ప్ర . అధిక సమస్యలకు ప్రధాన కారణం (MAIN REASON FOR MORE PROBLEMS) ఏమిటి ?
జ . అధిక సమస్యలకు ప్రధాన కారణం డబ్బే .
" డబ్బు ఒక మబ్బు లాంటిది. డబ్బు ఒక సబ్బు లాంటిది. డబ్బు ఒక జబ్బు లాంటిది . డబ్బు ఒక గబ్బు లాంటిది . "
సమస్యలు లేని జీవి ఈ సృష్టి లోనే లేదు అంటే ఆశ్చర్య పోనవసరం లేదు . రాముడికైనా సమస్యలు తప్ప లేదు . క్రుష్ణుడికైనా తప్పలేదు . సత్య హరిశ్చ్సంద్రుడికి , నలమహారాజుకు సమస్యలు తప్పలేదు . ఎవ్వరునూ బంగారు స్పూన్ ను నోట్లో పెట్టుకుని పుట్టరు . సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి . చిన్న నాటి నుండే ఎన్ని సమస్యలు ఎదుర్కోగలిగితే అంత అనుభవమొస్తుంది. సమస్యల వలననే , ఖష్టాల వలననే మనిషిలో , ఏదో ఒకటి సాధించాలనే కసి , తపన పెరుగు తుంది . పట్టుదల పెరుగుతుంది . ఆలోచనలతో మెదడు పదను తేరుతుంది . ఒక్కొక్కటి సాధించు కుంటూ పోతుంటే వారిపై వారికి విశ్వాసం పెరుగుతుంది . మనిషిలో క్రమశిక్షన పెరుగు తుంది . జీవితంపై నమ్మకం కలుగుతుంది . ధైర్యం ఏర్పడుతుంది . కష్ట పడి సంపాదిచిన దానిని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని చూస్తారు . సమాజంలో గౌరవంగా జీవిస్తారు . నలుగురికి జీవనోపాది కలిగిస్తారు . ఇలాంటి వారే ఇతరులకు ఆదర్శంగా నిలబడుతారు . ' సంపాదించడమంటే ' , కేవలం డబ్బు సంపాదించడం మాత్రమె కాదు . సంతోషంగా జీవించడం కావచ్చు , స్నేహితులను సంపాదించడం కావచ్చు , రాజ కీయంగా లేదా వృత్తి పరంగా ప్రజల అభిమానం , గౌరం పొందడం కావచ్చు .నేడు పెద్ద పెద్ద పరిశ్రమల వ్యవస్తాపకులందరూ , పెద్ద పెద్ద పదవులలో ఉన్న వారెందరో ఎన్నో సమస్యలు ఎదోర్కుని , ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చిన వారే .
సమస్యలను ముఖ్యంగా రెండు భాగాలుగా విభజించ వచ్చు . అవి ఒకటి అంతర్లీన మైనవి (బయటకు కనబడనివి . చెప్పుకోడానికి వీలు కానటు వంటివి ). రెండవది భాహ్య మైనవి ( బయటకు కనబడేవి . చెప్పుకోడానికి వీలయ్యేవి ).
సమస్యలను మరల ఆరు రకాలు గా చెప్పుకోవచ్చు . అవి , మొదటిది, ముఖ్యమైనది ఆర్ధిక సమస్యలు . రెండవది ఆరోగ్య సమస్యలు . మూడోవది మానసిక సమస్యలు . నాల్గవది సామాజిక / సాంఘీక సమస్యలు . ఐదవది కుటుంభ సమస్యలు . ఇక ఆరవది పై ఐదింటిలో లేనటువంటి సమస్యలు ఏవైనా కావచ్చు . అలానే ఒక్కోక్క సమస్యలో నియంత్రించ గలిగేవి . నియంత్రించ డానికి వీలు లేనివి అనే రెండు విభాగాలు ఉంటాయి . నిజానికి మనుష్యులకు సహజంగా వచ్చే సమస్యలకంటే , వారు సృష్టించు కునేవే అధికంగా ఉంటాయి .
చిన్న చిన్న సమస్యలు రాగానే భయ పడ కూడదు , బెంబేలెత్తి పోకూడదు . సమస్యలు ఎవ్వరికైనను సహజమని గుర్తు పెట్టుకోవాలి . సమస్యలకు భయ పడుతూ పోతే ఈగ , దోమ కూడా మనపై సవారి చేస్తాయి . సమస్యలు తాత్కాలిక మైనవి కావచ్చు . దీర్ఘ కాలానికి సంభంధించినవి కావచ్చు .
మెజారిటి సమస్యలకు మూల కారణం డబ్బే . డబ్బు కష్టపడి నిజాయితీగా , సక్రమమైన పద్ధతిలో సంపాదిస్తూ పొదుపు చేసుకుంటూ , సక్రమంగా అవసరాలకే ఖర్చు పెట్టుకుంటూ పోతే , చాలా వరకు సమస్యలు దరిచేరవు.
అంతే కాకుండా మనిషి సంఘ జీవి . మనిషి జీవించడానికి సమాజంలోని బంధు మిత్రుల , కుటుంభ సభ్యుల అందరి సహకారం , ప్రభుత్వ సహకారాలు అవసరం ఉంటాయి .వాటిని కాదని కేవలం తన శక్తిమీదనో లేదా ఏ ఒక్కరి మీదనో లేదా ఏదో ఒక వర్గపు కుటుంభం మీదనో లేదా మరో ఒకే శక్తి మీదనో భారం వేసి జీవిస్తే , సమస్యలు వచ్చినప్పుడు తట్టుకోవడం కష్టమవుతుంది . అది తెలుసుకుని మనిషి లోని అరిషడ్ వర్గాలనే ఆరు శత్రువులను , అనగా కామ , క్రోధ , లోభ , మోహ , మధ , మాత్సర్యాలను విడ నాడ గలుగుతే సమస్యలన్నీ దూది పింజాల్లా తేలి పోతాయి .సమస్యలను మరిచిపోవడం ఒక కళే . సమస్యలను మరిచి పోవడానికి , ఉపయోగ పడే మరో వ్యాపకాన్ని అలవర్చు కోవడం వలన కూడా కొన్ని రకాల సమస్యలనుండి బయట పద వచ్చు .
No comments:
Post a Comment