ప్ర . అవినీతి సొమ్ముతో (CORRUPTED MONEY) ఎలాంటి సుఖాలను అనుభవించ వచ్చు ?
జ . అవినీతితో , అక్రమంగా సంపాదించిన ఆస్తులతో ,డబ్బుతో, నల్ల ధనం తో , బినామి ఆస్తులతో తాత్కాలికమైన సుఖం , సౌఖ్యం లభించ వచ్చు . మినరల్ వాటర్ తో స్నానం చేయ వచ్చు . ఎ .సి . కార్లల్లో తిరగ వచ్చు . టూర్లు వేయ వచ్చు . షికార్లు కొట్ట వచ్చు . రాజ భోగాలు , అధికారం, హోదా లభించ వచ్చు . అయినా అది దీర్ఘ కాలం నిలువదు . కాని ఆ అవినీతి మచ్చ మాత్రం వారి తర తరాలను వెంటాడుతేనే ఉంటుంది . పైకి గాంభీరంగా కనిపించినా , అంతరాత్మ నీడలా వెంటాడుతేనే ఉంటుంది . అంతే కాకుండా దిన దినం ప్రాణ గండంలా భయం , భయంగా జీవించాల్సి వస్తుంది . ఏ మనిషి అయినా ఎవరికీ భయపడక పోయినా , ఎవరు చెప్పినా వినక పోయినా - తన అంత రాత్మకు భయపడుతాడు , తల వంచు తాడు . తన అంత రాత్మ సూచించి నట్లుగా నడుచుకుంటాడు . అవినీతి పరులు , నల్ల ధన కుభేరులు కోర్టులకు తల నొప్పిగా మార వచ్చు. సమాజంలో చెడ్డ వారిగా , చరిత్ర హీనులుగా మిగిలిపోవాల్సి రావచ్చు .
అదే నీతి మంతంగా , నిజాయితితో , క్రమ శిక్షణ జీవితంతో , సక్రమంగా సంపాదించిన ఆస్తులతో ,డబ్బుతో (అవి కొన్నే కావచ్చు ), నిజాయితీగా జీవించే వారికి దీర్ఘ కాలం ఆనందం , త్రుప్తి , సంతోషం , ఆనందం , ప్రశాంతత లభిస్తుంది . నిజాయితీగా ఉంటె ఎంతో హాయిగా ఉంటుంది .యే టెన్సన్స్ ఉండవు . యే చికాకులు ఉండవు . అంతే కాకుండా నిర్భయంగా జీవించ వచ్చు . ఆదర్శంగా నిలువ వచ్చు . సమాజంలో మంచి పేరు , ప్రతిష్ట , కీర్తి , గౌరవం , గుర్తింపు లభించ వచ్చు. ప్రయత్నించి చూడండి .

No comments:
Post a Comment