ప్ర . "రిజర్వేషన్ల " (RESERVATIONS) ఉద్యమాలకు కారణాలు ఏమిటి ?
అసలు "రిజర్వేషన్ల " అంటే ఏమిటి ?
జ . గత కొంత కాలం నుండి చూస్తుంటే రోజు రోజుకు "రిజర్వేషన్ల " ఉద్యమాలు ఉధృత మవుతున్నాయి . నాడు రాజస్థాన్లో ' గుజ్జర్లు ' , గుజరాత్ లో ' పాటి దార్లు ' , ఆంద్ర ప్రదేశ్ లో ' కాపులు ' , నేడు హరియానాలో ' జాట్లు ' మరియు నిరంతరం 'బి సి ' లు "రిజర్వేషన్ల " కొరకు ప్రాణాలకు తెగిస్తూ , ప్రయివేటు ఆస్తులకు , ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తూ , కొన్ని చోట్ల హింసాత్మకంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు .
ప్రభుత్వాలు రాజ్యాంగ పరంగా , చట్ట బద్దంగా దుర్భర జీవితం గడుపుతున్న కొన్ని కులాల వారికి , మతాల వారికి , సామాజిక , సాంఘీక , ఆర్ధిక , ఉద్యోగ భద్రతను నిర్ణీత శాతంలో కల్పించ డాన్ని "రిజర్వేషన్లు " గా చెప్పు కోవచ్చు .
రిజర్వేషన్లు కల్పించడానికి గల ముఖ్య కారణాలు ?
దూర దృష్టి గల నాటి మన రాజ్యాంగ రూపకర్తల , నిర్మాతలయిన మహాత్మా గాంధీ , జవహార్ లాల్ నెహ్రు , డా: రాజేంద్ర ప్రసాద్ , డా : రాధా కృష్ణన్ , సర్దార్ వల్లభాయి పటేల్ , డా : అంబేద్కర్ మొదలయిన అనేక మంది గొప్ప నాయకుల ప్రకారం "రిజర్వేషన్ల " ముఖ్య ఉద్దెశ్యమేమంటే , దేశంలో కుల వివక్షకు , మత వివక్షకు గురి అవుతూ పెదతనంలో దుర్భర జీవితం గడుపుతున్న కొన్ని కులాల వారికి , మతాల వారికి , సామాజిక , సాంఘీక , ఆర్ధిక , ఉద్యోగ భద్రతను , రాజ్యాంగ పరంగా , చట్ట బద్దంగా న్యాయం చేకూర్చి , వారిని కూడా మిగిలిన వారి అందరితో సమానం చేయాలనేదే వారి ఆశయం .
వాస్త వానికి ఏమి జరుగుతుంది ?
కాని వాస్తవానికి గత 68 సంవత్సరాల చరిత్ర చూస్తే , మొదటి 10 సంవత్సరాలు మినహాయిస్తే , రాజకీయ లబ్ధి కోసమే , ఎదిగినవారు - ఒదిగున్న వారిని , పేద వారిని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్పా , మెజారిటీ అనగారిన ప్రజలను , పేద తనంలో మ్రగ్గు తున్న ప్రజలను పైకి రానివ్వడం లేదు . గ్రామాలలో నేటికి , కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి కూడా , పరోక్షంగా ఉన్నత వర్గాల వారే పాలన సాగిస్తున్న దాఖలాలు మనకు అక్కడక్కడ కనిపిస్తుంటాయి . పేరు వారిది . ఊరు వీరిది .
మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు పుట్టిన వారికి నేడు 68 సం . రాల వయస్సు . "68 సం . రాల వయస్సు వచ్చాక కూడా మాకు ఎదుగూ బొదుగూ లేని జీవితమేనా ? ఆడుక్కు తినడమేనా? చకోర పక్షుల్లా ఆసరా పెన్షన్ల కోసం ఎదిరి చూడటమేనా ? అందరిలా మా కాళ్ళ మీద మేము నిలబడి , తలెత్తుకుని బ్రతికే రోజులు ఎప్పుడు వస్తాయి ? ధన ధన వంతులు మరింత ధన వంతులవుతున్నారు , పేద వారు మరింత పేద వారు అవుతున్నారు , కేవలం రాజకీయ నాయకులు , వారి కార్య కర్తలు , అధికారులు మాత్రమే దేశ సంపదనంతా అనుభవిస్తున్నారు " అనే ఆలోచనలతో , అసహనంతో పెల్లుభికినవే ఈ ' రిజర్వేషన్ల ' ఉద్యమాలు .
ఏమి చేస్తే బాగుండేది ?
మనకు స్వాతంత్ర్యం వచ్చిన 10 లేదా 20 సంవత్సరాల తరువాత నైనా , అన్ని కులాల లోని , మతాల లోని పేద ప్రజలను ఒక వర్గంగా గుర్తించి లేదా విభజించి , వారికి విద్యా పరంగా , సాంఘీక పరంగా , ఆరోగ్య పరంగా , ఆర్ధిక పరంగా రిజర్వేషన్లు కల్పించి ఉన్నత స్థితికి తీసుక రాగలిగి ఉంటే బాగుండేది . కాని దురదృస్టా వశాత్తు , నేటికి కూడా అలాంటి ఆలోచన ప్రభుత్వాలకు లేదు . ఎందుకంటే ఎక్కడ ఓటు బ్యాంక్ గల్లవుతుందో , ఎక్కడ అధికారం కోల్పోతామో అన్న భయం . ఆ కారణంగానే రోజు రోజుకు ధన వంతులు మరింత ధన వంతులవుతున్నారు . పేద వారు మరింత పేద వారు ఆవు తున్నారు . మెజారిటీ నాయకులూ , వారి కార్య కర్తలు , అధికారులు మరియు పెద్ద పెద్ద వ్యాపారస్తులు మాత్రమే అత్యంత ధనికులవుతున్నారు . మిగిలిన వారందరూ పేద ,నిరుపేద , మద్య తరగతులలో ( ఓటు బ్యాంక్ గా ) జీవిస్తున్నారు .
కులాలు అనేవి , మతాలు అనేవి నాటి వారి వారి వృత్తులను బట్టి , వారు నమ్ముకున్న ఆద్యాత్మిక గురువులను బట్టి ఏర్పడినవి . అన్ని కులాల లోనూ ధనవంతులున్నారు . అలానే అన్ని కులాల లోనూ పేదలున్నారు .
ఒక కులంలో రిజర్వేషన్ ద్వారా తండ్రికి లేదా తల్లికి లేదా ఇద్దరికీ ఉద్యాగాలు లభించాయంటే , తరువాత వారి పిల్లలను జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి , చదివించి , తమ కాల్ల మీద తాము నిలబడే విధంగా తీర్చి దిద్దాలి . అంతే గాని స్వాతంత్ర్యం వచ్చి 68 సంవత్సరాలు దాటినా అన్ని రంగాలలో , కొన్ని కులాల వారి తల్లి దండ్రులకు , వారి కొడుకులకు , కోడన్డ్లకు , మనుమలకు , మనుమా రాన్డ్లకు , మునిమనుమలకు , ముని మనుమా రాన్డ్లకు .... ...... రిజర్వేషన్లు కల్పించుకుంటూ పోతే , ఇతర ఉన్నత కులాల లోని పేదలకు స్వాతంత్ర ఫలాలు , రిజర్వేషన్లు అందే దెన్నడు ?
ఏమి చేస్తే బాగుంటది ? సాధ్యమవుతుందా ?
"రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు " , సభ్యులు తలుచు కుంటే అసాధ్యమేమీ కాదు . అన్ని కులాల లోని పేదలను విద్యా , ఆరోగ్య , సాంఘీక , సామాజిక పరంగా రిజర్వేషన్ల ద్వారా ఎదుగానివ్వాలి అనే ఆలోచన , తపన పాలకులలో ఉండాలి . ఆ విధంగా మానవ వనరులను అభి వృద్ది చేయాలి . ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకో గలగాలి . వారి కాళ్ళ మీద వారు నిలబడి జీవించే విధంగా తీర్చి దిద్దాలి . అంతే గాని , చకోర పక్షుల్లా , నెల వారి పెన్షన్ల కోసం ఎదిరి చూసే వారిగా , రోజూ అడుక్కు తినే బిక్ష గాండ్లు గా మార్చ కూడదు.
దేశాభి వృద్ధిని దృష్టిలో పెట్టుకుని , మా అధికారం ఎక్కడ పోతుందో నని గాని , మా అవి నీతి , మా నల్ల ధనం , మా బినామి ఆస్తులు ఎక్కడ బయట పడుతాయో నని భయ పడ కూడదు. అదికారం ఒక సారి పోతుంది కావచ్చు . కాని రెండో సారి మీదే కావచ్చు .
రిజర్వేషన్ల ఉద్యమాలకు గల ముఖ్య కారణాలు ?
01.
02.
03.
04.
05.
రిజర్వేషన్ల ఉద్యమాలను ఎలా అదుపు చేయాలి ?
01.
02.
03.
04.
05.
No comments:
Post a Comment