Thursday, December 31, 2015

ఇతరులు ఎత్తుకునే ' చిట్టీలకు ' సంభందించి జామీన్ గా సంతకాలు చేయ వచ్చా ?

ప్ర . ఇతరులు  ఎత్తుకునే  ' చిట్టీలకు ' సంభందించి  జామీన్  గా  సంతకాలు  చేయ  వచ్చా ?

జ .  సాధ్యమయినంత వరకు  ( ఎంతో ముఖ్య మైన వారు అయితే  తప్పా ) , ఎట్టి  పరిస్థితులలోనూ  ఇతరులు  ఎత్తుకునే  చిట్టీలకు , తీసుకునే  అప్పులకు  , స్యూరిటీ  గా  సంతకాలు చేయ కూడదు . దీర్ఘ కాలంలో  అనేక మార్పులు జరుగుతుంటాయి . ఏవో కొన్ని కారణాల వలన  , చిట్టీలు  ఎత్తుకున్న  వారు , అప్పులు తీసుకున్న వారు , వాయిదాలు  చెల్లించ లేక పోతే , స్యూరిటీ  ఇచ్చిన వారికి   బెదిరింపులు  , నోటీసులు  ,  సమన్లు వచ్చే అవకాశం  ఉంటుంది . అంతే కాదు . వారి  వారసులకు కూడా  భారం , బాధలు  తప్పవు .  అప్పటి   ముప్పేట  మాన సిక  బాధ  చెప్పనలవిగా  ఉంటుంది . కాబట్టి   ఎట్టి  పరిస్థితులలోనూ  ఇతరులు  ఎత్తుకునే  చిట్టీలకు , తీసుకునే  అప్పులకు  ,  గుడ్డిగా  స్యూరిటీ    సంతకాలు చేయ కూడదు . 

No comments: