Wednesday, December 30, 2015

అవినీతిని కొంత వరకైనా నియంత్రించాలంటే ఏమి చేయాలి ?

ప్ర . అవినీతిని  కొంత వరకైనా నియంత్రించాలంటే  ఏమి  చేయాలి ?

జ . అవినీతిని , అక్ర మాలను , మోసాలను  కొంత వరకైనా నియంత్రించాలంటే  లేదా తగ్గించాలంటే , వ్యవస్థలో  కొన్ని  మార్పులు  చేయాలి . అవి ,
01. భారత దేశం లోని  ప్రతి  ఒక్కరికి  ఒక అధికార  ఐడెంటిటీ  పత్రాన్ని  నిర్భందం  చేయాలి . ప్రస్తుత  పరిస్థితుల్లో   " ఆధార్  కార్డ్ " కు మించిన  అధికార పత్రం మరోటి లేదు . అందుకని " ఆధార్  కార్డ్ " ను  ఇంకనూ  ఇవ్వని  భారతీయులందరికీ  జారీ  చేయాలి . అలానే  ప్రతి వ్యవహారంలో  నిర్భంధం  చేయాలి . 
02. ప్రతి ఒక్కరికీ దేశంలో , ఒకే ఒక  బ్య్యాంకు  అకౌంట్  నెంబరు  ఉండాలి . అదే నెంబరు తో  ఇతర బ్యాంకులకు  మారే  పోర్టబిలిటీ  సదుపాయం కల్పించాలి . 
03. ప్రతి ఒక్కరికీ 'పాన్ ' కార్డు  జారీ చేయాలి . 
04. దేశం లోని  ప్రతి గజం  భూమిని , ఇంటిని   సర్వే  చేయించి  , వారి వారి  పేర్ల మీద  రిజిస్టర్  చేయాలి  . ప్రభుత్వ  భూమిని  గుర్తించాలి . బినామీ ఆస్తులను  గుర్తించి  ప్రభుత్వ  పరం చేయాలి . 
05. విదేశాలలో ఉన్న  డబ్బుకు  , ఆస్తులకు  , అలానే విదేశాలనుండి  వచ్చే  ఆస్తులకు  , డబ్బుకు  '  ఫెమా ' పూర్తి  నియంత్రణ  ఉండాలి . 
06. ట్రస్టుల పై , స్వచ్చంద  సంస్థలపై  , మిశానీరీలపై  పూర్తి  నియంత్రణ  కొన  సాగించాలి .  
07. ' ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్స్ ' ను  నియంత్రించాలి . 
08. విదేశాలలో  ఉంది అని   ఎలక్షన్ల  సమయంలో  చెప్పిన  రూ . 1,45,000 కోట్లను , స్వదేశంలోనికి  త్వరగా  రప్పించ గలగాలి . 
09. ఎలక్షన్లో  పెట్టే  ఖర్చును , ఎలక్షన్ కమీషన్  నియంత్రించాలి . ఎలక్షన్  కమీషనే  ' ఎలక్షన్ నిధిని ' ఏర్పాటు చేయాలి . ఎవరైనా  డబ్బులు ఇవ్వాలనుకుంటే  , చెక్కుల రూపంలో  ఈ నిధికి  పంపించాలి  .  వారికి  పూర్తి  ఆదాయ  పన్ను మినహాయింపు  కల్పించాలి . అలానే  విదేశాల నుండి వచ్చే నిధులు  కూడా  , డైరెక్టుగా  ఈ నిధికే పంపించాలి . ఎత్తి పరిస్థితులలో  కూడా  , రాజా కీయ నాయకులకు గాని , పార్టీలకు గాని  ఎలక్షన్ ఫండులను  ఇవ్వరాదు .  ఎలక్షన్ల  పూర్తి ఖర్చును  ఎలెక్షన్  కమీషనే  భరించాలి . 
10. సమర్ధత లేని  , అవినీతికి పాల్పడే   ఎన్నికైన నాయకులను  , కాల్ బ్యాక్  చేసే  అధికారం  ఓటర్లకు  కల్పించే  చట్టం తీసుకుని రావాలి .  
11. న్యాయ  స్థానాలకు  , సి బి ఐ , విజిలెన్స్ , ఎ సి బి లకు , ఈ డి లకు  స్వతంత్ర అధికారాలు  ఉండే విధంగా  చట్టాలను తీసుకుని రావాలి . 
12. ' జన లోక్  పాల్ ' బిల్లు  ను  లోక సభ , రాజ్య సభలలో   ప్రవేశ పెట్టి , రాజ్యాంగ బద్ధం చెయ్యాలి .   
13. రాష్ట్ర పతి మినహా  అందరూ ' జన లోక్  పాల్ ' బిల్లు పరిధిలోకి వచ్చే విధంగా  చూడాలి . 

ఈ  విధంగా  చేయడం వలన  కొంత వరకు  అవినీతిని , మోసాలను , అక్రమాలను , కుంభకోణాలను  అరికట్ట వచ్చు  



No comments: