Thursday, December 31, 2015

ప్రజలకు ' అసహనం ' ఎందుకు కలుగుతుంది ? దాని పర్యావ సానమేమిటి ?

ప్ర . ప్రజలకు  ' అసహనం ' ఎందుకు  కలుగుతుంది ? దాని  పర్యావ సానమేమిటి ?

జ . ' అసహనం ' అంటే  సహించ లేక పోవడం .  అసంతృప్తి , సమాజం పై  , ప్రభుత్వాలపై  మరియు  చివరిగా  జీవితంపై  విరక్తి  కలగడం . ' అసహనం ' అనే దానికి  , ఇది  కారణం అని  ఇద మిద్దంగా  చెప్పడం సాద్యం కాదు  . 
' అసహనం ' కలగ డానికి  అనేక  పరిస్థితులు  కారణం కావచ్చు . అందులో  ముఖ్యమైనవి , ఎదుటి వారిని హీనంగా  చూడటం , కించ పరుచడం , లెక్క చేయక పోవడం , గుర్తించక పోవడం , బానీసలుగా  చూడటం , వారిపై పెత్తనం  సాధించాలనుకోవడం ,  అనారోగ్య సమస్యలు , కుటుంభ సమస్యలు , చేతి నిండా  పనిలేక పోవడం , అనుకున్నవి  సాధించ లేక పోవడం , తోటి  సహచరులు , స్నేహితులు  తన ముందటే  అక్రమ మార్గం లో  అందలమెక్కడం , ప్రభుత్వాలు  చెప్పేవి ఒకటి , నడుచుకునేవి  మరొకటి , అధికారంలోకి  రాగానే , దేశంలోని  సంపదలకు  రక్షణ గా  ఉండాల్సింది పోయి , భక్షకులుగా  మారుతుండటం  , కోట్లకు  కోట్లు  నల్ల ధనంగా  మార్చి  విదేశాల  బ్యాంకులలో  దాచుకోవడం , మరి కొన్నాళ్ళకు  వాటిని  మేము రప్పిస్తామని  ప్రజలకు  ఎర  వేసి  అధికారం లోకి  రావడం , ప్రజలను  పేద తనం లోనే ఉంచుతూ  , ఓటు బ్యాంకుగా  మార్చడం , ఆర్ధికంగా , కేసుల  పరంగా మాన సికంగా  హింసించడం ,  చట్టాలను  , అధికారాలను  అడ్డం పెట్టుకుని  సామాన్యుల  నోర్లు మూయించడం  మొదలైనవి  ఎన్నింటినో  చెప్పుకోవచ్చు .  వీటిలో ఏదో  ఒకటి కావచ్చు .  కొన్ని కావచ్చు , అన్నీ  కావచ్చు .  

ఇక దాని పర్యావ సానం  గురించి  చెప్పాలంటే  ,  అది  ' అసహనం  ' తీవ్రతను  బట్టి ఆధార  పడి  ఉంటుంది. ఇతరులతో  కోట్లాడ  వచ్చు . విద్వంసాలు  సృస్టించ వచ్చు .  పిచ్చి వాండ్లు కావచ్చు .  సైకో గా  మార వచ్చు , ఆత్మ  హత్యలు  చ్సుకో వచ్చు . అసంఘీక   శక్తులుగా  మార వచ్చు . 

No comments: