ప్ర . అనుమానం అంటే ఏమిటి ? మనిషికి అనుమానం ఎందుకు కలుగుతుంది ? నమ్మకం అంటే ఏమిటి ? నమ్మకం ఎలా ఏర్పడుతుంది ?
జ .సాధారణంగా ప్రతి నిత్యం ఏదో ఒక చోట లేదా ఏదో ఒక వ్యవస్థలో లేదా ఒక సంస్థలో లేదా ఏదో ఒక కుటుంభంలో వినే పదాలలో " అనుమానం " కుడా ఒకటి . ఈ " అనుమానం " అనే భావనల వలన , ఆలోచనల వలన , అనేకమైన సంఘటనలతో ఎన్నో కుటుంభాలు , మరెన్నో వ్యవస్థలు కుప్ప కూలి పోతున్నాయి . అందుకే నాలుగు అక్షరాల పదమైన " అనుమానం " బీజాక్షరాల్లా అందరి నోల్లల్లో శ్వాస ఉన్నంత వరకూ ఉచ్చరింప బడుతూ నే ఉంటున్నది . అయితే ఈ " అనుమానం " అనేదే లేక పోతే వీటికి రెట్టింపు కుటుంభాలు , వీటికి రెట్టింపు వ్యవస్థలు కుప్ప కూలి పోతాయి . " నమ్మి నాన బోస్తే పుచ్చి బూడిద అయినట్లు " , అన్నిటిని , అందరిని నమ్ముకుంటూ పోతే చివరికి ఏమి మిగలదు . గొర్రె కసాయి వాన్ని నమ్ముతుంది . కాని కసాయి దాని ప్రాణాలు తీస్తాడు . వ్యవసాయ దారుడు , నాణ్యమైన విత్తనాలనే నమ్మి , ఎక్కువ ధర పెట్టి కొని తెచ్చి చెలుక దున్ని వేస్తాడు . అవి మొలకెత్తనపుడు తెలుసుకుంటాడు , నేను నమ్మి మోసాపోయానని . నిరుద్యోగి నమ్మి ఏజెంట్ కు లక్షలు కుమ్మరిస్తాడు . ఉద్యోగ రానప్పుడు తెలుసుకుంటాడు , నేను మోస పోయానని . సామాన్య ప్రజలు చిట్టీలు వేస్తారు . వారు బిస్తరు చదురుకున్న రోజు , ఇంటికి తాళం వేసిన రోజు తెలుసుకుంటాడు , నేను మోస పోయానని . రాజకీయ నాయకుల వాగ్దానాలు , మాటలు నమ్మి , ఓటర్లు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు . కాని వారు పరి పాలించే టపుడు తెలుస్తుంది ఓటర్లకు , మేము నమ్మి ఓట్లు వేసి మోసాపోయామని . అదియును గాక , ఒక వేల అందరూ నమ్మకాల మీదనే జీవిస్తుంటే , అపుడు ఈ చట్టాలు , పోలీసు వ్యవస్థ , న్యాయ వ్యవస్థ , ప్రభుత్వాలు ఏవీ అవసరం ఉండదు . బలమైన వారే , తెలివైన వారే , హుషారు గల వారే , అందమైన వారే , ఎదుటి వారిని మోసం చేసుకుంటూ కొంత కాలం హాయిగా జీవించ వచ్చు . కొంత కాలం ఎందుకన్నానంటే , కొంత కాలం తరువాత , మోస పోయే వారు పని చేయరు . సంపాదించరు . ఎలాగో నమ్మి మోసపోతున్నాం కదా , ఎందుకు కష్ట పడాలి , ఎవరికోసం సంపాదించాలి , ఎవరికోసం బ్రతుకాలి అని అనుకుంటారు . అడ్డ చాకిరి చేసి , " కాకుల కొట్టి గద్దలకు వేయాలా " అని పనులు మానేస్తారు . ఈ విధంగా శ్రమ శక్తి ఆగి పోతుంది , ఉత్పత్తి ఆగి పోతుంది . దేశ అభి వృద్ది ఆగి పోతుంది . అందు కని " అనుమానం " మరియు " నమ్మకం " రెండూ ఉండాలి . రెండూ బ్యాలెన్సింగ్ గా ఉండాలి . ప్రతి నాణానికి , ప్రతి నోటుకు బొమ్మ , బొరుసూ రెండూ ఉండాలి . అలా ఉంటేనే నాణానికి గాని రూపాయి ప్రతి నోటు కుగాని విలువ ఉంటుంది . చెల్లు బాటు అవుతుంది . అందుకని అను మానించే వారిని చులకనగా చూడకూడదు . అనుమానించే వారిని నేరస్తులుగా భావించ కూడదు . సి . ఐ . డీ . లకు , ఎ . సి బి . వారికి , ఇన్వెస్ట్ గేషన్ వ్యవస్థలకు , ప్రభుత్వాలకు , యజమానులకు , తల్లి దండ్రులకు , బార్యలకు , భర్తలకు " అనుమానం " అనేది ఒక ' ఆయుధం ' లాంటిది . అంతే కాదు " అనుమానం " అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది కుడా . " అనుమానం " ద్వారా సత్యాన్ని బయటకు తీయ వచ్చు , అలానే అనుమానించే వారి మీద నిందలు , అబాండాలు వేసి , తమ తమ కార్య కలాపాలాను నిర్విగ్నంగా కొన సాగించుకోవచ్చు .
అసలు ఈ " అనుమానం " అంటే ఏమిటి ?బాధ్యత గల వ్యక్తులు , తాము ఇచ్చిన పనిని సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అని గాని , తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నారా లేదా అని గాని , తమ బిడ్డలు దారి తప్పుతున్నారా లేదా అని గాని , రహస్యంగా తెలుసు కోవడానికి ప్రయత్నించ డాన్నే " అనుమానం " గా చెప్పుకోవచ్చు .
మనిషికి , ఎదుటి వారి పైనా ఎందుకు అనుమానం కలుగుతుంది ?
ఎదుటి మనిషి ,( ఆడ కావచ్చు లేదా మగ కావచ్చు) వారి మాటల తీరులో , నడవడికలో , ఆలోచనలలో , చేష్టలలో , సగటు వ్యక్తులకు భిన్నంగా , అసాదారణ రీతిలో , కోరికలలో , వేష భాషలలో , దుస్తులలో , చూపులలో , సైగలలలో , వ్యవహార శైలిలో తేడాలు , మార్పులు , కనబడి నప్పుడు , స్వేచ్చగా ఉండాలనుకున్నపుడు , స్వేచ్చగా తిరుగాలనుకున్నపుడు , ఒంటరి తనాన్ని ఇస్టపడినపుడు , వద్దన్న పనిని వాలాంచి చేసినపుడు , ఎదురుగా ఒక తీరుగా మరియు చాటుగా మరొక తీరుగా నడుచుకున్నపుడు , అతి భయంగా అతి అమాయకంగా నటించి నపుడు , అనుబంధం గల వారికి ఎదురు తిరిగినపుడు , కేర్లేస్స్ చేసినపుడు , బెదిరించి నపుడు , దబాయించి నపుడు , గదరాయించి నపుడు , చీదరించుకున్నపుడు , అసహ్యించు కున్నపుడు , కించ పరిచినట్లుగా మాట్లాడినపుడు , ఇతరులముందు డామినేషన్ కనబరచినపుడు , కోట్లాడి నపుడు , తిట్టి నపుడు , కొట్టినపుడు , ఏదో సాధించు కోవాలని బయట ప్రజలు వినేటట్లుగా అరిచినపుడు , రేడియో టైపులో మాట్లాడి నపుడు - వారితో సంభందం, అనుభందం గల వారికి గల వారికి , వారిపై అధికారం గల ప్రతి ఒక్క వ్యవస్థకు , ప్రతి ఒక్క సంస్థకు , ప్రతి ఒక్కరికి , అలాంటి వారిపై " అనుమానం " కలుగుతుంది . అయితే , ఈ విధంగా నడుచుకున్న వారంతా పొరపాటు చేసినట్లు కాదు . తప్పు చేసి నట్లు కాదు . నేరం చేసినట్లు కాదు , మోసం చేసినట్లుకాదు . కాని అనుమానాన్ని కలిగింప చేస్తారు . అనుమానాన్ని రేకెత్తింప చేస్తారు.
" అనుమానం పెను భూతం " కాదన లేము . కాని "నిప్పులేనిదే పొగరాదు " అనే సామెత కూడా వాడుకలోనుండి వచ్చినదే .
భారత దేశం విలువలకు , సంస్క్రతికి , సాంప్రదాయాలకు , కట్టుబాట్లకు పుట్టినిల్లు . సమాజంలో బ్రతుకు తున్నపుడు మనుష్యులు విలువలకు , సంస్క్రతికి , సాంప్రదాయాలకు , కట్టుబాట్లకు అనుగుణంగా నడుచుకోవాలి . భావి తరాలకు ఆదర్శం కావాలి . అలా కాకుండా నా డబ్బు నా యిష్టం , నా శరీరం నా యిష్టం , నా సంపద నా యిష్టం , నా పిల్లలు నా యిష్టం అంటే రోడ్డుకు అడ్డంగా నడుస్తే ఏమవుతుందో అదే జరుగు తుంది. ఆ కారణంగానే వ్యవస్థలు , సంస్థలు, కుటుంభాలు కుప్ప కూలి పోతాయి . సంసారాలు కుక్కలు చింపిన విస్తరులవుతాయి .
నమ్మకం అంటే ఏమిటి ?
అనుమానానికి , ఆవ నమ్మకానికి పూర్తి వ్యతిరేక పదం " నమ్మకం " . బాధ్యత గల వ్యక్తులు , తాము ఇచ్చిన పనిని సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అని గాని , తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నారా లేదా అని గాని , తమ బిడ్డలు దారి తప్పుతున్నారా లేదా అని గాని , రహస్యంగా తెలుసు కోవడానికి ప్రయత్నించ కుండా , పరిశీలించ కుండా ఉండడాన్నే " నమ్మకం " గా చెప్పుకోవచ్చు .
నమ్మకం ఎలా ఏర్పడుతుంది ?
వ్యవస్థల మద్య , సంస్థల మద్య , మనుష్యుల మద్య , కుటుంభ సబ్యుల మద్య , భార్యా భర్తల మద్య అలానే వ్యవస్థలకు ప్రజలకు మద్య , సంస్థలకు ప్రజలకు మద్య ఎలాంటి దాప రికాలు లేకుండా , మనస్పర్ధలు లేకుండా , అబద్దాలు, మోసాలు లేకుండా, స్వార్ధం లేకుండా, ఇంకా చెప్పాలంటే కామ క్రోధ ,మోహ , లోభ మధ మాత్సర్యాలు లేకుండా సామాజిక , ఆర్ధిక , కుటుంభ వ్యవహారాలూ నడుస్తూ ఉంటే , అప్పుడు, ఒక దానిపై మరొక దానికి , ఒకరిపై మరొకరికి నమ్మకం ఏర్పడుతుంది .
వ్యవస్థల మద్య , సంస్థల మద్య , మనుష్యుల మద్య , కుటుంభ సబ్యుల మద్య , భార్యా భర్తల మద్య అలానే వ్యవస్థలకు ప్రజలకు మద్య , సంస్థలకు ప్రజలకు మద్య ఎలాంటి దాప రికాలు లేకుండా , మనస్పర్ధలు లేకుండా , అబద్దాలు, మోసాలు లేకుండా, స్వార్ధం లేకుండా, ఇంకా చెప్పాలంటే కామ క్రోధ ,మోహ , లోభ మధ మాత్సర్యాలు లేకుండా సామాజిక , ఆర్ధిక , కుటుంభ వ్యవహారాలూ నడుస్తూ ఉంటే , అప్పుడు, ఒక దానిపై మరొక దానికి , ఒకరిపై మరొకరికి నమ్మకం ఏర్పడుతుంది .
No comments:
Post a Comment