ప్ర . జంతువులకు , పశు పక్షాదులకు మాటలు రావు , చదువు రాదు . మరి అవి ఎలా జీవించ గలుగుతున్నాయి ? ఎలా సంతానోత్పత్తిని వృద్ధి చేసుకుంటున్నాయి ?
జ . జంతువులకు , పశు పక్షాదులకు మాటలు రావు , చదువు రాదు అనేది నిజమే . వాటికి గురువులు లేరు అనేది వాస్తవమే . కాని ప్రకృతి నుండి అన్నీ గ్రహిస్తాయి . మన లాగానే ఏవి రుచిగా ఉంటె వాటినే తింటాయి . ఏవి ఆరోగ్య కరం అనిపిస్తే వాటినే భుజిస్తాయి . ఎక్కడ చోటు దొరుకుతే అక్కడే పడుకుంటాయి . అలానే సంతానోత్పత్తిని వృద్ధి చేసుకుంటాయి . వాటికి కుటుంభ నియంత్రణ లేదు . మనుష్యులు నియంత్రిస్తే తప్పా . వాటికి మన లాగ మాటలు రాక పోయినా , చదువు లేక పోయినా వాటికవే అర్ధం చేసుకునే భాష ఉంటుంది .
No comments:
Post a Comment