Wednesday, February 3, 2016

ఆరోగ్యంగా మరియు జబ్బుల బారిన పడ కుండా జీవించాలంటే ఏమి చేయాలి ?

ప్ర . ఆరోగ్యంగా  మరియు జబ్బుల బారిన పడ  కుండా జీవించాలంటే  ఏమి చేయాలి ?
జ. ఆరోగ్యంగా   మరియు జబ్బుల బారిన పడ  కుండా జీవించాలంటే  రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవాలి . పరిశుభ్రతను  పాటించాలి . హాని కరమైన  పదార్ధాలను తినకూడదు . హాని కరమైన అలవాట్లను మాను కోవాలి . మంచి మరియు  పాజిటివ్ ఆలోచనలను  పెంచుకోవాలి . 
రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే:
ఎ ) విటమిన్ ' సి ':  ప్రతి రోజు విటమిన్ ' సి ' ఉండే  , నిమ్మ , బత్తాయ , సంత్రా ,  నారింజ , స్ట్రా బెర్రీ,  పోప్పడ ,  మామిడి   పండ్ల లాంటి వాటిని, మొలకెత్తిన గింజలను   తినాలి లేదా రసాలను త్రాగాలి  . పాలకూర , క్యాబేజీ లాంటి  వాటిని వండుకుని తినాలి ఇది శరీరంలో  నిల్వ ఉండే  విటమిన్ కాదు . అందుకని  దీనిని  ప్రతి నిత్యం తీసుకోవాలి . 
బి ) విటమిన్ 'బి .6 ' :   విటమిన్ 'బి .6 '  అనేది  రోగ నిరోధక  వ్యవస్థకు  సంభందించిన  జీవ రసాయనక  ప్రతి చర్యలలో   కీలక పాత్ర  పోషిస్తుంది .  ఇది  సాధారణంగా  సాల్మాన్ , టూనా  వంటి చేపలలో , చికెన్ , శనగలు , గ్రుడ్లు, పొద్దు తిరుగుడు గింజలు, పిస్తా , పాలకూర  లాంటి వాటిల్లో పుష్కలంగా  లభిస్తుంది .

సి ) విటమిన్ 'ఇ ' :   ఇది బ్రహ్మాండమైన  యాంటి ఆక్సి డెంట్ . ఇన్ఫెక్షన్ తో  పోరాడటంలో  శరీరానికి  తోడ్పడుతుంది .  ఇది , బాదం  గింజలలో  , జీడి పప్పులో ,  వేరు శనగ  గింజలలో , పాలకూర లో  పుష్కలంగా  ఉంటుంది . 

No comments: