Wednesday, December 30, 2015

కుక్కలు , పశు పక్షాదులు , క్రిమి కీటకాలు మనష్యుల కంటే గొప్ప తెలివి గలవా ?

 ప్ర . కుక్కలు , పశు పక్షాదులు , క్రిమి కీటకాలు  మనష్యుల  కంటే  గొప్ప తెలివి  గలవా  ?

జ . కొన్ని విషయాలలో  కుక్కలు , పశు పక్షాదులు , క్రిమి కీటకాలు  మనష్యుల  కంటే  గొప్ప తెలివి  గలవి  అని  చెప్పడంలో  ఎలాంటి సందేహం లేదు .   కుక్కలు , పశు పక్షాదులు , క్రిమి కీటకాలు రాబోయే ప్రమాదాలను  ముందే గుర్తించి  మనుష్యులను  హెచ్చరిస్తాయి .  గ్రామాలలో  ఉండే కుక్కలు , పశు పక్షాదులు , క్రిమి కీటకాలు  జరుగ బోయే  ప్రమాదాలను ముందే పసి గట్ట గలవు . యమ ధూతలు  మనిషి  ప్రాణాన్ని  తీసుకుని  పోవడానికి , ఆ పరిసర  ప్రాంతాలకు  వచ్చి నప్పుడు , కుక్కలు పసి గట్టి , ఏడుస్తూ  ఉంటాయి .( అరవడం వేరు , ఏడవడం  వేరు)
దానిని బట్టి , ఒకటి రెండు రోజుల లోనే  , పది , ఇరువై  గజాల దూరం లోనే   ఎవరో ఒకరు , రోగిష్టో  లేక   వృద్ధుడో  ,  మరొకరో   ఏదో కారణంతో  కాలం చేయ బోతున్నారని  మనం  అర్ధం చేసు కోవచ్చు . కుక్కలు సూర్యుడిని   కుంటూ  ఏడిస్తే  ఏదో అగ్ని  ప్రమాదం జరుగ బోతుందనే  దానికి   హెచ్చరిక గా భావించాలి . కుక్కలు ఆకాశాన్ని  చూస్తూ    ఏడిస్తే  ఏదో తుఫాన్ లేదా కుంభ వృష్టి  లేదా  భూ కంపం  లాంటి   ప్రమాదం జరుగ బోతుందనే  దానికి   హెచ్చరిక గా భావించాలి . కాకులు  ఇంటికి  లేదా దగ్గరగా  వచ్చి అరుస్తే  భందు వులు   వస్తున్నారని గాని , లేదా  దగ్గరి సంభందీకులు  ఏదో ప్రమాదంలో చిక్కు   కున్నారనికూడా  భావించ  వచ్చు . 

No comments: