ప్ర . దేశంలో " రాజకీయ వ్యవస్థ " ప్రక్షాళన తక్షణం అవసరమా ?
జ . దేశంలో " రాజకీయ వ్యవస్థ " ప్రక్షాళన తక్షణం అవసరం ఉంది .
మనకు అనేక వ్యవస్థలున్నాయి . అందులో ముఖ్యమైనవి , కుటుంభ వ్యవస్థ , సామాజిక వ్యవస్థ , రాజకీయ వ్యవస్థ , ఆర్ధిక వ్యవస్థ , పరి పాలనా వ్యవస్థ , న్యాయ వ్యవస్థ , ఎన్నికల వ్యవస్థ, పన్నుల వ్యవస్థ, మీడియా వ్యవస్థ , రాజ్యంగా వ్యవస్థ , ఇలా అనేకంగా ఉన్నాయి . వీటిలో , అన్ని వ్యవస్థలను శాషించేది కేవలం రాజకీయ వ్యవస్థ ఒక్కటే . యింతటి అధికారాలు గల రాజకీయ వ్యవస్థ , స్వాతంత్ర్యం వచ్చిన 10 సంవత్సరాలు మినహా , నాటి నుండి నేటి వరకు , అవినీతి కూపంలో కూరుకు పోయిందనడానికి అనేక సాక్షాలున్నాయి . తమ అధికారాలను దక్కించు కోడానికి , సంపద పెంచుకోడానికి , గత అవినీతి నాయకులను క్షమించడం మినహా ప్రజలకు చేసిన మేలు అల్పం . ప్రజలను నిర్లక్షమ్ చేయడానికి , ప్రజలు అనారోగ్యానికి గురి కావడానికి , సంపూర్ణ విద్య , ఇతర వసతులు లేక పోవడానికి , ఆర్ధిక అసమానతులు ఏర్పడడానికి , కూడు గుడ్డా లేక పోవడానికి , నేటికి ప్రభుత్వాలు ప్రకటించే సంక్షేమ పధకాలకు , సబ్సిడీలకు , ఆసరా పించన్లకు ప్రతి నెలా చకోర పక్షుల్లా ఎదిరి చూడ టానికి మరియు భారత దేశం అభి వృద్ధి చెందిన దేశాల సరసన చెరక పోవడానికి ముఖ్య కారణం , ఈ అవినీతి కూపంలో మునిగి పోయిన రాజకీయ వ్యవస్థే . కనీసం ఈనాడైనా రాజకీయ వ్యవస్థ ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది . చట్టం ముందు అందరూ సమానులే అనే భావనను కలిగించాల్సిన అవసరం ఎంతో ఉంది . చట్టాల లోని లొసుగులను నల్ల ధనం తో , బినామి ఆస్తులతో వినియోగించు కోకుండా చూడ వలసిన అవసరం ఎంతయినా ఉంది .
No comments:
Post a Comment