన్షన్ 4000 చెల్లించాలి. అలానే 10 లక్షల ఆరోగ్యశ్రీని భీమాను కల్పించాలి.
09. ఈ 6 గ్యారంటీల అమలుకు ప్రత్యేక వెబ్సైట్ ను
ఏర్పాటు చేయాలి మరియు దాని వివరాలు, అప్లై చేసుకునే విధానం, నియమ నిబంధనలు ప్రచారం చేయాలి.
10. తెలంగాణా రాష్ట్రం కొరకు బలిదానాలు చేసిన కుటుంబాలకు , వారి పిల్లలకు ఆర్ధిక భరోసా, ఆరోగ్య భరోసా మానసిక స్థైర్యాన్ని కల్పించాలి.
11. పార్టీలతో సంబంధం లేకుండా, ప్రతిపక్షాలు, గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా, అన్ని గ్రామాలను, పట్టణాలను సమానంగా అభివృద్ధి చేయాలి. గ్రామాలను, పట్టణాలకు ధీటుగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉపాధి అవకాశాలు, ప్రయివేట్  పాఠశాలలకు , ప్రభుత్వ  పాఠశాలలో ఉచిత విద్యను  అందించాలి. అలానే ఉచిత వైద్యశాలలను అభివృద్ధి చేస్తే పట్టణాలకు వలసలు తగ్గుతాయి. పట్టణాలలో రద్ధీ తగ్గుతుంది.
12. బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తి వేయాలి.
13. అక్రమ కేసులను, విచారణ చేసి ,ఎత్తి వేయాలి.
14. ప్రజలకు ప్రశ్నించే స్వేచ్ఛను, సమస్యలపై ధర్నాలు చేసుకునే స్వేచ్ఛను, ప్రభుత్వ కార్యాలయాలు, సభలకు, సచివాలయంలోకి అనుమతితో ప్రవేశించేందుకు స్వేచ్ఛను కల్పించాలి.
15. అర్హులైన పేద మధ్యతరగతి వారి కుటుంబాల వారికే రేషన్ కార్డులు వర్తింప చేయాలి. అవి రెండు రకాలుగా ఉండాలి. పేదలకు 1 రూపాయికి కిలో బియ్యం , మధ్య తరగతి వారికి 5 రూ.లకు కిలో సన్న బియ్యం ఇవ్వాలి. అప్పుడే అన్ని రేషన్ కార్డులు ఉపయోగం లోకి వస్తాయి. నేడు దొడ్డు బియ్యం తెచ్చుకుని, తినలేక, అమ్ము కుంటున్నారు. మరికొందరు తెచ్చుకోడానికే ఇష్ట పడటం లేదు. తీసుకోని బియ్యం దొడ్డిదారి పడుతున్నాయి. అన్నపూర్ణ కార్డులకు ఉచిత బియ్యం యధావిధిగా అమలు చేయాలి.
ప్రతి రేషన్ కార్డుకు, ఆధార్ నెంబర్ లింక్ చేయాలి.అప్పుడే అవినీతి, అక్రమాలు తగ్గిపోతాయి.

16.  ట్రాఫిక్ ఛలాన్ల రేట్లు తగ్గించాలి.
17. పెట్రోల్ డీజిల్ పై పన్నులను తగ్గించాలి.
18. ఓటరు కార్డులకు, ఆధార్ నెంబర్ ను లింక్ చేయాలి. అప్పుడే ఒకే వ్యక్తి  పేరు రెండు చోట్ల రిజిస్టర్ అవదు. దీని వలన రెండు ప్రాంతాలలో, రెండు రాష్ట్రాలలో ఓటు వేయడం ఆగిపోతుంది. దొంగ ఓట్లు పడవు
19. గ్రామాలలో, గ్రేటర్ హైదరాబాద్ లో  మోరీలను, డ్రైనేజీ సిస్టంను సరిచేయాలి.
20. కనీసం ప్రతి 5 కి.మీ. దూరంలో ఒక పార్కింగ్ బిల్డింగ్ లను నిర్మించాలి.
21. గ్రేటర్ హైదరాబాద్ లో జనాభా రద్ధీని తగ్గించాలి. రింగ్ రోడ్ల వరకు మెట్రోరైలును విస్తరింప జేయాలి. రింగ్ రోడ్ల చుట్టూ టౌన్ షిప్ లను , ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను , విద్య వైద్యం ఉపాధి సంస్థలను నెలకొల్పాలి.
23. రాష్ట్ర ఆదాయం పెంచడానికి, విదేశీ పెట్టుబడులను, విదేశీ ఉపాధి సంస్థలను రప్పించాలి. టూరిజంను అభివృద్ధి చేయాలి.
24. సామాన్యులకు ఓటు హక్కు కావాలని కృషి చేసిన డా. అంబేడ్కర్ గారి కృషికి ఫలితం దక్కాలంటే, ఓటుకు విలువను పెంచాలంటే, ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి ఆసక్తి చూపాలంటే, ఓటరు ఆత్మాభిమానం దెబ్బ తీయకుండా ఉండాలంటే,  "పార్టీ పిరాయింపుల నివారణ చట్టాన్ని" మరియు " అవినీతికి పాల్పడే, హామీలను అమలు చేయని అభ్యర్థుల కాల్ బ్యాక్ చట్టాన్ని" తీసుకుని రావాలి.

Monday, December 4, 2023

పార్టీ పిరాయింపుల చట్టాన్ని తీసుకుని రావాలి

భారతీయులమైన మనం స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించాలని నాటి స్వాతంత్ర సమరయోధులు ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, రాణీ రుద్రమదేవి, గాంధీజీ, నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్ధార్ వల్లభాయ్ పటేల్ , డా.బాబా సాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్ మరెందరో త్యాగాల ద్వారా, బ్రిటిష్ లేను తరిమి కొట్టి , స్వాతంత్ర్యం సాధించి సుమారుగా ఏడు దశాబ్దాలు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు అయిపోయింది. ప్రజాస్వామ్యంగా ప్రజలు జీవించాలని రాజ్యాంగాన్ని రచించిన డా. అంబేడ్కర్ గారు , 18 యేండ్లు నిండిన ప్రతి ఒక్కరికి  వారికి ఓటు హక్కును కల్పించారు. పూర్వ కాలంలో  ఈ ఓటు  హక్కు కేవలం  ధనవంతులకు , విద్యావంతులకే   ఉండేది .  కానీ, ఈ రోజు అప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుచున్నవి. పలుగు ఉన్న వారిదే బర్రె అన్నట్లు, బుజ బలం , కండ బలం ఉన్న వారిదే, ధనం ఉన్న వారిదే గెలుపు,వారసులదే అధికారం అన్నట్లుగా ఉంది. రాజకీయాల్లోకి యువత ధైర్యంగా రావాలి. కానీ , రాజకీయ వ్యాపారం చేయడానికి చేయకూడదు. ఎన్నికల విధానంలో అనేక లోపాలు ఉన్నాయి. ఎన్నికల వ్యవస్థలో లోపాలు గురించి నేను " ఎన్నికల సంస్కరణల దిక్సూచి" అనే పుస్తకాన్ని రచించాను. ఆసక్తి గలవారు స్టడీ చేయ గలరు. నా బ్లాగ్ #www. sollutions2all.blogspot.com ను చూడ గలరు. ఎన్నికల సంస్కరణలు చేయకుండా, వెయ్యేండ్లు ఎన్నికలు జరిగినా, లక్షల కోట్లు వృధానే తప్పా ప్రయోజనం ఉండదు. నేటికీ రాష్ట్రాలలో, దేశంలో , పేదరికం తగ్గక పోవడం , అవినీతి పెచ్చు పెరగడం, నియంతృత్వ పాలనలు, ప్రశ్నించే స్వేచ్ఛ లేక పోవడం, దేశ సంపదను సమానంగా అనుభవించనివ్వక పోవడం , ఉపాధి కల్పన వికేంద్రీకరించక పోవడం , నిరుద్యోగుల సంఖ్య పెరగడం, పేద తనం తగ్గక పోవడం, గ్రామాల ప్రజలు కొందరు త్రాగుడుకు బానీసలవడం కారణంగా, నేటికీ ప్రజలు , చకోర పక్షుల్లా, ఉచితాల కొరకు, ఉచిత పథకాల కొరకు ఎదురు చూస్తున్నారు. ఓటర్లకు డబ్బు ఆశ, మధ్యం ఆశ, బిర్యాని ఆశ చూపుతూ, అభ్యర్ధులు ఓటర్లను కొంటున్నారు. ఇది జగమెరిగిన సత్యం. ఎక్కడా నియంత్రణ లేదు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ డబ్బును, ఆయా గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలి. నేడు అలాకూడా చేయడం లేదు. గత ఏడు దశాబ్దాల నుండి అనేక మార్లు ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఓటర్లే ఓడి పోతున్నారు తప్పా అభివృద్ధి చెందడం లేదు. పైగా ఉచితాలకు అలవాటుపడి సోమరులు అవుతున్నారు, బానీసలుగా మారిపోతున్నారు. 
అందుకు ముఖ్యమైన కారణాలను పరిశీలిస్తే, 
 01. భారతీయులై యుండి, 25 సం.రాలు నిండి, మానసికంగా బాగా ఉంటే చాలు, పోటీ చేయడానికి అవకాశం ఉండటం 

 02. విద్య లేక పోయినా, ఎన్ని కేసులు ఉన్నా, ఎంతటి అవినీతికి పాల్పడినా , పోటీ చేయడానికి అర్హత కలిగి ఉండటం 

03. వారసత్వాలకే అధిక అవకాశాలు ఉండటం 

04. చనిపోయిన అభ్యర్థుల వారసులకు, అర్హత లేక పోయినా పోటీ చేయడానికి అవకాశాలు కల్పించడం 
 
05. ఎన్నికలలో చేసే ఖర్చుపై నియంత్రణ లేకపోవడం , ఇలా మరెన్నో.. 

06. యువతీ యువకులు రాజకీయాల్లోకి రావడానికి ప్రోత్సాహం లేక పోవడం 

07. డెబ్భై యేండ్లు నిండిన వృద్ధులు కూడా , రాజకీయాల్లో పోటీ చేయడానికి అవకాశాలు ఉండటం

ఇప్పుడు ప్రజలు ముఖ్యంగా కోరుకునేది, పార్టీలు ఏవైనా కానీ, అవి కాంగ్రెస్, బిఎస్పీ, బిజేపి,ఎం.ఐ.ఎమ్ , బి.ఎస్.పి. మరియు ఇతర పార్టీలు ఏవైనా కావచ్చు. ప్రజాస్వామ్య దేశంలో, ప్రజలే గెలవాలంటే, ప్రజాభిప్రాయాలను , ప్రజల ఆశయాలను వమ్ము చేయకుండా ఉండాలంటే, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే, తక్షణమే ఈ చర్యలు చేపట్టాలి. 

 01. అభ్యర్థుల "పిరాయింపుల నివారణ " చట్టాన్ని తీసుకుని రావాలి 

 02. ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా, ప్రజల విశ్వాసాలకు వ్యతిరేకంగా పాల్పడే అభ్యర్థులను " కాల్ బ్యాక్ " చేసే చట్టాన్ని తీసుకుని రావాలి. 
 
03. అప్పటి వరకు గెలిచిన ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు , ఓటర్ల అభిప్రాయాలను, ఆకాంక్షలను, ఆశలను వమ్ము చేయకుండా, నైతిక భాద్యత వహించి, ఇతర పార్టీల లోకి పిరాయించకుండా ఉండాలి. ఒక వేళ ఇతర పార్టీల లోకి వెళ్ళాలనుకుంటే, గెలిచిన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, ఓటర్ల అభిప్రాయాలకు , ఓటు వేయడానికి విలువైన సమయం వెచ్చించి నందుకు, నష్ట పరిహారం కట్టించి, వేరే పార్టీలోకి వెళ్ళాలి. ఇది స్వతంత్ర అభ్యర్ధులకు కూడా వర్తిస్తుంది. 

 04. ఓటర్ల ఓటు హక్కును దుర్వినియోగ పరిచే విధంగా, అగౌరవ పరిచే విధంగా, ఓటర్ల నమ్మకాన్ని చెదరగొట్టే విధంగా, ఓటర్లు 3 గంటలు క్యూలైన్లలో నిలబడి, ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వేయకుండా, అబ్సల్యూట్ పవర్స్ ను స్పీకర్లకు తొలగించాలి. 

 05. పార్టీ పిరాయించడానికి , మా ప్రాంతాల అభివృద్ధి కొరకు అని సాకు చూపెడుతున్నారు. కాబట్టి, ఏ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధికి నోచుకోని అన్ని గ్రామాలను, మండలాలను, జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలి. ఎన్నికల వరకే పార్టీలు, అభ్యర్థులు మరియు ఓటర్లు. ఆ తరువాత అందరూ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలే అని భావించాలి. 
 
06. ఇతర పార్టీల లోకి వెళ్ళే ఎమ్మెల్యేలను , ఎంపీలను, ఆయా నేతల గెలుపు కొరకు కష్ట పడిన కార్యకర్తలు, ఓట్లు వేసిన ఓటర్లు సామదాన భేదోపాయాలతో పార్టీ పిరాయించకుండా చూడాలి. 
 
07. బిల్లులు పాస్ చేసే సమయాలలో, అవి ప్రజోపయోగకరమైనవి అయినట్లయితే, బయట నుండి సపోర్ట్ చేయవచ్చు. 

 08. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను, అవినీతిని, మోసాలను, భూకబ్జాలను ప్రశ్నించడానికి, వ్యక్తులుగా కాకుండా, "ప్రజా మేధావుల సంఘాలను" ఏర్పాటు చేయాలి.అలానే పిరాయించే నేతలను వీరు గట్టిగా అడ్డుకోవాలి

Friday, December 1, 2023

బర్రెలక్క కొరకు దేశ విదేశాల మేధావుల స్పందనకు కారణాలేమిటి?

బర్రెలక్క/ Barrelakka దేశ విదేశాలలోని మానవతా వాదులు, మేధావులు , లాయర్లు, నెటిజన్లు బర్రెలక్క (శిరీష) లో ఏమి చూసి, ఎందుకు ఇంత భారీగా స్పందిస్తున్నారనేది , ఒక సారి పరిశీలిస్తే, ఆమే కులం చూసి కాదు. ఆమే మతం చూసి కాదు. ఆమే ఆడ పిల్ల అని కాదు. ఆమే పేద రాలు , డబ్బు లేదు ఇల్లు లేదు అని కాదు. ఆమే చిన్న వయసు అని కాదు. ఆమే చదువు కున్నదని కాదు. ఆమెకు ఉద్యోగం రాలేదని కాదు.ఇవన్నీ చివరి అంశాలు. బర్రెలక్క లో నెటిజన్లు, మానవతా వాదులు, మేధావులు చూసి స్పందిస్తున్నది ముఖ్యంగా; 01. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా, దేశంలో నియంతృత్వ పాలనలు, పేదరికం పోకపోవడం. సమానత్వం లేక పోవడం. రాజ్యాంగం, చట్టాలు బలంగా ఉన్నా అవి అమలు కాక పోవడం మొదటి దైతే. 02. బర్రెలక్క ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం 03. బర్రెలక్క లో ధైర్యం, పట్టుదల 04. బర్రెలక్క లో పోరాట పటిమ ఉండటం 05. బర్రెలక్కలో సాధించే శక్తి ఉందని గ్రహించడం 06. బర్రెలక్క లో చురుకు తనం,కలుపుగోలుతనం 07. బర్రెలక్క లో ముక్కుసూటి తనం ,చతురత 08. బర్రెలక్క ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పే మేధా శక్తి ఉండటం. అది కూడా ఒక పేపర్ లేకుండా, ఎవరి సలహాలు, సూచనలు లేకుండా 09. బర్రెలక్క లో అనంతమైన ఏదో ఒక ''సిక్స్ సెన్స్" ఉందని,పేద ప్రజలకు ప్రతినిధి అవుతుందని గ్రహించడం 10. బర్రెలక్కకు దేశం, రాష్ట్రాల ప్రజా సమస్యలపై ప్రాధమిక అవగాహన ఉండటం 11. బర్రెలక్క మాటలలో అబద్దాలు, తడబాటు తనం లేక పోవడం 12. బర్రెలక్క లో కించిత్తు గర్వం కనిపించక పోవడం 13. బర్రెలక్క లో అమాయకత్వం ఉండటం 14. బర్రెలక్క లో ఇతర నిరుద్యోగుల, పేదల సమస్యలు తీర్చాలనే మానవతా దృక్పథం ఉండడం. 15. వ్యవ‌స్థల లోపాలను ఎత్తి చూపాలనే తపన కలిగి ఉండటం. 16. ఇలాగ నిర్భయంగా ఎదిరించే, మాట్లాడే యువతీ యువకులు రాజకీయాల్లోకి రావాలని మేధావులు కోరుకోవడం ఆ తర్వాత నే మొదట "కాదు" అని చెప్పిన అంశాలు వచ్చి చేరినాయి ఈ అంశాలే నెటిజన్లను, మానవతా వాదులను, మేధావులను ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి లక్షణాలు/ అంశాలు ఎవరిలో ఉన్నను మానవతా వాదులు, మేధావులు, ప్రజాస్వామ్య వాదులు, నెటిజన్లు తప్పకుండా స్పందిస్తారు ఇలాంటి యువతీ యువకులను ప్రోత్సహించాల్సిన భాద్యత మనందరిపైనా ఉంది. దేశ సంపదను వికేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Friday, October 20, 2023

మరణించే విషయం , మరణం తరువాత విషయాలు , మరణించే వారికి తెలుస్తాయా ?

 మరణించే  విషయం  , మరణం   తరువాత   విషయాలు , మరణించే వారికి  తెలుస్తాయా ?

వృద్ధులకు , దీర్ఘ కాల రోగులకు , వారు చనిపోయే విషయాలు , మరణం తరువాత విషయాలు  తెలుస్తాయి . కొన్ని సూచనల ద్వారా  తెలుస్తుంది . కానీ కొందరు చెప్పలేక పోతారు . అప్పటికే  కోమా లోకి వెళ్లి పోతారు . కొందరు చావు అంటే భయం వలన  చెప్పలేక పోతారు.  పిల్లలు , యువతీ యువకులకు, అకాస్మాత్తుగా చనిపోయే వారికి  ఇలాంటి సూచనలు కనబడవు . 

కొందరు వృద్ధులకు , చని పోవడానికి 5, 6, నెలల ముందు  నుండే , మరణం  విషయాలు తెలుస్తుంటాయి . కానీ చెప్పరు భయంతో . ఇలాంటి  వారు మనతో మాట్లాడుతారు . అలానే  వారికి ఇష్టమైన , చనిపోయిన వారి  ఆత్మలతో మాట్లాడుతారు . వారితో సరదాగా ఉంటారు . వారికి అన్ని విషయాలు చెబుతుంటారు . వారితో గతంలో  గడిపిన విషయాల గురించి  ముచ్చటించు కుంటారు . వీరికి భోజనం పెడితే , వాళ్ల చనిపోయిన అమ్మకు , అక్క చెల్లెన్డ్లకు  , అన్న దమ్ములకు ( తన వద్దకు వచ్చిన ఆత్మలకు ) భోజనం పెట్టమంటారు . వారు ఏది తింటే అది , వారు ఏది త్రాగితే అది పోయమంటారు . విచిత్రింగా   ప్రవర్తిస్తుంటారు . ఆ ఆత్మలు మనకు కనబడవు . వారినే చూపమంటే , ఇప్పటి దాకా ఇక్కడే వుంది , నా ప్రక్కలోనే పడుకుంది అని అంటారు . మనకు మాత్రం  ఎవరూ కనబడరు , శబ్దం  వినిపించదు . 

అంటే  ఇప్పుడు వారు , చావు వద్దకు వెళుతున్నారు , చావడం ఇష్టం లేక , మల్లి మన లోకం  లోకి వస్తున్నారని అర్ధం చేసుకోవాలి . వీరికి చావు గురించి తెలుస్తుంది . కానీ , ఈ లోకాన్ని విడువ లేక భయంతో చెప్పడం లేదు . ఇంకా తీరని కోరికలు ఉన్నప్పుడు  ఇలా  చేస్తుంటారు .      

Friday, October 13, 2023

జమిలి ఎన్నికలు అనగా నేమి ? / WHAT DOES IT MEAN JAMILI ELECTIONS ?

  జమిలి ఎన్నికలు 


జమిలి  ఎన్నికలు   అనగా  నేమి ?

కేంధ్రం లోనూ  , దేశం లోని అన్ని రాష్ట్రాల లోనూ ఒకే సారి  జనరల్ ఎన్నికలు జరపడాన్ని , జమిలి ఎన్నికలు అని అంటారు . 

ఇలా జమిలి ఎన్నికలు జరుపడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి .

అందులో ముఖ్యముగా ,

౦౧ . అవినీతి తగ్గుతుంది .

౦౨. ఎన్నికల ఖర్చు తగ్గుతుంది .

౦౩. ఆయా కాలాల , ప్రజల అభీష్టానికి అనుగునంగా నాయకులూ ఎన్నిక అవుతారు 

౦౪. పార దర్శకత నెలకొంటుంది .

౦౫. కొద్దీ నెలల్లో  రాష్ట్ర పతి ఎన్నికలు జరిగి నట్లయితే , రాష్ట్ర పతి కూడా ప్రజల అభీష్టానికి అనుగునంగా ఎన్నికవుతారు .

Sunday, October 1, 2023

WHICH IS BETTER , "CHITS" OR "SIP IN MUTUAL FUNDS" ? /చిట్టీలు మంచివా లేక మ్యూచ్యువల్ ఫండ్స్ క్రమ పద్దతిలో పొదుపు చేయడం (SIP) మంచివా ?

 WHICH IS  BETTER CHITS OR SIP ?

చిట్టీలు కట్టడం మంచిదా   లేక   మ్యూచ్యువల్  ఫండ్స్  క్రమ  పద్దతిలో  పొదుపు చేయడం (SIP)  మంచిదా   ?


చిట్టీలు కట్టడం మంచిదా   లేక   మ్యూచ్యువల్  ఫండ్స్  క్రమ  పద్దతిలో  పొదుపు చేయడం (SIP) మంచిదా  అంటే ఖచ్చితంగా ఇది కరెక్ట్ అని చెప్పడం సరికాదు . దేని ప్రయోజనాలు , దేని ఇబ్బందులు  దానికి  ఉంటాయి . ఒక వ్యక్తి అవసరాలు , అవకాశాలు , రిస్క్ , లక్ష్యాలు  , సమర్ధత , రెగ్యులర్ డబ్బు అందుబాటులో ఉండటం  మొదలైన అనేక కారణాల పైన ఆధార పడి ఉంటుంది . 

1. అవసరాలు : ఉదా . ఒక వ్యక్తికి  ఒక సంవత్సరం , రెండు సంవత్సరాలలో  డబ్బులు అవసరం  ఉన్నాయి అనుకుందాం . అతనికి  చిట్టి  గానీ , ఫిక్సడ్ డిపాజిట్ కానీ , రీకరింగ్ డిపాజిట్ కానీ మంచిగా ఉంటుంది . తక్కువ రిటర్న్ వచ్చినా , అవసరాలకు, డబ్బు  అందుబాటులో ఉంటుంది . 

ఇతనికి  మ్యూచ్యువల్  ఫండ్స్ సరికాదు . బాగుండదు . కారణం , ఒక సంవత్సరం , రెండు సంవత్సరాలలో రిటర్న్  రావచ్చు , రాక పోవచ్చు . ఒక్కో సారి  అసలు పెట్టుబడి కూడా నష్ట పోవచ్చు . మ్యూచ్యువల్  ఫండ్స్ లలో  అయితే  కనీసం 6 నుండి 10 , 15, 20 సంవత్సరాలు పెట్టుబడి  పెడితే  అధికంగా వెల్త్  క్రియేట్ చేయడం వీలవుతుంది . 

2. అవకాశాలు : ఇప్పటికి , గ్రామాలలో  చాలా మందికి  మ్యూచ్యువల్  ఫండ్స్ అంటే తెలియదు . ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియదు . ఎలా కె . వై . సి . తీసుకోవాలో తెలియదు . కొందరికి బ్యాంకులలో  ఎలా పొదుపు చేయాలో తెలియదు . ఇలాంటి వారికి , తేలికగా అందుబాటులో ఉండేవి  చిట్టీలే  అని చెప్పవచ్చు . తెలిసిన వారు , నమ్మకం అయినా వారైతే  , ఏ అవసరానికి  కావాల్సి వచ్చినా  వెంటనే పాట పాడుకోవచ్చు . నెలవారీగా కట్టుకోవచ్చు . కొందరు గుట్టుగా  పొదుపు చేసుకోవాలనుకునే వారికి , ఇది చక్కని అవకాశం . 

చిట్టీల కాల  పరిమితి  మహా అయితే 20,  25 , 50 నెలలు  ఉంటాయి . ఎన్ని నెలలు ఉంటాయో  అంతమంది  సభ్యులు ఉంటారు . చిట్టీని నడిపే వారు  3 నుండి 5% వరకు  తన కమిషన్ తీసుకుని , మిగిలిన మొత్తాన్ని బిడ్దర్ కు ఇచ్చివేస్తాడు . చిట్టీలలో కూడా వివిధ రకాలుగా ఉంటాయి . ప్రతినెలా పాట పాడేవి , ఫిక్స్డ్ అమౌంట్ ఇచ్చేవి లేదా చిట్టీ  నడిపే వారు కమిషన్  ఏ మాత్రం   తీసుకోకుండా  నడిపే చిట్టీలు  ఉన్నాయి . ప్రయివేటు చిట్టీలలో పెనాల్టీలు , వడ్డీలు , చార్జీలు , స్టాంప్ డ్యూటీలు ఏవి ఉండవు . అదే రిజిస్టర్డ్ చిట్టీలలో పెనాల్టీలు , వడ్డీలు , చార్జీలు , స్టాంప్ డ్యూటీలు , ఇతరములు ఉంటాయి . ప్రయివేట్ చిట్టీలయితే  షూరిటీ  కూడా ఇవ్వనవసరం లేదు . నమ్మకమే షూరిటీ .

3. రిస్క్ : ప్రయివేట్  చిట్టీలైనా , రిజిస్టర్డ్  చిట్టీలైనా  రిస్క్ మాత్రం ఉంటుంది . ప్రయివేట్  చిట్టీలు  , రిజిస్టర్డ్  చిట్టీలు  రెండూ కొన్ని కోర్ట్ కేసులలో  ఉన్నాయి . అందరూ ఒకే రీతిగా ఉంటారని చెప్పడం లేదు . చిట్టీలు వేసే టపుడు , అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుని వేయాలి . అసలు చిట్టీలు  వేసే వారిలో కొందరు   ఎందుకు  చేతులెత్తేస్తారు ? ఇప్పటివరకు జరిగిన  అనేక సంఘటనలను గమనిస్తే , మనకు కొన్ని కనిపిస్తాయి . 

ఎ ) చిట్టీలు  ఎత్తుకున్న వారు , కొంత మంది కట్ట కుండా వెళ్లి పోతే  లేదా ఆలస్యం చేస్తే  , ఆ భారం  నుండి తప్పించు కోడానికి  కొంతమంది చేతులు  ఎత్తేస్తారు . 

బి ) చిట్టీలు నడిపే వారు  , ఏవైనా వ్యసనాలకు  అలవాటు పడినా , చిట్స్ అమౌంట్ ను  , వేరే పెట్టుబడులలో  పెట్టి  నష్ట పోయినా  , చేతులు  ఎత్తేయ వచ్చు . వీరికి మోసం చేయాలని  ఏ కోశానా  ఉండక పోవచ్చు . కానీ నష్ట పోయారు  కాబట్టి  , సభ్యులకు  చెల్లించ లేరు .

సి )  చిట్టీలు నడిపే వారు కొందరు , అది ప్రయివేటు కావచ్చు , రిజిస్టర్డ్ కావచ్చు , మోసం చేయాలనే ఉద్దేశ్యం తోటే  ప్రారంభిస్తారు . చీటీలు ఎత్తిన వారికి కూడా మాయ మాటలు చెప్పి , నేను ఎక్కువ వడ్డీ ఇస్తానని  తన వద్దే పెట్టుకుంటారు . మీ అవసరాలకు  ఇస్తానని , ఎక్కువ వడ్డీ ఇస్తానని , వారి వద్ద అధనంగా  నిల్వ బెట్టుకున్న డబ్బును కూడా తెమ్మంటారు . పలానా చోట భూములు కొంటున్న , పలానా  షేర్లలో పెట్టుబడులు పెడుతున్నా అంటూ రక రకాల భరోసాలు ఇస్తూ  డబ్బు తన వద్ద పెట్టుకుంటారు . గంభీరంగా కనబడుతారు . మాటకారులై ఉంటారు . తీయగా  మాట్లాడుతారు . నమ్మిస్తారు . వమ్ము చేస్తారు . ఇలాంటి వారితో  కాస్త జాగ్రత్త గా ఉండాలి . 

4. లక్ష్యాలు : ఏవైనా  పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నవారు , అంటే  ఇల్లు కొనుక్కోవడం , పిల్లల పెళ్ళిండ్లు , కారు కొనడం , పెద్ద పెద్ద చదువులు , రిటైర్ మెంట్  లాంటి వాటికి  మ్యూచ్యువల్  ఫండ్స్ చాలా చక్కగా ఉపయోగపడుతాయి . మ్యూచ్యువల్  ఫండ్స్ గురించి తెలిసిన వారిని సంప్రదించి  నిర్ణయాలు  తీసుకుని  మ్యూచ్యువల్  ఫండ్స్ లలో దీర్ఘ కాలం పెట్టుబడులు పెడితే  పెద్ద మొత్తంలో వెల్త్ క్రియేట్ చేయవచ్చు . మ్యూచ్యువల్  ఫండ్స్ లలో ఒకే సారి పెద్ద మొత్తంలో పెట్టుబదులు పెట్టవచ్చు . లేదా  నెలవారీగా  పెట్టుబడులు పెట్టవచ్చు . నెలవారీగా  క్రమ పద్దతిలో  పెట్టుబడులు  పెట్టడాన్ని  SIP  లేదా  SYSTAMATIC INVESTMENT PLAN  అని అంటారు . 

5. సమర్ధత : ఫైనాన్సియల్ నాలెడ్జి ఉన్న వారు  , సమర్ధత  ఉన్నవారు, అవసరాలను బట్టి , అవకాశాలను బట్టి ,  ఆదాయ పన్నులను దృష్టిలో ఉంచుకొని ,  దేనిలోనైనా పెట్టుబడులు పెట్టి  సంపదను  పెంచుకోగలరు . పన్నులను తగ్గించుకోగలరు . 

6. రిటర్న్స్ : బ్యాంకులలో ఫిక్సడ్  డిపాజిట్   , చిట్టీలలో  6 నుండి 8 % రిటర్న్ వస్తే ,  మ్యూచ్యువల్  ఫండ్స్ లలో సంవత్సరానికి  12 నుండి 14% వస్తుంది . అదీ లాంగ్ పిరియేడు  కంటిన్యూ  చేస్తే . బ్యాంక్  సేవింగ్ అకౌంట్లలో  నైతే 3% వడ్డీ లభిస్తుంది . 

అర్ధమైంది అని అనుకుంటున్నాను . ఇంకా మీరు  ఏమైనా  తెలుసుకోవాలంటే  కామెంట్స్ లలో పోస్ట్ చేయండి . సమాధానాలు ఇవ్వడానికి  ప్రయత్నం చేస్తాను . 


Thursday, September 14, 2023

What are Passive income sources ? (అదనపు ఆదాయ మార్గాలు )

Passive Income Sources: 


 అదనపు ఆదాయ మార్గాలు 


01. ట్యూషన్స్ చెప్పడం 
02. పాల పాకెట్స్  , న్యూస్ పేపర్ వేయడం 
03. ఫ్రీ లాన్సర్ గా పని చేయడం 
04. ఆన్లైన్ లో ఆర్టికల్స్   వ్రాయడం 
05. ఆన్లైన్లో  ఎడిటింగ్ చేయడం 
06. ఐడియాలు  చెప్పడం 
07. సలహాలు చెప్పడం 
08. యూట్యూబ్  నడపడం 
09. వివాహాలు కుదర్చడం 
10. వస్తువులు , ఆహార పదార్ధాలు చేర వేయడం 
11. షేర్ మార్కెట్ , మ్యూచువల్  ఫండ్స్ ద్వారా   అదనపు  ఆదాయం సంపాదించడం 
12. టూరిస్ట్ గైడ్ గా పని చేయడం 
13. క్యాబ్స్ నడపడం 
14. గేమ్స్ ఆడటం 
15. గేమ్స్ ట్రైనింగ్ ఇవ్వడం 
16. ఆరోగ్య సలహాలు ఇవ్వడం 

మొదలైన అనేక మార్గాల ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించవచ్చు . 
మనసు ఉంటె మార్గం దొరుకుతుంది . 
;

Tuesday, January 24, 2023

INVESTMENTS IN BANKING SHARES & MUTUAL FUNDS. IS IT SAFE OR NOT HERE AFTER?

 బ్యాంకింగ్  షేర్లలో  , బ్యాంక్ మ్యూచువల్ ఫండ్స్ లలో  పెట్టుబడి పెట్టడం  వలన  ఏమైనా  సమస్యలు  ఉన్నాయా ?   

(INVESTMENTS IN BANKING SHARES & MUTUAL FUNDS . IS IT SAFE OR NOT HERE AFTER?)

 
బ్యాంకింగ్  షేర్లలో  , బ్యాంక్ మ్యూచువల్ ఫండ్స్ లలో  పెట్టుబడి పెట్టడం ఇక నుండి అంతగా  లాభదాయకం కాదేమో అని అనిపిస్తుంది . 

అందుకు కారణాలు ప్రధాన మైనవి ,

01. బ్యాంకు లపై  అధికంగా రాజకీయ ప్రభావముండటం .

02. బ్యాంకులలో  కరెంట్ అకౌంట్స్ లలో , సేవింగ్ అకౌంట్స్ లలో  నిల్వలు (CASA)  తగ్గుతూ ఉండటం .

03. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు   అధికంగా  అప్పులు తీసుకుని ,అవి అసలు , వడ్డీ చెల్లించలేని పరిస్థితులలో ఉండటం . దీని వలన బ్యాంకులు భారీగా  నష్ట పోవచ్చు .
 
04. గతంలో  9౦ రోజులు దాటితేనే , మొండిబాకీల అసలు  మరియు  వడ్డీకి  ప్రొవిజిన్ చేసే వారు . ఇప్పుడు  అలా కాకుండా , అప్పు తీసుకున్న వారు , ఇక చెల్లించ లేరు 
అని తెలుస్తే  చాలు , ప్రొవిజిన్ పెట్టాల్సిందే  అని చెబుతున్నారు . దీని వలన , బ్యాంకుల లాభాలు , క్షీణించడానికి అవకాశం మెండుగా ఉంది . అంతే కాదు ,
మరెన్నో  చీకటి కోణాలకు  దారి తీసే అవకాశం లేక పోలేదు . 

05. బ్యాంకు లకు , రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా కు , కేంద్ర ప్రభుత్వానికి , బడా కంపెనీల అప్పులను రైట్ ఆఫ్ చేసే  అధికారం ఉంది , చేస్తున్నాయి కూడా . రేపు ఇంకా విపరీతంగా రైట్ ఆఫ్ చేస్తారు. దీని వలన బ్యాంకు ఆదాయాలు తగ్గిపోతాయి . 
ఆ కారణంగా  షేర్ల ధరలు  తగ్గి , షేర్ హోల్డర్స్  నష్ట పోవచ్చు .

06. బ్యాంకులు   మొండి బకాయిలను వసూలు  చేయకుండా , తెలివిగా  ఇతర ఏజెన్సీ లకు అమ్ముతున్నారు . ఎలా అమ్ముతున్నారంటే  , ఉదా : రూలు . 24, ౦౦౦౦ కోట్ల  అప్పులను , రూలు . 12,౦౦౦ కు అమ్మేస్తున్నారు . మరికొన్ని  బ్యాంకులు  రూలు . 1౦,౦౦౦ కోట్ల అప్పులను , రూలు . 3,౦౦౦ కోట్లకు అమ్ముతున్నారు . ఆ వెసులుబాటు ఉంది . ఇక  మిగిలిన అప్పులను , లాభాలనుండి  తగ్గిస్తున్నారు . దీనివలన షేర్ల  ధరలు అమాంతం తగ్గిపోతున్నాయి . దీని కారణంగా , షేర్ హోల్డర్స్  భారీగా నష్ట పోతున్నారు .
ఇక మరి కొన్ని బ్యాంకులు , బాండ్లను జారీ చేసి , దానిలో ఒక రిస్క్ క్లాజ్ పెట్టి , మొత్తం బాండ్లను రద్దు చేస్తున్నారు . ఇది ఎంత అన్యాయం . అసలు  ఆ క్లాజే  ఉండ కూడదు .

07. బ్యాంకింగ్  స్కీం లు నడిపే మ్యూచువల్  ఫండ్స్ కూడా , బ్యాంకింగ్ షేర్లలోనే  ఇన్వెస్ట్ చేస్తాయి . షేర్ల ధరలు  తగ్గిపోతే , ఆటోమాటిక్  గా , ఎన్ . ఏ . వి  తగ్గి పోతుంది . 
 ఆ విధంగా  ఇన్వెస్టర్స్  నష్ట పోతారు.  

08. కొన్ని బ్యాంకులు , కొన్ని ఇస్యూలను , షేర్ హోల్డర్స్  కు , తేలియా నీయకుండా చేస్తున్నాయి .  అవి కోర్టుల నుండి  నెగటివ్ తీర్పులు  వచ్చే వరకు  ఇన్వెస్టర్స్ కు తెలియక , అధికంగా  పెట్టుబడులు పెట్టిన వారు   భారీగా నష్ట పోతున్నారు. 


నోట్ : ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్  మాత్రమే . పెట్టుబడులు పెట్టేముందు  డాక్యూమెంట్స్ ను పూర్తిగా చదివి    మీ స్వంత  నిర్ణయాలు  గాని లేదా  మీకు నమ్మకమైన  ఫైనానాన్సియల్  కన్సల్టెంట్ సలహాలు , సూచనలతో  , పెట్టుబడులు పెట్టగలరు . 





You can also watch my youtube channel for other and related share market information:




;

Thursday, December 3, 2020

జి .హెచ్ .ఎం .సి ఎన్నికల(డిసెంబర్ ,2020)లో పోలింగ్ శాతం తగ్గ డానికి కారణాలు? (REASONS FOR THE REDUCE OF POLLING PERCENTAGE IN GHMC ELECTIONS ) & పోలింగ్ శాతం పెర్గ డానికి ఏమి చేయాలి?

;
ప్ర: జి .హెచ్ .ఎం .సి ఎన్నికల (డిసెంబర్,2020) లో పోలింగ్ శాతం తగ్గ డానికి కారణాలు? (REASONS FOR THE REDUCE OF POLLING PERCENTAGE IN GHMC ELECTIONS, DECEMBER,2020 ) & పోలింగ్ శాతం పెర్గ డానికి ఏమి చేయాలి? 

జ:ఎన్నికల సందర్భంగా , ఎన్నికల కమీషన్ మరియు మీడియా అనేక రకాలుగా , అవగాహనా కల్పించినా , ప్రోత్స హించినా , బాధ్యతను గుర్తు చేసినా ,ఎన్నికలలో పోలింగ్ శాతం తగ్గడానికి " కర్ణుడి చావుకి శతకోటి కారణాలన్నట్లు ", అనేక కారణాలున్నాయి. డిసెంబర్ ,2020 లో జరిగిన జి .హెచ్ .ఎం .సి ఎన్నికలలో , స్టేట్ ఎలక్షన్ కమీషనర్ చెప్పిన ప్రకారం , మొత్తం ఓటర్ల సంఖ్య , 74 లక్షల 67 వేల 256 . (ఇది కాన్స్టిట్యూఎన్సీ లిస్ట్ ) 43 శాతం పోలింగ్ జరిగిందని అంటున్నారు . అంటే ఓటర్ల సంఖ్య సుమారుగా 32 , 10 వేల 920 అన్నమాట . ఎన్నికల లిస్టులు చూస్తే , కనీసం 20 శాతం ఓటర్లు డిలీట్ అయినవి . 20 శాతం అంటే 14 లక్షల 93 వేల 451 ఓటర్లను డిలీట్ చేశారు. కరోనా వలన , సాఫ్ట్వేర్ ఇంజినీర్లు , ఇతరులు సుమారుగా 10 లక్షల మంది ఇంటి నుండి పని చేస్తున్నారు. లేదా గ్రామాలకు వెళ్లి పోయారు. ఇక కనీసం 2 లక్షల మంది ఓటర్లు మున్సిపల్ కార్పొరేషన్ లిస్ట్ ల లోకి వెళ్లి పోయారు . వీటిని తీసివేస్తే జి .హెచ్ .ఎం సి . ఓటర్ల సంఖ్య - 47 లక్షల 73 వేల 805 ఓటర్లు . ఇక పాలయిన ఓట్ల సంఖ్య - 32 లక్షల 10 వేల 920 . ఈ లెక్కన పోలింగ్ శాతం చూస్తే - 67 . 26 శాతం పోలైనట్లు లెక్క. 

  పోలింగ్ శాతం తగ్గ డానికి కారణాలు
1. చాలా మంది పేర్లు , ఒకటి కంటే ఎక్కువగా నమోదు కావడం . ఆన్ లైన్ ద్వారా మరియు ఇతర మార్గాల ద్వారా . కరెక్క్షన్స్ కోసం అవకాశం కల్పించడం వలన , అన్ని రకాలుగా సబ్మిట్ చేసారు . తక్కువ సమయం , సిబ్బంది కొరత మొదలైన కారణాల వలన , పాతవి అలానే వుంచి క్రొత్తగా మరల రిజిస్టర్ చేయడం లాంటివి జరుగు చున్నవి. ఫోటోలు మారడము , పేర్లు , అడ్డ్రస్సులు తేడాగా వుండటం వలన , లిస్టులో నుండి రిమువ్ చేయలేక పోతున్నారు. 
2. ఆంద్ర ప్రదేశ్ ప్రజలు మరియు ఇతర రాష్ట్రాల ప్రజలు, ఇతర జిల్లాల ప్రజలు వారి స్వస్థాలాలోనే కాకుండా , మరల ఇక్కడ కూడా నమోదు చేసుకుని ఉండి ఉండొచ్చు. రెండు సార్లు వేయకుండా , ఎన్నికల కమీషన్ కఠిన చర్యలు చేపట్టక చేపట్టక పోవడం వలన , ఇక్కడి ఎన్నికలలో పాల్గొన కుండా ఉండటాన్ని కొట్టి పారేయ లేము. 
3. చాలా మంది అర్హత ఉన్న అనేక ఏండ్లు గా ఉంటున్న ఓటర్లను , అనేక కారణాల వలన ఓటర్ల లిస్టుల నుండి తొలగించడం జరిగింది . ఆ కారణంగా చాలా మంది ఓటర్లు, వారి ఓటు హక్కు వినియోగించు కోలేక పోయారు .
4. చాలా మంది ఓటర్లకు , ఎన్నికల సిబ్బంది ఓటరు స్లిప్పులను ఇవ్వడం లేదు . అందు వలన మరియు పోలింగ్ కేంద్రాలు ఎక్కడో తెలియక , ఓటు వేయలేక పోయారు .  
5. గ్రేటర్ హైదరాబాదు లో , వివిధ కారణాల వలన అడ్డ్రస్సులు మారే వారు అధికం . అడ్డ్రస్సులు మారిన వారు , పాత అడ్డ్రస్సుల్లో ఉండరు కాబట్టి , ఎన్నికల స్లిప్పులు ఇవ్వడానికి అవకాశమే లేదు . ఆ కారణంగా కూడా కూడా కొంత మంది ఓటర్లు వోటు వేయ లేక , ఓటు శాతం తగ్గింది . 
 6. చని పోయిన వారి పేర్లు ఓటరు లిస్టులో నుండి తొలగించక పోవడం వలన , నమోదయిన ఓటర్ల సంఖ్యా పెరిగి నట్లైంది. ఓటింగ్ శాతం తగ్గి నట్లైంది . 
7. ఈ మద్య కాలంలో నూతనంగా వెరయిటీ ఓటర్ ఐ డి కార్డులు ఇష్యూ చేసారు . వాటి మీద ప్రజెంట్ పోలింగ్ బూతు నెం . పార్ట్ నెం . స్థలం అన్నీ ఉన్నాయి . సులువుగా వీరిని బూతు లోకి అనుమతించ వచ్చు . కాని స్లిప్పులు లేని కారణంగా వీరిని బూతు లోకి అనుమతించ లేదు . తెలియక కొందరు , వాదించడం ఇష్టం లేక కొందరు , లాఠీలకు బయ పడి కొందరు వెను తిరిగి పోయారు . ఓటరు కార్డుల పైననే ఇవన్నీ ఉన్నాయని , ఇలా కొత్తగా ఓటరు కార్డులు పొందిన వారికి మరియు ఎన్నికల సిబ్బంది కి , ఎన్నికల కమీషన్ అవగాహనా కల్పించ లేక పోయారు . 
8. కొందరు అని వార్య కారణాల వలన , ఇతర ప్రదేశాలకు వెళ్ళడం వలన , ఓటు వేయలేక పోయారు . 
9. మరి కొందరు అనారోగ్య కారణాల వలన , ఓటు వేయలేక పోయారు . 
10. ఇంకొందరు , ఓటు వేసినా , వేయక పోయినా వీరాభి మానుల కారణంగా ఎవరో ఒకరు గెలుస్తారు , మరల యదా విదే , అని ఎన్నికలంటే నిరాసక్తత , నిర్లక్ష్యO , అయిష్టత తో ఓటు వేయ కుండా ఉండ వచ్చు . 
11. డబ్బు , మందు ప్రభావం కొందరిలో ఉత్సాహాన్ని నింపుతే , మరికొందరిలో నిరుత్సాహాన్ని , ఇంకొందరిలో పగలు , కక్షలు , కొట్లాటలు పెంచి ఓటు హక్కు లను దూరం చేసాయి . 
12. కొన్ని చోట్ల పోలింగు బూతులు దూరంగా ఉండటం వలన ఓటు హక్కు వినియోగించు కోలేదు . 13. ఒకే కుటుంభ సభ్యులకు , తల్లి దండ్రులకు పాత కార్డుల ప్రకారం ఒక అడ్డ్రస్సు బూతు , కొత్తగా అవకాశం వచ్చిన పిల్లలకు కొత్త కార్డుల ప్రకారం మరో పోలింగు బూతు పడటం వలన , ఎవరో ఒకరు , లేదా అందరూ ఓటు వేయడం మిస్ చేసు కుని ఉండాలి .వృద్ధులను పోలింగ్ భూత్ లకు తీసుకపోవడం వీలు కాక పోవడం వలన. 
14. ఎండ ప్రతాపం మరియు నీరు , నీడ లాంటి సౌకర్యాలు కొరవవడం కూడా , ఎన్నికల శాతం తగ్గడానికి కారణం అయి ఉండాలి . 
15. వేరే ప్రాంతాల్లో ఎన్నికల విధుల్లో ఉండటం , పోస్టల్ బ్యాలెట్ వోటు హక్కును వినియోగించు కోవడం మరిచి పోవడం మొదలగునవి , ఎన్నో కారణాలు , గ్రేటర్ హైదరాబాదు లో ఓటింగు శాతం తగ్గ డానికి కారణ మయ్యాయి. 

ఎన్నికల కమీషన్ , ఎంతో దూరదృష్టితో వోటర్ కార్డు ప్రాముఖ్యతను గుర్తించి , ఓటరు నమోదు ప్రక్రియ ను ప్రారంభించింది . వోటరు కార్డు అనేది ఇప్పుడు ఒక "బహులార్ధక సాధక సాధనం " . బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా వోటరు కార్డు నే అడ్గు తున్నారు . రేషన్ కార్డు కు అప్లై చేయాలన్నా వోటర్ కార్డు నే అడుగు తున్నారు . టెలి ఫోనుకు అప్లై చేయాలన్నా వోటర్ కార్డే కావాలి . పాస్ పోర్టు కు అప్లై చేయాలన్నా వోటర్ కార్డే కావాలి . డ్రైవింగ్ లైసెన్సు కు అప్లై చేయాలన్నా వోటరు కార్డు కావాలి. చివరికి వోటు వేయాలన్నా వోటర్ కార్డు కావాలి . ఇంత ముఖ్యమైన వోటర్ కార్డు , అప్లై చేసిన ప్రతి చోటా ఉంటాయి . అలాంటిది , వోటర్ లిస్టులో పేరు లేక పోతే , వోటర్ కార్డు విలువ ఏమిటి ?. వోటరు , వోటు వేయడానికి వెళ్లి నప్పుడు వోటు వేసే అర్హత లేదన్నప్పుడు ఎంత క్షోభకు గురి అవుతాడు . బ్యాంకు , పాస్పోర్ట్ , టెలిఫోన్, డ్రైవింగ్ అధి కారులు , ఏదేని అవసరం వచ్చి వోటరును వేడుకుదామనుకుని , వోటర్ లిస్టు వేడుకుతే , అందులో వోటరు పేరు లేక పోతే , ఇక ఎలా ముందు కెలుతారు ?. ఇక ప్రజలకవ్యవస్థలపై విశ్వాసం ఎలా కలుగుతుంది ? 

పోలింగ్ శాతం పెర్గ డానికి ఏమి చేయాలి ? 
1. ప్రతి ఇంటి ఇంటికి ఎన్నికల కమీషన్ నియమించిన సిబ్భందే వెళ్లి , అర్హులైన వోటర్ల గురించి , అనర్హులైన వోటర్ల గురించి ఖచ్చితమైన విచారణ జరిపి , తప్పుడు వోటర్లను , ఓటర్ లిస్టు నుండి తొలగించాలి . అలానే ఓటరు లిస్టులో లేని పేర్లను అక్కడికక్కడే ఫోటోలు దింపి , అప్లికేషన్లను తీసుకోవాలి . ఆ తరు వాత ఓటరు లిస్టులో నమోదు చేయాలి . 
2. విచారణకు నియమించ బడే సిబ్భంది , ఏమి చదివారు అనేది కాకుండా , ప్రజల భాషలు అర్ధం చేసు కోగలరా , మాట్లాడ గలరా , చదువ గలరా , వ్రాయ గలరా , విచారణ భాధ్యతలను సక్రమంగా నిర్వర్తించ గలరా అనేది పరిశీలించి నియమించాలి . 
3. మరణ ధ్రువ పత్రాలు ఇష్యూ చేసే జి. ఎచ్. ఎం సి నుండి వివరాలు సేకరించి, మరణించిన వారి పేర్లను ఓటరు లిస్టు లో నుండి తొలగించాలి . 
4. ఏ రాజ కీయ నాయకులకు , కార్య కర్తలకు , ఓటరు లిస్టులో పేర్లను తొలగించ డానికి , అవకాశం ఇవ్వ కూడదు . 
5. కేవలం గత ఎన్నికలలో ( వివిధ కారణాల మూలంగా ) ఓటు వేయ లేక పోయి నంత మాత్రాన , వారి పేర్లను ఓటర్ లిస్టులో నుండి తొలగించ కూడదు . 
6.ఒకసారి కంటే ఎక్కువ సార్లు లిస్టయిన పేర్లను , ఫోటోలను , అడ్డ్రస్స్ లను గుర్తిచే , కనీసం రాష్ట్ర పరిధిలో నైనా , సాఫ్టవేర్ ను ఉపయోగించి , డూప్లికేట్ ఓటర్లను గుర్తించి , అనలైజ్ చేసి , నిర్ధారణ చేసు కుని , అలాంటి వాటిని తొలగించాలి . 
7.ఎన్నికల కమీషన్ , కేవలం ఎన్నికల సమయాన్నే మొక్కుబడి గా హడావుడి చేయ కుండా , పూర్తి కాలం వోటర్ల నమోదు , వోటర్ల తొలగింపు పై దృష్టి సారించాలి . 
8. నిస్వార్ధంగా ఎన్నికలను జరిపించాలి . ప్రభుత్వ ఒత్తిడులకు లొంగ కూడదు. 
9. ఎన్నికల బ్యాలెట్ పేపర్లలో గాని , ఈవీఎం లలో గాని , వీరిపై ఇన్ని క్రిమినల్ కేసులు , లేదా ఇతర కేసులు ఉన్నాయి అని ప్రచురించాలి . 
10. రిగ్గింగ్ కు పాల్పడినా , డబ్బులు పంచినా , మద్యం పంపిణీ చేసిన రాజకీయ నేతలను , మరో 5 సంవత్సరాలవరకు ఎన్నికలలో పాల్గొనకుండా చట్టాన్ని తీసుకుని రావాలి . ఆ చట్టాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారో వారి పేర్లను ప్రకటించాలి . 
11. ఓటర్ల ద్వారా ఎన్నికై , వేరే పార్టీ లోకి చేరే వారిని , వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలి . మళ్ళీ ఎన్నికల వరకు , ఎన్నికలలో పాల్గొనకుండా చేయాలి . 
12. ఎవరైనా చనిపోతే , అర్హత లేని వారి కుటుంబ సభ్యులను పోటీ లేకుండా ఎనుకో కూడదు. ఇలాంటి వారి వలన ప్రజలు 5 సంవత్సరాలు నష్టపోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా , ప్రజలకు ఎన్నికలంటే , ఎంతో విలువైనవి అనే విధంగా , ఎన్నికల విధానం ఉండాలి . ప్రజలకు ఎన్నికలంటే నమ్మకం , ఉత్సాహం కలిగించాలి.

Monday, July 20, 2020

SRI RAMANUJA PHILOSOPHICAL FOUNDATION TRUST

;
                  *శ్రీ రామానుజ ఫిలసాఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్*

భారత దేశ మంతటికి గాను , దాతలు, శ్రేయోభిలాషులు   మరియు  అప్పటి  జడ్జి  *శ్రీమాన్ లేట్ గోపాల కృష్ణమూర్తి*  గారు , పేద ప్రజలను / బంధువులను ఆదుకోవాలనే ప్రధాన ఉద్దేశ్యంతో   *చాత్తాద శ్రీవైష్ణవ వెల్ఫేర్ ట్రస్ట్*  1997  లో ఆవిర్భవించింది.  దీని రిజిస్ట్రేషన్ నెంబర్. 69 / 19997 .దీనికై సర్వశ్రీ బి . బాలకృష్ణ  గారు , టి . రాజమన్నార్ గారు మరియు సూర్యనారాయణ గారు మొదలగు విశాఖ వాస్తవ్యులు చేసిన కృషి ఎంతో ప్రశస్త నీయమైనది.   అయితే  , ఆ తరువాత  ఒక సంవత్సరం వరకు , ఇందులో ఎలాంటి కార్యక్రమాలు జరుగలేదు.

ఆ తరువాత , ప్రజాకాంక్షను కోరే పెద్ద మనసు గల దాతలు, శ్రేయోభిలాషులు   కొందరు కలిసి ట్రస్టీస్ గా ఏర్పడి 1998  లో , దీని పేరును *శ్రీ రామానుజ ఫిలసాఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్* గా మార్చడం జరిగినది.
దీని యొక్క రిజిస్టర్డ్ ఆఫీస్: ఎం .ఐ . జి . II -97 , సెక్టార్ - 3 , ఎం . వి .పి. కాలనీ ,విశాఖపట్నం - 530017 . ఆంధ్ర ప్రదేశ్ .
హైదరాబాద్ చాప్టర్ ఆఫీస్:  2 - 2 - 1146 - 7 - 12 / 1 , న్యూ నల్లకుంట , నర్మదా భవన్, శివమ్ రోడ్ , హైదరాబాద్ - 500044 . తెలంగాణ .

*ఆబ్జెక్టివ్స్  ఆఫ్ ట్రస్ట్:*
01 . కుల మతాలతో సంబంధం లేకుండా , పేద విద్యార్థుల విద్యార్జన కొరకు ఉపకార వేతనములు మరియు ఇతర సదుపాయాలు కలుగ చేయడం.
02 . పేద , బిక్కు , వితంతువులకు , వృద్ధులకు,  వైద్య సదుపాయాలు కలుగజేయడం .
03 . నిరుద్యోగులకు , శారీరక వికలాంగులకు  ఆర్ధిక సహాయాన్ని అందించడం.
04 . ఇతర ప్రజా చారిటబుల్ ట్రస్ట్ లకు , ఇన్స్టిట్యుషన్స్ కు మరియు అసోసియేషన్స్ కు అన్నధానాలకు  నిధులు ఇవ్వడం .
05 . నిరుద్యోగులు  ఉద్యాగాలు పొందడానికి , ట్రైనింగ్  సహకారాలను అందించడం.
06 . నీతివంతమైన , సాంఘీక , వైజ్ఞ్జ్యానిక, సాహిత్య మరియు ఆధ్యాత్మిక పుస్తకాలను  పబ్లిష్ చేయడం, మొదలైనవి .

*శ్రీ రామానుజ ఫిలసాఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్*   చైర్మన్ గా  *శ్రీ కర్పూరం వెంకటేశ్వర్లు* గారు  2010  వరకు   చైర్మన్ గా కొన సాగారు . ఇప్పటికీ  ట్రస్ట్ మెంబెర్ గానే  కొన సాగుతున్నారు . ఆ తరువాత  శ్రీమంతుడు *శ్రీ దాస్యం మురళీధర్ స్వామి* గారు చైర్మన్ గా ఉన్నారు .
ఇప్పడు * శ్రీ మాచవరం వెంకటేశ్వర్లు* గారు చైర్మన్ గా కొన సాగుతున్నారు.
ఇప్పుడు  *శ్రీ రామానుజ ఫిలసాఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్* , మన చాత్తాద శ్రీవైష్ణవ సంఘానికి అనుబంధం గానే నడుస్తున్నది.

*శ్రీ రామానుజ ఫిలసాఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్*  కు ఎంతోమంది దాతలు, దానకర్ణులు ,విశాల హృదయులు విరాళాలు ఇచ్చారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది , దానకర్ణురాలు Dr.*శ్రీమతి నర్మద* గారు . Dr. *శ్రీమతి నర్మద* గారు సుమారుగా  80  వేల డాలర్లు , వాయిదాల  పద్దతిలో ఇచ్చారు . అప్పుడు మన కరెన్సీలో చూసుకుంటే  సుమారుగా 40  లక్షల రూపాయలు. అప్పుడు వారి అనుమతితో  సుమారుగా  23 లక్షలను ఫిక్షుడు డిపాజిట్ చేసి , కొంత డబ్బును *నర్మదా భవన్* నిర్మాణానికి ఖర్చు చేశారు.   

*శ్రీ రామానుజ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్*  కార్యక్రమాల గురించి , అప్పటి గౌరవ కార్యదర్శి *శ్రీమాన్ దాస్యం మురళీధర్ స్వామి* 2005  రిలీజ్ ఐన సావనీర్ లో ఏమి అన్నారో వారి మాటలలోనే చూడండి. 

*మన సమాజంలో చాల మంది బీద  వారున్నారు . వారిలో ఎక్కువ మంది అతి బీద వారు గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నారు . వీరి సంపాదన కనీసం కూడు , గుడ్డకు సరిపోదు . కొంత మంది తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉచిత విద్యను అందించలేని పరిస్థితులలో ఉన్నారు . పేదరికంతో , అజ్ఞ్యానంతో , అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. కొన్ని సందర్భాలలో సంపాదించే కుటంబ సభ్యుల అకాల మరణంతో భార్యా పిల్లలు  దిక్కులేని స్థితికి చేరుకుంటున్నారు. మరియు కుటుంభంలో సంపాదించే కుమారులు సైతం వేరు పడటంతో  వృద్ధులకు నిలువ నీడ లేని పరిస్థితులు ఏర్పడుతున్నవి*.
*పై సమస్యల బాధల నివారణకై  రాష్త్ర , కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలతో విశేషంగా  కృషి చేస్తున్నవి. కొన్నిమానవతా  సంస్థలు వారికీ నచ్చిన ఆశయాలతో వారి పరిధిలో కొందరి బీద వారికీ సహాయం చేస్తున్నారు. ఇవి కాక కొన్ని ఆర్ధికంగా నిలదొక్కుకున్న కుల సంస్థలు , వారి కులం లోని బీదలకు ఆర్ధిక సహాయం అంద చేస్తున్నాయి . వీటన్నిటి వలన కూడా అందరి బీదలకు పూర్తి స్థాయిలో సాయం అందడం లేదు*.
బీదల పాట్లు , కష్టాలు ఎలా ఉంటాయో , 2005  లోనే  సావనీర్ లో  *శ్రీ దాస్యం మురళీధర్ స్వామి* గారు , చాలా చక్కగా రిపోర్ట్ చేశారు . *శ్రీ దాస్యం మురళీధర్ స్వామి* గారికి , మన సమాజం పట్ల , బీదల పట్ల ఎంతటి  అవగాహన , సానుభూతి , దయ ఉందో ,దీనిని బట్టి మనం అర్ధ చేసుకోవచ్చు. అంతే కాదు . వారు పెద్ద మొత్తంలో విరాళాలు కూడా ఇచ్చిన దయార్ద్ర హృదయుడు.

ఇప్పటికీ ప్రతి సంవత్సరం  ఎంతో మంది దాతలు దేశ , విదేశాలనుండి విరాళాలు పంపిస్తున్నారు. అంతే కాదు, పెద్ద ఉద్యోగంలో ఉన్న ఒక బంధువు , *శ్రీ రామానుజ ఫిలసాఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్* కు , తన వేతనంలో , ప్రతి నెలా 1 % ఇస్తానని 2005 లోనే వాగ్దానం చేశాడు.      
ఆ విధంగా వచ్చిన విరాళాలను ,డిపాజిట్ల పై వచ్చే వడ్డీలను మరియు ఇతర ఆదాయాలను 2003 వ సం. నుండి వృద్ధులకు , వితంతంతువులకు పింఛన్లు ఇస్తున్నారు . పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇస్తున్నారు . రోగులకు ఆర్ధిక సహాయం చేస్తున్నారు. కుల మత బేధం లేకుండా అన్నదానం నిర్వహించే నాలుగు సంస్థలకు నిధులను అంద చేస్తున్నారు . ముఖ్యంగా మన కమ్యూనిటీ కే అధికంగా నిధులను వెచ్చిస్తున్నారు.

అలానే ప్రతి సంవత్సరం ఆదాయపన్ను  చట్టం ప్రకారం , విరాళాలను ఖర్చులను ఆడిటింగ్ జరిపిస్తున్నారు . ఆ విధంగా చేయడం  వలన , ఆదాయపన్ను చట్టం విరాళాలలకు , 50 %   పన్ను మినహాయింపులు కల్పిస్తున్నది.  ప్రతి విరాళాలను , ఖర్చులను  పారదర్శకంగా , మన పత్రికలో రెగ్యులర్ గా  ప్రచురిస్తున్నారు.
ఎంత చక్కగా కార్యక్రమాలు నిర్వహించినా , చాల మంది బంధువుల నుండి కొన్ని ఆరోపణలు వస్తున్నవి. అవి ఏమిటంటే , 

01 . *శ్రీ రామానుజ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్* ఉంది అన్న సంగతి , కమిటీ సభ్యులు ఎవరు ? ఎలా ఎన్నుకోబడుతారు ?  దాని వలన ఎవరికి సహాయం అందుతుంది?  మన కులం వారికేనా?  ఇతర కులాల వారికి  కూడానా?  ఎవరు రెకమండేషన్ చేయాలి?   అన్న విషయం సుమారుగా 70 % బంధువులకు తెలియదు.

02 . ప్రతి సం. రం. కేవలం కొన్ని శాఖలకే పెర్మనెంట్ గా సహాయం అందుతుంది. చాలా శాఖలకు ఆర్ధిక సహాయం అందడం లేదు. రాష్ట్రములో సుమారుగా  46  శాఖలున్నాయి . అంటే మిగిలిన శాఖలలో బీదలు , వృద్దులు , వికలాంగులు , వితంతువులు లేరా?
 
03 . ఎప్పుడు అప్లై  చేయాలి? ఎవరికి అప్లై చేయాలి? ఏమేమి సబ్మిట్ చేయాలి? ఎవరికి  అప్లికేషన్స్  సబ్మిట్ చేయాలి ? ఎవరు రికమండ్ చేయాలి? అనే విషయాలు పత్రికలో అడ్వాన్స్  గా రావడం లేదు . ఒక వేల వచ్చినా , సమయం అయిపోయాక  చేతిక పత్రిక అందడం వలన , మరల సం . వరకు  వేచి ఉండాల్సిన  పరిస్థితి.

04 . ఎంతో మంది అధ్యక్షులు , శాఖల నుండి అప్లికేషన్స్ పంపించినా , ఇంత వరకు సమాధానం లేదు. అనే ఆరోపణలు ఉన్నాయి.

05 . విరాళాలు పంపించిన వారికి  ఎంత శాతం పన్ను మినహాయింపు ఉంటుంది? , ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? అనే వివరాలు తెలియడం లేదు అనే ఆరోపణలు వస్తున్నాయి.

06 . ఒక్క రోజు కూడా మీటింగ్ పెట్టి , ట్రస్ట్ గురించి బంధువులకు అవగాహన కల్పించిన దాఖలాలు లేవు అనే ఆరోపణలు వస్తున్నాయి .

07 . దాతలనుండి  నిరంతరాయంగా విరాళాలు  సేకరించి ,  పేదలకు ఆర్ధిక సహాయం అందించడానికి , కాల నియమాలు  ఎందుకు  అని ప్రశ్నిస్తున్నారు.

08 . ఆన్ లైన్ లో  విరాళాలు అందిస్తే , పెండింగ్ లో ఉన్న మొత్తం  ఇంత  అని పత్రికలో ప్రకటించక పోవడం. పెండింగ్ లో ఉన్న బ్యాంక్ క్రెడిట్ మొత్తాలకు   రసీదులు వ్రాసి పెట్టక పోవడం.

09 . ట్రస్ట్ ఫోన్ నెంబర్ ఏమిటి ? ఎవరిని కాంటాక్ట్ చేయాలి?  వెబ్సైట్ , ఇమెయిల్ ఐడి ఏమిటి ?  

ట్రస్ట్ పై అవగాహన పెంచుకోండి. ఈ ట్రస్ట్ రాష్ట్రం లోని  అర్హులందరికి, ఉన్నంతలో  ఆర్ధిక సహాయం అందిస్తుంది.  తాహత్తు ఉన్నవారు విరాళాలు ఇవ్వండి . పన్ను మినహాయింపులను పొందండి. అడుగడుగునా ప్రశ్నించే తత్వం పెంచుకోండి. అర్హులైన వారు , శాఖల అధ్యక్షుల ద్వారా అప్లై చేయండి. ఆ తరువాత కూడా ఎందుకు రాలేదో విచారించండి. అనర్హులు లబ్ది పొందితే  నిలదీయండి. మౌనం చాలా ప్రమాద కరం*.

PROBLEMS AND SOLUTIONS

;
                                              *సమస్యలు-పరిష్కారాలు*

అన్ని అర్హతలు ఉండి కూడా ఉద్యోగం రాక నిరుద్యోగి గానే ఉంటే , మీ మీ నక్షత్రాల ప్రకారం ఓ పది మొక్కలను నాటి  జాగ్రత్తగా పెంచి పోషించండి. అవి ఫలాలు అందించే లోపు మీకు ఉద్యోగం రావచ్చు. లేదా మీ టాలెంట్ ప్రకారం ,మీకు నచ్చిన బిజినెస్ ఎంచుకోవాలి.

ఏదైనా కార్యాలయంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటే , క్రమ శిక్షణ తో , సమయపాలన తో ,ఎవరిపైనా చాడీలు చెప్పకుండా ,మీ పని మీరు చేసుకుంటూ , వీలయితే తోటి వారికి సహాయం చేస్తూ , తోటి వారితో సరదాగా ఉంటే ,ఏ సమస్యలు ఉండవు.

ఆ కారణంగా అవమానాల పాలు అవుతున్న వారు , ఇతరుల గురించి పట్టించు కోకుండా ,ఇతరులపై ఈర్ష్య , అసూయలు పెంచుకో కుండా , ఎవరికీ హాని చేయకుండా ,మనవి కాని వాటిపై ఆశలు పెంచు కోకుండా ఉంటే అవమానాలు మన దరి  చేరవు.

దాయాదుల తో ఆస్తి తగువులు ఉన్నవారు , మన వెంటరాని ఆస్తులపై అత్యాశలు పెంచుకో కుండా , అనవసరంగా కోర్టులకు వెళ్ళకుండా, సామరస్యంగా పరిష్కరించుకుంటే ,ఏ తగవులు ఉండవు. చీమలకు పంచదార పోయండి.

సంతానం విషయంలో విచారం ఉన్నవారు , చుట్టుపక్కల ఉన్న పిల్లలను ప్రేమగా చూసుకుంటూ, ప్రతి నెలా మీకు వీలైన రోజు , అనాధ పిల్లల హాస్టల్ కు వెళ్లి, మీకు చేతనైన ఆహారం, పండ్లు ఫలాలు, పుస్తకాలు, పెన్నులు, బట్టలు పంచండి. వీలయితే కొంతకాలం కొరకు పిల్లలను దత్తత తీసుకోండి. చుట్టు పక్కల పిల్లలకు సేవలు చేయండి.

ఇంట్లో వివాహం ఆలస్యం అవుతున్న ఆడపిల్ల ఉంటే  వారంలో ఒక రోజు నానబెట్టిన గోధుమలలో బెల్లం కలిపి ఆవులకు పెట్టండి. ప్రతి రోజూ మొక్కలకు నీరు పోయాలి. నిత్యం ఇష్టమైన దేవుళ్ళకు పూజలు చేయాలి. కుటుంబ సభ్యులకు సేవ చేయాలి.

భూ వివాదాలు ఏర్పడినప్పుడు మన వెంటరాని భూముల గురించి తాపత్రయ పడకుండా, ఊరికే వచ్చే ఆస్తులపై, మోసం సొమ్ము తో కొన్న భూములపై అత్యాశలు  పెంచుకో కుండా , కక్షలకు , ప్రతీకారాలు కూ పోకుండా , చెప్పుడు మాటలు వినకుండా, చట్ట ప్రకారం  కలిసి మాట్లాడు కుంటే ఏ సమస్యా ఉండదు. 

ఇల్లు అమ్ముడు పోక ఇబ్బందులు పడుతున్న వారు , ఇంటి చుట్టూ మొక్కలను పెంచి , ఇంటి  వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచుతూ, అందరితో కలుపు గోలుగా ,ప్రేమగా ఉండండి. ఇంట్లో కొంతకాలం నుండి వాడని ఏ వస్తువులు ఉన్నా  ,పాత బట్టలు ఉన్నా పేదలకు ఉచితంగా పంచండి. అలానే ధరపై  కూడా లిబరల్ గా ఉంటే ఇల్లు త్వరగా అమ్ముడు పోతుంది.

రహస్య శత్రువులు ఉన్నవారు , ఒకరిపై మరొకరికి షికాయితలు చేయకుండా, ఎవరిపైనా ఈర్ష్యా అసూయ పెంచుకో కుండా, ప్రశాంతంగా, మనకు సంబంధం లేని ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ,తమపని తాము చేసుకుంటూ, అందరితో సరదాగా ఉంటూ ,సమాజ సేవ చేస్తూ ఉంటే ఇక రహస్య శత్రువులు ఉండరు.

పంట దిగుబడి సరిగా రాని రైతులు పొలాన్ని చక్కగా దున్ని , సరియైన విత్తనాలు వేస్తూ , సేంద్రియ ఎరువులను వాడుతూ, క్రిమి కీటకాలకు తగిన మందులు వాడుతూ , కలుపు మొక్కలు తొలగిస్తూ , తగిన శ్రద్ధ తీసుకోవాలి. భూసార పరీక్షలు చేయించి ,ఆ భూమి ఏపంటకు ఉపయోగపడుతుందో ,ఆ పంటనే వేయాలి. అప్పుడు ఆ భూమిలో అధిక దిగుబడి వస్తుంది.

చుట్టుపక్కల వారితో మీకు గొడవలు జరుగుతూ ఉంటే , ఈశాన్యం వైపున , తులసి మొక్కలను ,ఎరుపు మొక్కలను పెంచాలి. 
ఎవరిపైనా ఈర్ష్యా అసూయలు పెంచుకో కుండా, ఈ ఏరియాలో మేమే గొప్ప అనే అహంకారం పెంచుకో కుండా , గోడకాడ, వాకిలి కాడ , కొద్దిగా సర్దుబాటు తో ఉంటూ , చేతనైనంత సహాయం చేస్తూ , అందరితో కలుపు గోలుగా ఉంటే , చుట్టు పక్కల వారితో ఎలాంటి సమస్యా ఉండదు.

అధికమైన రుణ బాధలతో మీరు బాధ పడుతూ ఉంటే ,  గొప్పలకు పోకుండా, ఖర్చులు తగ్గించుకుని , కష్టపడి పనిచేస్తూ , సంపాదించిన డబ్బును, కొద్ది కొద్దిగా తీరుస్తూ, ఎవరికి మోసం చేయకుండా , నిజాయితీ గా ఉంటూ , అందరితో ముఖ్యంగా అప్పుల వారితో ప్రేమగా ఉంటే ఋణ బాధ తగ్గవచ్చు.

మీ సంపాదన చాలీచాలకుండా ఉంటే , మనకు అవకాశం ఉన్న 24 గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిజాయితీ గా కష్టపడి పని చేసి డబ్బు సంపాదించాలి. మోసం చేసి సంపాదిస్తే ,ఏదో ఒకరోజు అవమానాల పాలో ,జైలు పాలో , ఎన్కౌంటరో కావాల్సి వస్తుంది. మీరు చేయదలుచుకుంటే వందల పనులు ఉన్నాయి. సంపాదించ దలుచుకుంటే వందల అవకాశాలు ఉన్నాయి. సంపాదనకు వయసుతో పనిలేదు. అమితాబచన్ నేటికి సంపాదిస్తూనే ఉన్నాడు. డాక్టర్.అబ్దుల్ కలాం, చనిపోయినా పేటెంట్స్ ద్వారా సంపాదిస్తూ నే ఉన్నాడు. ఎవరి స్వభావానికి ,తగిన పనులు వారు ఎంచుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. గొప్పలకు పోకూడదు. రెగ్యులర్ గా పొదుపు చేస్తూ ఉండాలి. డబ్బే డబ్బును సంపాదించే విధంగా ప్లాన్ చేసుకోవాలి.

అకారణ వివాదాల్లో ఇరుక్కుని ఉంటే , సమాజానికి ఉపయోగపడే సేవల్లో పాలు పంచుకోండి. కరోనా గురించి ప్రచారం చేయండి.  అందరితో ప్రేమగా ఉండండి. 

చదువులో వెనక పడి పోతుంటే ,మీరు రోజు మెడిటేషన్ చేయండి. మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి. చెడు స్నేహాలను ,చెడు అలవాట్లను శాశ్వతంగా విడనాడాలి. ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచండి.  కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి. చేతనైన సహాయం ఇంట్లో చేయండి. ప్రశాంతంగా కూర్చొని మనసుపెట్టి, ఇష్టంగా, నేర్చుకోవాలనే తపనతో చదవండి. మనసులో చదివింది విశ్లేషించండి. శాశ్వతంగా గుర్తుండి పోతుంది. చదువులో ఫస్ట్ ఉంటారు. 

మీకు శత్రువులు ఎక్కువ అవుతుంటే , మరోసారి తప్పు చేయను ,మీకు ఎలాంటి హాని చేయను, నేను ఎవరి విషయంలో జోక్యం చేసుకోను ,మీకు ఇవ్వాల్సింది త్వరలో ఇస్తాను అని దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరండి.

 మీరు విదేశాలు వెళ్లే ఛాన్స్ మిస్ అయి పోతూ ఉంటే , మీకు దానికి సంబంధించిన అర్హతలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి.
అర్హతలు పెంచుకోవాలి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. అవకాశం కోసం ఎదురు చూడాలి.

Wednesday, April 22, 2020

"సెక్యూరిటీ కౌన్సిల్" ( Security Council) లో భారత దేశానికి , వీటో పవర్ (Veto Power) ఎందుకు ఉండ కూడదు?

"ఐక్య రాజ్య సమితి" లోని అత్యంత శక్తివంతమైన అధికారం గల విభాగం *సెక్యూరిటీ కౌన్సిల్ ( Security Council) లో భారత దేశానికి , వీటో పవర్ (Veto Power) ఎందుకు ఉండ కూడదు?

*నేడు సెక్యూరిటీ కౌన్సిల్ లో ఏక ఛత్రాధిపత్యం వహించే దేశాలు / వీటో పవర్ (Veto Power) / పర్మనెంట్ మెంబర్ షిప్ గల దేశాలు 5 ఉన్నాయి. అవి , ఎ,బి ,సి ,ఎఫ్ & ఆర్. అందులో మన భారత దేశం లేదు.*
*ఐక్య రాజ్య సమితి [యునైటెడ్ నేషన్స్ అఫ్ ఆర్గనైజషన్ (UNO)] 24 , అక్టోబర్ 1945 లో ఏర్పడినది. ఇందులో సుమారుగా 193 దేశాలు ఉన్నాయి . ఐక్య రాజ్య సమితి లోని అత్యంత శక్తివంతమైన అధికారం గల విభాగం సెక్యూరిటీ కౌన్సిల్*. ఈ *సెక్యూరిటీ కౌన్సిల్* లో మొత్తం 15 సభ్యత్వ దేశాలు ఉన్నాయి. అందులో 5 పెర్మనెంట్ సభ్యత్వ దేశాలు. 10 పర్మనెంట్ కాని దేశాలు .
*ఐక్య రాజ్య సమితి* చార్టర్ ,1945 ప్రకారం, 5 దేశాలకు *వీటో పవర్* అధికారం లభించింది . వీటినే పర్మినెంట్ దేశాలు అని , బిగ్ 5 అని లేదా పి-5 అని పిలుస్తారు . ఈ 5 దేశాలు మారవు.స్థిరంగా ఉంటాయి . మిగిలిన 10 దేశాలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి మారుతూ ఉంటాయి.
*ఈ వీటో పవర్ గల 5 దేశాలు ఏవంటే , అమెరికా , బ్రిటన్ , చైనా , ఫ్రెంచ్ మరియు రష్యా *. నేడున్న వీటో పవర్ గల 5 దేశాల దేశాధినేతలు: అమెరికా (డోనాల్డ్ ట్రంప్ ), బ్రిటన్ (బోరిస్ జాన్సన్ ) , చైనా (క్షి జిన్ పింగ్ ) , ఫ్రెంచ్ (ఎమాన్యూల్ మాక్రోన్) మరియు రష్యా (వ్లాడిమిర్ పుతిన్ ).
భారత దేశం, అప్పటి ప్రధాన మంత్రి శ్రీ పి. వి . నరిసింహ రావు గారి కాలం కంటే ముందు నుండే , సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ సభ్యత్వం గురించి , చాలా గట్టి ప్రయత్నాలే చేస్తుంది . కాని ఇప్పటి వరకు సఫలం కాలేదు . అయితే చాలా కాలం క్రితం 4 దేశాలు అనగా బ్రెజిల్ , జెర్మనీ , భారత దేశం మరియు జపాన్ జి -4 కూటమిగా ఏర్పడి , పర్మనెంట్ సభ్యత్వాలకు పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు ఏ దేశానికి దక్కలేదు.
ఈ *ఐక్య రాజ్య సమితి* / *సెక్యూరిటీ కౌన్సిల్* యొక్క ప్రధాన బాధ్యత * ప్రపంచంలో శాంతి మరియు రక్షణ కల్పించడం*. ఏదేని సమస్య వచ్చినప్పుడు , దానికి ఒక రెసొల్యూషన్ ను , *సెక్యూరిటీ కౌన్సిల్* డ్రాఫ్ట్ చేస్తుంది. ఆ డ్రాఫ్ట్ రెసొల్యూషన్ పాస్ కావాలంటే , ఈ 5 పర్మనెంట్ దేశాల ఓటింగే ( వీటో పవర్ ) అత్యంత కీలకం.
అంతటి కీలక విషయాలపై నిర్ణయం తీసుకునే అధికారం మన భారత దేశానికి, స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలు దాటినా , ఇప్పటికి లేక పోవడం 130 కోట్ల ప్రజలు ఆలోచించాల్సిన విషయం. మన భారత దేశానికి ఒక గొప్ప చరిత్ర ఉంది . ఎన్నో వేల సంవత్సరాల క్రితం పుట్టింది మన భారత దేశం. జనాభాలో రెండవ అతి పెద్ద జనాభా గల దేశం. ఆర్ధికంగా పరిపుష్టిగల దేశం భారత దేశం. శాంతి కాముక దేశం భారత దేశం. ఆచారాలు , సంప్రాదయాలు , ఆధ్యాత్మిక విషయాలలో ఉన్నతమైన భావాలూ గల దేశం భారత దేశం . ఎన్నో మతాలు , మరెన్నో కులాలతో కలిసి సంతోషంగా , ఆనందంగా జీవనం సాగిస్తున్న సెక్యూలర్ స్టేట్ మన భారత దేశం. రక్షణ విషయంలో అత్యంత శక్తి వంతమైనది మన భారత దేశం. ప్రపంచ దేశాలన్నిటిలో , మన భారతీయులు సేవలందిస్తున్నారు , కీలకమైన బాధ్యతలను చేపడుతున్నారు , చివరికి ఐక్య రాజ్య సమితిలో కూడా కీలకమైన బాధ్యతలను సునాయాసంగా చేపడుతున్నారు. రాజకీయంగా ఎంతో శక్తి వంతమైనది మన భారత దేశం . ఇన్ని శక్తి సామర్ధ్యాలు ఉన్న మన భారత దేశానికి *సెక్యూరిటీ కౌన్సిల్* లో *పర్మనెంట్ మెంబర్ షిప్* లేక పోవడం *వీటో పవర్* లేక పోవడం బాధాకరమైన విషయం . కనీసం ఇప్పుడైనా , మన ప్రధాన మంత్రి *శ్రీ నరేంద్ర మోడీ* గారి హయాంలోనైనా మనం సాధించి తీరాలి.

Tuesday, April 14, 2020

*కోవిద్ - 19 * (Covid-19) వలన ఏర్పడిన ఆర్ధిక మాంద్యం నుండి బయట పడటం ఎలా?

*కోవిద్ - 19 *  (Covid-19) వలన ఏర్పడిన ఆర్ధిక మాంద్యం నుండి బయట పడటం ఎలా?
*కోవిద్ - 19 * (Covid-19)  వలన దేశం మొత్తం దిగ్బంధం (లాక్ డౌన్) అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. వేలాది కరోనా పాజిటివ్ కేసులు , వందలు దాటిన మరణాలు చూస్తున్నాం. ఉత్పత్తి , రవాణా , సేవలు అన్నీ స్తంభించి పోయాయి. ఇది కేవలం మన ఒక్క భారత దేశానికి సంబంధించిన విషయం కాదు . ప్రపంచం లోని 218 దేశాలకు ఈ కరోనా వైరస్ మహమ్మారి విస్తరించింది.
అయితే ఇక్కడ మన ప్రభుత్వాలకు మూడు సమస్యలు స్పష్టంగా కనబడుతున్నాయి .
01 . కరోనా వైరస్ ను ఎలా అరికట్టాలి?
02 . పేద మధ్య తరగతి లోని వివిధ వృత్తుల వారిని ఎలా ఆదుకోవాలి? ఉత్పత్తులను , సేవలను అందించే కంపెనీలను ఎలా ఆదుకోవాలి?
03 . ఇంతగా నష్ట పోతున్న ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టడం ఎలా?
మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి గొప్ప సారధ్యానికి , దేశ 130 కోట్ల ప్రజల సంపూర్ణ మద్దతు ఉంది కాబట్టి , మరో పదిహేను, ఇరువై రోజులలలో మొదటి రెండు సమస్యలు పూర్తిగా సమసి పోతాయి . అందులో ఏ మాత్రం సందేహం లేదు.
ఇక మిగిలింది , కేవలం ఆర్ధిక వ్యవస్థను ఎలా పరుగు పెట్టించాలి? ఎలా పూర్వ వైభవం తీసుక రావాలి?
ఇది ఆశామాషి విషయం కాదు. అయినా అసాధ్యం మాత్రం కాదు. మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్లు , మన ప్రధాన మంత్రి గారు ,29 రాష్ట్రాల ముఖ్య మంత్రులు , ఇప్పటి లాగానే ,వైద్య నిపుణుల సలహాలకు బదులు, ఆర్ధిక నిపుణుల సలహాలను తీసుకుని , చర్చించి , వారి సూచనల కనుగుణంగా , ఆర్ధిక కార్య క్రమాలను రూపొందిస్తూ , ఇప్పటి లాగానే ప్రజలలో ధృడ సంకల్పాన్ని కూడా గట్ట గలిగి , ప్రజలలో పట్టుదలను , మనో ధైర్యాన్ని , ఉత్సాహాన్ని నింప గలిగితే , ఈ ఆర్ధిక మాంద్యాన్ని , ఒకటి రెండు సంవత్సరాలలో అధిగ మించడం ఏమంత కష్టం మాత్రం కాక పోవచ్చని నేను భావిస్తున్నాను.
ధనికులపై ఈ ఆర్ధిక మాంధ్యం ప్రభావం ఏమి ఉండదు. వీరు హాయిగానే జీవించ గలరు. పేదలను ఎదో విధముగా ప్రభుత్వాలే ఆదుకుంటాయి. వచ్చిన సమస్యల్లా మధ్య తరగతి వారికే.
ఇప్పుడు మధ్య తరగతి ప్రజలు జీవించడానికి చేయ వలసినదల్లా , వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచు కోవాలి. ఖర్చులు తగ్గించు కోవాలి. సరదాలు , జల్సాలు , వృధా ఖర్చులను తగ్గించు కోవాలి . ముందుగా సేవింగ్స్ ను కొంత ప్రక్కకు పెట్టాలి . మిగిలిన దానిని మాత్రమే ఖర్చు పెట్టాలి.
ప్రతి ఒక్కరూ పరిసరాలను , వ్యక్తిగత శుభ్రతను విధిగా పాటించాలి.
ఇక్కడ మనం ఒక విషయం గుర్తు పెట్టు కోవాలి. గత 40 , 50 సంవత్సరాలనుండి చూస్తే , ప్రజల మధ్య ఆర్ధిక అంతరాలు బాగా పెరిగి పోతున్నాయి. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి . ఆ కారణంగా నేడు , దేశ సంపద అంతా , కేవలం 10 % ప్రజల మధ్యనే ఉంది . మిగిలిన 90 % ప్రజలలో 50 % ప్రజలు మధ్య తరగతి వారు , 40 % మంది బిలో పావర్టీ లైన్లో ఉన్నారు.
*కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా చేపట్టవలసిన చర్యలు*:
01 . దేశ సంపద అంతా 10 % ప్రజల చేతిలో నే ఉందని చెప్పుకున్నాం . ప్రభుత్వాలు , నాయకులు ఆ 10 % ప్రజలలో మనసు మారేటట్లుగా , దేశ భక్తిని , దేశ పరిస్థితులపై సానుభూతి పెంచాలి . వారి వద్ద ఉన్న నల్ల ధనం లో కనీసం 25 % ప్రభుత్వాలకు ఇచ్చేటట్లుగా ఒప్పించాలి . ఇక వారిని , ఈ నల్ల ధనం ఎక్కడిదని అడుగుమని అభయ మివ్వాలి . ఆ తరువాత కూడా , విచారణ చేయ కూడదు.
02 . ఒక రోజు ముఖ్య మంత్రి శ్రీ కె . సి . ఆర్ గారు చికెన్ , మటన్ తినడం వలన ఇమ్మ్యూనిటి పెరుగుతుంది , తినవచ్చు అని అన గానే , తెల్లవారే అక్కడ ప్రజలు బారులు తీరారు . రియాక్షన్ అలా ఉంటుంది .అంతకు ముందు చికెన్ తింటే కరోనా వస్తుందని భయ పడి తినడమే మానేశారు . ఉచితంగా వండి వడ్డించారు . అలానే ప్రధానమంత్రి , ముఖ్య మంత్రులు , విదేశీ వస్తువులను వాడ కూడదు , స్వదేశీ వస్తువులనే వాడటం వలన మన దేశం అభివృద్ధి చెందు తుంది , మనం ఆరోగ్యంగా జీవించ గలుగుతాం అని , ప్రజల మనుషుల్లో నాటుకునే వరకు చెబుతూ ఉంటే , ప్రజలు స్వదేశీ వస్తువులు అధికంగా వినియోగిస్తారు . అప్పుడు మనం దేశ జి . డి .పి. పెరుగుతుంది . అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందుతుంది.
03. కోవిద్ -19 మహమ్మారి కి సంబంధించి , "వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ " జాతీయ విపత్తు కారణంగా భారత దేశానికి రావాల్సిన నిధులపై వత్తిడి తేవాలి.
04 . మరో 5 లక్షల కోట్లను ప్రజల సంక్షేమ పథకాలకు విడుదల చేయాలి.
05 . ఉత్పాదక సంస్థలకు , సేవా సంస్థలకు , రవాణా సంస్థలకు ఎలాంటి ఆటంకాలు సృష్టించ కుండా , వాటి యధావిధి ఉత్పత్తులను, సేవలను కొనసాగించే విధంగా వెసులుబాటు కలిగించాలి.
06 . అసంఘటిత వ్యవసాయ కార్మికులను , పట్టణాల వైపు చూడకుండా , గ్రామాల లోనే ఉపాధి కల్పించాలి .కొత్త ఉపాధులను క్రియేట్ చేయాలి . చేతి వృత్తులను పెంచాలి.
07 . ప్రతి భారతీయుడు తినే ఆహారాన్ని , మన రైతులే పండించే విధంగా , రైతులకు , సబ్సీడీలు ,ప్రోత్సహకాలు యధావిధిగా కొనసాగించాలి .వ్యవసాయానికి సంబంధించిన సలహాలు , సహకారాలను అందించాలి. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరను కలిగించాలి. మధ్య దళారులను తొలగించాలి . ధాన్యాన్ని కొంత కాలం నిల్వ చేసుకోడానికి , కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ లను ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలి . రైతులే వారి కూరగాయ పంటలను, వారే మార్కెట్లో అమ్ముకునే విధంగా అవకాశం కల్పించాలి. రైతులకు భీమా , పంటలకు భీమాలను ఖచ్చితంగా అమలు చేయాలి.
08. వ్యవసాయ భూములకు ఇచ్చే , ఎకరానికి 8 వేల రూపాయలను , నిజమైన వ్యవసాయదారులకు (రైతులు కావచ్చు , కౌలు దారులు కావచ్చు) ఇవ్వాలి గాని , భూస్వాములకు ఇవ్వకూడదు . 10 ఎకరాల భూమి ఉన్న వారినందరిని భూస్వాములుగా గుర్తించాలి . నాగలి పట్టో , మెషెన్ ను పట్టో దున్నే వాడే రైతు . భూస్వాములకు కౌలు డబ్బు వస్తుంది , భూముల ధరలు పెరుగుతే , ఆ డబ్బు వారికే చెందుతాయి. అలానే మైనింగ్ చేసే వారు , ఒక్క పంట కూడా పండించరు . వారిని రైతులు అనడం , వారికీ ఎకరానికి 8 వేలు ఇవ్వడం తక్షణమే నిలిపి వేయాలి.
09 . భారత దేశంలో దొరకని ముడి సరుకులు, మెషినరీ తప్పా , ఎలాంటి ఆహార పదార్ధాలను, డ్రింక్స్ ను , మందులను రెండు మూడు సంవత్సరాలు దిగుమతి చేయ కుండా నిషేధించాలి . మన ఆరోగ్యాలను పాడు చేసేవే విదేశీ ఆహార పదార్ధాలు.
10 . వ్యక్తి గత ఆదాయ పన్నుల మినహాయింపు పరిమితిని 5 లక్షలకు పెంచాలి . నికర ఆదాయం 5 లక్షలు మించుతేనే రిటర్న్ ఫైల్ చేసే విధంగా మార్పులు చేయాలి. ఇవి అన్ని వయస్సుల వారికీ సమానంగా ఉండాలి. మిగిలిన మినహాయింపులు యధావిధిగా కోన సాగించాలి.
11 . కట్టు దిట్టమైన నిభంధనలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచాలి.
12 . విదేశీ పెట్టుబడులను ఆహ్వానించే విధంగా , నిభందనలను సడలించాలి.
13. ప్రజలకు బ్యాంకులపై నమ్మకాన్ని కలిగించాలి .ప్రజలకు మరియు బ్యాంకులకు లాభదాయకతను పెంచాలి. బ్యాంకులపై రాజకీయ నాయకుల వత్తిడి తగ్గించాలి. బ్యాంకులు ఇచ్చే లోన్లపై , ఎదుటి వారి వ్యాపారాల లాభదాయకతను, సెక్యూరిటీలను అస్సెస్స్ చేసే నిపుణులను బ్యాంకులలో నియమించాలి . సేవింగ్ అక్కౌంట్లపై వడ్డీ రేటును పెంచాలి . కోటి రూ . లు దాటిన ఎఫ్ . డి . లపై వడ్డీ రేట్లను తగ్గించాలి.
14 . విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న వారిని , విద్యార్థులను విదేశాలకు పంపించి వేయాలి . వారికి అన్ని విధాలుగా సహకారాలు అందించాలి.
15 . చదువుకుని ఖాళీగా ఉన్న విద్యార్థులకు, వారి స్వభావానికి అనుకూలమైన 
ఎదో ఒక రకమైన ఉపాధిని కల్పించాలి . కొత్త ఉపాధులను క్రియేట్ చేయాలి.
16 . పెట్రోల్ , డీజిల్ ఉత్పత్తుల వినియోగం సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ఇక్కడే సుమారుగా 70 % మొత్తం మనం డబ్బు విదేశాలకు వెళుతుంది . దీనికి ఆల్టర్ నేటివ్ గా విద్యుత్ ను లేదా సోలార్ శక్తిని అభి వృద్ధి పరచాలి.
17 . భారత దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మేధావే . ప్రతి ఒక్కరిలో తెలివి తేటలు ఉన్నాయి  . తన దేశం లేదా తన రాష్ట్రం లేదా తన జిల్లా లేదా తన గ్రామం అభి 
వృద్ధి గురించి చెప్పే సూచనలను , సలహాలను పరిగణలోకి తీసుకుని , ఒక నిపుణుల కమిటీలో చర్చించాలి. ఉపయోగం అనిపించిన వాటిని , అమలు చేయాలి.
ప్రభుత్వాలు ఈ చర్యలు చేపట్టినట్లవుతే , దేశ ప్రజలు ఇప్పటి లాగానే ప్రభుత్వాలకు సహక రించినట్లయితే , భారత దేశం కేవలం రెండు మూడు సంవత్సరాలలోనే , నేటి కరోనా వైరస్ సమస్యలవలన ఏర్పడిన ఆర్ధిక ఇబ్బందులను ,ఆర్ధిక మాంధ్యం నుండి తప్పకుండా గట్టెక్క గలదు.
*మార్గం కృష్ణ మూర్తి*
www.sollutions2all.blogspot.com