ప్ర . ' జి ఎస్. టి '. (GST)పన్ను విధానం ఎలా ఉండాలి ?
జ . ' జి ఎస్. టి '.(GST) పన్ను విధానం పేదలకు ఉపయోగ కరంగా ఉండాలి .
ఎన్నో సంవత్సరాల నుండి ప్రవేశ పెట్టాలనుకుంటున్న జి . ఎస్ . టి .(GST) బిల్లును , మరల ప్రవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షించ తగినదే . దీని వలన గుర్తు పెట్టుకో లేనన్ని " పరోక్ష పన్నులు " రద్దయి , ఒకే ఒక "జి. ఎస్. టి." పన్ను అమలులో ఉంటుంది . పారదర్శకత ఉంటుంది . అవినీతి తగ్గ వచ్చు . వ్యాపారాలు ఊపందు కుంటాయి . నల్ల ధన వృత్తులు , వ్యాపారాలు తగ్గు మొఖం పట్టి ప్రభుత్వాలకు పన్ను ఆదాయాలు పెరుగుతాయి . ఉద్యోగావకాశాలు పెర్గుతాయి .
అయితే , ప్రపంచీకరణలో భాగంగా , విదేశీ వ్యాపారస్తుల ను ప్రసన్నం చేయడానికని మాత్రం ఉండకూడదు . దేశ ప్రజల , వ్యాపారాల మేలు కోసం , దేశ అభి వృద్ది కోసం జరుగాలి . అందుకని ముందుగా ప్రజలకు , జి . ఎస్ . టి .(GST) పన్ను విధానం ఎలా ఉపయోగ పడుతుందో విస్తృతంగా చర్చ జరుగాలి . ప్రజల , వ్యాపారస్తుల అను మానాలను నివృత్తి చేయాలి . ప్రజల , వ్యాపారస్తుల సూచనలను , సలహాలను పరిగణలోకి తీసుకోవాలి . జి ఎస్. టి . ని 16% నుండి 18% మద్యలో ఉండేట్టు చూడాలి . అలానే ప్రతి 0.5% పన్నును పెంచాలన్నా రాజ్యాంగ సవరణ జరుగాలి . లేదంటే ప్రజలు , వ్యాపారస్తులు ఈ విషయం మరిచి పోయాక దొడ్డి దారిన జి .ఓ . ల ద్వారా, ఆర్డి నెన్స్ ల ద్వారా 40% వరకు పెంచు కుంటూ పోయే ప్రమాద ముంది . గత ఏడాది బ్యారల్ కు 130 డాలర్లు ఉన్న క్రూడ్ ఆయిల్ , నేడు 30 డాలర్లకు దిగి వచ్చినా ( ఫిబ్రవరి ,2016) , మన పెట్రోల్ , డిజిల్ మరియు ఇంధన ధరలు నాల్గో వంతుకు తగ్గక పోవడమే కాకుండా , మరింత పెరుగుతుండటం విడ్డూరంగా ఉంది . మనం సుమారుగా 60 నుండి 70 శాతం వరకు క్రూడ్ ఆయిల్ దిగుమతుల మీదనే ఆధార పడి ఉన్నాము. మన విదేశీ నిల్వలు ఖర్చయ్యేదీ ఇక్కడే . క్రూడ్ ఆయిల్ రేటు తగ్గడం మనకు వరంగా భావించాలి . అలాంటిది పెట్రోల్ , డిజిల్ మరియు ఇంధన ధరలు తగ్గక పోపోవడానికి కారణాలు సామాన్యులకు అంతు చిక్కడం లేదు . ఎక్కడ లోపముందో మేధావులు , ఆర్ధిక వేత్తలు ప్రజలకు వివరించాలి .
అలానే పేద ప్రజలు వాడే 100 యూనిట్ల లోపు కరెంట్ , వాటటర్ బిల్లులపైనా , రూ . లు . 100/- సెల్ రీచార్జీల బిల్లుల పైనా , కేబుల్ , నెట్ కనెక్షన్ల పైనా జి ఎస్ . టి . విధించ కూడదు .
ఎదో ఒక రోజు నేను చెప్పినవే అందరూ ఒప్పు కుంటారు . అమలు చేస్తారు .
ఎదో ఒక రోజు నేను చెప్పినవే అందరూ ఒప్పు కుంటారు . అమలు చేస్తారు .
No comments:
Post a Comment