ప్ర . ఒక్కో సారి మనుష్యులు ఎందుకుకు విచిత్రంగా ప్రవర్తిస్తారు ?
జ. సాధారణంగా కాలాన్ని బట్టి , ప్రకృతిని బట్టి , తినే ఆహార పదార్ధాలను బట్టి , మనిషి శరీరంలోని అవయవాలలో , హార్మోన్లలో మార్పులు వస్తుంటాయి . కాలానుగుణంగా సముద్రాలలో ఆటు పోటులు వస్తుంటాయి . రుతువులు మారుతుంటాయి . నెలలు , పౌర్ణమి , అమావాస్య లాంటి పక్షాలు , వారాలు , నక్షత్రాలు , అష్టమి , నవమి లాంటి తిధులు మారుతూ ఉంటాయి . అలానే కాలాన్ని బట్టి పురుషులలో , స్త్రీలలో మరియు అన్ని రకాల జీవరాశులలో వయస్సు పెరిగిన కొద్దీ వారి వారి శరీర ఆకృతులలో , అవయవాలలో మార్పులు కనిపిస్తుంటాయి . కాలానుగుణంగా వచ్చే హార్మోన్ల మార్పుల వలన కొందరిలో విచిత్ర ప్రవర్తన కనబడుతుంది .
అలానే వీటికి తోడు కాలానుగుణంగా వచ్చే ఉత్తరాయణం , దక్షనాయణం , ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి , అమావాస్య లాంటి పక్షాలు , అష్టమి మరియు నవమి లాంటి తిధులు ఏకమవడమో లేదా సమీపంలో ఉండటమో జరుగుతే కొందరు విపరీతంగా , విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు ,
స్పర్శ జ్ఞానం ఉన్న ఎవరికయినా , కాలు బొటన వ్రేలుకు సూదిగుచ్చుకుంటే , వెంటనే దాని నొప్పి మెదడుకు చేరిపోతుంది . అలానే శరీరంలో ఏ చిన్న మార్పయినా క్షణాలలో నరాలద్వారా మెదడుకు చేరి పోతుంది . ఎప్పటికప్పుడు హర్మోన్లలో మార్పుల కారణంగా , మెదడులో రాసాయన క్రియ జరిగి అది మనస్సుకు చేరవేస్తుంది . మనసు చెప్పినట్లే మనిషి నడుచుకుంటాడు .
ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి , అమావాస్య లాంటి పక్షాలు , అష్టమి మరియు నవమి లాంటి తిధుల ప్రభావం వలన , హార్మోన్లలో మార్పులు సంభవించి ఒక్కో సారి కొందరు శరీర నియంత్రణ కోల్పోతారు . విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు .
No comments:
Post a Comment