ప్ర . మనిషి " కంఫర్ట్ జోన్ " లో నివశిస్తే ప్రయోజనం ఏమిటి ?
జ . యే మనిషైనా " కంఫర్ట్ జోన్ " లో నివశిస్తుంటే అధ్బుతాలు సృష్టించ గలడు . అతడు లేదా ఆమె పేదలు కావచ్చు . ధనికులు కావచ్చు . అక్షరాస్యులు కావచ్చు లేదా నిరక్ష రాస్యులు కావచ్చు . శరీరం పైనా , మనసుపైనా ఎలాంటి ఉందని కారణంగా వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది . అలాంటి వారి నుండి వచ్చే ఆలోచనలు , ఐడియాలు , సూచనలు , నూతన ఆవిష్కరణలకు మూలమవుతాయి . ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలవుతాయి . మరెందరికో ఆదర్శ మవుతాయి .
అసలు ఈ " కంఫర్ట్ జోన్ " లో నివశించడమంటే ఏమిటి ?
" మనిషి ఆరోగ్యంగా , ఆహ్లాదకర వాతావరణంలో , ఎలాంటి సామాజిక , ఆర్ధిక , కుటుంభ , మానసిక సమస్యలు లేకుండా , కనీస వసతులైన కూడు , గూడు , గుడ్డ , విద్య కలిగి ఉండటాన్ని " కంఫర్ట్ జోన్ " లో నివశించడం గా చెప్ప వచ్చు " .
ఈ " కంఫర్ట్ జోన్ " ను ప్రభుత్వాలు గనుక యుద్ద ప్రాతి పదికన , ప్రజలకు అందించ గలుగుతే , ప్రజలను " కంఫర్ట్ జోన్ " లో కి గనుక తీసుక రాగలుగుతే , ఆ తరువాత ప్రజలే ప్రభుత్వాలకు వెన్ను దన్నుగా ఉండి , ఎన్నో గొప్ప సూచనలను చేస్తారు . ఎన్నో సలహాలను ఇస్తారు . మరెన్నో ఐడియాలను అందిస్తారు . అభి వృద్దిలో బాగా స్వాములవుతారు . ఎన్నో వృధా వ్యయాలను తగ్గిస్తారు . ప్రభుత్వ ఆదాయాలను పెంచ డానికి కృషి చేస్తారు . ప్రజలపై తరుచూ వెచ్చించే ఖర్చును తగ్గిస్తారు . సమాజంలో కొట్లాటలు , గొడవలు , దొంగ తనాలు , దోపిడీలు , హత్యలు , కోర్టు కేసులు తగ్గి పోతాయి . వారి శరీరం పైనా , మనసుపైనా ఎలాంటి ఉండని కారణంగా వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది . అలాంటి వారి నుండి వచ్చే ఆలోచనలు , ఐడియాలు , సూచనలు కోట్ల విలువ చేస్తాయి . అంతే కాదు , కొందరి మనష్యుల కలయికే కుటుంభం . కొన్ని కుటుంభాల కలయికే సమాజం . సమాజమంతా కలిస్తేనే రాష్ట్రం , దేశం మరియు ప్రపంచం . అందుకని మనుష్యులు " కంఫర్ట్ జోన్ " లో జీవించ గలుగుతే రాష్ట్రంలో , దేశంలో మరియు ప్రపంచంలో ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు .
ప్రజలను " కంఫర్ట్ జోన్ " లో కి తీసుక రావడానికి మొదట ఖర్చు ఎక్కువకావచ్చు . కాని భవిష్యత్తులో ఖర్చు తగ్గి పోతుంది . ఉదా : సోలార్ ఇన్ స్టాలేషన్ కు మొదట ఖర్చు బాగానే అవచ్చు . కాని దీర్ఘ కాలంలో మల్లీ ఖర్చు ఉండదు . అలాంటిదే ఈ " కంఫర్ట్ జోన్ " ఖర్చు కుడా .
అలా కాకుండా , ప్రజలను కేవలం ఓటు బ్యాంక్ గా చూస్తూ , పేదలను మాడ్చుతూ , ప్రజలలో కుల , జాతి , మత మరియు ప్రాంతీయ వైషమ్యాలను సృష్టిస్తూ , విభేదాలను పెంచుతూ , స్వార్ధం తో , అత్యాశతో అవినీతి సొమ్మును , నల్ల ధనాన్ని విదేశీ బ్యాంకులలో , ట్రస్ట్ లలో , పరోక్షంగా ఎఫ్ . డి . ఐ లలో , చంద్ర మండలం భూములపై మరియు ఆస్తులను బినామి పేర్ల మీద పెట్టుకుంటూ పోతే , భారత దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించ బడదు . అభి వృద్ధి చెందు తున్న దేశంగానే గుర్తించ బడుతుంది .
No comments:
Post a Comment