Thursday, December 31, 2015

ప్రజలకు ' అసహనం ' ఎందుకు కలుగుతుంది ? దాని పర్యావ సానమేమిటి ?

ప్ర . ప్రజలకు  ' అసహనం ' ఎందుకు  కలుగుతుంది ? దాని  పర్యావ సానమేమిటి ?

జ . ' అసహనం ' అంటే  సహించ లేక పోవడం .  అసంతృప్తి , సమాజం పై  , ప్రభుత్వాలపై  మరియు  చివరిగా  జీవితంపై  విరక్తి  కలగడం . ' అసహనం ' అనే దానికి  , ఇది  కారణం అని  ఇద మిద్దంగా  చెప్పడం సాద్యం కాదు  . 
' అసహనం ' కలగ డానికి  అనేక  పరిస్థితులు  కారణం కావచ్చు . అందులో  ముఖ్యమైనవి , ఎదుటి వారిని హీనంగా  చూడటం , కించ పరుచడం , లెక్క చేయక పోవడం , గుర్తించక పోవడం , బానీసలుగా  చూడటం , వారిపై పెత్తనం  సాధించాలనుకోవడం ,  అనారోగ్య సమస్యలు , కుటుంభ సమస్యలు , చేతి నిండా  పనిలేక పోవడం , అనుకున్నవి  సాధించ లేక పోవడం , తోటి  సహచరులు , స్నేహితులు  తన ముందటే  అక్రమ మార్గం లో  అందలమెక్కడం , ప్రభుత్వాలు  చెప్పేవి ఒకటి , నడుచుకునేవి  మరొకటి , అధికారంలోకి  రాగానే , దేశంలోని  సంపదలకు  రక్షణ గా  ఉండాల్సింది పోయి , భక్షకులుగా  మారుతుండటం  , కోట్లకు  కోట్లు  నల్ల ధనంగా  మార్చి  విదేశాల  బ్యాంకులలో  దాచుకోవడం , మరి కొన్నాళ్ళకు  వాటిని  మేము రప్పిస్తామని  ప్రజలకు  ఎర  వేసి  అధికారం లోకి  రావడం , ప్రజలను  పేద తనం లోనే ఉంచుతూ  , ఓటు బ్యాంకుగా  మార్చడం , ఆర్ధికంగా , కేసుల  పరంగా మాన సికంగా  హింసించడం ,  చట్టాలను  , అధికారాలను  అడ్డం పెట్టుకుని  సామాన్యుల  నోర్లు మూయించడం  మొదలైనవి  ఎన్నింటినో  చెప్పుకోవచ్చు .  వీటిలో ఏదో  ఒకటి కావచ్చు .  కొన్ని కావచ్చు , అన్నీ  కావచ్చు .  

ఇక దాని పర్యావ సానం  గురించి  చెప్పాలంటే  ,  అది  ' అసహనం  ' తీవ్రతను  బట్టి ఆధార  పడి  ఉంటుంది. ఇతరులతో  కోట్లాడ  వచ్చు . విద్వంసాలు  సృస్టించ వచ్చు .  పిచ్చి వాండ్లు కావచ్చు .  సైకో గా  మార వచ్చు , ఆత్మ  హత్యలు  చ్సుకో వచ్చు . అసంఘీక   శక్తులుగా  మార వచ్చు . 

పోస్టాఫీసుల వలన ప్రజలకు ఉపయోగ మేమి ( WHAT ARE THE USES OF POST OFFICES) ?

ప్ర . పోస్టాఫీసుల  వలన  ప్రజలకు  ఉపయోగ  మేమి  ( WHAT ARE THE USES OF POST OFFICES) ?

జ . పోస్టాఫీసుల  వలన  ప్రజలకు  అనేక  ఉపయోగాలు  కలవు  .  అవి ,
01. పోస్టాఫీసులలో  తపాలా  స్టాంపులు  అమ్ముతారు . 
02. రెవెన్యూ స్టాంపులు  అమ్ముతారు . 
03. కార్డులు , ఎన్వలపులు  అమ్ముతారు . 
04. బంగారు  నాణాలు  అమ్ముతారు . 
05. నాన్  జుడిష్యల్  స్టాంప్ పేపర్లు  అమ్ముతారు . 
06. కార్డులను  , కవర్లను , గ్రీటింగ్ కార్డ్స్ ను  , రాఖీలను   తక్కువ  చార్జీలతో  , మనం పంపించాల్సిన  దేశ , విదేశాల  అడ్డ్రస్ లకు  , అతి  తక్కువ  కాలంలో  పంపిస్తారు  . 
07. రిజిస్టర్డ్  లెటర్స్ , పార్సెల్స్ ను   తక్కువ  చార్జీలతో  , మనం పంపించాల్సిన  అడ్డ్రస్ లకు  , అతి  తక్కువ  కాలంలో  పంపిస్తారు  . 
08. డబ్బులను  తక్కువ  చార్జీలతో  , మనం పంపించాల్సిన  అడ్డ్రస్ లకు  , అతి  తక్కువ  కాలంలో  పంపిస్తారు  . 
09. ఇన్స్యూరెన్స్  తీసుకునే  సదుపాయాలూ  అందు బాటులో  ఉంటాయి . 
10. ఎస్ . బి  . అకౌంట్  తెరిచి  డబ్బులను  పొదుపు  చేసుకో  వచ్చు . తీసు కోవచ్చు .  అందులో జమయిన  డబ్బులకు  బ్యాంకు లాగానే  సంవత్సరానికి  4% వడ్డీ  లభిస్తుంది . 
11. పొదుపుకు  మరెన్నో  పధకాలు  అందుబాటులో  ఉంటాయి  . ఉదా : నేషనల్  సేవింగ్ సర్టిఫికెట్స్  , టైం  డిపాజిట్స్   , రికరింగ్  డిపాజిట్స్ , ఫిక్సెడ్ డిపాజిట్స్   మొదలగునవి . వీటికి  వడ్డీ  బ్యాంకుల కంటే , కాస్త ఎక్కువగానే ఉంటుంది . అంతే కాకుండా  సీనియర్  సిటిజన్స్  కు  0.25  నుండి 0. 50 వరకు  అధిక వడ్డీ ఉంటుంది . 
12. అంతే కాకుండా    పోస్టాఫీసుల ను పూర్హి కాలపు బ్యాంకులు గా  ఏర్పాటు చయ బోతున్నారు . 
13. అన్నిటికంటే ముఖ్యంగా , పోస్టాఫీసులు  గ్రామీణ  ప్రజలకు , పట్టణ  ప్రజలకు  అనుకూలంగా , అతి చేరువలో మరియు  ప్రతి గ్రామంలో , ప్రతి పట్టణం లో  ఉంటాయి . 

అంతే కాకుండా ,   పోస్టాఫీసులు  పూర్తిగా  ప్రభుత్వ  నియంత్రణలో  నడుస్తాయి  కాబట్టి  , ప్రజల సొమ్ముకు  పూర్తి భద్రత ఉంటుంది .  

భారత ' ఎమ్. పీ .' లకు వారి వారి నియోజక వర్గ ప్రాంతాలను అభి వృద్ధి చేయ డానికి , కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి ప్రతి సంవత్సరం ఇచ్చే ఎం . పీ . లాడ్స్ ఎంత ?

ప్ర . భారత  ' ఎమ్. పీ .' లకు  వారి  వారి నియోజక  వర్గ  ప్రాంతాలను  అభి వృద్ధి  చేయ   డానికి ,    కేంద్ర  ప్రభుత్వం ఒక్కొక్కరికి  ప్రతి సంవత్సరం   ఇచ్చే  ఎం . పీ . లాడ్స్  ఎంత ?

జ . భారత   దేశం  లోని  795  మంది  ' ఎమ్. పీ .' లకు  వారి  వారి నియోజక  వర్గ  ప్రాంతాలను  అభి వృద్ధి  చేయ   డానికి ,    కేంద్ర  ప్రభుత్వం   ఒఒక్కొక్కరికి  ప్రతి సంవత్సరం  ఇచ్చే  ఎం . పీ . లాడ్స్ , అక్ష రాలా రూ .లు.  5 కోట్లు . 
దీనిని  రూ . లు  25 కోట్ల కు పెంచాలని  ఆలోచనలు  చేస్తున్నారు . 

ఇతరులు ఎత్తుకునే ' చిట్టీలకు ' సంభందించి జామీన్ గా సంతకాలు చేయ వచ్చా ?

ప్ర . ఇతరులు  ఎత్తుకునే  ' చిట్టీలకు ' సంభందించి  జామీన్  గా  సంతకాలు  చేయ  వచ్చా ?

జ .  సాధ్యమయినంత వరకు  ( ఎంతో ముఖ్య మైన వారు అయితే  తప్పా ) , ఎట్టి  పరిస్థితులలోనూ  ఇతరులు  ఎత్తుకునే  చిట్టీలకు , తీసుకునే  అప్పులకు  , స్యూరిటీ  గా  సంతకాలు చేయ కూడదు . దీర్ఘ కాలంలో  అనేక మార్పులు జరుగుతుంటాయి . ఏవో కొన్ని కారణాల వలన  , చిట్టీలు  ఎత్తుకున్న  వారు , అప్పులు తీసుకున్న వారు , వాయిదాలు  చెల్లించ లేక పోతే , స్యూరిటీ  ఇచ్చిన వారికి   బెదిరింపులు  , నోటీసులు  ,  సమన్లు వచ్చే అవకాశం  ఉంటుంది . అంతే కాదు . వారి  వారసులకు కూడా  భారం , బాధలు  తప్పవు .  అప్పటి   ముప్పేట  మాన సిక  బాధ  చెప్పనలవిగా  ఉంటుంది . కాబట్టి   ఎట్టి  పరిస్థితులలోనూ  ఇతరులు  ఎత్తుకునే  చిట్టీలకు , తీసుకునే  అప్పులకు  ,  గుడ్డిగా  స్యూరిటీ    సంతకాలు చేయ కూడదు . 

ప్రపంచం లో కెల్లా అత్యంత దయా గుణం, జాలి గల వారు ఎవరు ?

ప్ర . ప్రపంచం లో కెల్లా  అత్యంత  దయా గుణం, జాలి గల వారు ఎవరు ?

జ .  భారతీయులు . 

అన్నిటి లో కల్లా తెలివైన వారు ఎవరు ?

ప్ర . అన్నిటి లో కల్లా  తెలివైన  వారు ఎవరు ?
జ. సృష్టి  తరువాత  , ఈ  ప్రపంచం  లో తెలివైన  వారు  మనిషి .

Wednesday, December 30, 2015

అవినీతిని కొంత వరకైనా నియంత్రించాలంటే ఏమి చేయాలి ?

ప్ర . అవినీతిని  కొంత వరకైనా నియంత్రించాలంటే  ఏమి  చేయాలి ?

జ . అవినీతిని , అక్ర మాలను , మోసాలను  కొంత వరకైనా నియంత్రించాలంటే  లేదా తగ్గించాలంటే , వ్యవస్థలో  కొన్ని  మార్పులు  చేయాలి . అవి ,
01. భారత దేశం లోని  ప్రతి  ఒక్కరికి  ఒక అధికార  ఐడెంటిటీ  పత్రాన్ని  నిర్భందం  చేయాలి . ప్రస్తుత  పరిస్థితుల్లో   " ఆధార్  కార్డ్ " కు మించిన  అధికార పత్రం మరోటి లేదు . అందుకని " ఆధార్  కార్డ్ " ను  ఇంకనూ  ఇవ్వని  భారతీయులందరికీ  జారీ  చేయాలి . అలానే  ప్రతి వ్యవహారంలో  నిర్భంధం  చేయాలి . 
02. ప్రతి ఒక్కరికీ దేశంలో , ఒకే ఒక  బ్య్యాంకు  అకౌంట్  నెంబరు  ఉండాలి . అదే నెంబరు తో  ఇతర బ్యాంకులకు  మారే  పోర్టబిలిటీ  సదుపాయం కల్పించాలి . 
03. ప్రతి ఒక్కరికీ 'పాన్ ' కార్డు  జారీ చేయాలి . 
04. దేశం లోని  ప్రతి గజం  భూమిని , ఇంటిని   సర్వే  చేయించి  , వారి వారి  పేర్ల మీద  రిజిస్టర్  చేయాలి  . ప్రభుత్వ  భూమిని  గుర్తించాలి . బినామీ ఆస్తులను  గుర్తించి  ప్రభుత్వ  పరం చేయాలి . 
05. విదేశాలలో ఉన్న  డబ్బుకు  , ఆస్తులకు  , అలానే విదేశాలనుండి  వచ్చే  ఆస్తులకు  , డబ్బుకు  '  ఫెమా ' పూర్తి  నియంత్రణ  ఉండాలి . 
06. ట్రస్టుల పై , స్వచ్చంద  సంస్థలపై  , మిశానీరీలపై  పూర్తి  నియంత్రణ  కొన  సాగించాలి .  
07. ' ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్స్ ' ను  నియంత్రించాలి . 
08. విదేశాలలో  ఉంది అని   ఎలక్షన్ల  సమయంలో  చెప్పిన  రూ . 1,45,000 కోట్లను , స్వదేశంలోనికి  త్వరగా  రప్పించ గలగాలి . 
09. ఎలక్షన్లో  పెట్టే  ఖర్చును , ఎలక్షన్ కమీషన్  నియంత్రించాలి . ఎలక్షన్  కమీషనే  ' ఎలక్షన్ నిధిని ' ఏర్పాటు చేయాలి . ఎవరైనా  డబ్బులు ఇవ్వాలనుకుంటే  , చెక్కుల రూపంలో  ఈ నిధికి  పంపించాలి  .  వారికి  పూర్తి  ఆదాయ  పన్ను మినహాయింపు  కల్పించాలి . అలానే  విదేశాల నుండి వచ్చే నిధులు  కూడా  , డైరెక్టుగా  ఈ నిధికే పంపించాలి . ఎత్తి పరిస్థితులలో  కూడా  , రాజా కీయ నాయకులకు గాని , పార్టీలకు గాని  ఎలక్షన్ ఫండులను  ఇవ్వరాదు .  ఎలక్షన్ల  పూర్తి ఖర్చును  ఎలెక్షన్  కమీషనే  భరించాలి . 
10. సమర్ధత లేని  , అవినీతికి పాల్పడే   ఎన్నికైన నాయకులను  , కాల్ బ్యాక్  చేసే  అధికారం  ఓటర్లకు  కల్పించే  చట్టం తీసుకుని రావాలి .  
11. న్యాయ  స్థానాలకు  , సి బి ఐ , విజిలెన్స్ , ఎ సి బి లకు , ఈ డి లకు  స్వతంత్ర అధికారాలు  ఉండే విధంగా  చట్టాలను తీసుకుని రావాలి . 
12. ' జన లోక్  పాల్ ' బిల్లు  ను  లోక సభ , రాజ్య సభలలో   ప్రవేశ పెట్టి , రాజ్యాంగ బద్ధం చెయ్యాలి .   
13. రాష్ట్ర పతి మినహా  అందరూ ' జన లోక్  పాల్ ' బిల్లు పరిధిలోకి వచ్చే విధంగా  చూడాలి . 

ఈ  విధంగా  చేయడం వలన  కొంత వరకు  అవినీతిని , మోసాలను , అక్రమాలను , కుంభకోణాలను  అరికట్ట వచ్చు  



టి . వి. చానల్లల్లో , పత్రికలలో , ఇంటర్ నెట్లల్లో ప్రసారమయ్యే వ్యాపార ప్రకటనలను ఎంత వరకు నమ్మ వచ్చు ?

ప్ర . టి . వి. చానల్లల్లో ,  పత్రికలలో  , ఇంటర్ నెట్లల్లో  ప్రసారమయ్యే  వ్యాపార  ప్రకటనలను  ఎంత వరకు  నమ్మ వచ్చు ?
జ . టి . వి. చానల్లల్లో ,  పత్రికలలో  , ఇంటర్ నెట్లల్లో  ప్రసారమయ్యే  వ్యాపార  ప్రకటనలను సరదాగా నే  తీసుకోవాలి గాని  , సీరియస్  తీసుకూడదు .   వాటిని  పూర్తిగా  నమ్మకూడదు .  వస్తువులను అమ్ముకునే  వ్యాపారస్తులు  , తిమ్మిని  బమ్మి   చేసైనా  తన  వస్తువులనూ  అమ్ముకో  డానికి  ప్రయత్నిస్తాలు  . వారి  వారి బ్రాండ్లను  పాప్యులర్  చేసు కోడానికి  ప్రయత్నిస్తారు .  వ్యాపార  ప్రకటనలను  తయారు  చేసే  వారు , ఎంత  బాగా తయారు  చేస్తే  అంత పేరు , డబ్బు  వస్తుంది అనుకుంటారు .   ఉదా : X  అనే  సబ్బు  వాడుతే చాలా  తెల్లగా  తయారవుతారంటారు . అలానే మరో 10 బ్రాండ్ల వారు ,  అలానే  అత్యంత  బ్యూటీగా  మారుతారు  అని  ప్రకటనలతో  అదర గొడుతారు . కాని వాస్తవంలో అందులో  ఏ  మాత్రం నిజం  లేదు .  అలానే బరువు తగ్గుతారనీ  , ఎత్తు  పెరుగుతారనీ  ప్రకటనలు  గుప్పిస్తారు .  యంత్రాలనీ  ,  తంత్రాలనీ , తాయత్తులనీ , రాల్లనీ   రక రకాల  ప్రకటనలు గుప్పిస్తూ  ప్రజలను  తిక మక  పెడుతుంటారు .   అమాయక  ప్రజలను , బాల హీన  ప్రజలను  నమ్మించే  ప్రయత్నం  చేస్తారు .   ఇక మరి కొన్ని  ప్రకటనలు  శరీరాలకు  హాని  కల్గించేవిగాను  మరియు  ఇల్లును  గుల్ల  చేసేవిగా  ఉంటాయి .  అందుకని  ప్రకటనలను  ఆస్వాదిస్తూనే , హంస  లా  స్వీకరించాలి . 

రిజర్వేషన్లు అవసరమా ? / IS RESERVATIONS REQUIRED ?

ప్ర . రిజర్వేషన్లు  అవసరమా  ? / IS RESERVATIONS REQUIRED ?
 జ . రిజర్వేషన్లు అవసరమే . ధన వంతులకు , కుబేరులకు  కాకుండా  , ప్రభుత్వ  ఉద్యోగులకు కాకుండా ,  ఎస్సీ  లోని  పేదలకు  , ఎస్టీ  లోని  పేదలకు ,  బీసీ లోని  పేదలకు  , ఎఫ్సీ  లోని  పేదలకు  ,  మైనారిటీ  లోని  పేదలకు  రిజర్వేషన్లు  కంటిన్యూ  చేయాలి .  

అవినీతి అంతం అవుతుందా ? WHETHER CORRUPTION WILL END ?

ప్ర . అవినీతి  అంతం  అవుతుందా ? WHETHER CORRUPTION WILL END ?

జ . మనిషికి  ఆశ   ఉన్నంత  కాలం  అవినీతి  అంతం కాదు . 

"ఎన్నికల సంస్కరణలు ఎలా జరగాలి ? ." HOW THE THE ELECTIONS REFORMS TO BE CONDUCTED ?

ప్ర "ఎన్నికల సంస్కరణలు  ఎలా జరగాలి ? / HOW THE ELECTIONS REFORMS TO BE CONDUCTED ? ."
      ***************************************
01.నేరగాండ్లను , అవినీతి పరులను , నల్ల ధన కుభేరులను ,75 సంవత్సరాలు దాటిన వారిని ఎన్నికలలో పోటీ చేయడాన్ని నిషేధించాలి .
02. పౌర సమాజాన్ని" ఫిఫ్త్ ఎస్టేట్ " గా రాజ్యాంగంలో భాగ స్వామ్యం చేయాలి .
03. అవినీతిని నిర్మూలించ డానికి ప్రతి 5 సంవత్స రాలకొక సారి , రాష్ట్ర పతి పాలన విధించాలి .
04. కాలాన్ని బట్టి స్పంధించ డానికి , 'ఎంపీ ' లకు , 'ఎం ఎల్ ఎ ', 'ఎం ఎల్ సి ' లకు విప్ లను జారీ చేయ కుండా స్వేఛ్చ నివ్వాలి .
05. ఇండి పెండెంట్స్ , పార్టీ పరంగా గెలిచిన , ప్రజా ప్రతినిధులు  ఓటర్ల అనుమతి లేకుండా , పార్టీ పిరాయించ డాన్ని నిషేధించాలి.
06. 
 రాజ్యాంగం ద్వారా ఓటర్లకు , అవినీతి నాయకుల మరియు అసమర్ధ నాయకులను 'కాల్ బ్యాక్ ' చేసే అధికారాలు కల్పించాలి .  

అప్పుడే  రాజ కీయ  నాయకులకు , ప్రజలను ఎన్నికల పోలింగుకు  వచ్చి , నిర్భందంగా  ఓటు  వేయ  మని  అడిగే   హక్కు ఉండాలి . ' నోటా ' వలన  ఎలాంటి  ప్రయోజనం లేదు . ఇది కేవలం  కంటి తుడుపు మాత్రమే . 


పౌర సమాజాన్ని ఎలా గుర్తించాలి ?

ప్ర .  పౌర సమాజాన్ని ఎలా  గుర్తించాలి ?

జ .  పౌర సమాజాన్ని " ఫిఫ్త్ ఎస్టేట్ "  ( 5th Estate ) గా  గుర్య్హించాలి . పౌర సమాజాన్ని ఫిఫ్త్ ఎస్టేట్ " గా గుర్తించే విధంగా పార్ల మెంటులో బిల్లు పెట్టి పాసయ్యేట్లు చేసే వారినే ( అసాంఘీక శక్తులను , అవినీతి పరులను మినహా ) ప్రజలు రాబోయే ఎలక్షన్లో ఎన్ను కోవాలి . అలానే  " ఫిఫ్త్ ఎస్టేట్ " కు  రాజ్యాంగ  హక్కులు  కల్పించాలి . 

ప్రజల మనో భావాలకు అత్యున్నతమైన ' రాష్ట్ర పతి' ఎన్నిక ప్రతి బిమ్భిస్తుందా ?

ప్ర . ప్రజల మనో భావాలకు అత్యున్నతమైన ' రాష్ట్ర పతి' ఎన్నిక  ప్రతిబింభిస్తుందా  ? 

జ . సాధారణ ఎన్నికల సమయాలలో , ప్రజలు గత భాధలు , కష్టాలు గుర్తుకు తెచ్చుకొని , నాయకుల వాగ్దానాలను నమ్మి , భావోద్వేగాలకు లోనయి , కొన్ని పార్టీలను పూడ్చి పెడుతారు , మరి కొన్ని పార్టీలను అందాల మెక్కిస్తారు . ఒక సంవత్సరమో , రెండు సంవత్సరాలో గడుస్తే గాని వారి నిజ స్వరూపం బయట పడదు . వారి నిజ స్వరూపం బయట పడేసరికి , వారు ప్రజల కంట్రోల్ల లేకుండా పోతున్నారు . అల్లాంటి సమయాల్లో , రాష్ట్ర పతి ఎన్నికలు జరుగడం  సర్వ సాధారణ మై పోయినాయి  . అప్పుడు అధి  కార పార్టీలు    'విప్పు' జారీ చేయడం , రాష్ట్ర పతి ఎన్నిక పూర్తి అవడం మొదలైనవీ కొన్ని సార్లు , ప్రజల మనో భావాలకు అత్యున్నతమైన రాష్ట్ర పతి ఎన్నిక ప్రతిబింభించడం  లేదేమోనని  అని పిస్తుంది .


www.margamkrishnamurthyideas.blog.com
www.sollutions2all.blog.com

సూర్య చంద్రుల , గ్రహాల ప్రభావం భూగోళం పైనా , మనుష్యుల పైనా , జీవ రాశుల పైనా ఉంటుందా ?

ప్ర . సూర్య చంద్రుల , గ్రహాల  ప్రభావం  భూగోళం పైనా , మనుష్యుల పైనా  ,  జీవ రాశుల పైనా  ఉంటుందా ?
జ . సూర్య చంద్రుల , గ్రహాల  ప్రభావం  భూగోళం పైనా , మనుష్యుల పైనా  ,  జీవ రాశుల పైనా  తప్ప కుండా  ఉంటుంది .  పగలు రాత్రి ఏర్పడేది , రుతువుల  మార్పు ,  కాలాల  మార్పు జరిగేది  వీటి వలననే . అంతే  కాదు , మనుష్యుల , జీవ రాశుల  మెదడు పై  పడి  , అప్పుడప్పుడు  అనుకోకుండా  విచిత్రంగా  ప్రవర్తిస్తారు . ఒక్కో సారి  ఆరోగ్యంగా  కుదుట పడు తారు . ఇవన్నీ  సూర్య చంద్రుల , గ్రహాల  ప్రభావమే . 

జంతువులకు , పశు పక్షాదులకు మాటలు రావు , చదువు రాదు . మరి అవి ఎలా జీవించ గలుగుతున్నాయి ? ఎలా సంతానోత్పత్తిని వృద్ధి చేసుకుంటున్నాయి ?

 ప్ర . జంతువులకు , పశు  పక్షాదులకు  మాటలు రావు , చదువు రాదు . మరి అవి  ఎలా  జీవించ గలుగుతున్నాయి ? ఎలా సంతానోత్పత్తిని  వృద్ధి చేసుకుంటున్నాయి ?
జ . జంతువులకు , పశు  పక్షాదులకు  మాటలు రావు , చదువు రాదు  అనేది  నిజమే . వాటికి గురువులు లేరు అనేది   వాస్తవమే .  కాని  ప్రకృతి  నుండి అన్నీ  గ్రహిస్తాయి . మన లాగానే ఏవి  రుచిగా  ఉంటె వాటినే తింటాయి . ఏవి  ఆరోగ్య కరం అనిపిస్తే వాటినే  భుజిస్తాయి .  ఎక్కడ చోటు దొరుకుతే అక్కడే  పడుకుంటాయి . అలానే సంతానోత్పత్తిని  వృద్ధి చేసుకుంటాయి . వాటికి కుటుంభ  నియంత్రణ లేదు .  మనుష్యులు  నియంత్రిస్తే  తప్పా .  వాటికి మన లాగ మాటలు  రాక పోయినా , చదువు  లేక పోయినా  వాటికవే  అర్ధం చేసుకునే  భాష ఉంటుంది .   

మానవులు దేని నుండి ఎక్కువగా జ్ఞ్యానాన్ని నేర్చుకుంటున్నారు ?

ప్ర . మానవులు  దేని నుండి  ఎక్కువగా  జ్ఞ్యానాన్ని  నేర్చుకుంటున్నారు ?
జ. మానవులైనా , పశు  పక్షాదులైనా , జంతువులైనా , ఎవ్వరైనననూ  ప్రకృతి  నుండే   జ్ఞ్యానాన్ని  నేర్చుకుంటారు . నేడు  పిల్లలు  తల్లి దండ్రుల నుండి , గురువుల నుండి  , సమాజం నుండి  , పుస్తకాల  నుండి , ఇంటర్నెట్ నుండి   జ్ఞ్యానాన్ని  నేర్చు కుంటున్నారు . 

కుక్కలు , పశు పక్షాదులు , క్రిమి కీటకాలు మనష్యుల కంటే గొప్ప తెలివి గలవా ?

 ప్ర . కుక్కలు , పశు పక్షాదులు , క్రిమి కీటకాలు  మనష్యుల  కంటే  గొప్ప తెలివి  గలవా  ?

జ . కొన్ని విషయాలలో  కుక్కలు , పశు పక్షాదులు , క్రిమి కీటకాలు  మనష్యుల  కంటే  గొప్ప తెలివి  గలవి  అని  చెప్పడంలో  ఎలాంటి సందేహం లేదు .   కుక్కలు , పశు పక్షాదులు , క్రిమి కీటకాలు రాబోయే ప్రమాదాలను  ముందే గుర్తించి  మనుష్యులను  హెచ్చరిస్తాయి .  గ్రామాలలో  ఉండే కుక్కలు , పశు పక్షాదులు , క్రిమి కీటకాలు  జరుగ బోయే  ప్రమాదాలను ముందే పసి గట్ట గలవు . యమ ధూతలు  మనిషి  ప్రాణాన్ని  తీసుకుని  పోవడానికి , ఆ పరిసర  ప్రాంతాలకు  వచ్చి నప్పుడు , కుక్కలు పసి గట్టి , ఏడుస్తూ  ఉంటాయి .( అరవడం వేరు , ఏడవడం  వేరు)
దానిని బట్టి , ఒకటి రెండు రోజుల లోనే  , పది , ఇరువై  గజాల దూరం లోనే   ఎవరో ఒకరు , రోగిష్టో  లేక   వృద్ధుడో  ,  మరొకరో   ఏదో కారణంతో  కాలం చేయ బోతున్నారని  మనం  అర్ధం చేసు కోవచ్చు . కుక్కలు సూర్యుడిని   కుంటూ  ఏడిస్తే  ఏదో అగ్ని  ప్రమాదం జరుగ బోతుందనే  దానికి   హెచ్చరిక గా భావించాలి . కుక్కలు ఆకాశాన్ని  చూస్తూ    ఏడిస్తే  ఏదో తుఫాన్ లేదా కుంభ వృష్టి  లేదా  భూ కంపం  లాంటి   ప్రమాదం జరుగ బోతుందనే  దానికి   హెచ్చరిక గా భావించాలి . కాకులు  ఇంటికి  లేదా దగ్గరగా  వచ్చి అరుస్తే  భందు వులు   వస్తున్నారని గాని , లేదా  దగ్గరి సంభందీకులు  ఏదో ప్రమాదంలో చిక్కు   కున్నారనికూడా  భావించ  వచ్చు . 

రోజు రోజుకు ధనికులు కుబేరులవుతుంటే , పేదలు నిరు పేదలుగా మార డానికి గల కారణం ఏమిటి ?

ప్ర . రోజు రోజుకు   ధనికులు  కుబేరులవుతుంటే , పేదలు నిరు పేదలుగా  మార డానికి  గల కారణం ఏమిటి ?
జ . పుట్టుకతోనే  కొందరు  తెలివిగాను , చలాకి గాను , బలంగాను  పుడుతారు . అలానే  మరి కొందరు తెలివి తక్కువ  తనం తోనూ , బలహీనం గానూ  ఉంటారు . వీరిలో నిజాయితీ గల వారూ  ఉంటారు .  ఎప్పుడైనా   తెలివి , బలం గల  వారినే విజయం  వరిస్తుంది కాబట్టి , పెద్ద పెరిగాక  కొంత  డబ్బు అధి కంగా  సంపాదించ గలుగు  తారు  .  ఆ విధంగా  తెలివి లేని వాడిపై  ,  తెలివైన  వాడు  పై చేయి  సాధిస్తాడు . అలా   మొదలైన  ప్రస్తానం , తెలివైన   , చురుకైన  , బలమైన  వారు   సమాజం లోని  లొసుగులను , చట్టాల లోని  లొసుగులను , అవకాశాలను  అంది పుచ్చుకుని , ఎవరి మేత వారికందించి  , అందరిని , అన్ని వ్యవస్థలను  గుప్పెట్లో  పెట్టుకుని , మోసాలు చేస్తూ , కుంభ కోణాలు చేస్తూ , కుబెరులై పోతుంటారు . తెలివి లేని వాడు, బల హీనుడు , నిజాయితీ  పరుడు  , ఎక్కడ వేసిన  గొంగడి అక్కడే  అన్న చందంగా , పేద తనంగానే జీవితం  సాగిస్తాడు  . 

పుట్టినప్పుడే శిశువుల్లో తెలివి తేటలలో , అవయవాల నిర్మాణంలో , అనారోగ్యంలో తేడాలుంటాయా ?

ప్ర . పుట్టినప్పుడే  శిశువుల్లో  తెలివి తేటలలో , అవయవాల  నిర్మాణంలో , అనారోగ్యంలో  తేడాలుంటాయా ?
జ . తప్ప కుండా  తేడా లుంటాయి . తల్లి  తీసుకునే   బలమైన ఆహారం , వైద్య పరీక్షలు  , మందుల  వాడకం , జీన్స్  , వాతా వరణం  లాంటి  అనేక  మైన  కారణాల  వలన , పుట్టినప్పుడే  శిశువుల్లో  తెలివి తేటలలో , అవయవాల  నిర్మాణంలో , అనారోగ్యంలో  తేడాలుంటాయి . 

ఎంత కష్ట పడినా కొందరినే విజయం వరిస్తుంది , ఎందుకు ?

ప్ర . ఎంత కష్ట పడినా  కొందరినే  విజయం వరిస్తుంది , ఎందుకు ?
జ . జీవితమనేది  ఒక  యుద్ధం  లాంటిది . ఈ  భూమిపై అడుగు పెట్టిన తరువాత , విజయాలన్నీ  వీరత్వాన్నే  వరిస్తాయి . జయాప జయాలాను , అదృష్ట  దురదృష్టా  లానే  నమ్మకాలతో  ముడి వేయ  కుండా ,  నిరంతరం  కృషిని  కోన సాగిస్తూనే  ఉండాలి . అలాంటి వారినే విజయాలు వరిస్తాయి .  

సృష్టిలో రకరకాల మనుష్యులు ఎందుకుంటారు ?

ప్ర . సృష్టిలో  రకరకాల  మనుష్యులు  ఎందుకుంటారు ?
జ . సృష్టి అనేది  మంచి చెడుల మేళ వింపు  మనుష్యులంతా  ఒకటే  అయినా  వారి మంచి చెడులు వేరు . భోజనం  ఒకటే అయినా  అన్నం  కూర వేరు . అన్నం  తీపిగా  ఉంటె  , కూర -  కారం , చేదు , ఉప్పు , పులుపు , ఘాటు  మరియు  తాలింపుల  మేళ వింపు . కాని  భోజనం ఒక్కటే . అలానే మనుష్యుల్లో   ఎవరికి  వారికే , సత్వ , రజో  , తమో  గుణాలు ఉంటాయి . తెలివి  తేటల్లో  తేడాలు , భౌతిక  స్వరూపాల రీత్యా అసమానతలు  గోచరిస్తుంటాయి . అలాగే కక్షలు  , కార్పణ్యాలు , ఈర్ష్య  , అసూయలుంటాయి  . 

Tuesday, December 29, 2015

ఈ సృష్టిలో ఏది గొప్పది ?

ప్ర . ఈ  సృష్టిలో  ఏది  గొప్పది ?
జ . ఈ  సృష్టిలో  గొప్పది  " ప్రకృతి "

సృష్టిలో సమానత్వం ఎందుకు లేదు ?

ప్ర . సృష్టిలో  సమానత్వం  ఎందుకు లేదు ?
జ . సృష్టిలో అందరూ  సమానులే . 

వృద్దులు ' ఒంటరి ' గా ఎందుకు జీవించ వలసి వస్తున్నది ? ఎందుకు అనాధలవుతున్నారు ? నివారణ ఏమిటి ?

వృద్దులు ' ఒంటరి ' గా ఎందుకు జీవించ వలసి వస్తున్నది ? ఎందుకు  అనాధలవుతున్నారు ?  నివారణ ఏమిటి ?
*********************************************************************************
వృద్దులు ' ఒంటరి ' గా  జీవించ వలసి రావడానికి అనేక కారణాలున్నాయి . వాటిలో ముఖ్యమైనవి ,
01. రోజు రోజుకు   జీవన వ్యయం పెరుగుతుండటం  వలన , తప్పని సరై  అందరూ ఉద్యోగాలు చేస్తూ , యాంత్రిక జీవితం  గడుపాల్సి వస్తున్నది .
02. పెద్ద  పెద్ద చదువులు  చదువుతున్నారు కాబట్టి ,  సుదూర  పట్టణాలలో  ఉద్యోగాలు చేయాల్సి రావడం వలన , వృద్ధ  తల్లి దండ్రులు  , గ్రామాలలో   లేదా పట్టణాలలో   ఒంటరిగా  నివసించాల్సి రావడం  జరుగు తున్నది . 
03. సంపాదించిన  డబ్బు  సరి పోక  లేదా  ఇరుకు  ఇరుకు  గదులలో  ఇమడ లేక  తల్లి దండ్రులు గ్రామాలలో   లేదా పట్టణాలలో   ఒంటరిగా  నివసించాల్సి రావడం  జరుగు తున్నది .
04.  పరిసర ప్రాంతాలు  సరి పడక , వాతా వరణం  గిట్టక  తల్లి దండ్రులు   గ్రామాలలో   లేదా పట్టణాలలో   ఒంటరిగా  నివసించాల్సి రావడం  జరుగు తున్నది .      
05. భార తీయ  సంపర దాయం  ప్రకారం , తల్లి దండ్రులను  పోషించే  భాద్యత  కొడుకులపైననే  ఉంటున్నది .  కొడుకులు  లేనివారిని , బిడ్డలే పోషిస్తుంటారు .  ఎవ్వరూ  లేని వారిని  బందువులు  లేదా ప్రభుత్వం  ఆదుకుంటది .   ఐతే  కొడుకులున్నవారి  విషయంలో ,  కోడన్డ్లకు  అత్తలకు  సరి పడక తల్లి దండ్రులు   గ్రామాలలో   లేదా పట్టణాలలో   ఒంటరిగా  నివసించాల్సి రావడం  జరుగు తున్నది . 

ఎందుకు  అనాధలవుతున్నారు ?
***********************
పై కారణాల  వలన  మరియు  మానవ సంభందాలు  , ప్రేమలు  నశించి  , నా అనే వారు  పట్టిచు కోక , చేవ ఉడిగి   వృద్ధ  తల్లి దండ్రులు  అనాధ లై  రోడ్డున పడటమో  లేక  దిక్కు  లేని  పరిస్థితులలో  మరణించడమో  , ఆత్మ హత్యలు  చేసుకోవడమో చేస్తున్నారు .    
నివారణ ఏమిటి ? 
***********
01. కొడుకులు ,బిడ్డలు  తమ  తల్లి దండ్రులు  పడ్డ భాదను  గుర్తు  చేసుకుని  , ప్రేమలు  , ఆప్యాయతలు  పెంచుకోవాలి   . వారి భాద్యతను  గుర్తు చేసు కోవాలి .  రేపు  తాము  కూడా  ఈ  దశకు   చేరుకోక తప్పదు అని గుర్తించాలి . 
02. మనల్ని  నవ మాసాలు  మోసి  సృస్టించింది  , చదివించి , పెద్ద చేసింది  తల్లి దండ్రులే  అని  గుర్తించాలి . 
03. మనం నేడు ఈ దశకు  చేరు కున్నామంటే , దానికి కారణం  తల్లి దండ్రులే అని తెలుసు కోవాలి . 
04. కొందరు  తల్లి  దండ్రులు  ఆస్తులు  సంపాదించి ఉండ వచ్చు , మరి కొందరు  సంపాదించి ఉండక పోవచ్చు . 
05. ఏ  ఆస్తుల  నైనా  భూమి  మీద  వదిలి  పోవాల్సిందే  అని  గుర్తెరుగాలి . 
06. ప్రపంచీకరణ  కారణంగా  , ఈ యాంత్రిక  కాలంలో , ప్రభుత్వమే  చొరవ తీసుకుని , ఎవరికీ  ఇబ్బంది   కలుగ కుండా , వృద్దాశ్రమాలు  కట్టించి , అన్ని తరగతుల  వృద్దులకు  అన్ని సౌకర్యాలతో  ( ఆహారం , వైద్యం , వినోదం , బట్టలు ) , వసతి కల్పించాలి .  ఇతర  దేశాలలో లాగా  ,అందుకు ప్రతిగా   , వారు  ఉద్యోగాలు చేసే  కాలం లోనే  వారి  జీతం  నుండే   మినహాయించి  , ఒక నిధిని ఏర్పాటు చేయాలి . వారికి  చెందే  ప్రభుత్వ  పథకాల నన్నింటిని , వారికి వర్తింప చేయాలి . 
అలానే  వారి ఆస్తులను  స్వీకరించ వచ్చు .  కొడుకులను  లేదా  బిడ్డలను  చేసి  వారి దగ్గరి నుండి  ప్రతీ  నెల కొంత సొమ్మును   వసూలు  చేసే  విధంగా  చట్టాలు  చేయాలి .  ధాతల  నుండి  విరాళాలు  సేక  రించ వచ్చు . 

ఈ విధంగా  వృద్ధులను  ఆదు  కోవడం వలన ,  చివరి దశలో  వారు , హాయిగా , సంతోషంగా  నివసించి  స్వర్గ లోకం  వెళ్ళడానికి అవకాశ ముంటుంది .  అలానే  కొడుకులకు  , బిడ్డలకు  ఏ  అపవాదు రాదు . యదా విధి గా  , చూడ వచ్చు , కలుసుకో వచ్చు , సంతోషాలు పంచు కోవచ్చు , కార్య క్రమాలు చేయ వచ్చు . 


మానవ సంభందాలు ( HUMAN RELATIONS) ఎందుకు దెబ్బ తింటున్నాయి ? కారణాలు ఏమిటి ? నివారించడం ఎలా ?

ప్ర . మానవ  సంభందాలు   ( HUMAN RELATIONS)  ఎందుకు దెబ్బ  తింటున్నాయి ? కారణాలు ఏమిటి  ? నివారించడం ఎలా ?

జ . మానవ  సంభందాలు  ( HUMAN RELATIONS)  దెబ్బ తినడానికి  అనేక కారణాలు ఉన్నాయి.  అందులో  ముఖ్య మైనవి ,

01. ప్రపంచీకరణ ( GLOBALISATION), పాశ్చాత్య  పోకడలు ( WESTREN STYLES)  అధికంగా  మన  దేశంలో  విస్త రించడం .

02. జీవన వ్యయం  పెరుగుతూ  ఉండడం వలన  , ఇంట్లోని  భార్య భర్తలు  ఉద్యోగాలు  చేయడం , పిల్లలు  చదువులకు  వెళ్ళడం , జీవితాలు  యాంత్రికమై  పోయి , కలసి  మాట్లాడుకునే  , ఆనందాలు , సంతోషాలు  పంచు కునే  సమయం  దొరకక , మానవ సంభందాలు  దెబ్బతింటున్నాయి .

03. పెద్ద పెద్ద చదువుల  కొరకని  కొందరు  తల్లి తండ్రులు , చిరాకు  వదిలించు కోవాలని  కొందరు తల్లి  తండ్రులు , పిల్లలను  దూర ప్రాంతా లకు  పంపించి  చదివిస్తున్నారు . ఆ కారణంగా  వారి మద్య  ప్రేమలు  కరువై  , వారు పెద్ద పెరిగి  , దూర  ప్రాంతాలలో  ఉద్యోగాలు  చేస్తూ  , పెట్టిన ఖర్చును  వడ్డీ తో  పంపించ డానికి , కొందరు  సిద్ద పడుతున్నారు  తప్పా , భాద్యతగా  ఫీలవ్వడం లేదు . ఒక్కోసారి  పరిస్థితులు  కూడా  కారణం కావచ్చు .

04. ఈ రోజుల్లో  మానవ సంభందాలన్నీ , డబ్బు తో  ముడి పడి  ఉన్నాయి .  డబ్బున్న  వారి తోనే  స్నేహాలు , సంభందాలు  కలుపుకుంటున్నారు .  

05. ఉమ్మడి  కుటుంభాలు  కనుమరుగయి , చిన్న చిన్న కుటుంభాలు  ఏర్పడటం  మూలంగా ,  పిల్లలకు   , ప్రేమ , దయ , నీతి  కథలు , పురాణాలు , మహా భారతాలు , రామాయణ కథలు , మంచి  బుద్దులు , క్రమ శిక్షణ  నేర్పే వారు కరువై నారు . ఆ కారణంగా  బంధమేమిటో , సంభంద మేమిటో  ఎవరికీ  తెలియడం లేదు . కొందరు  పిల్లలు  , పరమ పదించిన   అమ్మమ్మ , నానమ్మ , తాతయ్యల  ఫోటోలు  కూడా  గోడలకు   తగిలించాలంటే  ససేమిరా  అంటున్నారు . అసహ్యించు కుంటున్నారు . 

06. దీనికి తోడు  నేటి సినిమాలు , టి . వి . చానల్లు  ప్రసారం చేసే  సీరియల్లు , ఇంటర్ నెట్ల వలన , పిల్లలకు  పెద్దలతో  అనుభందాలు  తగ్గి పోతున్నాయి . 

07. అనేక కుటుంభాలలో , అత్తా మామలకు , కోడండ్లు , అల్లుండ్లకు - ఆవు X పులి , పాము X ముంగీస , దేవ X రాక్షస  వైరం లా ఉంటుంది . కారణం , వీరు  వేరు వేరు  కుటుంభ నేపధ్యాల నుండి రావడం  , వేరు వేరు ప్రాంతాల నుండి  రావడం  , వయస్సులలో  అధిక  తేడా లుండడం  మొదలైనవి  చెప్పు కోవచ్చు .  మరియు  ముఖ్యంగా  అత్తా  కోడండ్లు ఒకరిపై ఒకరు  డామినేట్  చేయాలనే  వింత  పోకడలు , వీరి మద్య  తెలియ కుండానే  అంతరాలను   పెంచి , సత్సంభందాలను  తుంచి , ఎంతో  కష్ట పడి  నిర్మించుకున్న  చక్కటి  కుటుంభాలను  కుప్ప కూలుస్తున్నాయి . చిందర వందర  చేస్తున్నాయి . దీని వలన  ముఖ్యంగా  వృద్దాప్య దశలో  ఉన్న  చేతలుడిగిన  ముసలి వారిపై  పడి , ఆస్తులున్నా , అభిమానాలున్నా , పేరు ప్రతిష్టలున్నా, దిక్కు లేని వారీగా  బిక్కు బిక్కు మంటూ జీవనం  సాగిస్తున్నారు  .   

Sunday, December 27, 2015

OLD AGE & LONELYNESS SHOULD NOT CREATE TO GET SUECIDE / 'వార్ధక్యం ', ' ఒంటరి తనం ' ఆత్మ హత్యలకు దారి తీయ కూడదు ".


'' 'వార్ధక్యం', 'ఒంటరితనం'ఆత్మహత్యలకుదారితీయకూడదు". 

**********************************************

యే మనిషికైనా తన జీవిత కాలంలో ముఖ్యమైన నాలుగు దశలు ఉంటాయి . అవి , 'బాల్యం', 'కౌమార్యం ', 'యవ్వనం ', మరియు 'వార్ధక్యం' .01. మొదటి దశ ' బాల్యం ': ఇది పుట్టిన రోజు నుండి 7 సంవత్సరాల వరకు గల కాలాన్ని ' బాల్యం ' గా చెప్పు కోవచ్చు . ఈ దశలో పిల్లలను , తల్లి దండ్రులు , అమ్మమ్మలు , తాతయ్యలు మరియు ఇతరులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతారు , కంటికి రెప్పలా చూస్తారు . మరెంతో ప్రేమను కనబరుస్తారు . అమ్మ నాన్నలు , అమ్మమ్మ , నానమ్మ తాతయ్యలు చెప్పే మంచి మాటలు , చిట్టి చిట్టి కథలు చెబుతుంటే వింటూ హాయిగా బజ్జుంటారు .

02. రెండవ దశ ' కౌమార్యం ' : ఇది సుమారుగా 7 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు గల కాలాన్ని ' కౌమార్యం ' అని చెప్ప వచ్చు . ఈ దశలో పిల్లలు ఆడుతూ , పాడుతూ , చదువుతూ , ఎగిరి గంతులు వేస్తూ సమాజాన్ని , లోకాన్ని అవగాహన చేసుకుంటూ తల్లి దండ్రుల , పెద్ద వారి అండతో , సహకారంతో ఇంటర్ చదువులు పూర్తి చేసి డిగ్రీ , ఇంజినీరింగ్ , డాక్టర్ కోర్సులలో అడుగు పెడుతారు . మంచిని చెడును అర్ధం చేసుకుంటారు . కొందరు , వారు పుట్టిన , పెరిగిన నేపధ్యాన్ని బట్టి , సమాజాన్ని బట్టి , వ్యవస్థను బట్టి , సినిమాలను , టి వి . ప్రసారాలను , ఇంటర్నెట్ ను బట్టి , జీవన స్థితి గతులను అనుసరించి మారు తుంటారు .
03. మూడవ దశ ' యవ్వనం ' : ఇది సుమారుగా 19 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు గల కాలాన్ని ' యవ్వనం ' అని చెప్ప వచ్చు . ఈ దశలో తల్లి దండ్రుల , పెద్ద వారి అండతో , సహకారంతో డిగ్రీ , ఇంజినీరింగ్ , డాక్టర్ కోర్సు లు పూర్తి చేసి , ఉద్యోగం లోనో , వ్యాపారం లోనో లేదా మరో వృత్తి లోనో స్థిర పడుతారు . డబ్బు సంపాదిస్తూ , తమ కాళ్ళ మీద తాము నిలబడుతారు . ఆ తరువాత పెండ్లిళ్ళు , పిల్లలు , బాధ్యతలు పెరుగుతాయి . గృహాలు , ఆస్తులు కొంటారు . ఇక వీరి తల్లి దండ్రులు వృద్ధాప్య దశకు చేరువలో ఉంటారు . అప్పుడు వీరికి , కొడుకులు ,బిడ్డలు అండగా వుంటారు . ఆ విధంగా కుటుంభం గా ఏర్పడి , సమాజం లో ఒక భాగంగా గుర్తించ బడుతారు .
04. నాల్గవ దశ ' వార్ధక్యం ' : ఇది సుమారుగా 61 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల వరకు గల కాలాన్ని ' వార్ధక్యం ' అని చెప్ప వచ్చు . ' వార్ధక్యం ' ( వృద్ధాప్యం ) దశలో వీరికి శక్తి సామర్ధ్యాలు తగ్గి పోతాయి . సంపాదించుకునే శక్తి తగ్గి పోతుంది . ఆదాయం తగ్గుతుంది . వీటికి తోడు రోగ నిరోధక శక్తి తగ్గి , అనా రోగ్యాలు వెంటాడు తాయి . ఉద్యోగ కారణాల వలన లేదా డబ్బు అధికంగా సంపాదించా లనే ఆరాటం వలన , ఆర్ధిక పరిస్థితుల కారణంగా , పిల్లల చదువుల వలన , కుటుంభ సమస్యల వలన లేదా ఇతర కారణాల వలన , జీవితాలు యాంత్రికంగా మారి కొడుకులు , బిడ్డలు , పిల్లలు ఒక్కొక్కరు , ఒక్కో చోట లేదా కొన్ని చోట్ల నివశించ వలసి రావచ్చు . అలాంటప్పుడు వృద్ధాప్యం లోని తల్లి దండ్రులు గ్రామాలలోనో , పట్టణాల లోనో ఒంటరిగా జీవించ వలసిన పరిస్థితి ఏర్పడు తున్నది .
ఇప్పడు ఒంటరి తనం ఓ పెద్ద సమస్యగా మారిపోయింది . అసలే వృద్ధాప్యం . ఆ వయస్సులో సాధారణంగా అనేక మైన రోగాలు వెంటాడుతాయి .కాళ్ళ నొప్పులు . నడవలేని , ఏ పని చేసుకోలేని పరిస్థితి . కొందరికి కండ్లు కన పడక పోవచ్చు . బి పి . షుగర్ ఉండ వచ్చు . వీరికి ఆక్షీజన్లా టైం ప్రకారం మందులు వాడాలి . కొందరు మూగ , చెవుడు ,వికలాంగులు కావచ్చు . ఇక వీరి ఆలోచనలు , రోధనలు ఎలా ఉంటాయంటే , నవ మాసాలు మోసి , కని , పెంచి పెద్ద చేసి , చదివించి , ప్రయోజకులను చేస్తే కాన రాకుండా పోయిరి అనే బాధ కడుపులో రగిలి పోతుంది . ఆస్తులు పంచిస్తే హాయిగా అనుభవిస్తూ అందనంత దూరంలో ఉండిరి గదా అన్న దిగులు కలుగుతుంది . గంపెడు బలగంలో పుడితిమి , చుట్టూ అందరు వున్నా , ఎవ్వరూ లేనట్లాయే నన్న బాధ . పిడికెడు అన్నం కంచంలో పెట్టె వారు లేక పాయె ననే వేదన . గ్లాసెడు నీరు అందించే వారు లేక పాయె ననే దిగులు . మందు గోలయినా అందించే వారు లేక పాయె ననే రంది . కనీసం ఆత్మీయంగా మాట్లాడే వారు లేక పాయె ననే కుంగు బాటు . సాటి వారు ఏమనుకుంటారో నని మరో రకమైన బాధ . ఇలాంటి ఆలోచనలు , రందులు , బాధలు , దిగులు వెరసి శారీరక క్రుంగు బాటుకు దారి తీసి , మరింత అనా రోగ్యానికి , పక్ష వాతానికి , హార్ట్ అటాక్ కు దారి తీయ వచ్చు . ఇవే చివరకు ఆత్మ హత్యలకు పురి కొల్ప వచ్చు .కటిక పేద వారైనా , అపర కుబేరులైనా ( 60 సంవత్సరాల పై బడి జీవిస్తా రను కుంటే ) ఈ నాలుగు దశలను ఎవ్వరూ తప్పించు కోలేరు . అనా రోగ్యాలను తప్పించు కోలేరు . కాని రందులను , దిగులును , మానసిక అశాంతిని , ఆత్మ హత్యలను తగ్గించు కోవచ్చు . ఆత్మీయతను పొంద వచ్చు .మనకు తెలుసు , ఇంట్లో కుంచెడు బియ్యం ఉన్నాయంటే మనకు ఆకలి వేయదు . బిందె నిండా మంచినీళ్ళు ఉన్నాయంటే మనకు పెద్దగా దూప వేయదు . కాని అవే లేవని మన మనసుకు తెలిస్తే విపరీతమైన ఆకలి , దూప వేస్తుంది . కారణం మన మనసుకు లేవని తెలియ గానే , అది మన అవయవాల నన్నింటిని అలర్ట్ చేస్తుంది . ఆ అవయవాలన్నింటి వత్తిడి వలన మరింత ఆకలి , దూప వేస్తుంది .
అలానే వృద్ధాప్యం లో ఉన్న వారికి , తమ చుట్టూ తమ వారు కనబడినా , ఆత్మీయంగా మాట్లాడినా , ఆర్ధికంగా ఎలాంటి లోటు లేనట్లవుతే , సమయానికి కావలసినంత ఆహారం దొరికి నట్లవుతే , సరిపడా మందులు అందుబాటులో ఉన్నట్లవుతే , నా అనే వారు ఎలాంటి తప్పుడు నడకలు నడవక పోతే , ఎలాంటి నెగెటివ్ ఆలోచనలు లేకుండా , దిగులు , రంది లేకుండా హాయిగా జీవిస్తారు . వీరు ఆత్మ హత్యల జోలికే పోరు . వీరికి ఆ అవసరం కూడా లేదు . కాని ఎప్పుడయితే పై వన్నీ లేదా కొన్ని లోపించినా , వాటికి తోడు చీద రింపులూ , చీత్కారాలు , వేదింపులు ఉన్నట్లయితే , రోజూ అవే ఆలోచనలతో , బాధలూ , రందులూ వెంటాడుతాయి . ఆ మానసిక వేదన తీవ్రమయితే , అనారోగ్యం ఇంకా పెరుగ వచ్చు , పక్ష వాతం , హార్ట్ అటాక్ కు గురి కావచ్చు , ఆత్మ హత్యకు దారి తీయ వచ్చు .
వృద్ధ భార్యా భర్తలు ఇద్దరూ జీవించి నంత కాలం , కొంత వరకు , ఒకరికి మరొకరు తోడుగా నిలుస్తారు . ఒకరికి మరొకరు కొండంత ధైర్యంగా ఉంటారు . కాని వారిలో ఒకరు దురదృష్టవశాత్తు కాలం చేస్తే , మిగిలిన వారికి ఒంటరి తనం బెంగ పట్టు కుంటుంది . అభద్రతా భావం పెరిగిపోతుంది . కనీసం అప్పుడైనా కొడుకుల కోడండ్ల , బిడ్డల అల్లుండ్ల , మనుమల మనుమ రాండ్ల ద్వారా ప్రేమ , ఆలనా పాలనా , పలకరింపు , తలపైనా చేతి స్పర్శ కూడా కరువయితే వారి మనో వేదన , దిగులు , క్రుంగుబాటు తీవ్ర తరమవుతుంది . వీటికి తోడు చీదరింపులు , వేదింపులు తోడయితే వారి జీవితం ఒక నరకంగా మారుతుంది . ఇక ఆ మానసిక ఆలోచనలతో రక్త ప్రసరణ తగ్గి పోయి పక్ష వాతానికి , హార్ట్ అటాక్ కు దారి తీస్తుంది . లేదా కొంత కాలానికి చుట్టూ చీకట్లు కమ్ముక పోయి , ఆలోచన శక్తి నశించి , అభద్రతా బావానికి లోనై , ఆత్మ హత్యకు పాల్పడుతారు . ఇటీవలి కాలంలో చుట్టూ అందరు ఉండి కూడా , ఒంటరి తనంతో , ఆత్మ హత్యకు పాల్పడిన సినీ ప్రముఖుడు శ్రీ రంగ నాథ్ గారిని , ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు .