Wednesday, December 30, 2015

సృష్టిలో రకరకాల మనుష్యులు ఎందుకుంటారు ?

ప్ర . సృష్టిలో  రకరకాల  మనుష్యులు  ఎందుకుంటారు ?
జ . సృష్టి అనేది  మంచి చెడుల మేళ వింపు  మనుష్యులంతా  ఒకటే  అయినా  వారి మంచి చెడులు వేరు . భోజనం  ఒకటే అయినా  అన్నం  కూర వేరు . అన్నం  తీపిగా  ఉంటె  , కూర -  కారం , చేదు , ఉప్పు , పులుపు , ఘాటు  మరియు  తాలింపుల  మేళ వింపు . కాని  భోజనం ఒక్కటే . అలానే మనుష్యుల్లో   ఎవరికి  వారికే , సత్వ , రజో  , తమో  గుణాలు ఉంటాయి . తెలివి  తేటల్లో  తేడాలు , భౌతిక  స్వరూపాల రీత్యా అసమానతలు  గోచరిస్తుంటాయి . అలాగే కక్షలు  , కార్పణ్యాలు , ఈర్ష్య  , అసూయలుంటాయి  . 

No comments: