ప్ర . టి . వి. చానల్లల్లో , పత్రికలలో , ఇంటర్ నెట్లల్లో ప్రసారమయ్యే వ్యాపార ప్రకటనలను ఎంత వరకు నమ్మ వచ్చు ?
జ . టి . వి. చానల్లల్లో , పత్రికలలో , ఇంటర్ నెట్లల్లో ప్రసారమయ్యే వ్యాపార ప్రకటనలను సరదాగా నే తీసుకోవాలి గాని , సీరియస్ తీసుకూడదు . వాటిని పూర్తిగా నమ్మకూడదు . వస్తువులను అమ్ముకునే వ్యాపారస్తులు , తిమ్మిని బమ్మి చేసైనా తన వస్తువులనూ అమ్ముకో డానికి ప్రయత్నిస్తాలు . వారి వారి బ్రాండ్లను పాప్యులర్ చేసు కోడానికి ప్రయత్నిస్తారు . వ్యాపార ప్రకటనలను తయారు చేసే వారు , ఎంత బాగా తయారు చేస్తే అంత పేరు , డబ్బు వస్తుంది అనుకుంటారు . ఉదా : X అనే సబ్బు వాడుతే చాలా తెల్లగా తయారవుతారంటారు . అలానే మరో 10 బ్రాండ్ల వారు , అలానే అత్యంత బ్యూటీగా మారుతారు అని ప్రకటనలతో అదర గొడుతారు . కాని వాస్తవంలో అందులో ఏ మాత్రం నిజం లేదు . అలానే బరువు తగ్గుతారనీ , ఎత్తు పెరుగుతారనీ ప్రకటనలు గుప్పిస్తారు . యంత్రాలనీ , తంత్రాలనీ , తాయత్తులనీ , రాల్లనీ రక రకాల ప్రకటనలు గుప్పిస్తూ ప్రజలను తిక మక పెడుతుంటారు . అమాయక ప్రజలను , బాల హీన ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు . ఇక మరి కొన్ని ప్రకటనలు శరీరాలకు హాని కల్గించేవిగాను మరియు ఇల్లును గుల్ల చేసేవిగా ఉంటాయి . అందుకని ప్రకటనలను ఆస్వాదిస్తూనే , హంస లా స్వీకరించాలి .
No comments:
Post a Comment